సూరా 11 · జుజ్ 12

Hud · 11:84

۞ وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ وَلَا تَنْقُصُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ ۚ إِنِّي أَرَاكُمْ بِخَيْرٍ وَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ مُحِيطٍ

ఇక మద్ యన్ వారి వద్దకు వారి సహోదరుడైన షుఐబ్ ను పంపాము. అతను అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. కొలతల్లో మరియు తూనికల్లో తగ్గించి ఇవ్వకండి. నేను నిశ్చయంగా, మిమ్మల్ని (ఇప్పుడు) మంచి స్థితిలో చూస్తున్నాను; కాని వాస్తవానికి మీపై ఆరోజు చుట్టు ముట్టబోయే శిక్షను గురించి నేను భయపడుతున్నాను.

తఫ్సీర్

మరియు మేము మద్యన్ వారి వైపునకు వారి సోదరుడు షుఐహ్ ను ప్రవక్తగా పంపించినాము. ఆయన ఇలా పలికారు : ఓ నా జాతి ప్రజలారా మీరు ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించండి. మీ కొరకు ఆరాధనకు అర్హుడైన ఆరాధ్య దైవం ఆయన తప్ప ఇంకొకడు లేడు. మీరు ప్రజల కొరకు కొలచినప్పుడు లేదా వారి కొరకు తూకము వేసినప్పుడు కొలతల్లో,తూనికల్లో తగ్గించకండి. నిశ్చయంగా నేను మిమ్మల్ని పుష్కలమైన ఆహారోపాధిలో,సుఖభోగాల్లో చూస్తున్నాను. అయితే మీరు మీ పై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలను పాపకార్యాల ద్వారా మార్చుకోకండి. మరియు నిశ్చయంగా నేను ఆరోజు చుట్టుముట్టుకునే శిక్ష గురించి మీపై భయపడుతున్నాను. అది మీలో నుంచి ప్రతి ఒక్కరిని పట్టుకుంటుంది. మీరు దాని నుండి ఎటువంటి పారిపోయే స్థలమును,శరణాలయమును పొందలేరు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి