وَالصَّافَّاتِ صَفًّا 1
వరుసగా బారులు తీరి నిలుచున్న వారి (దైవదూతల) సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَالزَّاجِرَاتِ زَجْرًا 2
మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَالتَّالِيَاتِ ذِكْرًا 3
ఈ ఉపదేశాన్ని (ఖుర్ఆన్ ను, అల్లాహ్ దగ్గరి నుండి మానవులకు) తెచ్చే వారి (దైవదూతల) సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ إِلَٰهَكُمْ لَوَاحِدٌ 4
నిశ్చయంగా, మీ ఆరాధ్య దైవం కేవలం ఆయన (అల్లాహ్) ఒక్కడే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ 5
ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్యనున్న వాటి ప్రభువు మరియు సూర్యోదయ (తూర్పు) స్థలాలకు ప్రభువు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ 6
నిశ్చయంగా, మేము భూలోకానికి దగ్గరి ఆకాశాన్ని నక్షత్ర సముదాయాలతో అలంకరించాము;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَحِفْظًا مِنْ كُلِّ شَيْطَانٍ مَارِدٍ 7
మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ నుండి కాపాడటానికి;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَا يَسَّمَّعُونَ إِلَى الْمَلَإِ الْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِنْ كُلِّ جَانِبٍ 8
ఇక వారు (షైతాన్ లు), ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల (దైవదూతల) మాటలు వినలేరు మరియు వారు ప్రతి దిక్కు నుండి తరుమబడుతూ ఉంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ 9
(ఎందుకంటే) వారు (షైతాన్ లు) బహిష్కరించ బడ్డారు. మరియు వారికి నిరంతరమైన శిక్ష ఉంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَأَتْبَعَهُ شِهَابٌ ثَاقِبٌ 10
కాని, ఎవడైనా (ఏ షైతానైనా), దేనినైనా ఎగురవేసుకొని పోతున్నట్లైతే, మండే అగ్నిజ్వాల అతనిని వెంబడిస్తుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَمْ مَنْ خَلَقْنَا ۚ إِنَّا خَلَقْنَاهُمْ مِنْ طِينٍ لَازِبٍ 11
అయితే వారిని అడగిండి: "ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక, మేము సృష్టించింది (ఈ సృష్టి దృఢమైనదా?" నిశ్చయంగా, మేము వారిని జిగట మట్టి (తీనిల్లాజిబ్) తో సృష్టించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ 12
వాస్తవానికి, నీవైతే ఆశ్చర్యపడుతున్నావు, కాని వారు ఎగతాళి చేస్తున్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِذَا ذُكِّرُوا لَا يَذْكُرُونَ 13
మరియు వారికి ఉపదేశమిచ్చినపుడు, వారు దానిని స్వీకరించరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِذَا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ 14
మరియు వారొక సంకేతాన్ని చూసినప్పుడు, దానిని ఎగతాళి చేస్తారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَقَالُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُبِينٌ 15
మరియు వారిలా అంటారు: "ఇది స్పష్టమైన మంత్రజాలం మాత్రమే!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ 16
"ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల సజీవులుగా లేపబడతామా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ 17
"ఏమిటి? మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قُلْ نَعَمْ وَأَنْتُمْ دَاخِرُونَ 18
వారితో ఇలా అను: "అవును! అప్పుడు మీరు అధమమైన వారు అవుతారు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ يَنْظُرُونَ 19
నిశ్చయంగా, అది ఒక పెద్ద ధ్వని మాత్రమే (రెండవ బాకా), అప్పుడు వారు (లేచి) చూస్తూ ఉండిపోతారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَقَالُوا يَا وَيْلَنَا هَٰذَا يَوْمُ الدِّينِ 20
మరియు వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదే ఆ తీర్పుదినం."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هَٰذَا يَوْمُ الْفَصْلِ الَّذِي كُنْتُمْ بِهِ تُكَذِّبُونَ 21
(అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "మీరు అబద్ధమని తిరస్కరిస్తూ ఉండే న్యాయవిచారణ దినం ఇదే!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ۞ احْشُرُوا الَّذِينَ ظَلَمُوا وَأَزْوَاجَهُمْ وَمَا كَانُوا يَعْبُدُونَ 22
(దైవదూతలతో ఇలా అనబడుతుంది): "ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్న వారిని -
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مِنْ دُونِ اللَّهِ فَاهْدُوهُمْ إِلَىٰ صِرَاطِ الْجَحِيمِ 23
అల్లాహ్ ను కాదని - తరువాత వారందరికీ ప్రజ్వలించే నరకాగ్ని మార్గాన్ని చూపండి;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَقِفُوهُمْ ۖ إِنَّهُمْ مَسْئُولُونَ 24
మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا لَكُمْ لَا تَنَاصَرُونَ 25
మీకేమైంది? మీరు పరస్పరం ఎందుకు సహాయం చేసుకోవటం లేదు?'"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ بَلْ هُمُ الْيَوْمَ مُسْتَسْلِمُونَ 26
అలా కాదు! ఆ రోజు వారు తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ 27
మరియు వారు ఒకరి వైపునకు మరొకరు మరలి ఇలా ప్రశ్నించుకుంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا إِنَّكُمْ كُنْتُمْ تَأْتُونَنَا عَنِ الْيَمِينِ 28
కొందరు అంటారు: "మీరు మా వద్దకు (మమ్మల్ని మోసగించటానికి) మా కుడివైపు నుండి వచ్చేవారు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا بَلْ لَمْ تَكُونُوا مُؤْمِنِينَ 29
ఇతరులు ఇలా జవాబిస్తారు: "అలా కాదు, మీ అంతట మీరే విశ్వసించేవారు కాదు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا كَانَ لَنَا عَلَيْكُمْ مِنْ سُلْطَانٍ ۖ بَلْ كُنْتُمْ قَوْمًا طَاغِينَ 30
"మాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలా కాదు! మీరే తలబిరుసుతనం చూపేవారు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَا ۖ إِنَّا لَذَائِقُونَ 31
"కావున, ఇప్పుడు మన ప్రభువు వాక్కు మనపై పూర్తి అయ్యింది. నిశ్చయంగా మనమంతా (శిక్షను) రుచి చూడగలము."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَغْوَيْنَاكُمْ إِنَّا كُنَّا غَاوِينَ 32
"కావున మేము మిమ్మల్ని తప్పు దారిలో పడవేశాము, నిశ్చయంగా మేము కూడా మార్గభ్రష్టులమై ఉంటిమి!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ 33
అప్పుడు నిశ్చయంగా, వారందరూ ఆ రోజు శిక్షలో భాగస్వాములవుతారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ 34
నిశ్చయంగా, మేము అపరాధులతో ఇదే విధంగా ప్రవర్తిస్తాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ يَسْتَكْبِرُونَ 35
వాస్తవానికి, వారితో: "అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు." అని అన్నప్పుడు, వారు దరహంకారం చూపేవారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَجْنُونٍ 36
మరియు వారు ఇలా అనేవారు: "ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ بَلْ جَاءَ بِالْحَقِّ وَصَدَّقَ الْمُرْسَلِينَ 37
వాస్తవానికి, అతను (ముహమ్మద్) సత్యాన్ని తీసుకొని వచ్చాడు. మరియు అతను (తనకు పూర్వం వచ్చిన) ప్రవక్తలను సత్యవంతులని ధృవపరచాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّكُمْ لَذَائِقُو الْعَذَابِ الْأَلِيمِ 38
నిశ్చయంగా, మీరు బాధాకరమైన శిక్షను రుచి చూడగలరు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنْتُمْ تَعْمَلُونَ 39
మరియు మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ఫలితం తప్ప, మరేమీ ఇవ్వబడదు -
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ 40
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أُولَٰئِكَ لَهُمْ رِزْقٌ مَعْلُومٌ 41
అలాంటి వారి కొరకు వారికి తెలిసి ఉన్న జీవనోపాధి ఉంది;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَوَاكِهُ ۖ وَهُمْ مُكْرَمُونَ 42
అన్ని రకాల ఫలాలు. మరియు వారు ఆదరించబడతారు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فِي جَنَّاتِ النَّعِيمِ 43
పరమ సుఖాలు గల స్వర్గవనాలలో;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ عَلَىٰ سُرُرٍ مُتَقَابِلِينَ 44
ఆసనాల మీద ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు,
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يُطَافُ عَلَيْهِمْ بِكَأْسٍ مِنْ مَعِينٍ 45
వారి మధ్య ప్రవహించే చెలమల నుండి, పానీయపు (మధు) పాత్రలు త్రిప్పబడుతుంటాయి;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ بَيْضَاءَ لَذَّةٍ لِلشَّارِبِينَ 46
అది తెల్లగా (మెరిసిపోతూ) త్రాగే వారికి ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنْزَفُونَ 47
దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ పోగొట్టుకోరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَعِنْدَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ عِينٌ 48
మరియు వారి దగ్గర, శీలవతులైన తమ చూపులను నిగ్రహించుకునే, అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَأَنَّهُنَّ بَيْضٌ مَكْنُونٌ 49
వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ 50
అప్పుడు వారు ఒకరి వైపు కొకరు మరలి, పరస్పరం ఇలా ప్రశ్నించుకుంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ قَائِلٌ مِنْهُمْ إِنِّي كَانَ لِي قَرِينٌ 51
వారిలో ఒకడంటాడు: "వాస్తవానికి (భూలోకంలో) నాకొక స్నేహితుడు (ఖరీనున్) ఉండేవాడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَقُولُ أَإِنَّكَ لَمِنَ الْمُصَدِّقِينَ 52
అతడు నన్ను ఇలా అడిగేవాడు: ఏమీ? నీవు కూడా (పునరుత్థానం) నిజమేనని నమ్మేవారిలో ఒకడివా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَدِينُونَ 53
ఏమీ? మనం చనిపోయి మట్టిగా ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా నిశ్చయంగా మనకు ప్రతిఫలమనేది ఉంటుందా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ هَلْ أَنْتُمْ مُطَّلِعُونَ 54
అతడు ఇంకా ఇలా అంటాడు: "ఏమీ? మీరు అతడిని చూడదలచుకున్నారా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاطَّلَعَ فَرَآهُ فِي سَوَاءِ الْجَحِيمِ 55
తరువాత అతడు తొంగి చూసి, అతడిని (తన పూర్వ స్నేహితుణ్ణి) భగభగ మండే నరకాగ్ని మధ్యలో చూస్తాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ تَاللَّهِ إِنْ كِدْتَ لَتُرْدِينِ 56
అతడితో (ఆ స్నేహితునితో), అతడు అంటాడు: "అల్లాహ్ సాక్షిగా! నీవు నన్ను నాశనం చేసి ఉండేవాడివే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَوْلَا نِعْمَةُ رَبِّي لَكُنْتُ مِنَ الْمُحْضَرِينَ 57
ఒకవేళ నా ప్రభువు అనుగ్రహమే లేకున్నట్లయితే! నేను కూడా (నరకానికి) హాజరు చేయబడిన వారిలో చేరి పోయేవాడిని."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ 58
(తరువాత ఆ స్వర్గవాసి తన సహచరులతో అంటాడు): "ఏమీ? ఇక మనం మరల చనిపోము కదా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا مَوْتَتَنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ 59
మన మొదటి (భూలోక) మరణం తప్ప! మనకు ఇక ఎలాంటి శిక్ష పడదు కదా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ هَٰذَا لَهُوَ الْفَوْزُ الْعَظِيمُ 60
నిశ్చయంగా, ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لِمِثْلِ هَٰذَا فَلْيَعْمَلِ الْعَامِلُونَ 61
ఇలాంటి (స్థానం) పొందటానికి పాటుపడే వారు పాటు పడాలి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَذَٰلِكَ خَيْرٌ نُزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ 62
ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు ఆతిథ్యమా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا جَعَلْنَاهَا فِتْنَةً لِلظَّالِمِينَ 63
నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِي أَصْلِ الْجَحِيمِ 64
నిశ్చయంగా, అది నరకపు అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ طَلْعُهَا كَأَنَّهُ رُءُوسُ الشَّيَاطِينِ 65
దాని మొగ్గలు షైతానుల తలల వలే ఉంటాయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَإِنَّهُمْ لَآكِلُونَ مِنْهَا فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ 66
నిశ్చయంగా, వారు దాని నుంచే తింటారు మరియు దానితోనే తమ కడుపులు నింపుకుంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِنْ حَمِيمٍ 67
తరువాత నిశ్చయంగా, దాని మీద వారికి త్రాగటానికి సలసల కాగే పానీయం మాత్రమే ఉంటుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى الْجَحِيمِ 68
ఆ తరువాత నిశ్చయంగా, వారి మరలింపు కేవలం భగభగ మండే నరకాగ్ని వైపునకే అవుతుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُمْ أَلْفَوْا آبَاءَهُمْ ضَالِّينَ 69
నిశ్చయంగా, అప్పుడు వారు తమ తండ్రితాతలు, మార్గభ్రష్టత్వంలో ఉండేవారని కనుగొంటారు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَهُمْ عَلَىٰ آثَارِهِمْ يُهْرَعُونَ 70
మరియు తాము కూడా వారి అడుగు జాడలను అనుసరించటానికి త్వరపడుతూ ఉండేవారమని!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ الْأَوَّلِينَ 71
మరియు వాస్తవానికి వారి పూర్వీకులు కూడా చాలా మంది మార్గభ్రష్టులుగానే ఉండేవారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَقَدْ أَرْسَلْنَا فِيهِمْ مُنْذِرِينَ 72
మరియు వాస్తవానికి మేము వారి వద్దకు హెచ్చరిక చేయటానికి (సందేశహరులను) పంపి ఉన్నాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنْذَرِينَ 73
ఇక చూడు! హెచ్చరిక చేయబడిన వారి పర్యవసానం ఎలా ఉండిందో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ 74
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَقَدْ نَادَانَا نُوحٌ فَلَنِعْمَ الْمُجِيبُونَ 75
మరియు వాస్తవంగా, నూహ్ మమ్మల్ని వేడుకున్నాడు. ఎందుకంటే, మేము (ప్రార్థనలకు) ప్రత్యుత్తరమిచ్చే వారిలో సర్వోత్తములము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ 76
మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జలప్రళయం) నుండి కాపాడాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَعَلْنَا ذُرِّيَّتَهُ هُمُ الْبَاقِينَ 77
మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ 78
మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ سَلَامٌ عَلَىٰ نُوحٍ فِي الْعَالَمِينَ 79
సర్వలోకాలలో నూహ్ కు శాంతి కలుగు గాక (సలాం)!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ 80
నిశ్చయంగా, మేము సజ్జనులకు ఈ విధంగా ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ 81
నిశ్చయంగా, అతను మా విశ్వాసులైన దాసులలోని వాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ 82
తరువాత మేము ఇతరులను ముంచి వేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ۞ وَإِنَّ مِنْ شِيعَتِهِ لَإِبْرَاهِيمَ 83
మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ 84
అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ 85
అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు: "మీరు దేనిని ఆరాధిస్తున్నారు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ 86
ఏమీ? మీరు అల్లాహ్ ను వదలి మిథ్యా (బూటక) దైవాలను (ఆరాధించ) గోరుతున్నారా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَمَا ظَنُّكُمْ بِرَبِّ الْعَالَمِينَ 87
అయితే సర్వలోకాల ప్రభువును గురించి మీ అభిప్రాయమేమిటి?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَنَظَرَ نَظْرَةً فِي النُّجُومِ 88
ఆ తరువాత, అతను నక్షత్రాల వైపుకు తన దృష్టి సారించాడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَقَالَ إِنِّي سَقِيمٌ 89
అప్పుడు అతను ఇలా అన్నాడు: "నిశ్చయంగా, నా ఆరోగ్యం బాగులేదు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِينَ 90
కావున వారు అతనిని వదలి పెట్టి వెళ్ళిపోయారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَرَاغَ إِلَىٰ آلِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ 91
తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: "మీరు తినటం లేదేమిటి?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا لَكُمْ لَا تَنْطِقُونَ 92
"మీకేమైంది? మీరెందుకు మాట్లాడరు?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًا بِالْيَمِينِ 93
తరువాత అతను వాటి వద్దకు వెళ్ళి తన కుడిచేతితో వాటిని పగుల గొట్టాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ 94
అప్పుడు, వారు (ప్రజలు) అతని దగ్గరకు త్వరత్వరగా వచ్చారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ 95
అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: "ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ 96
"వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا ابْنُوا لَهُ بُنْيَانًا فَأَلْقُوهُ فِي الْجَحِيمِ 97
వారు (పరస్పరం ఇలా చెప్పుకున్నారు): "ఇతని కొరకు ఒక (అగ్ని) గుండం నిర్మించి, తరువాత ఇతనిని ఆ భగభగ మండే అగ్నిలో పడవేయండి!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَرَادُوا بِهِ كَيْدًا فَجَعَلْنَاهُمُ الْأَسْفَلِينَ 98
కావున, వారు అతనికి విరుద్ధంగా పన్నాగాలు పన్నారు, కాని మేము వారిని కించపరచాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ 99
మరియు అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "నిశ్చయంగా, నేను నా ప్రభువు (తీసుకొని వెళ్ళే) వైపునకు వెళ్ళిపోతాను. ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ رَبِّ هَبْ لِي مِنَ الصَّالِحِينَ 100
(అతను ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నాకు సద్వర్తనుడైన (కుమారుణ్ణి) ప్రసాదించు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ 101
కావున మేము అతనికి సహనశీలుడైన కుమారుని శుభవార్త నిచ్చాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْيَ قَالَ يَا بُنَيَّ إِنِّي أَرَىٰ فِي الْمَنَامِ أَنِّي أَذْبَحُكَ فَانْظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَا أَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِي إِنْ شَاءَ اللَّهُ مِنَ الصَّابِرِينَ 102
ఆ బాలుడు అతనికి తోడుగా శ్రమ చేయగల వయస్సుకు చేరుకున్నప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "ఓ నా కుమారా! వాస్తవానికి నేను నిన్ను బలి (జిబహ్) చేస్తున్నట్లుగా కలలో చూశాను, ఇక నీ సలహా ఏమిటో చెప్పు!" అతను (ఇస్మాయీల్) అన్నాడు: "ఓ నాన్నా! నీకు ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చు, అల్లాహ్ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ 103
ఆ తరువాత వారిద్దరూ ఆయన (అల్లాహ్) ఆజ్ఞను నెరవేర్చటానికి సిద్ధ పడ్డారు. మరియు అతను (ఇబ్రాహీమ్) అతనిని (ఇస్మాయీల్ ను) నుదుటిపై బోర్లా పరుండబెట్టాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَنَادَيْنَاهُ أَنْ يَا إِبْرَاهِيمُ 104
మరియు మేము అతనిని పిలుస్తూ ఇలా అన్నాము: "ఓ ఇబ్రాహీమ్!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ 105
వాస్తవంగా, నీవు కలన నిజం చేసి చూపించావు!" నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమిస్తాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ هَٰذَا لَهُوَ الْبَلَاءُ الْمُبِينُ 106
నిశ్చయంగా, ఇదొక స్పష్టమైన (కఠిన) పరీక్ష.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَفَدَيْنَاهُ بِذِبْحٍ عَظِيمٍ 107
మరియు మేము అతనికి (ఇస్మాయీల్ కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ 108
మరియు తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని నిలిపాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ سَلَامٌ عَلَىٰ إِبْرَاهِيمَ 109
"ఇబ్రాహీమ్ కు శాంతి కలుగు గాక (సలాం)!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ 110
ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ 111
నిశ్చయంగా, అతను (ఇబ్రాహీమ్) విశ్వసించిన మా దాసులలోని వాడు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَبَشَّرْنَاهُ بِإِسْحَاقَ نَبِيًّا مِنَ الصَّالِحِينَ 112
మరియు మేము అతనికి ఇస్ హాఖ్ యొక్క శుభవార్తను ఇచ్చాము, అతను ఒక సద్వర్తనుడైన ప్రవక్త.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَبَارَكْنَا عَلَيْهِ وَعَلَىٰ إِسْحَاقَ ۚ وَمِنْ ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِنَفْسِهِ مُبِينٌ 113
మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు ఇస్ హాఖ్ ను అనుగ్రహించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులుండే వారు. మరికొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ 114
మరియు వాస్తవానికి, మేము మూసా మరియు హారూన్ లను అనుగ్రహించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَنَجَّيْنَاهُمَا وَقَوْمَهُمَا مِنَ الْكَرْبِ الْعَظِيمِ 115
మరియు మేము వారిద్దరిని మరియు వారి జాతి వారిని మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَنَصَرْنَاهُمْ فَكَانُوا هُمُ الْغَالِبِينَ 116
మరియు మేము వారికి సహాయం చేశాము, కాబట్టి వారు విజయం పొందిన వారయ్యారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَآتَيْنَاهُمَا الْكِتَابَ الْمُسْتَبِينَ 117
మరియు వారిద్దరికి (మంచి చెడులను) స్పష్టపరిచే గ్రంథాన్ని ప్రసాదించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَهَدَيْنَاهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ 118
మరియు వారిద్దరికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ 119
మరియు ఆ తరువాత తరాల వారిలో వారిద్దరి గురించి మంచి కీర్తిని నిలిపాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ 120
"మూసా మరియు హారూన్ లకు శాంతి కలుగు గాక (సలాం)!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ 121
నిశ్చయంగా, ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ 122
నిశ్చయంగా వారిద్దరూ, విశ్వాసులైన మా దాసులలోని వారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ إِلْيَاسَ لَمِنَ الْمُرْسَلِينَ 123
మరియు నిశ్చయంగా, ఇల్యాస్ కూడా మా సందేశహరులలో ఒకడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ قَالَ لِقَوْمِهِ أَلَا تَتَّقُونَ 124
అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ الْخَالِقِينَ 125
ఏమీ? మీరు బఅల్ (అనే విగ్రహాన్ని) ఆరాధిస్తూ సర్వోత్తముడైన సృష్టికర్తను వదలి పెడుతున్నారా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ اللَّهَ رَبَّكُمْ وَرَبَّ آبَائِكُمُ الْأَوَّلِينَ 126
అల్లాహ్ యే మీ ప్రభువు! మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కదా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ 127
కాని వారు అతనిని (ఇల్యాస్ ను) అసత్యవాదుడని తిరస్కరించారు, కాబట్టి వారు తప్పకుండా (శిక్ష కొరకు) హాజరు చేయబడతారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ 128
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ 129
తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ سَلَامٌ عَلَىٰ إِلْ يَاسِينَ 130
"ఇల్ యాసీన్ కు శాంతి కలుగు గాక (సలాం)!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ 131
నిశ్చయంగా, సజ్జనులకు మేము ఈ విధంగా ప్రతిఫలమిస్తాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ 132
నిశ్చయంగా, అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ لُوطًا لَمِنَ الْمُرْسَلِينَ 133
మరియు నిశ్చయంగా లూత్ కూడా మేము పంపిన సందేశహరులలో ఒకడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ نَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ 134
ఎప్పుడైతే మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరిని రక్షించామో -
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ 135
ముసలామె (అతని భార్య) తప్ప - ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ 136
ఆ తరువాత మిగతా వారినందరినీ నిర్మూలించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِمْ مُصْبِحِينَ 137
మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَبِاللَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ 138
మరియు రాత్రులలో కూడా! అయినా మీరు అర్థం చేసుకోలేరా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ 139
మరియు నిశ్చయంగా, యూనుస్ కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ 140
అతను నిండు పడవ వైపుకు పరిగెత్తినప్పుడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ 141
అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ 142
ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ 143
అప్పుడతను, (అల్లాహ్) పవిత్రతను కొనియాడే వారిలోని వాడు కాకపోయినట్లైతే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ 144
దాని (చేప) కడుపులో పునరుత్థాన దినం వరకు ఉండి పోయేవాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ۞ فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ 145
ఆ పిదప మేము అతనిని అనారోగ్య స్థితిలో, ఒక దిగంబర మైదానంలో పడవేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنْبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِنْ يَقْطِينٍ 146
మరియు అతనిపై ఒక ఆనప జాతి తీగను మొలిపించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ 147
మరియు అతనిని ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ మంది (ప్రజల) వద్దకు పంపాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ 148
వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ 149
అయితే వారిని ఇలా అడుగు: "ఏమీ? నీ ప్రభువుకైతే కుమార్తెలు మరియు వారి కొరకు కుమారులా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمْ خَلَقْنَا الْمَلَائِكَةَ إِنَاثًا وَهُمْ شَاهِدُونَ 150
లేక మేము దేవదూతలను స్త్రీలుగా పుట్టించామా? మరియు వారు దానికి సాక్షులా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَلَا إِنَّهُمْ مِنْ إِفْكِهِمْ لَيَقُولُونَ 151
అలా కాదు! నిశ్చయంగా, వారు (ఖురైషులు) తమ బూటకపు నమ్మకాల ఆధారంగా అంటున్నారు:
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَدَ اللَّهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ 152
"అల్లాహ్ కు సంతానముంది!"అని మరియు వారు నిశ్చయంగా, అబద్ధాలాడుతున్నారు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَصْطَفَى الْبَنَاتِ عَلَى الْبَنِينَ 153
ఆయన (అల్లాహ్) కుమార్తెలను - కుమారులకు బదులుగా -ఎన్నుకున్నాడా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ 154
మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు చేస్తున్నారు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَفَلَا تَذَكَّرُونَ 155
ఏమీ? మీరు గ్రహించలేరా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمْ لَكُمْ سُلْطَانٌ مُبِينٌ 156
లేక! మీ వద్ద ఏదైనా స్పష్టమైన ప్రమాణం ఉందా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأْتُوا بِكِتَابِكُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ 157
మీరు సత్యవంతులే అయితే మీ గ్రంథాన్ని తీసుకురండి!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَعَلُوا بَيْنَهُ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ 158
మరియు వారు, ఆయన (అల్లాహ్) మరియు జిన్నాతుల మధ్య బంధుత్వం కల్పించారు. కాని వాస్తవానికి జిన్నాతులకు తెలుసు, తాము ఆయన (అల్లాహ్) ముందు (లెక్క కొరకు) హాజరు చేయబడతామని!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ سُبْحَانَ اللَّهِ عَمَّا يَصِفُونَ 159
వారు కల్పించే విషయాలకు అల్లాహ్ అతీతుడు (పరమ పవిత్రుడు)!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ 160
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ 161
ఇక నిశ్చయంగా, మీరు మరియు మీ ఆరాధ్యదైవాలు (కలిసి);
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا أَنْتُمْ عَلَيْهِ بِفَاتِنِينَ 162
ఎవ్వడిని కూడా, దుష్టకార్యాలు చేయటానికి పురి కొలుపలేరు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا مَنْ هُوَ صَالِ الْجَحِيمِ 163
భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا مِنَّا إِلَّا لَهُ مَقَامٌ مَعْلُومٌ 164
(దైవదూతలు ఇలా అంటారు): "మరియు మాలో ఒక్కడు కూడా తన స్థానం నియమింప బడకుండా లేడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّا لَنَحْنُ الصَّافُّونَ 165
మరియు నిశ్చయంగా, మేము కూడా (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలుచుంటాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّا لَنَحْنُ الْمُسَبِّحُونَ 166
మరియు నిశ్చయంగా, మేము కూడా ఆయన పవిత్రతను కొనియాడే వారమే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنْ كَانُوا لَيَقُولُونَ 167
మరియు (సత్యతిరస్కారులు) ఇలా అంటూ ఉండేవారు:
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَوْ أَنَّ عِنْدَنَا ذِكْرًا مِنَ الْأَوَّلِينَ 168
"ఒకవేళ మా పూర్వీకుల నుండి మాకు ఇలాంటి బోధన లభించి ఉంటే!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَكُنَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ 169
"మేము కూడా, అల్లాహ్ యొక్క ఎన్నుకున్న, భక్తులమై ఉండేవారము!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَكَفَرُوا بِهِ ۖ فَسَوْفَ يَعْلَمُونَ 170
కాని, వారిప్పుడు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. ఇక త్వరలోనే వారు తెలుసు కుంటారు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ 171
మరియు వాస్తవానికి మా దాసులైన, మేము పంపిన సందేశహరుల విషయంలో మా నిర్ణయం జరిగింది;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُمْ لَهُمُ الْمَنْصُورُونَ 172
నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ جُنْدَنَا لَهُمُ الْغَالِبُونَ 173
మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ 174
కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ 175
మరియు వారిని చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ 176
ఏమీ? వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنْذَرِينَ 177
కాని, అది వారి ఇంటి ప్రాంగణంలో దిగినప్పుడు, హెచ్చరించబడిన వారికి అది దుర్భరమైన ఉదయం కాగలదు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ 178
కావున నీవు ప్రస్తుతానికి వారిని వదలి పెట్టు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ 179
మరియు చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ 180
నీ ప్రభువు సర్వలోపాలకు అతీతుడు; సర్వశక్తిమంతుడైన ప్రభువు, వారి కల్పనలకు అతీతుడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ 181
మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ 182
మరియు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్