Al-Inshiqaq

سورة الإنشقاق

సూరా 84 · మక్కీ · 25 ఆయత్‌లు

84:1జుజ్ 30 · పు. 589

إِذَا السَّمَاءُ انْشَقَّتْ1

ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు!
84:2జుజ్ 30 · పు. 589

وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ2

మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.
84:3జుజ్ 30 · పు. 589

وَإِذَا الْأَرْضُ مُدَّتْ3

మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు;
84:4జుజ్ 30 · పు. 589

وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ4

మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు;
84:5జుజ్ 30 · పు. 589

وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ5

అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.
84:6జుజ్ 30 · పు. 589

يَا أَيُّهَا الْإِنْسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ6

ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు.
84:7జుజ్ 30 · పు. 589

فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ7

అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి;
84:8జుజ్ 30 · పు. 589

فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا8

అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు.
84:9జుజ్ 30 · పు. 589

وَيَنْقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا9

మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు!
84:10జుజ్ 30 · పు. 589

وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ10

ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు;
84:11జుజ్ 30 · పు. 589

فَسَوْفَ يَدْعُو ثُبُورًا11

అప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు;
84:12జుజ్ 30 · పు. 589

وَيَصْلَىٰ سَعِيرًا12

మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు.
84:13జుజ్ 30 · పు. 589

إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا13

వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు.
84:14జుజ్ 30 · పు. 589

إِنَّهُ ظَنَّ أَنْ لَنْ يَحُورَ14

వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు.
84:15జుజ్ 30 · పు. 589

بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا15

అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు.
84:16జుజ్ 30 · పు. 589

فَلَا أُقْسِمُ بِالشَّفَقِ16

కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను!
84:17జుజ్ 30 · పు. 589

وَاللَّيْلِ وَمَا وَسَقَ17

రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా!
84:18జుజ్ 30 · పు. 589

وَالْقَمَرِ إِذَا اتَّسَقَ18

పూర్ణచంద్రుని సాక్షిగా!
84:19జుజ్ 30 · పు. 589

لَتَرْكَبُنَّ طَبَقًا عَنْ طَبَقٍ19

మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.
84:20జుజ్ 30 · పు. 589

فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ20

అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు?
84:21జుజ్ 30 · పు. 589

وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ ۩21

మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు?
84:22జుజ్ 30 · పు. 589

بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ22

అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు.
84:23జుజ్ 30 · పు. 589

وَاللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ23

మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
84:24జుజ్ 30 · పు. 589

فَبَشِّرْهُمْ بِعَذَابٍ أَلِيمٍ24

కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు -
84:25జుజ్ 30 · పు. 590

إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ25

విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి