సూరా 11 · జుజ్ 12

Hud · 11:8

وَلَئِنْ أَخَّرْنَا عَنْهُمُ الْعَذَابَ إِلَىٰ أُمَّةٍ مَعْدُودَةٍ لَيَقُولُنَّ مَا يَحْبِسُهُ ۗ أَلَا يَوْمَ يَأْتِيهِمْ لَيْسَ مَصْرُوفًا عَنْهُمْ وَحَاقَ بِهِمْ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ

మరియు ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత కాలం వరకు ఆపి ఉంచితే, వారు తప్పకుండా అంటారు: "దానిని ఆపుతున్నది ఏమిటీ?" వాస్తవానికి అది వచ్చిన రోజు, దానిని వారి నుండి తొలగించగల వారెవ్వరూ ఉండరు. మరియు వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే, వారిని క్రమ్ముకుంటుంది.

తఫ్సీర్

మరియు ఒక వేళ మేము ఇహలోక జీవితంలో ముష్రికుల నుండి వారు ఏ శిక్ష హక్కుదారులో అది కొన్ని నిర్ణీత దినముల కాలం వరకు ఆపి ఉంచితే దాన్ని తొందర చేసేవారు,ఎగతాళిచేసేవారు ఏ వస్తువు మన నుండి శిక్షను ఆపింది అని తప్పకుండా అంటారు.వినండి నిశ్చయంగా వారు ఏ శిక్ష హక్కుదారులో దానికి అల్లాహ్ వద్ద ఒక సమయం ఉన్నది.అది వారి వద్ద ఏ రోజైతే వస్తుందో వారి నుండి దాన్ని మరల్చేవాడిని ఎవరినీ వారు పొందరంటే పొందరు.కాని అది వారిపై వచ్చి పడుతుంది.ఏ శిక్ష గురించైతే వారు ఎగతాళిగా,హేళనగా తొందరచేసేవారో అది వారిని చుట్టుముట్టుతుంది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి