సూరా 12 · జుజ్ 12

Yusuf · 12:13

قَالَ إِنِّي لَيَحْزُنُنِي أَنْ تَذْهَبُوا بِهِ وَأَخَافُ أَنْ يَأْكُلَهُ الذِّئْبُ وَأَنْتُمْ عَنْهُ غَافِلُونَ

(వారి తండ్రి యఅఖూబ్) అన్నాడు: "మీరు అతనిని తీసుకొని పోవటం నిశ్చయంగా నన్ను చింతాక్రాంతునిగా చేస్తోంది. మీరు అతని విషయంలో ఏమరు పాటులో ఉన్నప్పుడు, అతనిని ఏదైనా తోడేలు తిని వేస్తుందేమోనని నేను భయపడుతున్నాను."

తఫ్సీర్

యాఖూబ్ తన కుమారులతో ఇలా పలికారు : నిశ్చయంగా మీరు అతన్ని తీసుకుని వెళ్ళటం నన్ను దుఃఖమునకు గురి చేస్తుంది.అతను దూరమవటమును నేను సహించలేను.మీరు తినటంలో,ఆటల్లో ఉండి అతని నుండి మీరు ఏమరు పాటులో ఉన్నప్పుడు అతన్ని తోడేలు తినివేస్తుందని నేను భయపడుతున్నాను.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి