సూరా 11 · జుజ్ 12

Hud · 11:42

وَهِيَ تَجْرِي بِهِمْ فِي مَوْجٍ كَالْجِبَالِ وَنَادَىٰ نُوحٌ ابْنَهُ وَكَانَ فِي مَعْزِلٍ يَا بُنَيَّ ارْكَبْ مَعَنَا وَلَا تَكُنْ مَعَ الْكَافِرِينَ

మరియు అది వారిని పర్వతాల వలే ఎత్తైన అలలలోనికి తీసుకొని పోసాగింది. అప్పుడు నూహ్ (పడవ నుండి) దూరంగా ఉన్న తన కుమారుణ్ణి పిలుస్తూ (అన్నాడు): "ఓ నా కుమారా! మాతో పాటు (ఓడలోకి) ఎక్కు అవిశ్వాసులలో కలిసిపోకు!"

తఫ్సీర్

మరియు ఓడ తనలో ఉన్న ప్రజలను,ఇతరులను తీసుకుని పర్వతాల్లాంటి పెద్ద పెద్ద అలల్లో పయనించింది.ఒక దయ గల తండ్రిలా నూహ్ అలైహిస్సలాం అవిశ్వాసపరుడైన తన కుమారుడిన పిలిచారు.మరియు అతడు తన తండ్రి నుండి,తన జాతివారి నుండి ఒంటరిగా ఒక ప్రదేశములో ఉన్నాడు. ఓ నా ప్రియ కుమారా నీవు మునగటం నుండి బ్రతికి బయటపడటానికి మాతో పాటు ఓడలో ఎక్కు.మరయు నీవు సత్య తిరస్కారుల్లోంచి కాకు.అలాంటప్పుడు నీకూ వారికి మునగటం ద్వారా సంభవించిన వినాశనము సంభవిస్తుంది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి