Al-Qiyamah

سورة القيامة

సూరా 75 · మక్కీ · 40 ఆయత్‌లు

75:1జుజ్ 29 · పు. 577

لَا أُقْسِمُ بِيَوْمِ الْقِيَامَةِ1

అలా కాదు! నేను పునరుత్థాన దినపు శపథం చేస్తున్నాను.
75:2జుజ్ 29 · పు. 577

وَلَا أُقْسِمُ بِالنَّفْسِ اللَّوَّامَةِ2

అలా కాదు! నేను తనను తాను నిందించుకునే అంతరాత్మ శపథం చేస్తున్నాను.
75:3జుజ్ 29 · పు. 577

أَيَحْسَبُ الْإِنْسَانُ أَلَّنْ نَجْمَعَ عِظَامَهُ3

ఏమిటి? మేము అతని ఎముకలను ప్రోగు చేయలేమని మానవుడు భావిస్తున్నాడా?
75:4జుజ్ 29 · పు. 577

بَلَىٰ قَادِرِينَ عَلَىٰ أَنْ نُسَوِّيَ بَنَانَهُ4

వాస్తవానికి! మేము అతని వ్రేళ్ళ కొనలను గూడా సరిగ్గా సవరించగల సమర్ధులము.
75:5జుజ్ 29 · పు. 577

بَلْ يُرِيدُ الْإِنْسَانُ لِيَفْجُرَ أَمَامَهُ5

అయినా, మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు.
75:6జుజ్ 29 · పు. 577

يَسْأَلُ أَيَّانَ يَوْمُ الْقِيَامَةِ6

అతడు: "అయితే ఈ పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుంది?" అని అడుగుతున్నాడు.
75:7జుజ్ 29 · పు. 577

فَإِذَا بَرِقَ الْبَصَرُ7

కళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు;
75:8జుజ్ 29 · పు. 577

وَخَسَفَ الْقَمَرُ8

మరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు;
75:9జుజ్ 29 · పు. 577

وَجُمِعَ الشَّمْسُ وَالْقَمَرُ9

మరియు సూర్యచంద్రులు కలిపి వేయబడినప్పుడు;
75:10జుజ్ 29 · పు. 577

يَقُولُ الْإِنْسَانُ يَوْمَئِذٍ أَيْنَ الْمَفَرُّ10

మానవుడు ఆ రోజు: "ఎక్కడికి పారి పోవాలి?" అని అంటాడు.
75:11జుజ్ 29 · పు. 577

كَلَّا لَا وَزَرَ11

అది కాదు! (అతనికి) ఎక్కడా శరణం ఉండదు!
75:12జుజ్ 29 · పు. 577

إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمُسْتَقَرُّ12

ఆ రోజు నీ ప్రభువు వద్దనే ఆశ్రయం ఉంటుంది.
75:13జుజ్ 29 · పు. 577

يُنَبَّأُ الْإِنْسَانُ يَوْمَئِذٍ بِمَا قَدَّمَ وَأَخَّرَ13

ఆ రోజు మానవుడికి, తాను చేసి పంపంది మరియు వెనక వదలింది అంతా తెలుపబడుతుంది.
75:14జుజ్ 29 · పు. 577

بَلِ الْإِنْسَانُ عَلَىٰ نَفْسِهِ بَصِيرَةٌ14

అలా కాదు! మానవుడు తనకు విరుద్ధంగా, తానే సాక్షి అవుతాడు;
75:15జుజ్ 29 · పు. 577

وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُ15

మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే!
75:16జుజ్ 29 · పు. 577

لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ16

నీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను గ్రహించటానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు.
75:17జుజ్ 29 · పు. 577

إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ17

నిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే!
75:18జుజ్ 29 · పు. 577

فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ18

కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు.
75:19జుజ్ 29 · పు. 577

ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ19

ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే!
75:20జుజ్ 29 · పు. 578

كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ20

అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు;
75:21జుజ్ 29 · పు. 578

وَتَذَرُونَ الْآخِرَةَ21

మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు!
75:22జుజ్ 29 · పు. 578

وُجُوهٌ يَوْمَئِذٍ نَاضِرَةٌ22

ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి;
75:23జుజ్ 29 · పు. 578

إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌ23

తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి;
75:24జుజ్ 29 · పు. 578

وَوُجُوهٌ يَوْمَئِذٍ بَاسِرَةٌ24

మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి;
75:25జుజ్ 29 · పు. 578

تَظُنُّ أَنْ يُفْعَلَ بِهَا فَاقِرَةٌ25

నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి.
75:26జుజ్ 29 · పు. 578

كَلَّا إِذَا بَلَغَتِ التَّرَاقِيَ26

అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు;
75:27జుజ్ 29 · పు. 578

وَقِيلَ مَنْ ۜ رَاقٍ27

మరియు: "ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది.
75:28జుజ్ 29 · పు. 578

وَظَنَّ أَنَّهُ الْفِرَاقُ28

మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు;
75:29జుజ్ 29 · పు. 578

وَالْتَفَّتِ السَّاقُ بِالسَّاقِ29

మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది.
75:30జుజ్ 29 · పు. 578

إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمَسَاقُ30

ఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది!
75:31జుజ్ 29 · పు. 578

فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ31

కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపనూ లేదు!
75:32జుజ్ 29 · పు. 578

وَلَٰكِنْ كَذَّبَ وَتَوَلَّىٰ32

మరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు!
75:33జుజ్ 29 · పు. 578

ثُمَّ ذَهَبَ إِلَىٰ أَهْلِهِ يَتَمَطَّىٰ33

ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు!
75:34జుజ్ 29 · పు. 578

أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ34

(ఓ సత్యతిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది!
75:35జుజ్ 29 · పు. 578

ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ35

అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది!
75:36జుజ్ 29 · పు. 578

أَيَحْسَبُ الْإِنْسَانُ أَنْ يُتْرَكَ سُدًى36

ఏమిటీ? మానవుడు తనను విచ్చల విడిగా వదలిపెట్టండం జరుగుతుందని భావిస్తున్నాడా?
75:37జుజ్ 29 · పు. 578

أَلَمْ يَكُ نُطْفَةً مِنْ مَنِيٍّ يُمْنَىٰ37

ఏమీ? అతడు ప్రసరింప జేయబడిన ఒక వీర్యబిందువు కాడా?
75:38జుజ్ 29 · పు. 578

ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ38

తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు.
75:39జుజ్ 29 · పు. 578

فَجَعَلَ مِنْهُ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنْثَىٰ39

ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు.
75:40జుజ్ 29 · పు. 578

أَلَيْسَ ذَٰلِكَ بِقَادِرٍ عَلَىٰ أَنْ يُحْيِيَ الْمَوْتَىٰ40

అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా?

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి