وَالنَّجْمِ إِذَا هَوَىٰ 1
అస్తమించే నక్షత్రం సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ 2
మీ సహచరుడు (ముహమ్మద్), మార్గభ్రష్టుడు కాలేదు మరియు తప్పు దారిలోనూ లేడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا يَنْطِقُ عَنِ الْهَوَىٰ 3
మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ 4
అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ عَلَّمَهُ شَدِيدُ الْقُوَىٰ 5
అది అతనికి మహా బలవంతుడు (జిబ్రీల్) నేర్పాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ذُو مِرَّةٍ فَاسْتَوَىٰ 6
అతను శక్తిసామర్ధ్యాలు గలవాడు, తన వాస్తవరూపంలో ప్రత్యక్షమయినప్పుడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَهُوَ بِالْأُفُقِ الْأَعْلَىٰ 7
అతను ఎత్తైన దిజ్ఞ్మండలంలో (దిక్చక్రంలో) కనిపించాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ دَنَا فَتَدَلَّىٰ 8
తరువాత సమీపించాడు, మరింత క్రిందికి దిగి వచ్చాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَىٰ 9
అప్పుడు అతను రెండు ధనస్సుల దూరంలోనో లేక అంతకంటే తక్కువ దూరంలోనో ఉన్నాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَوْحَىٰ إِلَىٰ عَبْدِهِ مَا أَوْحَىٰ 10
అప్పుడు అతను (జిబ్రీల్), ఆయన (అల్లాహ్) దాసునిపై అవతరింప జేయవలసిన, దానిని (వహీని) అవతరింపజేశాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا كَذَبَ الْفُؤَادُ مَا رَأَىٰ 11
అతను (ప్రవక్త) చూసిన దానిని, అతని హృదయం అబద్ధమని అనలేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَفَتُمَارُونَهُ عَلَىٰ مَا يَرَىٰ 12
అయితే మీరు, అతను (కళ్ళారా) చూసిన దానిని గురించి (అతనితో) వాదులాడుతారా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَقَدْ رَآهُ نَزْلَةً أُخْرَىٰ 13
మరియు వాస్తవానికి అతను (ప్రవక్త) అతనిని (జిబ్రీల్ ను) మరొకసారి (ప్రత్యక్షంగా) అవతరించినప్పుడు చూశాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ عِنْدَ سِدْرَةِ الْمُنْتَهَىٰ 14
(సప్తాకాశంలో) చివరి హద్దులో నున్న రేగు చెట్టు (సిదరతుల్ మున్తహా) దగ్గర.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ عِنْدَهَا جَنَّةُ الْمَأْوَىٰ 15
అక్కడికి దగ్గరలోనే జన్నతుల్ మా'వా ఉంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ يَغْشَى السِّدْرَةَ مَا يَغْشَىٰ 16
అప్పుడు ఆ సిదరహ్ వృక్షాన్ని కప్పేది కప్పేసినప్పుడు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا زَاغَ الْبَصَرُ وَمَا طَغَىٰ 17
అతని (ప్రవక్త) దృష్టి తప్పిపోనూ లేదు మరియు హద్దుదాటి కూడా పోలేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَقَدْ رَأَىٰ مِنْ آيَاتِ رَبِّهِ الْكُبْرَىٰ 18
వాస్తవంగా, అతను (ముహమ్మద్) తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను (ఆయాత్ లను) చూశాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ 19
మీరు, అల్ లాత్ మరియు అల్ ఉజ్జాను గురించి ఆలోచించారా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَنَاةَ الثَّالِثَةَ الْأُخْرَىٰ 20
మరియు మూడవదీ చివరిది అయిన మనాత్ ను (గురించి కూడా)?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَلَكُمُ الذَّكَرُ وَلَهُ الْأُنْثَىٰ 21
మీ కొరకైతే కుమారులు మరియు ఆయన కొరకు కుమార్తెలా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ تِلْكَ إِذًا قِسْمَةٌ ضِيزَىٰ 22
ఇది అన్యాయమైన విభజన కాదా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنْ هِيَ إِلَّا أَسْمَاءٌ سَمَّيْتُمُوهَا أَنْتُمْ وَآبَاؤُكُمْ مَا أَنْزَلَ اللَّهُ بِهَا مِنْ سُلْطَانٍ ۚ إِنْ يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْأَنْفُسُ ۖ وَلَقَدْ جَاءَهُمْ مِنْ رَبِّهِمُ الْهُدَىٰ 23
ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. వారు, కేవలం తమ ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمْ لِلْإِنْسَانِ مَا تَمَنَّىٰ 24
ఏమిటి? మానవునికి తాను కోరినదంతా లభిస్తుందా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلِلَّهِ الْآخِرَةُ وَالْأُولَىٰ 25
వాస్తవానికి, అంతిమ (పరలోకం) మరియు ప్రథమం (ఇహలోకం) అన్నీ అల్లాహ్ కే చెందినవి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ۞ وَكَمْ مِنْ مَلَكٍ فِي السَّمَاوَاتِ لَا تُغْنِي شَفَاعَتُهُمْ شَيْئًا إِلَّا مِنْ بَعْدِ أَنْ يَأْذَنَ اللَّهُ لِمَنْ يَشَاءُ وَيَرْضَىٰ 26
మరియు ఆకాశాలలో ఎందరో దేవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం పనికిరాదు; అల్లాహ్ ఎవరి పట్లనైతే ప్రసన్నుడై, తన ఇష్టంతో వారికి అనుమతిస్తేనే తప్ప!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ لَيُسَمُّونَ الْمَلَائِكَةَ تَسْمِيَةَ الْأُنْثَىٰ 27
నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో! వారే దేవదూతలను స్త్రీల పేర్లతో పిలుస్తారు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا لَهُمْ بِهِ مِنْ عِلْمٍ ۖ إِنْ يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ ۖ وَإِنَّ الظَّنَّ لَا يُغْنِي مِنَ الْحَقِّ شَيْئًا 28
ఈ విషయం గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం తమ ఊహలనే అనుసరిస్తున్నారు. కాని వాస్తవానికి, ఊహ సత్యానికి ఏ మాత్రం బదులు కాజాలదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَعْرِضْ عَنْ مَنْ تَوَلَّىٰ عَنْ ذِكْرِنَا وَلَمْ يُرِدْ إِلَّا الْحَيَاةَ الدُّنْيَا 29
కావున, మా హితబోధ (ఖుర్ఆన్) నుండి ముఖం త్రిప్పుకొని ఇహలోక జీవితం తప్ప మరేమీ కోరని వ్యక్తిని నీవు పట్టించుకోకు,
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ذَٰلِكَ مَبْلَغُهُمْ مِنَ الْعِلْمِ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِمَنِ اهْتَدَىٰ 30
ఇదే వారి జ్ఞానపరిధి. నిశ్చయంగా, నీ ప్రభువుకు, ఆయన మార్గం నుండి ఎవడు తప్పిపోయాడో తెలుసు. మరియు ఎవడు సన్మార్గంలో ఉన్నాడో కూడా, ఆయనకు బాగా తెలుసు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ لِيَجْزِيَ الَّذِينَ أَسَاءُوا بِمَا عَمِلُوا وَيَجْزِيَ الَّذِينَ أَحْسَنُوا بِالْحُسْنَى 31
మరియు ఆకాశాలలో నున్నది మరియు భూమిలో నున్నది, అంతా అల్లాహ్ కే చెందుతుంది. దుష్టులకు వారి కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి మరియు సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ الَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ إِلَّا اللَّمَمَ ۚ إِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ ۚ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنْشَأَكُمْ مِنَ الْأَرْضِ وَإِذْ أَنْتُمْ أَجِنَّةٌ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ ۖ فَلَا تُزَكُّوا أَنْفُسَكُمْ ۖ هُوَ أَعْلَمُ بِمَنِ اتَّقَىٰ 32
ఎవరైతే చిన్న చిన్న తప్పులు తప్ప, పెద్ద పాపాల నుండి మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారి కొరకు, నిశ్చయంగా, నీ ప్రభువు క్షమాపణ పరిధి చాలా విశాలమైనది. మిమ్మల్ని మట్టి నుండి సృష్టించినప్పటి నుండి మరియు మీ తల్లుల గర్భాలలో పిండాలుగా ఉన్నప్పటి నుండి కూడా, ఆయనకు మీ గురించి బాగా తెలుసు. కావున మీరు మీ పవిత్రతను గురించి (గొప్పలు) చెప్పుకోకండి. ఎవడు భయభక్తులు గలవాడో ఆయనకు బాగా తెలుసు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَفَرَأَيْتَ الَّذِي تَوَلَّىٰ 33
నీవు (ఇస్లాం నుండి) మరలి పోయే వాడిని చూశావా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَعْطَىٰ قَلِيلًا وَأَكْدَىٰ 34
మరియు (అల్లాహ్ మార్గంలో) కొంత మాత్రమే ఇచ్చి, చేయి ఆపుకునేవాడిని?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَعِنْدَهُ عِلْمُ الْغَيْبِ فَهُوَ يَرَىٰ 35
అతని వద్ద అగోచర జ్ఞానముందా? అతడు (స్పష్టంగా) చూడటానికి?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمْ لَمْ يُنَبَّأْ بِمَا فِي صُحُفِ مُوسَىٰ 36
లేక, మూసా గ్రంథంలో నున్న విషయాలు అతనికి తెలుపబడలేదా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِبْرَاهِيمَ الَّذِي وَفَّىٰ 37
మరియు తన బాధ్యతను నెరవేర్చిన ఇబ్రాహీమ్ విషయము;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَلَّا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ 38
మరియు (పాపాల) భారం మోసే వాడెవడూ ఇతరుల (పాపాల) భారం మోయడని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنْ لَيْسَ لِلْإِنْسَانِ إِلَّا مَا سَعَىٰ 39
మరియు మానవునికి తాను చేసిన దాని ఫలితం తప్ప మరొకటి లభించదని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ 40
మరియు నిశ్చయంగా, అతనికి తన కృషి ఫలితమే చూపబడుతుందని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ 41
అప్పుడు అతనికి తన కృషికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుందని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنْتَهَىٰ 42
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్దనే (ప్రతిదాని) ముగింపు ఉన్నదని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ 43
మరియు నిశ్చయంగా, ఆయనే నిన్ను నవ్విస్తున్నాడు మరియు ఏడ్పిస్తున్నాడని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنَّهُ هُوَ أَمَاتَ وَأَحْيَا 44
మరియు నిశ్చయంగా, ఆయనే మరణింపజేసేవాడు మరియు జీవితాన్ని ప్రసాదించేవాడని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنَّهُ خَلَقَ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنْثَىٰ 45
మరియు నిశ్చయంగా, మగ-ఆడ జంటలను సృష్టించినవాడు ఆయనేనని -
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مِنْ نُطْفَةٍ إِذَا تُمْنَىٰ 46
విసర్జింపబడిన వీర్యబిందువు నుండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنَّ عَلَيْهِ النَّشْأَةَ الْأُخْرَىٰ 47
మరియు నిశ్చయంగా, దానికి మరొక జీవితాన్ని (పునరుత్థానం) ప్రసాదించడం ఆయన (అల్లాహ్) కే చెందినదని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنَّهُ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ 48
మరియు నిశ్చయంగా, ఆయనే సంపన్నునిగా చేసేవాడు మరియు తృప్తినిచ్చు వాడని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنَّهُ هُوَ رَبُّ الشِّعْرَىٰ 49
మరియు నిశ్చయంగా ఆయనే అగ్ని నక్షత్రానికి ప్రభువని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنَّهُ أَهْلَكَ عَادًا الْأُولَىٰ 50
మరియు నిశ్చయంగా, ఆయనే తొలి ఆద్ జాతిని నాశనం చేసినవాడని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَثَمُودَ فَمَا أَبْقَىٰ 51
మరియు సమూద్ జాతిని; ఒక్కడూ కూడా లేకుండా రూపుమాపాడని.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَقَوْمَ نُوحٍ مِنْ قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ 52
మరియు అంతకు పూర్వం నూహ్ జాతి వారిని. నిశ్చయంగా, వారు పరమ దుర్మార్గులు మరియు తలబిరుసులు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالْمُؤْتَفِكَةَ أَهْوَىٰ 53
మరియు ఆయనే తలక్రిందులైన నగరాలను నాశనం చేశాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَغَشَّاهَا مَا غَشَّىٰ 54
తరువాత వాటిని క్రమ్ముకొనవలసింది (రాళ్ళ వర్షం) క్రమ్ముకున్నది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَبِأَيِّ آلَاءِ رَبِّكَ تَتَمَارَىٰ 55
అయితే (ఓ మానవుడా!) నీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను గురించి నీవు అనుమానంలో పడి ఉంటావు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هَٰذَا نَذِيرٌ مِنَ النُّذُرِ الْأُولَىٰ 56
ఇది వరకు వచ్చిన హెచ్చరిక చేసే వారి వలే ఇతను (ముహమ్మద్) కూడా హెచ్చరిక చేసేవాడు మాత్రమే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَزِفَتِ الْآزِفَةُ 57
రానున్న ఘడియ (పునరుత్థాన దినం) సమీపంలోనే వుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَيْسَ لَهَا مِنْ دُونِ اللَّهِ كَاشِفَةٌ 58
అల్లాహ్ తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَفَمِنْ هَٰذَا الْحَدِيثِ تَعْجَبُونَ 59
ఏమీ? మీరు ఈ సందేశాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ 60
మరియు మీరు నవ్వుతున్నారా?మరియు మీకు ఏడ్పు రావటం లేదా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنْتُمْ سَامِدُونَ 61
మరియు మీరు నిర్లక్ష్యంలో మునిగి ఉన్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاسْجُدُوا لِلَّهِ وَاعْبُدُوا ۩ 62
కావున! అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి. మరియు (ఆయనను మాత్రమే) ఆరాధించండి!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్