Ad-Dukhan

سورة الدخان

సూరా 44 · మక్కీ · 59 ఆయత్‌లు

44:1జుజ్ 25 · పు. 496

حم1

హా - మీమ్.
44:2జుజ్ 25 · పు. 496

وَالْكِتَابِ الْمُبِينِ2

స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా!
44:3జుజ్ 25 · పు. 496

إِنَّا أَنْزَلْنَاهُ فِي لَيْلَةٍ مُبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنْذِرِينَ3

నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము. నిశ్చయంగా, మేము (ప్రజలను) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము.
44:4జుజ్ 25 · పు. 496

فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ4

దానిలో (ఆ రాత్రిలో), ప్రతి విషయం వివేకంతో విశదీకరించ బడుతుంది;
44:5జుజ్ 25 · పు. 496

أَمْرًا مِنْ عِنْدِنَا ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ5

మా ఆజ్ఞానుసారంగా, నిశ్చయంగా, మేము (సందేశహరులను) పంపుతూ వచ్చాము.
44:6జుజ్ 25 · పు. 496

رَحْمَةً مِنْ رَبِّكَ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ6

నీ ప్రభువు తరఫు నుండి కారుణ్యంగా! నిశ్చయంగా, ఆయనే అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.
44:7జుజ్ 25 · పు. 496

رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِنْ كُنْتُمْ مُوقِنِينَ7

భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు. మీకు వాస్తవంగా నమ్మకమే ఉంటే!
44:8జుజ్ 25 · పు. 496

لَا إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ8

ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మరియు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. ఆయన మీ ప్రభువు మరియు పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు.
44:9జుజ్ 25 · పు. 496

بَلْ هُمْ فِي شَكٍّ يَلْعَبُونَ9

అసలు! వారు సందేహంలో పడి ఆటల్లో మునిగి ఉన్నారు (పరిహసిస్తున్నారు).
44:10జుజ్ 25 · పు. 496

فَارْتَقِبْ يَوْمَ تَأْتِي السَّمَاءُ بِدُخَانٍ مُبِينٍ10

కావున నీవు ఆకాశం నుండి స్పష్టమైన పొగ వచ్చే దినం కొరకు నిరీక్షించు!
44:11జుజ్ 25 · పు. 496

يَغْشَى النَّاسَ ۖ هَٰذَا عَذَابٌ أَلِيمٌ11

అది మానవులందరినీ క్రమ్ముకుంటుంది. అదొక బాధాకరమైన శిక్ష.
44:12జుజ్ 25 · పు. 496

رَبَّنَا اكْشِفْ عَنَّا الْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ12

(అప్పుడు వారు ఇలా వేడుకుంటారు): "ఓ మా ప్రభూ! ఈ శిక్షను మా నుండి తొలగించు. నిశ్చయంగా, మేము విశ్వాసుల మవుతాము."
44:13జుజ్ 25 · పు. 496

أَنَّىٰ لَهُمُ الذِّكْرَىٰ وَقَدْ جَاءَهُمْ رَسُولٌ مُبِينٌ13

ఇక (అంతిమ ఘడియలో) హితబోధ స్వీకరించటం వారికి ఎలా పనికి రాగలదు? వాస్తవానికి వారి వద్దకు (సత్యాన్ని) స్పష్టంగా తెలియజేసే ప్రవక్త వచ్చి ఉన్నాడు;
44:14జుజ్ 25 · పు. 496

ثُمَّ تَوَلَّوْا عَنْهُ وَقَالُوا مُعَلَّمٌ مَجْنُونٌ14

అప్పుడు వారు అతని నుండి మరలి పోయారు మరియు ఇలా అన్నారు: "ఇతను ఇతరుల నుండి నేర్చుకున్నాడు, ఇతనొక పిచ్చివాడు!"
44:15జుజ్ 25 · పు. 496

إِنَّا كَاشِفُو الْعَذَابِ قَلِيلًا ۚ إِنَّكُمْ عَائِدُونَ15

వాస్తవానికి మేము కొంతకాలం వరకు ఈ శిక్షను తొలగిస్తే నిశ్చయంగా, మీరు చేస్తూ వచ్చిందే మళ్ళీ చేస్తారు.
44:16జుజ్ 25 · పు. 496

يَوْمَ نَبْطِشُ الْبَطْشَةَ الْكُبْرَىٰ إِنَّا مُنْتَقِمُونَ16

మేము శిక్షించటం కోసం గట్టిగా పట్టుకున్న రోజు, మేము నిశ్చయంగా, ప్రతీకారం చేస్తాము.
44:17జుజ్ 25 · పు. 496

۞ وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَاءَهُمْ رَسُولٌ كَرِيمٌ17

మరియు వాస్తవంగా, వారికి పూర్వం మేము ఫిర్ఔన్ జాతి వారిని పరీక్షకు గురి చేశాము. మరియు వారి వద్దకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చి ఉన్నాడు.
44:18జుజ్ 25 · పు. 496

أَنْ أَدُّوا إِلَيَّ عِبَادَ اللَّهِ ۖ إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ18

(అతను ఇలా అన్నాడు): "అల్లాహ్ దాసులను నాకు అప్పగించు. నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుణ్ణయిన సందేశహరుణ్ణి.
44:19జుజ్ 25 · పు. 497

وَأَنْ لَا تَعْلُوا عَلَى اللَّهِ ۖ إِنِّي آتِيكُمْ بِسُلْطَانٍ مُبِينٍ19

మరియు మీరు అల్లాహ్ ముందు అహంభావాన్ని (ఔన్నత్యాన్ని) చూపకండి. నిశ్చయంగా, నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకొని వచ్చాను.
44:20జుజ్ 25 · పు. 497

وَإِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُمْ أَنْ تَرْجُمُونِ20

మరియు నిశ్చయంగా, నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు (అయిన) అల్లాహ్ యొక్క శరణు పొందాను, - మీరు నన్ను రాళ్లు రువ్వి చంపకుండా ఉండటానికి.
44:21జుజ్ 25 · పు. 497

وَإِنْ لَمْ تُؤْمِنُوا لِي فَاعْتَزِلُونِ21

ఒకవేళ మీరు నా మాట నమ్మకపోయినా సరే! నా జోలికి మాత్రం రాకండి!"
44:22జుజ్ 25 · పు. 497

فَدَعَا رَبَّهُ أَنَّ هَٰؤُلَاءِ قَوْمٌ مُجْرِمُونَ22

చివరకు అతను తన ప్రభువున ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా, ఈ జనులు చాలా అపరాధులు!"
44:23జుజ్ 25 · పు. 497

فَأَسْرِ بِعِبَادِي لَيْلًا إِنَّكُمْ مُتَّبَعُونَ23

(అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు): "నీవు నా దాసులను తీసుకొని రాత్రివేళ బయలు దేరు, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు.
44:24జుజ్ 25 · పు. 497

وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُنْدٌ مُغْرَقُونَ24

మరియు సముద్రాన్ని చీల్చి నెమ్మదిగా వెళ్ళిపో. నిశ్చయంగా, ఆ సైనికులు అందులో మునిగిపోతారు!"
44:25జుజ్ 25 · పు. 497

كَمْ تَرَكُوا مِنْ جَنَّاتٍ وَعُيُونٍ25

వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచి పోయారు;
44:26జుజ్ 25 · పు. 497

وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ26

మరియు ఎన్నో పంటపొలాలను మరియు గొప్ప భవనాలను;
44:27జుజ్ 25 · పు. 497

وَنَعْمَةٍ كَانُوا فِيهَا فَاكِهِينَ27

మరియు వారు అనుభవిస్తూ ఉన్న ఎన్నో సుఖసంతోషాలను కూడా!
44:28జుజ్ 25 · పు. 497

كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَاهَا قَوْمًا آخَرِينَ28

ఈ విధంగా, (వారి ముగింపు జరిగింది). మరియు మేము వాటికి ఇతర జాతి వారిని వారసులుగా చేశాము.
44:29జుజ్ 25 · పు. 497

فَمَا بَكَتْ عَلَيْهِمُ السَّمَاءُ وَالْأَرْضُ وَمَا كَانُوا مُنْظَرِينَ29

కాని, వారి కొరకు ఆకాశం గానీ, భూమి గానీ విలపించలేదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు.
44:30జుజ్ 25 · పు. 497

وَلَقَدْ نَجَّيْنَا بَنِي إِسْرَائِيلَ مِنَ الْعَذَابِ الْمُهِينِ30

మరియు వాస్తవంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని అవమానకరమైన శిక్ష నుండి విముక్తి కలిగించాము -
44:31జుజ్ 25 · పు. 497

مِنْ فِرْعَوْنَ ۚ إِنَّهُ كَانَ عَالِيًا مِنَ الْمُسْرِفِينَ31

ఫిర్ఔన్ నుండి నిశ్చయంగా, అతడు మితిమీరి ప్రవర్తించేవారి, అగ్రగణ్యుడు.
44:32జుజ్ 25 · పు. 497

وَلَقَدِ اخْتَرْنَاهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى الْعَالَمِينَ32

మరియు వాస్తవానికి మాకు తెలిసి ఉండి కూడా మేము వారిని లోకంలో (ఆ కాలపు) సర్వజనులపై ఎన్నుకున్నాము.
44:33జుజ్ 25 · పు. 497

وَآتَيْنَاهُمْ مِنَ الْآيَاتِ مَا فِيهِ بَلَاءٌ مُبِينٌ33

మరియు మేము వారికి అద్భుత సూచనలను (ఆయాత్ లను) ఒసంగి ఉంటిమి. అందులో వారికి స్పష్టమైన పరీక్ష ఉండింది.
44:34జుజ్ 25 · పు. 497

إِنَّ هَٰؤُلَاءِ لَيَقُولُونَ34

నిశ్చయంగా, వీరు (ఖురైషులు) ఇలా అంటున్నారు:
44:35జుజ్ 25 · పు. 497

إِنْ هِيَ إِلَّا مَوْتَتُنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنْشَرِينَ35

"వాస్తవానికి, మాకు ఈ మొదటి మరణం మాత్రమే ఉంది, ఆ తరువాత మేము తిరిగి బ్రతికించబడము.
44:36జుజ్ 25 · పు. 497

فَأْتُوا بِآبَائِنَا إِنْ كُنْتُمْ صَادِقِينَ36

మీరు సత్యవంతులే అయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురండి!"
44:37జుజ్ 25 · పు. 497

أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍ وَالَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ أَهْلَكْنَاهُمْ ۖ إِنَّهُمْ كَانُوا مُجْرِمِينَ37

వారు మేలైన వారా? లేక తుబ్బఅ జాతివారు మరియు వారి కంటే పూర్వం వారా? మేము వారందరినీ నాశనం చేశాము. నిశ్చయంగా, వారందరూ అపరాధులే!
44:38జుజ్ 25 · పు. 497

وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ38

మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆట (కాలక్షేపం) కొరకు సృష్టించలేదు.
44:39జుజ్ 25 · పు. 497

مَا خَلَقْنَاهُمَا إِلَّا بِالْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ39

మేము వాటిని ఒక లక్ష్యంతోనే సృష్టించాము, కాని చాలా మందికి ఇది తెలియదు.
44:40జుజ్ 25 · పు. 498

إِنَّ يَوْمَ الْفَصْلِ مِيقَاتُهُمْ أَجْمَعِينَ40

నిశ్చయంగా, తీర్పుదినం వారందరి కొరకు ఒక నిర్ణీత దినం.
44:41జుజ్ 25 · పు. 498

يَوْمَ لَا يُغْنِي مَوْلًى عَنْ مَوْلًى شَيْئًا وَلَا هُمْ يُنْصَرُونَ41

ఆ దినమున ఏ స్నేహితుడు కూడా మరొక స్నేహితునికి ఏ మాత్రం ఉపయోగపడడు. మరియు వారికి ఎలాంటి సహాయమూ లభించదు.
44:42జుజ్ 25 · పు. 498

إِلَّا مَنْ رَحِمَ اللَّهُ ۚ إِنَّهُ هُوَ الْعَزِيزُ الرَّحِيمُ42

అల్లాహ్ కరుణించిన వానికి తప్ప! నిశ్చయంగా, ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
44:43జుజ్ 25 · పు. 498

إِنَّ شَجَرَتَ الزَّقُّومِ43

నిశ్చయంగా, జఖ్ఖూమ్ వృక్షఫలం;
44:44జుజ్ 25 · పు. 498

طَعَامُ الْأَثِيمِ44

పాపులకు ఆహారంగా ఇవ్వబడుతుంది;
44:45జుజ్ 25 · పు. 498

كَالْمُهْلِ يَغْلِي فِي الْبُطُونِ45

మరిగే నూనే (సీసం) వలే, అది వారి కడుపులో మరుగుతుంది;
44:46జుజ్ 25 · పు. 498

كَغَلْيِ الْحَمِيمِ46

సలసల కాగే నీటిలాగా!
44:47జుజ్ 25 · పు. 498

خُذُوهُ فَاعْتِلُوهُ إِلَىٰ سَوَاءِ الْجَحِيمِ47

(ఇలా అనబడుతుంది): "ఇతనిని పట్టుకొని భగభగ మండే నరకాగ్ని మధ్యలోకి ఈడ్వండి;
44:48జుజ్ 25 · పు. 498

ثُمَّ صُبُّوا فَوْقَ رَأْسِهِ مِنْ عَذَابِ الْحَمِيمِ48

ఆ తరువాత అతని నెత్తి మీద సలసల కాగే నీటి శిక్షను పోయండి.
44:49జుజ్ 25 · పు. 498

ذُقْ إِنَّكَ أَنْتَ الْعَزِيزُ الْكَرِيمُ49

దీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా!"
44:50జుజ్ 25 · పు. 498

إِنَّ هَٰذَا مَا كُنْتُمْ بِهِ تَمْتَرُونَ50

నిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడి వున్న విషయం!
44:51జుజ్ 25 · పు. 498

إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ51

నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు.
44:52జుజ్ 25 · పు. 498

فِي جَنَّاتٍ وَعُيُونٍ52

ఉద్యానవనాలలో మరియు చెలమల మధ్య.
44:53జుజ్ 25 · పు. 498

يَلْبَسُونَ مِنْ سُنْدُسٍ وَإِسْتَبْرَقٍ مُتَقَابِلِينَ53

వారు, మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టు వస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు.
44:54జుజ్ 25 · పు. 498

كَذَٰلِكَ وَزَوَّجْنَاهُمْ بِحُورٍ عِينٍ54

ఇలా ఉంటుంది వారి స్థితి! మరియు మేము వారిని అందమైన, ప్రకాశవంతమైన కళ్ళు గల వారితో (హూర్ లతో) వివాహం చేయిస్తాము.
44:55జుజ్ 25 · పు. 498

يَدْعُونَ فِيهَا بِكُلِّ فَاكِهَةٍ آمِنِينَ55

వారక్కడ శాంతియుతంగా ఉంటూ అనేక రకాలైన ఫలాలను అడుగుతుంటారు.
44:56జుజ్ 25 · పు. 498

لَا يَذُوقُونَ فِيهَا الْمَوْتَ إِلَّا الْمَوْتَةَ الْأُولَىٰ ۖ وَوَقَاهُمْ عَذَابَ الْجَحِيمِ56

వారక్కడ మరణాన్ని ఎన్నడూ రుచి చూడరు; వారి మొదటి (ఇహలోక) మరణం తప్ప! మరియు ఆయన వారిని భగభగమండే అగ్నిశిక్ష నుండి కాపాడాడు;
44:57జుజ్ 25 · పు. 498

فَضْلًا مِنْ رَبِّكَ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ57

నీ ప్రభువు అనుగ్రహం వల్ల. ఇదే ఆ గొప్ప సాఫల్యం!
44:58జుజ్ 25 · పు. 498

فَإِنَّمَا يَسَّرْنَاهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ58

అందుకే నిశ్చయంగా, మేము (ఈ ఖుర్ఆన్ ను) నీ భాషలో సులభం చేశాము. ఇలాగైనా వారు అర్థం చేసుకుంటారని (హితబోధ గ్రహిస్తారని).
44:59జుజ్ 25 · పు. 498

فَارْتَقِبْ إِنَّهُمْ مُرْتَقِبُونَ59

కావున, నీవు నిరీక్షించు! నిశ్చయంగా వారు కూడా నిరీక్షిస్తున్నారు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి