Al-Fajr

سورة الفجر

సూరా 89 · మక్కీ · 30 ఆయత్‌లు

89:1జుజ్ 30 · పు. 593

وَالْفَجْرِ1

ప్రాంతః కాలం సాక్షిగా!
89:2జుజ్ 30 · పు. 593

وَلَيَالٍ عَشْرٍ2

పది రాత్రుల సాక్షిగా!
89:3జుజ్ 30 · పు. 593

وَالشَّفْعِ وَالْوَتْرِ3

సరి బేసీల సాక్షిగా!
89:4జుజ్ 30 · పు. 593

وَاللَّيْلِ إِذَا يَسْرِ4

గడచిపోయే రాత్రి సాక్షిగా!
89:5జుజ్ 30 · పు. 593

هَلْ فِي ذَٰلِكَ قَسَمٌ لِذِي حِجْرٍ5

వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి?
89:6జుజ్ 30 · పు. 593

أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ6

నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?
89:7జుజ్ 30 · పు. 593

إِرَمَ ذَاتِ الْعِمَادِ7

ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల?
89:8జుజ్ 30 · పు. 593

الَّتِي لَمْ يُخْلَقْ مِثْلُهَا فِي الْبِلَادِ8

వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు.
89:9జుజ్ 30 · పు. 593

وَثَمُودَ الَّذِينَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ9

మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల?
89:10జుజ్ 30 · పు. 593

وَفِرْعَوْنَ ذِي الْأَوْتَادِ10

మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల?
89:11జుజ్ 30 · పు. 593

الَّذِينَ طَغَوْا فِي الْبِلَادِ11

వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు;
89:12జుజ్ 30 · పు. 593

فَأَكْثَرُوا فِيهَا الْفَسَادَ12

మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు.
89:13జుజ్ 30 · పు. 593

فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ13

కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు.
89:14జుజ్ 30 · పు. 593

إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ14

వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)!
89:15జుజ్ 30 · పు. 593

فَأَمَّا الْإِنْسَانُ إِذَا مَا ابْتَلَاهُ رَبُّهُ فَأَكْرَمَهُ وَنَعَّمَهُ فَيَقُولُ رَبِّي أَكْرَمَنِ15

అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు;
89:16జుజ్ 30 · పు. 593

وَأَمَّا إِذَا مَا ابْتَلَاهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُ فَيَقُولُ رَبِّي أَهَانَنِ16

కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు.
89:17జుజ్ 30 · పు. 593

كَلَّا ۖ بَلْ لَا تُكْرِمُونَ الْيَتِيمَ17

అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు;
89:18జుజ్ 30 · పు. 593

وَلَا تَحَاضُّونَ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ18

మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు;
89:19జుజ్ 30 · పు. 593

وَتَأْكُلُونَ التُّرَاثَ أَكْلًا لَمًّا19

మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు.
89:20జుజ్ 30 · పు. 593

وَتُحِبُّونَ الْمَالَ حُبًّا جَمًّا20

మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు!
89:21జుజ్ 30 · పు. 593

كَلَّا إِذَا دُكَّتِ الْأَرْضُ دَكًّا دَكًّا21

అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు;
89:22జుజ్ 30 · పు. 593

وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا22

మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు.
89:23జుజ్ 30 · పు. 594

وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍ يَتَذَكَّرُ الْإِنْسَانُ وَأَنَّىٰ لَهُ الذِّكْرَىٰ23

ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ?
89:24జుజ్ 30 · పు. 594

يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي24

అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.
89:25జుజ్ 30 · పు. 594

فَيَوْمَئِذٍ لَا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ25

అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు!
89:26జుజ్ 30 · పు. 594

وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ26

మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు.
89:27జుజ్ 30 · పు. 594

يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ27

(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా!
89:28జుజ్ 30 · పు. 594

ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَرْضِيَّةً28

నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!
89:29జుజ్ 30 · పు. 594

فَادْخُلِي فِي عِبَادِي29

నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో!
89:30జుజ్ 30 · పు. 594

وَادْخُلِي جَنَّتِي30

మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!"

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Salah Bukhatir - Al-Fajr · Tlawati