సూరా 12 · జుజ్ 13

Yusuf · 12:88

فَلَمَّا دَخَلُوا عَلَيْهِ قَالُوا يَا أَيُّهَا الْعَزِيزُ مَسَّنَا وَأَهْلَنَا الضُّرُّ وَجِئْنَا بِبِضَاعَةٍ مُزْجَاةٍ فَأَوْفِ لَنَا الْكَيْلَ وَتَصَدَّقْ عَلَيْنَا ۖ إِنَّ اللَّهَ يَجْزِي الْمُتَصَدِّقِينَ

వారు అతని (యూసుఫ్) దగ్గరకు (మరల) వచ్చి అన్నారు: "ఓ సర్దార్ (అజీజ్)! మేము మా కుటుంబం వారు చాలా ఇబ్బందులకు గురయ్యాము. మరియు మేము చాలా తక్కువ సామగ్రి తెచ్చాము, కాని మాకు పూర్తి సామగ్రి (ధాన్యాన్ని) దాన ధర్మ రూపంలోనైనా సరే ఇవ్వండి. నిశ్చయంగా, అల్లాహ్ దానధర్మాలు చేసే వారికి మంచి ప్రతిఫలం ఇస్తాడు."

తఫ్సీర్

అయితే వారు తమ తండ్రి ఆదేశమును పాటించారు.మరియు వారు యూసుఫ్ ను,అతని సోదరుడిని వెతుకుతూ వెళ్ళారు.అప్పుడు వారు యూసుఫ్ వద్దకు వచ్చి మాపై కష్టము,పేదరికం వచ్చి పడింది.మరియు మేము అల్పమైన,తక్కువదైన సామగ్రిని తీసుకుని వచ్చాము.అయితే నీవు మాకు మునుపు కొలిచి ఇచ్చినట్లే పూర్తిగా కొలచి ఇవ్వు .మరియు దానికన్నా ఎక్కువ మాకు దానంగా ఇవ్వు లేదా మా అల్పమైన సామగ్రి నుండి దృష్టి సడలించి ఇవ్వు.నిశ్చయంగా అల్లాహ్ దానం చేసే వారికి మంచి ప్రతి ఫలాన్ని ప్రసాధిస్తాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి