సూరా 12 · జుజ్ 13
Yusuf · 12:90
قَالُوا أَإِنَّكَ لَأَنْتَ يُوسُفُ ۖ قَالَ أَنَا يُوسُفُ وَهَٰذَا أَخِي ۖ قَدْ مَنَّ اللَّهُ عَلَيْنَا ۖ إِنَّهُ مَنْ يَتَّقِ وَيَصْبِرْ فَإِنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ
వారన్నారు: "ఏమిటి? వాస్తవానికి నీవే యూసుఫ్ వా?" అతను జవాబిచ్చాడు: "నేనే యూసుఫ్ ను మరియు ఇతడు (బెన్యామీన్) నా సోదరుడు. నిశ్చయంగా, అల్లాహ్ మమ్మల్ని అనుగ్రహించాడు. నిశ్చయంగా, ఎవరైతే దైవభీతి కలిగి వుండి, సహనంతో ఉంటారో, అలాంటి సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లాహ్ ఎన్నడూ వృథా చేయడు."
తఫ్సీర్
దానితో వారు ఆశ్చర్యానికి లోనయ్యారు.మరియు ఏమి నిశ్చయంగా నీవు యూసుఫ్ వా ?! అని పలికారు.యూసుఫ్ వారికి ఇలా సమాధానమిచ్చారు : అవును నేను యూసుఫ్ ని మరియు మీరు నాతోపాటు చూస్తున్న ఇతడు నా సొంత సోదరుడు.మేము ఉన్న దాని నుండి మమ్మల్ని విముక్తిని కలిగించి,ఉన్నత స్థానమును కలిగించి అల్లాహ్ మాపై అనుగ్రహమును కలిగించాడు.నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ కు భయపడి ఆయన ఆదేశాలను పాఠించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి మరియు ఆపదల్లో సహనం చూపిస్తాడో నిశ్చయంగా అతని ఆచరణ మంచిది.మరియు అల్లాహ్ సత్కర్మలను చేసేవారి పుణ్యమును వృధా చేయడు.కాని వాటిని వారి కొరకు సంరక్షిస్తాడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి