عَمَّ يَتَسَاءَلُونَ 1
ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ عَنِ النَّبَإِ الْعَظِيمِ 2
ఆ మహా వార్తను గురించేనా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ الَّذِي هُمْ فِيهِ مُخْتَلِفُونَ 3
దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَلَّا سَيَعْلَمُونَ 4
అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ 5
ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَلَمْ نَجْعَلِ الْأَرْضَ مِهَادًا 6
ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالْجِبَالَ أَوْتَادًا 7
మరియు పర్వతాలను మేకులుగా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا 8
మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا 9
మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا 10
మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا 11
మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا 12
మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا 13
మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنْزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا 14
మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لِنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا 15
దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَنَّاتٍ أَلْفَافًا 16
మరియు దట్టమైన తోటలను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا 17
నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَوْمَ يُنْفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا 18
ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا 19
మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا 20
మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا 21
నిశ్చయంగా, నరకం ఒక మాటు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لِلطَّاغِينَ مَآبًا 22
ధిక్కారుల గమ్యస్థానం;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَابِثِينَ فِيهَا أَحْقَابًا 23
అందులో వారు యుగాల తరబడి ఉంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا 24
అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا حَمِيمًا وَغَسَّاقًا 25
సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ جَزَاءً وِفَاقًا 26
(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا 27
వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا 28
పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا 29
మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَذُوقُوا فَلَنْ نَزِيدَكُمْ إِلَّا عَذَابًا 30
కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا 31
నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ حَدَائِقَ وَأَعْنَابًا 32
ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَكَوَاعِبَ أَتْرَابًا 33
మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَكَأْسًا دِهَاقًا 34
మరియు నిండి పొర్లే (మధు) పాత్ర
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّابًا 35
అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ جَزَاءً مِنْ رَبِّكَ عَطَاءً حِسَابًا 36
(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الرَّحْمَٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا 37
భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَوْمَ يَقُومُ الرُّوحُ وَالْمَلَائِكَةُ صَفًّا ۖ لَا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمَٰنُ وَقَالَ صَوَابًا 38
ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ذَٰلِكَ الْيَوْمُ الْحَقُّ ۖ فَمَنْ شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ مَآبًا 39
అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا أَنْذَرْنَاكُمْ عَذَابًا قَرِيبًا يَوْمَ يَنْظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنْتُ تُرَابًا 40
నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్