సూరా 12 · జుజ్ 12
Yusuf · 12:26
قَالَ هِيَ رَاوَدَتْنِي عَنْ نَفْسِي ۚ وَشَهِدَ شَاهِدٌ مِنْ أَهْلِهَا إِنْ كَانَ قَمِيصُهُ قُدَّ مِنْ قُبُلٍ فَصَدَقَتْ وَهُوَ مِنَ الْكَاذِبِينَ
(యూసుఫ్) అన్నాడు: "ఈమెనే, నన్ను మోహింప జేయగోరింది!" ఆమె కుటుంబం వారిలో నుండి అక్కడ ఉన్న ఒకడు ఇలా సాక్ష్యమిచ్చాడు: "ఒకవేళ అతని అంగి, ముందు నుండి చినిగి ఉంటే ఆమె పలికేది సత్యం మరియు అతను అసత్యుడు!
తఫ్సీర్
యూసుఫ్ అలైహిస్సలాం ఇలా అన్నారు : నన్ను అశ్లీల కార్యం చేయమని ఆమెయే కోరింది మరియు నేను దానిని చేసే ఉద్దేశం ఆమెతో చేయలేదు. మరియు అల్లాహ్ ఆమె కుటంబములో నుంచి ఒడిలో ఉన్న ఒక పిల్లవాడికి మాట్లాడేటట్లు చేశాడు అతడు తన మాటల్లో ఇలా సాక్షమిచ్చాడు : ఒక వేళ యూసుఫ్ చొక్కా అతని ముందు నుండి చిరిగి ఉంటే అది ఆమె నిజాయితీకి సూచన. ఎందుకంటే ఆమె అతన్ని తన నుండి ఆపటానికి ప్రయత్నించి ఉంటుంది. అప్పుడు అతను అబద్దం పలికిన వాడు అవుతాడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి