సూరా 11 · జుజ్ 12
Hud · 11:28
قَالَ يَا قَوْمِ أَرَأَيْتُمْ إِنْ كُنْتُ عَلَىٰ بَيِّنَةٍ مِنْ رَبِّي وَآتَانِي رَحْمَةً مِنْ عِنْدِهِ فَعُمِّيَتْ عَلَيْكُمْ أَنُلْزِمُكُمُوهَا وَأَنْتُمْ لَهَا كَارِهُونَ
అతను (నూహ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు చూస్తున్నారు కదా? నేను నా ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన సూచనను (నిదర్శనాన్ని) అనుసరిస్తున్నాను. ఆయన తన కారుణ్యాన్ని నాపై ప్రసాదించాడు, కాని అది మీకు కనబడటం లేదు. అలాంటప్పుడు మీరు దానిని అసహ్యించుకుంటున్నా, దానిని స్వీకరించమని మేము మిమ్మల్ని బలవంతం చేయగలమా?
తఫ్సీర్
నూహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : ఓ నా జాతి వారా నాకు చెప్పండి ఒక వేళ నేను నా నిజాయితీ గురించి సాక్ష్యం పలికే మరియు నేను సత్యవంతుడని విశ్వసించటం మీపై అనివార్యం చేసే ఏదైన ఆధారంపై ఉంటే,మరియు నాకు ఆయన తన వద్ద నుండి కారుణ్యమైన దైవదౌత్యము (నుబువ్వత్),దైవ సందేశాలను చేరవేసే బాధ్యత (రిసాలత్) ను ప్రసాదిస్తే మరియు దాని విషయంలో మీ అజ్ఞానము వలన అది మీకు కనబడకపోతే దాన్ని విశ్వసించటం పై మిమ్మల్ని మేము బలవంతం చేయగలమా,దాన్ని మేము మీ హృదయముల్లో బలవంతాన ప్రవేసింపచేయగలమా ?.మాకు దాని శక్తి లేదు.విశ్వాస సౌభాగ్యము కలిగించేవాడు అతడే అల్లాహ్.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి