సూరా 12 · జుజ్ 12

Yusuf · 12:23

وَرَاوَدَتْهُ الَّتِي هُوَ فِي بَيْتِهَا عَنْ نَفْسِهِ وَغَلَّقَتِ الْأَبْوَابَ وَقَالَتْ هَيْتَ لَكَ ۚ قَالَ مَعَاذَ اللَّهِ ۖ إِنَّهُ رَبِّي أَحْسَنَ مَثْوَايَ ۖ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ

మరియు అతను నివసించే ఇంటి స్త్రీ అతనిని మోహించి అతని మనస్సును చలింప జేయగోరి తలుపులు మూసి, అతనితో: "(నా వద్దకు) రా!" అని పిలిచింది. అతను :"నేను అల్లాహ్ శరణు గోరుతున్నాను! నిశ్చయంగా ఆయన! నా ప్రభువు, నాకు మంచి స్థానాన్ని ప్రసాదించాడు. నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు." అని పలికాడు.

తఫ్సీర్

అజీజు భార్య సున్నితముతో మరియు వ్యూహమును చేసి యూసుఫ్ నుండి అశ్లీలకార్యం చేయటమునకు కోరింది.మరియు ఆమె ఏకాంతమును కోరుకుంటూ తలుపులను మూసివేసింది.మరియు ఆయనతో ఇలా పలికింది : నీవు నా వద్దకు రా.అప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం నీవు నన్ను దేనివైపునైతే పిలుస్తున్నావో దాని నుండి నేను అల్లాహ్ రక్షణను కోరుతున్నాను.నిశ్చయంగా నా యజమాని తన వద్ద నాకు స్థానమును కల్పించి నాకు ఉపకారము చేశాడు.అయితే నేను అతనిపట్ల అవినీతికు పాల్పడను.ఒక వేళ నేను ఆయన పట్ల అవినీతికి పాల్పడితే నేను దుర్మార్గుడిని అయిపోతాను.నిశ్చయంగా దుర్మార్గులు సాఫల్యం చెందరు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి