సూరా 11 · జుజ్ 12

Hud · 11:11

إِلَّا الَّذِينَ صَبَرُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ

కాని ఎవరైతే సహనం వహించి, సత్కార్యాలు చేస్తూ ఉంటారో, అలాంటి వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.

తఫ్సీర్

కాని ఎవరైతే ఆపదల్లో,విధేయత చూపటంలో,అవిధేయ కార్యాల నుండి దూరం ఉండటంలో సహనం చూపి,సత్కర్మలు చేస్తారో వారి పరిస్థితి వేరుగా ఉంటుంది.వారికి నిరాశ కలగదు,అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నత ఉండదు.ప్రజల పై దాడీ చేయటం జరగదు.ఈ గుణాలను కలిగిన వారందరి కొరకు వారి ప్రభువు వద్ద వారి పాపములకు మన్నింపు ఉంటుంది.మరియు పరలోకములో వారికి పెద్ద ప్రతిఫలం ఉంటుంది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి