يَا أَيُّهَا الْمُدَّثِّرُ 1
ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قُمْ فَأَنْذِرْ 2
లే! ఇక హెచ్చరించు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَرَبَّكَ فَكَبِّرْ 3
మరియు మీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَثِيَابَكَ فَطَهِّرْ 4
మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالرُّجْزَ فَاهْجُرْ 5
మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَا تَمْنُنْ تَسْتَكْثِرُ 6
మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلِرَبِّكَ فَاصْبِرْ 7
మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَإِذَا نُقِرَ فِي النَّاقُورِ 8
మరియు బాకా (నాఖూర్) ఊదబడినప్పుడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ 9
ఆ దినం చాలా కఠినమైన దినమై ఉంటుంది;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ عَلَى الْكَافِرِينَ غَيْرُ يَسِيرٍ 10
సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ذَرْنِي وَمَنْ خَلَقْتُ وَحِيدًا 11
వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَعَلْتُ لَهُ مَالًا مَمْدُودًا 12
మరియు నేను అతనికి పుష్కలంగా సంపదనిచ్చాను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَبَنِينَ شُهُودًا 13
మరియు అతనికి తోడుగా ఉండే కుమారులను!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَهَّدْتُ لَهُ تَمْهِيدًا 14
మరియు అతను కొరకు అతని జీవన సౌకర్యాలను సులభం చేశాను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ 15
అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَلَّا ۖ إِنَّهُ كَانَ لِآيَاتِنَا عَنِيدًا 16
అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ سَأُرْهِقُهُ صَعُودًا 17
నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُ فَكَّرَ وَقَدَّرَ 18
వాస్తవానికి, అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَقُتِلَ كَيْفَ قَدَّرَ 19
కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురి కానివ్వండి!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ 20
అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురి కానివ్వండి!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ نَظَرَ 21
అప్పుడు అతడు ఆలోచించాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ عَبَسَ وَبَسَرَ 22
తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు);
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ 23
తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَقَالَ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ يُؤْثَرُ 24
అప్పుడు అతడు ఇలా అన్నాడు: "ఇది పూర్వ నుండి వస్తూ వున్న ఒక మంత్రజాలం మాత్రమే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنْ هَٰذَا إِلَّا قَوْلُ الْبَشَرِ 25
ఇది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ سَأُصْلِيهِ سَقَرَ 26
త్వరలోనే నేను అతనిని నరకాగ్నిలో కాల్చుతాను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا أَدْرَاكَ مَا سَقَرُ 27
మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమనుకుంటున్నావు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَا تُبْقِي وَلَا تَذَرُ 28
అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَوَّاحَةٌ لِلْبَشَرِ 29
అది మానవుణ్ణి (అతడి చర్మాన్ని0 దహించి వేస్తుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ عَلَيْهَا تِسْعَةَ عَشَرَ 30
దానిపై పందొమ్మిది (దేవదూతలు నియమించబడి) ఉన్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا جَعَلْنَا أَصْحَابَ النَّارِ إِلَّا مَلَائِكَةً ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِلَّذِينَ كَفَرُوا لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَيَزْدَادَ الَّذِينَ آمَنُوا إِيمَانًا ۙ وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ الَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ وَالْكَافِرُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ مَنْ يَشَاءُ وَيَهْدِي مَنْ يَشَاءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِيَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ 31
మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్యతిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్యతిరస్కారులు: "ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్ ఉద్దేశమేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَلَّا وَالْقَمَرِ 32
అలా కాదు! చంద్రుని సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاللَّيْلِ إِذْ أَدْبَرَ 33
గడిచిపోయే రాత్రి సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالصُّبْحِ إِذَا أَسْفَرَ 34
ప్రకాశించే, ఉదయం సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهَا لَإِحْدَى الْكُبَرِ 35
నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ نَذِيرًا لِلْبَشَرِ 36
మానవునికి ఒక హెచ్చరిక;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لِمَنْ شَاءَ مِنْكُمْ أَنْ يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ 37
మీలో ముందుకు రావాలని కోరుకునే వానికి లేదా వెనుక ఉండి పోయేవానికి;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ رَهِينَةٌ 38
ప్రతి మానవుడు తాను చేసిన కర్మలకు తాకట్టుగా ఉంటాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا أَصْحَابَ الْيَمِينِ 39
కుడిపక్షం వారు తప్ప!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فِي جَنَّاتٍ يَتَسَاءَلُونَ 40
వారు స్వర్గాలలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ عَنِ الْمُجْرِمِينَ 41
అపరాధులను గురించి (మరియు వారితో అంటారు):
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا سَلَكَكُمْ فِي سَقَرَ 42
"మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ 43
వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ 44
మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ 45
మరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ 46
మరియు తీర్పుదినాన్ని అబద్ధమని నిరాకరిస్తూ ఉండేవాళ్ళము;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ حَتَّىٰ أَتَانَا الْيَقِينُ 47
చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చి పడింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَمَا تَنْفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ 48
అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِينَ 49
అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَأَنَّهُمْ حُمُرٌ مُسْتَنْفِرَةٌ 50
వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَرَّتْ مِنْ قَسْوَرَةٍ 51
సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ بَلْ يُرِيدُ كُلُّ امْرِئٍ مِنْهُمْ أَنْ يُؤْتَىٰ صُحُفًا مُنَشَّرَةً 52
అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَلَّا ۖ بَلْ لَا يَخَافُونَ الْآخِرَةَ 53
కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ 54
అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَمَنْ شَاءَ ذَكَرَهُ 55
కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا يَذْكُرُونَ إِلَّا أَنْ يَشَاءَ اللَّهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ 56
కాని అల్లాహ్ కోరితే తప్ప! వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్