طسم 1
తా - సీన్ - మీమ్.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ 2
ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయతులు)
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَعَلَّكَ بَاخِعٌ نَفْسَكَ أَلَّا يَكُونُوا مُؤْمِنِينَ 3
(ఓ ముహమ్మద్) వారు విశ్వసించలేదనే బాధతో బహుశా నీవు నీ ప్రాణాలే కోల్పోతావేమో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنْ نَشَأْ نُنَزِّلْ عَلَيْهِمْ مِنَ السَّمَاءِ آيَةً فَظَلَّتْ أَعْنَاقُهُمْ لَهَا خَاضِعِينَ 4
మేము కోరితే ఆకాశం నుండి వారిపై ఒక అద్భుత సంకేతాన్ని (ఆయత్ ను) అవతరింపజేసి, దానికి వారి మెడలను నమ్రతతో వంగి పోయేలా చేసేవారము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا يَأْتِيهِمْ مِنْ ذِكْرٍ مِنَ الرَّحْمَٰنِ مُحْدَثٍ إِلَّا كَانُوا عَنْهُ مُعْرِضِينَ 5
మరియు వారి వద్దకు అనంత కరుణామయుడని వద్ద నుండి క్రొత్త సందేశం వచ్చినప్పుడల్లా, వారు దాని నుండి విముఖులు కాకుండా ఉండలేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَقَدْ كَذَّبُوا فَسَيَأْتِيهِمْ أَنْبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ 6
వాస్తవానికి, ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చిన దాని యథార్థమేమిటో వారికి తెలిసిపోతుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَوَلَمْ يَرَوْا إِلَى الْأَرْضِ كَمْ أَنْبَتْنَا فِيهَا مِنْ كُلِّ زَوْجٍ كَرِيمٍ 7
ఏమీ? వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవరాసుల్ని) పుట్టించామో?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ 8
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ 9
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰ أَنِ ائْتِ الْقَوْمَ الظَّالِمِينَ 10
మరియు నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించిన విషయాన్ని వారికి జ్ఞాపకం చేయించు: "దుర్మార్గులైన జాతి ప్రజల వద్దకు వెళ్ళు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَوْمَ فِرْعَوْنَ ۚ أَلَا يَتَّقُونَ 11
ఫిర్ఔన్ జాతివారి వద్దకు. ఏమీ? వారికి దైవభీతి లేదా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ رَبِّ إِنِّي أَخَافُ أَنْ يُكَذِّبُونِ 12
(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَيَضِيقُ صَدْرِي وَلَا يَنْطَلِقُ لِسَانِي فَأَرْسِلْ إِلَىٰ هَارُونَ 13
నా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది, కావున నీవు హారూన్ వద్దకు కూడా (వహీ) పంపు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَهُمْ عَلَيَّ ذَنْبٌ فَأَخَافُ أَنْ يَقْتُلُونِ 14
మరియు వారి దగ్గర నా మీద ఒక నేరం మోపబడి ఉన్నది, కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ كَلَّا ۖ فَاذْهَبَا بِآيَاتِنَا ۖ إِنَّا مَعَكُمْ مُسْتَمِعُونَ 15
(అల్లాహ్) సెలవిచ్చాడు: "అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతో పాటు ఉండి సర్వమూ వింటూ ఉంటాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأْتِيَا فِرْعَوْنَ فَقُولَا إِنَّا رَسُولُ رَبِّ الْعَالَمِينَ 16
కావున మీరిద్దరూ ఫిరఔన్ వద్దకు వెళ్ళి అనండి: "నిశ్చయంగా, మేము సర్వలోకాల పోషకుని సందేశహరులము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَنْ أَرْسِلْ مَعَنَا بَنِي إِسْرَائِيلَ 17
కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ أَلَمْ نُرَبِّكَ فِينَا وَلِيدًا وَلَبِثْتَ فِينَا مِنْ عُمُرِكَ سِنِينَ 18
(ఫిర్ఔన్) అన్నాడు: "ఏమీ? మేము నిన్ను బాల్యంలో మాతో పాటు పోషించలేదా? మరియు నీవు నీ వయస్సులోని అనేక సంవత్సరాలు మాతో పాటు గడిపావు కదా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَفَعَلْتَ فَعْلَتَكَ الَّتِي فَعَلْتَ وَأَنْتَ مِنَ الْكَافِرِينَ 19
అయినా నీవు హీనమైన ఆ పని చేశావు, కావున నీవు కృతఘ్నులలోని వాడవు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ فَعَلْتُهَا إِذًا وَأَنَا مِنَ الضَّالِّينَ 20
(మూసా) అన్నాడు: "నేను పొరపాటుగా ఆ పని చేశాను!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَفَرَرْتُ مِنْكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِي رَبِّي حُكْمًا وَجَعَلَنِي مِنَ الْمُرْسَلِينَ 21
ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَيَّ أَنْ عَبَّدْتَ بَنِي إِسْرَائِيلَ 22
ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ الْعَالَمِينَ 23
(ఫిర్ఆన్) అడిగాడు: "అయితే ఈ సర్వలోకాల ప్రభువు అంటే ఏమిటి?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِنْ كُنْتُمْ مُوقِنِينَ 24
(మూసా) జవాబిచ్చాడు: "మీరు నమ్మేవారే అయితే! ఆయనే ఆకాశాలకూ మరియు భూమికీ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ لِمَنْ حَوْلَهُ أَلَا تَسْتَمِعُونَ 25
(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న వారితో: "ఏమీ? మీరు వింటున్నారా?" అని ప్రశ్నించాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ 26
(మూసా) అన్నాడు: "ఆయన (అల్లాహ్) మీ ప్రభువు మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కూడానూ!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ إِنَّ رَسُولَكُمُ الَّذِي أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌ 27
(ఫిర్ఔన్) అన్నాడు: "మీ వద్దకు పంపబడిన మీ ఈ సందేశహరుడు నిశ్చయంగా పిచ్చివాడే!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَمَا بَيْنَهُمَا ۖ إِنْ كُنْتُمْ تَعْقِلُونَ 28
(మూసా) అన్నాడు: "మీరు అర్థం చేసుకోగలిగితే! ఆయనే తూర్పూ పడమరలకూ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ لَئِنِ اتَّخَذْتَ إِلَٰهًا غَيْرِي لَأَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُونِينَ 29
(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకుంటే నేను నిన్ను చెరసాలలో ఉన్నవారితో చేర్చుతాను."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ أَوَلَوْ جِئْتُكَ بِشَيْءٍ مُبِينٍ 30
(మూసా) అన్నాడు: "ఏమీ? నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని (సత్యాన్ని) తీసుకువచ్చిన తరువాత కూడానా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ فَأْتِ بِهِ إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ 31
(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు సత్యవంతుడవే అయితే దానిని (ఆ అద్భుత సూచనను) చూపు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعْبَانٌ مُبِينٌ 32
అప్పుడు (మూసా) తన చేతి కర్రను పడవేయగానే, అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَنَزَعَ يَدَهُ فَإِذَا هِيَ بَيْضَاءُ لِلنَّاظِرِينَ 33
తరువాత అతను (మూసా) తన చేతిని (చంక నుండి) వెలుపలికి తీయగానే, అది చూసేవారి యెదుట తెల్లగా ప్రకాశించసాగింది!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ لِلْمَلَإِ حَوْلَهُ إِنَّ هَٰذَا لَسَاحِرٌ عَلِيمٌ 34
(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న నాయకులతో అన్నాడు: "నిశ్చయంగా, ఇతనొక నేర్పు గల మాంత్రికుడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يُرِيدُ أَنْ يُخْرِجَكُمْ مِنْ أَرْضِكُمْ بِسِحْرِهِ فَمَاذَا تَأْمُرُونَ 35
ఇతను తన మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి తరుమ గోరుతున్నాడు, అయితే మీ సలహా ఏమిటి?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا أَرْجِهْ وَأَخَاهُ وَابْعَثْ فِي الْمَدَائِنِ حَاشِرِينَ 36
వారన్నారు: "అతనిని మరియు అతని సోదరుణ్ణి ఆపి ఉంచు మరియు (మంత్రగాళ్ళను) సమావేశ పరచటానికి అన్ని నగరాలకు వార్తాహరులను పంపు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍ 37
వారు నీ వద్దకు నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి తెస్తారు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَجُمِعَ السَّحَرَةُ لِمِيقَاتِ يَوْمٍ مَعْلُومٍ 38
ఈ విధంగా ఒక నియమిత రోజున ఒక నియమిత ప్రదేశంలో మాంత్రికులంతా సమావేశ పరచబడ్డారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنْتُمْ مُجْتَمِعُونَ 39
మరియు ప్రజలతో ఇలా ప్రశ్నించడం జరిగింది: "ఏమీ? మీరంతా సమావేశమయ్యారా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَعَلَّنَا نَتَّبِعُ السَّحَرَةَ إِنْ كَانُوا هُمُ الْغَالِبِينَ 40
ఒకవేళ మాంత్రికులు గెలుపొందితే మనమంతా వారిని అనుసరించాలి కదా!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَمَّا جَاءَ السَّحَرَةُ قَالُوا لِفِرْعَوْنَ أَئِنَّ لَنَا لَأَجْرًا إِنْ كُنَّا نَحْنُ الْغَالِبِينَ 41
మాంత్రికులు వచ్చిన తరువాత ఫిర్ఔన్ తో అన్నారు: "మేము గెలుపొందితే నిశ్చయంగా మాకు బహుమాన ముంది కదా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ نَعَمْ وَإِنَّكُمْ إِذًا لَمِنَ الْمُقَرَّبِينَ 42
(ఫిర్ఔన్) అన్నాడు: "అవును! నిశ్చయంగా, అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరుతారు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ لَهُمْ مُوسَىٰ أَلْقُوا مَا أَنْتُمْ مُلْقُونَ 43
మూసా వారితో అన్నాడు: "మీరు విసర దలుచుకున్న దానిని విసరండి!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَلْقَوْا حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوا بِعِزَّةِ فِرْعَوْنَ إِنَّا لَنَحْنُ الْغَالِبُونَ 44
అప్పుడు వారు తమ త్రాళ్ళను మరియు తమ కర్రలను విసిరి ఇలా అన్నారు: "ఫిర్ఔన్ శక్తి సాక్షిగా! నిశ్చయంగా మేమే విజయం పొందుతాము."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَلْقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ 45
ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగి వేసింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ 46
అప్పుడు ఆ మాంత్రికులు సజ్దాలో పడ్డారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ 47
వారన్నారు: "మేము సర్వలోకాల ప్రభువును విశ్వసిస్తున్నాము,
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ رَبِّ مُوسَىٰ وَهَارُونَ 48
మూసా మరియు హారూన్ ల ప్రభువును."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ آمَنْتُمْ لَهُ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّهُ لَكَبِيرُكُمُ الَّذِي عَلَّمَكُمُ السِّحْرَ فَلَسَوْفَ تَعْلَمُونَ ۚ لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُمْ مِنْ خِلَافٍ وَلَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ 49
(ఫిర్ఔన్) అన్నాడు: "నేను మీకు అనుమతి ఇవ్వక ముందే మీరు ఇతనిని విశ్వసించారా? నిశ్చయంగా, ఇతడే మీ గురువు, మీకు జాలవిద్యను నేర్పినవాడు. సరే! ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ వ్యతిరేక (ప్రతిపక్ష) దిశల చేతులను మరియు కాళ్ళను నరికిస్తాను మరియు మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا لَا ضَيْرَ ۖ إِنَّا إِلَىٰ رَبِّنَا مُنْقَلِبُونَ 50
(మాంత్రికులు) అన్నారు: "బాధ లేదు! నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا نَطْمَعُ أَنْ يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَايَانَا أَنْ كُنَّا أَوَّلَ الْمُؤْمِنِينَ 51
నిశ్చయంగా, మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే వాస్తవానికి అందరి కంటే ముందుగా విశ్వసించిన వారం మేమే!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ۞ وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَسْرِ بِعِبَادِي إِنَّكُمْ مُتَّبَعُونَ 52
మరియు మేము మూసాకు ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "నీవు నా దాసులను రాత్రివేళ తీసుకొని వెళ్ళిపో నిశ్చయంగా, మీరు వెంబడించబడతారు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَرْسَلَ فِرْعَوْنُ فِي الْمَدَائِنِ حَاشِرِينَ 53
తరువాత ఫిర్ఔన్ అన్ని పట్టణాలకు వార్తాహరులను పంపాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ هَٰؤُلَاءِ لَشِرْذِمَةٌ قَلِيلُونَ 54
(ఇలా ప్రకటన చేయించాడు): "వాస్తవానికి వీరు (ఈ ఇస్రాయీల్ సంతతి వారు) ఒక చిన్న తెగవారు మాత్రమే.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّهُمْ لَنَا لَغَائِظُونَ 55
మరియు నిశ్చయంగా, వారు మాకు చాలా కోపం తెప్పించారు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّا لَجَمِيعٌ حَاذِرُونَ 56
మరియు నిశ్చయంగా, మనం ఐకమత్యంతో ఉండి జాగరూకత చూపేవారము."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَخْرَجْنَاهُمْ مِنْ جَنَّاتٍ وَعُيُونٍ 57
కావున మేము వారిని, తోటల నుండి మరియు చెలమల నుండి వెళ్ళగొట్టాము;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَكُنُوزٍ وَمَقَامٍ كَرِيمٍ 58
మరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَذَٰلِكَ وَأَوْرَثْنَاهَا بَنِي إِسْرَائِيلَ 59
ఈ విధంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని, వాటికి వారసులుగా చేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَتْبَعُوهُمْ مُشْرِقِينَ 60
అప్పుడు (ఫిర్ఔన్ జాతి) వారు సూర్యోదయ కాలమున (ఇస్రాయీల్ సంతతి) వారిని వెంబడించారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَمَّا تَرَاءَى الْجَمْعَانِ قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ 61
ఆ ఇరుపక్షాల వారు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు, మూసా అనుచరులు అన్నారు: "నిశ్చయంగా మేము చిక్కి పోయాము!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ 62
(మూసా అన్నాడు): "అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنِ اضْرِبْ بِعَصَاكَ الْبَحْرَ ۖ فَانْفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِيمِ 63
అప్పుడు మేము మూసాకు: "నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَزْلَفْنَا ثَمَّ الْآخَرِينَ 64
మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింప జేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنْجَيْنَا مُوسَىٰ وَمَنْ مَعَهُ أَجْمَعِينَ 65
మరియు మూసాను మరియు అతనితో పాటు ఉన్నవారిని అందరినీ రక్షించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ 66
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ 67
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ 68
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిసంపన్నుడు, అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَاهِيمَ 69
ఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَا تَعْبُدُونَ 70
అతను తన తండ్రితో మరియు తన జాతి వారితో: "మీరెవరిని ఆరాధిస్తున్నారు?" అని అడిగినపుడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا نَعْبُدُ أَصْنَامًا فَنَظَلُّ لَهَا عَاكِفِينَ 71
వారన్నారు: "మేము విగ్రహాలను ఆరాధిస్తున్నాము మరియు మేము వాటికే ఎల్లప్పుడు భక్తులమై ఉంటాము."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ 72
(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَوْ يَنْفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ 73
లేదా, మీకేమైనా మేలు చేయగలవా? లేదా హాని చేయగలవా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا بَلْ وَجَدْنَا آبَاءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ 74
వారన్నారు: "అలా కాదు! మేము మా తండ్రితాతలను ఇలా చేస్తూ ఉండగా చూశాము."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ أَفَرَأَيْتُمْ مَا كُنْتُمْ تَعْبُدُونَ 75
అతను అన్నాడు: "ఏమీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరెవరిని ఆరాధిస్తున్నారో?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَنْتُمْ وَآبَاؤُكُمُ الْأَقْدَمُونَ 76
మీరు గానీ మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గానీ (ఆలోచించారా)?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَإِنَّهُمْ عَدُوٌّ لِي إِلَّا رَبَّ الْعَالَمِينَ 77
ఎందుకంటే! నిశ్చయంగా, ఇవన్నీ నా శత్రువులే! కేవలం ఆ సర్వలోకాల ప్రభువు తప్ప!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ الَّذِي خَلَقَنِي فَهُوَ يَهْدِينِ 78
ఆయనే నన్ను సృష్టించాడు. కాబట్టి ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالَّذِي هُوَ يُطْعِمُنِي وَيَسْقِينِ 79
ఆయనే నాకు తినిపించేవాడు మరియు త్రాగించేవాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ 80
మరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే, ఆయనే నాకు స్వస్థత నిచ్చేవాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالَّذِي يُمِيتُنِي ثُمَّ يُحْيِينِ 81
మరియు ఆయనే నన్ను మరణింపజేసేవాడు, తరువాత మళ్ళీ బ్రతికింపజేసేవాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالَّذِي أَطْمَعُ أَنْ يَغْفِرَ لِي خَطِيئَتِي يَوْمَ الدِّينِ 82
మరియు ఆయనే తీర్పుదినమున నా తప్పులను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ رَبِّ هَبْ لِي حُكْمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ 83
మరియు ఓ నా ఫ్రభూ! నాకు వివేకాన్ని ప్రసాదించు మరియు నన్ను సద్వర్తనులలో కలుపు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاجْعَلْ لِي لِسَانَ صِدْقٍ فِي الْآخِرِينَ 84
మరియు తరువాత వచ్చే తరాల వారిలో నాకు మంచి పేరును ప్రసాదించు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاجْعَلْنِي مِنْ وَرَثَةِ جَنَّةِ النَّعِيمِ 85
మరియు సర్వసుఖాల స్వర్గానికి వారసులయ్యేవారిలో నన్ను చేర్చు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاغْفِرْ لِأَبِي إِنَّهُ كَانَ مِنَ الضَّالِّينَ 86
మరియు నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టులలోని వాడే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَا تُخْزِنِي يَوْمَ يُبْعَثُونَ 87
మరియు అందరూ తిరిగి బ్రతికింపబడే రోజు నన్ను అవమానం పాల చేయకు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَوْمَ لَا يَنْفَعُ مَالٌ وَلَا بَنُونَ 88
ఏ రోజునైతే ధనసంపత్తులు గానీ, సంతానం గానీ పనికిరావో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا مَنْ أَتَى اللَّهَ بِقَلْبٍ سَلِيمٍ 89
కేవలం నిర్మలమైన హృదయంతో అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు తప్ప!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِينَ 90
మరియు (ఆ రోజు) స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకు రాబడుతుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَبُرِّزَتِ الْجَحِيمُ لِلْغَاوِينَ 91
మరియు నరకం మార్గం తప్పిన వారి ముందు పెట్టబడుతుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَقِيلَ لَهُمْ أَيْنَ مَا كُنْتُمْ تَعْبُدُونَ 92
మరియు వారితో అనబడుతుంది: "మీరు ఆరాధించేవారు (ఆ దైవాలు) ఇప్పుడు ఎక్కడున్నారు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مِنْ دُونِ اللَّهِ هَلْ يَنْصُرُونَكُمْ أَوْ يَنْتَصِرُونَ 93
అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَكُبْكِبُوا فِيهَا هُمْ وَالْغَاوُونَ 94
అప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ 95
మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ 96
వారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు:
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ تَاللَّهِ إِنْ كُنَّا لَفِي ضَلَالٍ مُبِينٍ 97
"అల్లాహ్ సాక్షిగా! మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ نُسَوِّيكُمْ بِرَبِّ الْعَالَمِينَ 98
ఎప్పుడైతే మేము మిమ్మల్ని సర్వలోకాల ప్రభువుతో సమానులుగా చేశామో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا أَضَلَّنَا إِلَّا الْمُجْرِمُونَ 99
మరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَمَا لَنَا مِنْ شَافِعِينَ 100
మాకిప్పుడు సిఫారసు చేసేవారు ఎవ్వరూ లేరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَا صَدِيقٍ حَمِيمٍ 101
మరియు ఏ ప్రాణ స్నేహితుడు కూడా లేడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ 102
ఒకవేళ మళ్ళీ మరలిపోయే అవకాశం మాకు దొరికి ఉంటే, మేము తప్పకుండా విశ్వసించిన వారిలో చేరిపోతాము!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ 103
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ 104
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَذَّبَتْ قَوْمُ نُوحٍ الْمُرْسَلِينَ 105
నూహ్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ 106
వారి సహోదరుడు నూహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ 107
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ 108
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ 109
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ 110
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ۞ قَالُوا أَنُؤْمِنُ لَكَ وَاتَّبَعَكَ الْأَرْذَلُونَ 111
వారన్నారు: "ఏమీ? మేము నిన్ను విశ్వసించాలా? నిన్ను కేవలం అధములైన వారే కదా అనుసరిస్తున్నది?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ وَمَا عِلْمِي بِمَا كَانُوا يَعْمَلُونَ 112
(నూహ్) అన్నాడు: "వారేమి (పనులు) చేస్తూ ఉండేవారో నాకేం తెలుసు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّي ۖ لَوْ تَشْعُرُونَ 113
వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا أَنَا بِطَارِدِ الْمُؤْمِنِينَ 114
మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించే వాడను కాను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ مُبِينٌ 115
నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا لَئِنْ لَمْ تَنْتَهِ يَا نُوحُ لَتَكُونَنَّ مِنَ الْمَرْجُومِينَ 116
వారన్నారు: "ఓ నూహ్! నీవు దీనిని మానుకోకపోతే, నీవు తప్పక రాళ్ళు రువ్వి చంపబడతావు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ رَبِّ إِنَّ قَوْمِي كَذَّبُونِ 117
(నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నా జాతి ప్రజలు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తున్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَافْتَحْ بَيْنِي وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِي وَمَنْ مَعِيَ مِنَ الْمُؤْمِنِينَ 118
కావున నీవే నాకూ మరియు వారికీ మధ్య తీర్పు చేయి. మరియు నన్నూ మరియు నాతో పాటు ఉన్న విశ్వాసులనూ కాపాడు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَنْجَيْنَاهُ وَمَنْ مَعَهُ فِي الْفُلْكِ الْمَشْحُونِ 119
ఆ పిదప మేము అతనిని మరియు అతనితో పాట నిండునావలో ఎక్కి ఉన్న వారినందరినీ కాపాడాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ أَغْرَقْنَا بَعْدُ الْبَاقِينَ 120
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ 121
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ 122
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ 123
ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ 124
వారి సహోదరుడు హూద్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ 125
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ 126
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ 127
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ 128
ఏమీ? మీరు కేవలం ఆడంబరానికి ప్రతి ఎత్తైన స్థలం మీద ఒక స్మారకాన్ని నిర్మిస్తారా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ 129
మరియు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారన్నట్లు పెద్దపెద్ద కోటలు కడతారా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِذَا بَطَشْتُمْ بَطَشْتُمْ جَبَّارِينَ 130
మరియు మీరు ఎవరినైనా పట్టుకుంటే, అతి క్రూరులై పట్టుకుంటారా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ 131
ఇకనైన మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاتَّقُوا الَّذِي أَمَدَّكُمْ بِمَا تَعْلَمُونَ 132
మరియు మీకు తెలిసివున్న (మంచి) వస్తువులను, మీకు విస్తారంగా ఇచ్చిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمَدَّكُمْ بِأَنْعَامٍ وَبَنِينَ 133
ఆయన విస్తారంగా మీకు పశువులను మరియు సంతానాన్ని అనుగ్రహించాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَنَّاتٍ وَعُيُونٍ 134
మరియు తోటలను మరియు చెలమలను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ 135
నిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُنْ مِنَ الْوَاعِظِينَ 136
వారన్నారు: "నీవు ఉపదేశించినా, ఉపదేశించక పోయినా మాకు అంతా సమానమే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ 137
ఇది మా పూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ 138
మరియు మాకు ఎలాంటి శిక్ష విధించబడదు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ 139
ఈ విధంగా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ 140
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَذَّبَتْ ثَمُودُ الْمُرْسَلِينَ 141
సమూద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَالِحٌ أَلَا تَتَّقُونَ 142
వారి సహోదరుడు సాలిహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ 143
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ 144
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ 145
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَتُتْرَكُونَ فِي مَا هَاهُنَا آمِنِينَ 146
ఏమీ? మీరిప్పుడు ఇక్కడ ఉన్న స్థితిలోనే సుఖశాంతులలో ఎల్లప్పుడూ వదలి వేయబడతారని అనుకుంటున్నారా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فِي جَنَّاتٍ وَعُيُونٍ 147
తోటలలో మరియు చెలమలలో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ 148
మరియు ఈ పొలాలలో, మాగిన పండ్లగుత్తులు గల ఖర్జూరపు చెట్ల మధ్య;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا فَارِهِينَ 149
మరియు మీరు కొండలను తొలిచి ఎంతో నేర్పుతో గృహాలను నిర్మిస్తూ ఉంటారనీ!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ 150
అలా కాదు, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ 151
మరియు మితిమీరి ప్రవర్తించే వారి ఆజ్ఞలను అనుసరించకండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ الَّذِينَ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ 152
ఎవరైతే భూమిలో కల్లోలం రేకెత్తిస్తున్నారో మరియు ఎన్నడూ సంస్కరణను చేపట్టరో!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا إِنَّمَا أَنْتَ مِنَ الْمُسَحَّرِينَ 153
వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا أَنْتَ إِلَّا بَشَرٌ مِثْلُنَا فَأْتِ بِآيَةٍ إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ 154
నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! కావున నీవు సత్యవంతుడవే అయితే, ఏదైనా అద్భుత సూచన తీసుకురా!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ هَٰذِهِ نَاقَةٌ لَهَا شِرْبٌ وَلَكُمْ شِرْبُ يَوْمٍ مَعْلُومٍ 155
(సాలిహ్) అన్నాడు: "ఇదిగో ఈ ఆడ ఒంటె. ఇది నీరు త్రాగే (దినం) మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణయించబడ్డాయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيمٍ 156
దీనికి హాని కలిగించకండి. అలా చేస్తే ఒక మహా దినపు శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَعَقَرُوهَا فَأَصْبَحُوا نَادِمِينَ 157
కాని వారు దాని వెనుక కాలి మోకాలి పెద్ద నరమును కోసి చంపారు, ఆ తరువాత వారు పశ్చాత్తాప పడతూ ఉండిపోయారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَخَذَهُمُ الْعَذَابُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ 158
కావున, వారిని శిక్ష పట్టుకుంది. నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ 159
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَذَّبَتْ قَوْمُ لُوطٍ الْمُرْسَلِينَ 160
లూత్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ 161
వారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ 162
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ 163
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ 164
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَتَأْتُونَ الذُّكْرَانَ مِنَ الْعَالَمِينَ 165
(ప్రకృతికి విరుద్ధంగా) సర్వప్రాణులలో కెల్లా మీరే పురుషుల వద్దకు పోతారేమిటీ?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُمْ مِنْ أَزْوَاجِكُمْ ۚ بَلْ أَنْتُمْ قَوْمٌ عَادُونَ 166
మీ ప్రభువు, మీ కొరకు సహవాసులు (అజ్వాజ్) గా పుట్టించిన వారిని విడిచి పెడుతున్నారేమిటి? అలా కాదు, మీరు హద్దు మీరి ప్రవర్తించే జాతివారు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا لَئِنْ لَمْ تَنْتَهِ يَا لُوطُ لَتَكُونَنَّ مِنَ الْمُخْرَجِينَ 167
(దానికి) వారన్నారు: "ఓ లూత్! ఇక నీవు మానుకోక పోతే నీవు దేశం నుండి బహిష్కరించబడిన వారిలో చేరుతావు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ إِنِّي لِعَمَلِكُمْ مِنَ الْقَالِينَ 168
(లూత్) అన్నాడు: "నిశ్చయంగా మీ ఈ చేష్టను అసహ్యించుకునే వారిలో నేనూ ఉన్నాను."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ رَبِّ نَجِّنِي وَأَهْلِي مِمَّا يَعْمَلُونَ 169
(ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా కుటుంబం వారినీ వీరి చేష్ట నుండి కాపాడు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ 170
కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరినీ కాపాడాము -
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ 171
వెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప -
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ 172
ఆ తరువాత, మిగతా వారిని నిర్మూలించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَمْطَرْنَا عَلَيْهِمْ مَطَرًا ۖ فَسَاءَ مَطَرُ الْمُنْذَرِينَ 173
వారిపై ఒక వర్షాన్ని కురిపించాము. అది (ముందు) హెచ్చరించబడిన వారిపై (కురిపించబడ్డ) అతి భయంకరమైన వర్షం.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ 174
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ 175
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَذَّبَ أَصْحَابُ الْأَيْكَةِ الْمُرْسَلِينَ 176
వన (అయ్ కహ్) వాసులు సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ أَلَا تَتَّقُونَ 177
షుఐబ్ వారితో ఇలా అన్నాడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ 178
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ 179
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ 180
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ۞ أَوْفُوا الْكَيْلَ وَلَا تَكُونُوا مِنَ الْمُخْسِرِينَ 181
మీరు (ఇచ్చినపుడు) సరిగ్గా కొలిచి ఇవ్వండి. నష్టపరిచే వారిలో చేరకండి!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ 182
త్రాసుతో సరిసమానంగా తూచండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ 183
ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ దౌర్జన్యపరులుగా ప్రవర్తించకండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاتَّقُوا الَّذِي خَلَقَكُمْ وَالْجِبِلَّةَ الْأَوَّلِينَ 184
మిమ్మల్ని మరియు మీకు పూర్వం గతించిన తరాల వారిని సృష్టించిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا إِنَّمَا أَنْتَ مِنَ الْمُسَحَّرِينَ 185
వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا أَنْتَ إِلَّا بَشَرٌ مِثْلُنَا وَإِنْ نَظُنُّكَ لَمِنَ الْكَاذِبِينَ 186
నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! నిశ్చయంగా, మేము నిన్ను అసత్యవాదులలో ఒకనిగా పరిగణిస్తున్నాము!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَسْقِطْ عَلَيْنَا كِسَفًا مِنَ السَّمَاءِ إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ 187
నీవు సత్యవంతుడవే అయితే ఆకాశం యొక్క ఒక తునకను మాపై పడవేయి."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ رَبِّي أَعْلَمُ بِمَا تَعْمَلُونَ 188
(షుఐబ్) అన్నాడు: "మీరు చేసేది నా ప్రభువుకు బాగా తెలుసు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ الظُّلَّةِ ۚ إِنَّهُ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ 189
కాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చి పడింది. నిశ్చయంగా, అదొక భయంకరమైన దినపు శిక్ష!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ 190
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ 191
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّهُ لَتَنْزِيلُ رَبِّ الْعَالَمِينَ 192
మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం).
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ 193
దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنْذِرِينَ 194
నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ بِلِسَانٍ عَرَبِيٍّ مُبِينٍ 195
స్పష్టమైన అరబ్బీ భాషలో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّهُ لَفِي زُبُرِ الْأَوَّلِينَ 196
నిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَوَلَمْ يَكُنْ لَهُمْ آيَةً أَنْ يَعْلَمَهُ عُلَمَاءُ بَنِي إِسْرَائِيلَ 197
ఇస్రాయీల్ సంతతి వారిలోని విద్వాంసులు ఈ విషయాన్ని ఒప్పు కోవటం వారికొక సూచనగా సరిపోదా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَوْ نَزَّلْنَاهُ عَلَىٰ بَعْضِ الْأَعْجَمِينَ 198
ఒకవేళ మేము దీనిని అరబ్ కాని వానిపై అవతరింపజేసి ఉంటే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَقَرَأَهُ عَلَيْهِمْ مَا كَانُوا بِهِ مُؤْمِنِينَ 199
అతను దానిని వారికి చదివి వినిపించినా, వారు దానిని విశ్వసించేవారు కారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَذَٰلِكَ سَلَكْنَاهُ فِي قُلُوبِ الْمُجْرِمِينَ 200
ఈ విధంగా, మేము దీనిని (తిరస్కారాన్ని) అపరాధుల హృదయాల లోనికి దిగిపోయేలా చేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَا يُؤْمِنُونَ بِهِ حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ 201
కఠినశిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَيَأْتِيَهُمْ بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ 202
అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి పడుతుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَيَقُولُوا هَلْ نَحْنُ مُنْظَرُونَ 203
అప్పుడు వారంటారు: "ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ 204
ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَفَرَأَيْتَ إِنْ مَتَّعْنَاهُمْ سِنِينَ 205
చూశావా? మేము కొన్ని సంవత్సరాలు వారికి (ఈ జీవితంలో) సుఖసంతోషాలతో గడిపే వ్యవధినిచ్చినా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ جَاءَهُمْ مَا كَانُوا يُوعَدُونَ 206
తరువాత వాగ్దానం చేయబడినది (శిక్ష) వారిపైకి వచ్చినపుడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا أَغْنَىٰ عَنْهُمْ مَا كَانُوا يُمَتَّعُونَ 207
వారు అనుభవిస్తూ ఉండిన సుఖసంతోషాలు వారికేమీ పనికిరావు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا أَهْلَكْنَا مِنْ قَرْيَةٍ إِلَّا لَهَا مُنْذِرُونَ 208
మరియు - హెచ్చరిక చేసేవారిని (ప్రవక్తలను) పంపనిదే - మేము ఏ నగరాన్ని కూడా నాశనం చేయలేదు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ذِكْرَىٰ وَمَا كُنَّا ظَالِمِينَ 209
హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيَاطِينُ 210
మరియు దీనిని (ఈ దివ్యగ్రంథాన్ని) తీసుకొని క్రిందికి దిగిన వారు షైతానులు కారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا يَنْبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ 211
మరియు అది వారికి తగినది కాదు; వారది చేయలేరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ 212
వాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ 213
కావున అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنْذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ 214
మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ 215
విశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపై నీ కనికరపు రెక్కలను చాపు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّي بَرِيءٌ مِمَّا تَعْمَلُونَ 216
ఒకవేళ వారు నీ పట్ల అవిధేయత చూపితే వారితో అను: "మీరు చేసే కార్యాలకు నేను బాధ్యుడను కాను."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ 217
మరియు ఆ సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత మీద నమ్మకం ఉంచుకో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ 218
ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ 219
మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారితో నీ రాకపోకడలను కూడా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ 220
నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَنْ تَنَزَّلُ الشَّيَاطِينُ 221
షైతాన్ లు ఎవరిపై దిగుతారో నేను మీకు తెలుపనా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍ 222
వారు అసత్యవాదులైన పాపాత్ములపై దిగుతారు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يُلْقُونَ السَّمْعَ وَأَكْثَرُهُمْ كَاذِبُونَ 223
గాలి వార్తలను చెవులలో ఊదుతారు; మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالشُّعَرَاءُ يَتَّبِعُهُمُ الْغَاوُونَ 224
మరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَلَمْ تَرَ أَنَّهُمْ فِي كُلِّ وَادٍ يَهِيمُونَ 225
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా వారు (కవులు) తమ కవిత్వంలో ప్రతి విషయాన్ని ఉద్దేశరహితంగా (ప్రశంసిస్తూ) ఉంటారని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ 226
మరియు నిశ్చయంగా, వారు తాము ఆచరించని దానిని చెప్పుకుంటారని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَذَكَرُوا اللَّهَ كَثِيرًا وَانْتَصَرُوا مِنْ بَعْدِ مَا ظُلِمُوا ۗ وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ 227
కాని, (వారిలో) విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ, అల్లాహ్ ను అమితంగా స్మరించే వారూ మరియు - తమకు అన్యాయం జరిగినప్పుడే - ప్రతీకార చర్య తీసుకునే వారు తప్ప! అన్యాయం చేసేవారు తమ పర్యవసానం ఏమిటో త్వరలో తెలుసుకోగలరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్