సూరా 11 · జుజ్ 12

Hud · 11:61

۞ وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَالِحًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ هُوَ أَنْشَأَكُمْ مِنَ الْأَرْضِ وَاسْتَعْمَرَكُمْ فِيهَا فَاسْتَغْفِرُوهُ ثُمَّ تُوبُوا إِلَيْهِ ۚ إِنَّ رَبِّي قَرِيبٌ مُجِيبٌ

ఇక సమూద్ వారి వద్దకు వారి సహోదరుడు సాలిహ్ ను పంపాము. అతను అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి, దానిలో మిమ్మల్ని నివసింప జేశాడు. కనుక మీరు ఆయన క్షమాభిక్ష వేడుకోండి, తరువాత ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా, నా ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. (మీ ప్రార్థనలకు) జవాబిస్తాడు."

తఫ్సీర్

మరియు మేము సమూద్ జాతి వారి వైపునకు వారి సోదరుడు సాలిహ్ అలైహిస్సలాంను ప్రవక్తగా పంపించాము. ఆయన ఇలా పలికారు : ఓ నా జాతి వారా మీరు ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించండి.ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన ఆరాధ్య దైవం మీ కొరకు ఇంకొకరు లేరు. ఆయన మీ తండ్రి అయిన ఆదమ్ ను భూమి మట్టి నుండి సృష్టించటం వలన మిమ్మల్ని భూమి మట్టి నుండి సృష్టించాడు. మరియు ఆయన మిమ్మల్ని దానిలో నివసింపజేశాడు.అయితే మీరు ఆయనతో మన్నింపు వేడుకోండి.ఆ పిదప మీరు విధేయ కార్యాలకు పాల్పడి,పాపకార్యాలను విడనాడి ఆయన వైపునకు మరలండి.నిశ్చయంగా నా ప్రభువు ఆయన కొరకు ఆరాధనను ప్రత్యేకించుకునే వారికి చాలా దగ్గరగా ఉంటాడు.వారి అర్ధనలను స్వీకరిస్తాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి