An-Nazi'at

سورة النازعات

సూరా 79 · మక్కీ · 46 ఆయత్‌లు

79:1జుజ్ 30 · పు. 583

وَالنَّازِعَاتِ غَرْقًا1

(అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసే వారి (దేవదూతల) సాక్షిగా!
79:2జుజ్ 30 · పు. 583

وَالنَّاشِطَاتِ نَشْطًا2

(విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవదూతల) సాక్షిగా!
79:3జుజ్ 30 · పు. 583

وَالسَّابِحَاتِ سَبْحًا3

(విశ్వంలో) తేలియాడుతూ పోయే వారి సాక్షిగా!
79:4జుజ్ 30 · పు. 583

فَالسَّابِقَاتِ سَبْقًا4

మరియు పందెంలో వలే (ఒకరితో నొకరు) పోటీ పడే వారి సాక్షిగా!
79:5జుజ్ 30 · పు. 583

فَالْمُدَبِّرَاتِ أَمْرًا5

మరియు (తమ ప్రభువు) ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించేవారి (దేవదూతల) సాక్షిగా!
79:6జుజ్ 30 · పు. 583

يَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ6

ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది.
79:7జుజ్ 30 · పు. 583

تَتْبَعُهَا الرَّادِفَةُ7

దాని తర్వాత రెండవ సారి బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు).
79:8జుజ్ 30 · పు. 583

قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ8

ఆ రోజు (కొన్ని) హృదయాలు (భయంతో) దడదడలాడుతూ ఉంటాయి.
79:9జుజ్ 30 · పు. 583

أَبْصَارُهَا خَاشِعَةٌ9

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి.
79:10జుజ్ 30 · పు. 583

يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ10

వారు ఇలా అంటున్నారు: "ఏమీ? మనం మన పూర్వ స్థితిలోకి మళ్ళీ తీసుకు రాబడతామా?
79:11జుజ్ 30 · పు. 583

أَإِذَا كُنَّا عِظَامًا نَخِرَةً11

మనం శిథిలమైన ఎముకలుగా మారి పోయిన తరువాత కూడానా?"
79:12జుజ్ 30 · పు. 583

قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ12

వారు (ఇంకా ఇలా) అంటారు: "అయితే ఈ తిరిగి రావటమనేది చాల నష్టదాయకమైనదే!"
79:13జుజ్ 30 · పు. 583

فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ13

కాని అది వాస్తవానికి, ఒకే ఒక (తీవ్రమైన) ధ్వని.
79:14జుజ్ 30 · పు. 583

فَإِذَا هُمْ بِالسَّاهِرَةِ14

అప్పుడు వారందరూ, ఒకేసారి లేచి మైదానంలోకి వచ్చి ఉంటారు.
79:15జుజ్ 30 · పు. 583

هَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ15

ఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా?
79:16జుజ్ 30 · పు. 583

إِذْ نَادَاهُ رَبُّهُ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى16

అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు,
79:17జుజ్ 30 · పు. 584

اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ17

(ఇలా అన్నాడు): "ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు.
79:18జుజ్ 30 · పు. 584

فَقُلْ هَلْ لَكَ إِلَىٰ أَنْ تَزَكَّىٰ18

"ఇక (అతనితో) ఇట్లను: 'ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా?
79:19జుజ్ 30 · పు. 584

وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ19

మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా?'"
79:20జుజ్ 30 · పు. 584

فَأَرَاهُ الْآيَةَ الْكُبْرَىٰ20

తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు.
79:21జుజ్ 30 · పు. 584

فَكَذَّبَ وَعَصَىٰ21

కాని అతడు (ఫిర్ఔన్) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు.
79:22జుజ్ 30 · పు. 584

ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ22

ఆ తర్వాత అతడు (ఫిర్ఔన్) వెనక్కి మరలి పోయి, (కుట్రలు) పన్నసాగాడు.
79:23జుజ్ 30 · పు. 584

فَحَشَرَ فَنَادَىٰ23

పిదప (ప్రజలను) సమావేశపరచి, ఎలుగెత్తి చాటుతూ;
79:24జుజ్ 30 · పు. 584

فَقَالَ أَنَا رَبُّكُمُ الْأَعْلَىٰ24

ఇలా అన్నాడు: "నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును!"
79:25జుజ్ 30 · పు. 584

فَأَخَذَهُ اللَّهُ نَكَالَ الْآخِرَةِ وَالْأُولَىٰ25

కావున అల్లాహ్ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురి చేశాడు.
79:26జుజ్ 30 · పు. 584

إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِمَنْ يَخْشَىٰ26

నిశ్చయంగా, ఇందులో (అల్లాహ్ కు) భయపడే ప్రతి వ్యక్తి కొరకు గుణపాఠముంది.
79:27జుజ్ 30 · పు. 584

أَأَنْتُمْ أَشَدُّ خَلْقًا أَمِ السَّمَاءُ ۚ بَنَاهَا27

ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠినమయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది!
79:28జుజ్ 30 · పు. 584

رَفَعَ سَمْكَهَا فَسَوَّاهَا28

ఆయన దాని కప్పు (ఎత్తు)ను చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు;
79:29జుజ్ 30 · పు. 584

وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَاهَا29

మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు.
79:30జుజ్ 30 · పు. 584

وَالْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَاهَا30

మరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు.
79:31జుజ్ 30 · పు. 584

أَخْرَجَ مِنْهَا مَاءَهَا وَمَرْعَاهَا31

దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు;
79:32జుజ్ 30 · పు. 584

وَالْجِبَالَ أَرْسَاهَا32

మరియు పర్వతాలను (దానిలో) స్థిరంగా నాటాడు;
79:33జుజ్ 30 · పు. 584

مَتَاعًا لَكُمْ وَلِأَنْعَامِكُمْ33

మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా!
79:34జుజ్ 30 · పు. 584

فَإِذَا جَاءَتِ الطَّامَّةُ الْكُبْرَىٰ34

ఇక ఆ గొప్ప దుర్ఘటన (పునరుత్థాన దినం) వచ్చినప్పుడు;
79:35జుజ్ 30 · పు. 584

يَوْمَ يَتَذَكَّرُ الْإِنْسَانُ مَا سَعَىٰ35

ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు;
79:36జుజ్ 30 · పు. 584

وَبُرِّزَتِ الْجَحِيمُ لِمَنْ يَرَىٰ36

మరియు చూసే వారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది.
79:37జుజ్ 30 · పు. 584

فَأَمَّا مَنْ طَغَىٰ37

ఇక ధిక్కారంతో హద్దులు మీరి ప్రవర్తించిన వాడికి;
79:38జుజ్ 30 · పు. 584

وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا38

మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చిన వాడికి;
79:39జుజ్ 30 · పు. 584

فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ39

నిశ్చయంగా, నరకాగ్నియే, వాని నివాస స్థానమవుతుంది!
79:40జుజ్ 30 · పు. 584

وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ40

మరియు తన ప్రభువు ముందు నిలబడ వలసి వుంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి;
79:41జుజ్ 30 · పు. 584

فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ41

నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థానమవుతుంది!
79:42జుజ్ 30 · పు. 584

يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا42

(ఓ ముహమ్మద్!) వీరు నిన్ను - ఆ ఘడియను గురించి: "అసలు అది ఎప్పుడొస్తుంది?" అని అడుగుతున్నారు.
79:43జుజ్ 30 · పు. 584

فِيمَ أَنْتَ مِنْ ذِكْرَاهَا43

దాని గురించి చెప్పడానికి దాంతో నీకేమి సంబంధం?
79:44జుజ్ 30 · పు. 584

إِلَىٰ رَبِّكَ مُنْتَهَاهَا44

దాని వాస్తవ జ్ఞానం నీ ప్రభువుకే ఉంది!
79:45జుజ్ 30 · పు. 584

إِنَّمَا أَنْتَ مُنْذِرُ مَنْ يَخْشَاهَا45

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు, దానికి భయపడే వారిని హెచ్చరించే వాడవు మాత్రమే!
79:46జుజ్ 30 · పు. 584

كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوا إِلَّا عَشِيَّةً أَوْ ضُحَاهَا46

వారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Sahl Yaseen - An-Nazi'at · Tlawati