సూరా 11 · జుజ్ 12

Hud · 11:31

وَلَا أَقُولُ لَكُمْ عِنْدِي خَزَائِنُ اللَّهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ إِنِّي مَلَكٌ وَلَا أَقُولُ لِلَّذِينَ تَزْدَرِي أَعْيُنُكُمْ لَنْ يُؤْتِيَهُمُ اللَّهُ خَيْرًا ۖ اللَّهُ أَعْلَمُ بِمَا فِي أَنْفُسِهِمْ ۖ إِنِّي إِذًا لَمِنَ الظَّالِمِينَ

"మరియు నా వద్ద నిధులు ఉన్నాయని గానీ మరియు నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ నేను మీతో అనటం లేదు; మరియు నేను దైవదూతనని కూడా అనటం లేదు మరియు మీరు హీనంగా చూసే వారికి అల్లాహ్ మేలు చేయలేడని కూడా అనటం లేదు. వారి మనస్సులలో ఉన్నది అల్లాహ్ కు బాగా తెలుసు. అలా అయితే! నిశ్చయంగా, నేను దుర్మార్గులలో చేరిన వాడనే!"

తఫ్సీర్

ఓ నాజాతి వారా నా వద్ద అల్లాహ్ నిధులు ఉన్నాయని వాటిలో ఆయన ప్రసాధించిన ఆహారోపాది ఉన్నదని ఒక వేళ మీరు విశ్వసిస్తే నేను దాన్ని మీపై ఖర్చు చేస్తాను అని మీతో అనటంలేదు.మరియు నాకు అగోచర విషయాల గురించి జ్ఞానం ఉన్నదని మీతో అనటం లేదు.నేను దైవదూతల్లోంచి అని మీతో అనటం లేదు కాని నేనూ మీలాగా మనిషిని.మరియు మీరు మీ దృష్టిలో అల్పముగా,చిన్నవారిగా భావించేవారిని అల్లాహ్ మేలు చేయడని సన్మార్గం చూపడని అనటం లేదు.అల్లాహ్ కి వారి సంకల్పాల గురించి,వారి స్థితుల గురించి బాగా తెలుసు.నిశ్చయంగా ఒక వేళ నేను దాన్నివాదిస్తే (దావా) అల్లాహ్ శిక్షకు అర్హత కలిగిన దుర్మార్గుల్లోంచి అయిపోతాను.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి