Al-Qalam

سورة القلم

సూరా 68 · మక్కీ · 52 ఆయత్‌లు

68:1జుజ్ 29 · పు. 564

ن ۚ وَالْقَلَمِ وَمَا يَسْطُرُونَ1

నూన్, కలం సాక్షిగా! మరియు వారు (దేవదూతలు) వ్రాస్తున్న దాని సాక్షిగా!
68:2జుజ్ 29 · పు. 564

مَا أَنْتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ2

నీ ప్రభువు అనుగ్రహం వలన నీవు (ఓ ముహమ్మద్) పిచ్చివాడవు కావు!
68:3జుజ్ 29 · పు. 564

وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ3

మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది.
68:4జుజ్ 29 · పు. 564

وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ4

మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు!
68:5జుజ్ 29 · పు. 564

فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ5

కావున త్వరలోనే నీవు చూడగలవు మరియు వారు కూడా చూడగలరు;
68:6జుజ్ 29 · పు. 564

بِأَيْيِكُمُ الْمَفْتُونُ6

మీలో ఎవరికి పిచ్చి ఉందో!
68:7జుజ్ 29 · పు. 564

إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ7

నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు మార్గభ్రష్టుడయ్యాడో తెలుసు మరియు ఎవడు సన్మార్గం మీద ఉన్నాడో కూడా ఆయనకు బాగా తెలుసు!
68:8జుజ్ 29 · పు. 564

فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ8

కావున నీవు ఈ అసత్యవాదులను అనుసరించకు.
68:9జుజ్ 29 · పు. 564

وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ9

ఒకవేళ నీవు (ధర్మం విషయంలో) మెత్తపడితే వారు కూడా మెత్తపడ కోరుతున్నారు.
68:10జుజ్ 29 · పు. 564

وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَهِينٍ10

కావున నీవు ప్రమాణాలు చేసే ప్రతి నీచుడిని అనుసరించకు;
68:11జుజ్ 29 · పు. 564

هَمَّازٍ مَشَّاءٍ بِنَمِيمٍ11

చాడీలు చెప్పేవాడిని, ఎత్తి పొడుస్తూ ఉండేవాడిని;
68:12జుజ్ 29 · పు. 564

مَنَّاعٍ لِلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ12

మంచిని నిరోధించేవాడిని, హద్దు మీరి ప్రవర్తించే పాపిష్ఠుడిని;
68:13జుజ్ 29 · పు. 564

عُتُلٍّ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ13

నిర్ధయుడిని, ఇంతే గాకుండా అపఖ్యాతి గల (నిందార్హుడైన) వాడిని;
68:14జుజ్ 29 · పు. 564

أَنْ كَانَ ذَا مَالٍ وَبَنِينَ14

వాడు ధనవంతుడూ మరియు సంతాన భాగ్యంతో తలతూగుతూ ఉన్నవాడు అయినా సరే!
68:15జుజ్ 29 · పు. 564

إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ15

ఒకవేళ వాడికి మా సూచనలు (ఆయాత్) వినిపిస్తే, అందుకు వాడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు.
68:16జుజ్ 29 · పు. 564

سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ16

మేము త్వరలోనే వాడి ముక్కు మీద వాత పెడ్తాము.
68:17జుజ్ 29 · పు. 565

إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ17

నిశ్చయంగా, మేము ఆ తోటవారిని పరీక్షించినట్లుగా వీరిని కూడా పరీక్షిస్తాము. ఎవరైతే తెల్లవారగానే తప్పక దాని పంట కోసుకుందామని ప్రతిజ్ఞ చేసుకున్నారో!
68:18జుజ్ 29 · పు. 565

وَلَا يَسْتَثْنُونَ18

మరియు (అల్లాహ్ కోరితే) అనే, మినహాయింపుకు తావు ఇవ్వకుండా!
68:19జుజ్ 29 · పు. 565

فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِنْ رَبِّكَ وَهُمْ نَائِمُونَ19

కావున వారు పడుకొని ఉండగానే నీ ప్రభువు తరఫు నుండి దానిపై (ఆ తోటపై) ఒక ఆపద వచ్చి పడింది.
68:20జుజ్ 29 · పు. 565

فَأَصْبَحَتْ كَالصَّرِيمِ20

దాంతో తెల్లవారే సరికి అది (ఆ తోట) పంట కోసిన పొలం వలే మారి పోయింది.
68:21జుజ్ 29 · పు. 565

فَتَنَادَوْا مُصْبِحِينَ21

తరువాత ఉదయం లేచి వారు ఒకరితో నొకరు ఇలా చెప్పుకోసాగారు:
68:22జుజ్ 29 · పు. 565

أَنِ اغْدُوا عَلَىٰ حَرْثِكُمْ إِنْ كُنْتُمْ صَارِمِينَ22

"మీరు పంటను కోయదలుచుకుంటే ఉదయమే మీ పొలానికి వెళ్ళండి."
68:23జుజ్ 29 · పు. 565

فَانْطَلَقُوا وَهُمْ يَتَخَافَتُونَ23

ఆ తరువాత వారు ఒకరితోనొకరు (ఈ విధంగా) మెల్లగా చెప్పుకుంటూ బయలు దేరారు.
68:24జుజ్ 29 · పు. 565

أَنْ لَا يَدْخُلَنَّهَا الْيَوْمَ عَلَيْكُمْ مِسْكِينٌ24

"ఈ రోజు ఏ పేదవాడిని కూడా మీ దగ్గరకు రానివ్వకండి!"
68:25జుజ్ 29 · పు. 565

وَغَدَوْا عَلَىٰ حَرْدٍ قَادِرِينَ25

మరియు వారు (పేదవారిని) దగ్గరకు రానివ్వకూడదని గట్టి నిర్ణయంతో తెల్లవారు ఝామున బయలు దేరారు.
68:26జుజ్ 29 · పు. 565

فَلَمَّا رَأَوْهَا قَالُوا إِنَّا لَضَالُّونَ26

వారు దానిని (తోటను) చూసి ఇలా వాపోయారు: "నిశ్చయంగా, మనం దారి తప్పాము!
68:27జుజ్ 29 · పు. 565

بَلْ نَحْنُ مَحْرُومُونَ27

కాదు! కాదు! మనం సర్వం కోల్పోయాము!"
68:28జుజ్ 29 · పు. 565

قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُلْ لَكُمْ لَوْلَا تُسَبِّحُونَ28

వారిలో మధ్యరకానికి చెందినవాడు ఇలా అన్నాడు: "ఏమీ? నేను మీతో అనలేదా? మీరు ఎందుకు ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడరని ('ఇన్ షా అల్లాహ్!' అనరని)?"
68:29జుజ్ 29 · పు. 565

قَالُوا سُبْحَانَ رَبِّنَا إِنَّا كُنَّا ظَالِمِينَ29

వారు ఇలా అన్నారు: "మా ప్రభువు సర్వలోపాలకూ అతీతుడు! నిశ్చయంగా, మేమే దుర్మార్గులము!"
68:30జుజ్ 29 · పు. 565

فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَلَاوَمُونَ30

తరువాత వారు అభిముఖులై ఒకరి నొకరు నిందించుకోసాగారు.
68:31జుజ్ 29 · పు. 565

قَالُوا يَا وَيْلَنَا إِنَّا كُنَّا طَاغِينَ31

వారు ఇలా వాపోయారు: "అయ్యో! మా పాడుగాను! నిశ్చయంగా, మేము తలబిరుసుతనం చూపాము!
68:32జుజ్ 29 · పు. 565

عَسَىٰ رَبُّنَا أَنْ يُبْدِلَنَا خَيْرًا مِنْهَا إِنَّا إِلَىٰ رَبِّنَا رَاغِبُونَ32

బహశా! మన ప్రభువు మనకు దీనికి బదులుగా దీని కంటే శ్రేష్ఠమైన దానిని ప్రసాదించ వచ్చు! నిశ్చయంగా, మనం మన ప్రభువు వైపునకు (పశ్చాత్తాపంతో) మరలుదాము!"
68:33జుజ్ 29 · పు. 565

كَذَٰلِكَ الْعَذَابُ ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ33

ఈ విధంగా ఉంటుంది శిక్ష! మరియు పరలోక శిక్ష దీని కంటే ఘోరంగా ఉంటుంది. వారు ఇది తెలుసుకుంటే ఎంత బాగుండేది!
68:34జుజ్ 29 · పు. 565

إِنَّ لِلْمُتَّقِينَ عِنْدَ رَبِّهِمْ جَنَّاتِ النَّعِيمِ34

నిశ్చయంగా, దైవభీతి గలవారికి వారి ప్రభువు వద్ద పరమానందకరమైన స్వర్గవనాలు ఉంటాయి.
68:35జుజ్ 29 · పు. 565

أَفَنَجْعَلُ الْمُسْلِمِينَ كَالْمُجْرِمِينَ35

ఏమీ? మేము విధేయులను (ముస్లింలను) నేరస్థులతో సమానంగా ఎంచుదుమా?
68:36జుజ్ 29 · పు. 565

مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ36

మీకేమయింది? మీరు ఏ విధమైన నిర్ణయాలు చేస్తున్నారు?
68:37జుజ్ 29 · పు. 565

أَمْ لَكُمْ كِتَابٌ فِيهِ تَدْرُسُونَ37

మీ వద్ద ఏదయినా (దివ్య) గ్రంథముందా? దాని నుండి మీరు నేర్చుకోవటానికి!
68:38జుజ్ 29 · పు. 565

إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ38

నిశ్చయంగా, అందులో మీకు, మీరు కోరేదంతా ఉందని?
68:39జుజ్ 29 · పు. 565

أَمْ لَكُمْ أَيْمَانٌ عَلَيْنَا بَالِغَةٌ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۙ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ39

లేక, పునరుత్థాన దినం వరకు, మీరు నిర్ణయించుకున్నదే మీకు తప్పక లభిస్తుందని, మేము మీతో చేసిన గట్టి ప్రమాణం ఏదైనా ఉందా?
68:40జుజ్ 29 · పు. 565

سَلْهُمْ أَيُّهُمْ بِذَٰلِكَ زَعِيمٌ40

వారిలో దీనికి ఎవడు హామీగా ఉన్నాడో అడుగు.
68:41జుజ్ 29 · పు. 565

أَمْ لَهُمْ شُرَكَاءُ فَلْيَأْتُوا بِشُرَكَائِهِمْ إِنْ كَانُوا صَادِقِينَ41

లేక, వారికి ఎవరైనా (వారు అల్లాహ్ కు కల్పించిన) భాగస్వాములు ఉన్నారా? ఒకవేళ వారు సత్యవంతులే అయితే తమ ఆ భాగస్వాములను తీసుకు రమ్మను.
68:42జుజ్ 29 · పు. 565

يَوْمَ يُكْشَفُ عَنْ سَاقٍ وَيُدْعَوْنَ إِلَى السُّجُودِ فَلَا يَسْتَطِيعُونَ42

(జ్ఞాపకముంచుకోండి) ఏ రోజయితే పిక్క ఎముక తెరిచి వేయబడుతుందో! మరియు వారు సాష్టాంగం (సజ్దా) చేయటానికి పిలువబడతారో, అప్పుడు వారు (కపట విశ్వాసులు), అలా (సజ్దా) చేయలేరు!
68:43జుజ్ 29 · పు. 566

خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۖ وَقَدْ كَانُوا يُدْعَوْنَ إِلَى السُّجُودِ وَهُمْ سَالِمُونَ43

వారి చూపులు క్రిందికి వాలిపోయి ఉంటాయి, అవమానం వారిని ఆవరించి ఉంటుంది. మరియు వాస్తవానికి వారు నిక్షేపంగా ఉన్నప్పుడు సాష్టాంగం (సజ్దా) చేయటానికి ఆహ్వానించబడితే (తిరస్కరించేవారు)!
68:44జుజ్ 29 · పు. 566

فَذَرْنِي وَمَنْ يُكَذِّبُ بِهَٰذَا الْحَدِيثِ ۖ سَنَسْتَدْرِجُهُمْ مِنْ حَيْثُ لَا يَعْلَمُونَ44

కావున నన్ను మరియు ఈ సందేశాన్ని అబద్ధమని తిరస్కరించే వారిని వదలండి. వారు గ్రహించని విధంగా మేము వారిని క్రమక్రమంగా (వినాశం వైపునకు) తీసుకొని పోతాము.
68:45జుజ్ 29 · పు. 566

وَأُمْلِي لَهُمْ ۚ إِنَّ كَيْدِي مَتِينٌ45

మరియు నేను వారికి కొంత వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా పన్నాగం చాలా దృఢమైనది.
68:46జుజ్ 29 · పు. 566

أَمْ تَسْأَلُهُمْ أَجْرًا فَهُمْ مِنْ مَغْرَمٍ مُثْقَلُونَ46

లేక, (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఏదైనా ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నావా? వారికి దాని రుణం భారమవటానికి?
68:47జుజ్ 29 · పు. 566

أَمْ عِنْدَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ47

లేక, వారి వద్ద ఏదైనా అగోచర జ్ఞానం ఉందా? వారు దానిని వ్రాసి పెట్టడానికి?
68:48జుజ్ 29 · పు. 566

فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُنْ كَصَاحِبِ الْحُوتِ إِذْ نَادَىٰ وَهُوَ مَكْظُومٌ48

కావున నీవు నీ ప్రభువు ఆజ్ఞ కొరకు వేచి ఉండు. మరియు నీవు, చేపవాని (యూనుస్) వలే వ్యవహరించకు. (గుర్తుకు తెచ్చుకో) అతను దుఃఖంలో ఉన్నప్పుడు (తన ప్రభువును) మొర పెట్టుకున్నాడు.
68:49జుజ్ 29 · పు. 566

لَوْلَا أَنْ تَدَارَكَهُ نِعْمَةٌ مِنْ رَبِّهِ لَنُبِذَ بِالْعَرَاءِ وَهُوَ مَذْمُومٌ49

అతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి అందక పోయి ఉంటే, అతను అవమానకరమైన స్థితిలో (చేప కడుపులో పడి ఉండేవాడు కాని మేము అతనిని క్షమించాము). కావున అతను చౌట (బంజరు) మైదానంలో విసరి వేయ బడ్డాడు.
68:50జుజ్ 29 · పు. 566

فَاجْتَبَاهُ رَبُّهُ فَجَعَلَهُ مِنَ الصَّالِحِينَ50

చివరకు అతని ప్రభువు అతనిని ఎన్నుకొని సత్పురుషులలో చేర్చాడు.
68:51జుజ్ 29 · పు. 566

وَإِنْ يَكَادُ الَّذِينَ كَفَرُوا لَيُزْلِقُونَكَ بِأَبْصَارِهِمْ لَمَّا سَمِعُوا الذِّكْرَ وَيَقُولُونَ إِنَّهُ لَمَجْنُونٌ51

మరియు ఆ సత్యతిరస్కారులు, ఈ సందేశాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు, తమ చూపులతో నీ కాళ్ళు ఊడగొడతారా అన్నట్లు (నిన్ను జారించి పడవేసేటట్లు) నిన్ను చూస్తున్నారు. మరియు వారు నిన్ను (ఓ ముహమ్మద్!): "నిశ్చయంగా ఇతడు పిచ్చివాడు!" అని అంటున్నారు.
68:52జుజ్ 29 · పు. 566

وَمَا هُوَ إِلَّا ذِكْرٌ لِلْعَالَمِينَ52

కాని సర్వలోకాల (వారికి) ఇదొక హితోపదేశం మాత్రమే!

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి