సూరా 13 · జుజ్ 13
Ar-Ra'd · 13:13
وَيُسَبِّحُ الرَّعْدُ بِحَمْدِهِ وَالْمَلَائِكَةُ مِنْ خِيفَتِهِ وَيُرْسِلُ الصَّوَاعِقَ فَيُصِيبُ بِهَا مَنْ يَشَاءُ وَهُمْ يُجَادِلُونَ فِي اللَّهِ وَهُوَ شَدِيدُ الْمِحَالِ
మరియు ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతుంది. ఆయన స్తోత్రం చేస్తుంది; మరియు దైవదూతలు కూడా ఆయన భయంతో (ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు)! మరియు ఆయన ఫెళఫెళమనే ఉరుములను పంపి, వాటి ద్వారా తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అయినా వీరు (సత్యతిరస్కారులు) అల్లాహ్ ను గురించి వాదులాడుతున్నారు. మరియు ఆయన అద్భుత యుక్తిపరుడు.
తఫ్సీర్
మరియు ఉరుము తన ప్రభువు పరిశుద్ధతను పరిశుద్ధుడైన ఆయన స్థుతులతో కొనియాడుతుంది. మరియు దైవ దూతలు తమ ప్రభువు పరిశుద్ధతను ఆయన భయముతో మరియు ఆయన కొరకు గౌరవముగా,మర్యాదగా కొనియాడుతారు. మరియు ఆయన తన సృష్టితాల్లోంచి తాను ఎవరిని తుదిముట్టించదలచుకుంటే వారిపై కాలుతున్న పిడుగుల గర్జనలను పంపిస్తాడు. మరియు అవిశ్వాసపరులు అల్లాహ్ ఏకత్వ విషయంలో వాదులాడుతున్నారు. మరియు అల్లాహ్ తన పట్ల అవిధేయత చూపే వారి కొరకు మహా శక్తిమంతుడు మరియు యుక్తిపరుడు. తాను నిర్ణయించుకున్న దానిని చేసి తీరుతాడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి