Al-Hijr

سورة الحجر

సూరా 15 · మక్కీ · 99 ఆయత్‌లు

15:1జుజ్ 14 · పు. 262

الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ وَقُرْآنٍ مُبِينٍ1

అలిఫ్ - లామ్ - రా. ఇవి దివ్యగ్రంథ ఆయత్ లు మరియు (ఇది) ఒక స్పష్టమైన ఖుర్ఆన్.
15:2జుజ్ 14 · పు. 262

رُبَمَا يَوَدُّ الَّذِينَ كَفَرُوا لَوْ كَانُوا مُسْلِمِينَ2

సత్యతిరస్కారులు: "మేము అల్లాహ్ కు విధేయులమైతే (ముస్లింలమైతే) ఎంత బాగుండేది!" అని (పునరుత్థాన దినమున), పలుమార్లు కోరుకుంటారు.
15:3జుజ్ 14 · పు. 262

ذَرْهُمْ يَأْكُلُوا وَيَتَمَتَّعُوا وَيُلْهِهِمُ الْأَمَلُ ۖ فَسَوْفَ يَعْلَمُونَ3

వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతోషాలను అనుభవిస్తూ (వృథా) ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు. తరువాత వారు (సత్యాన్ని) తెలుసుకుంటారు.
15:4జుజ్ 14 · పు. 262

وَمَا أَهْلَكْنَا مِنْ قَرْيَةٍ إِلَّا وَلَهَا كِتَابٌ مَعْلُومٌ4

మరియు (దాని వ్యవధి) నిర్ణయించి వ్రాయబడి ఉండనిదే, మేము ఏ నగరాన్నీ కూడా నాశనం చేయలేదు.
15:5జుజ్ 14 · పు. 262

مَا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَأْخِرُونَ5

ఏ సమాజం కూడా తన నిర్ణీత గడువుకు, ముందు గానీ మరియు వెనుక గానీ కాజాలదు.
15:6జుజ్ 14 · పు. 262

وَقَالُوا يَا أَيُّهَا الَّذِي نُزِّلَ عَلَيْهِ الذِّكْرُ إِنَّكَ لَمَجْنُونٌ6

మరియు (సత్యతిరస్కారులు) అంటారు: "ఓ హితబోధ (ఖుర్ఆన్) అవతరింప జేయబడిన వాడా (ముహమ్మద్)! నిశ్చయంగా నీవు పిచ్చివాడవు.
15:7జుజ్ 14 · పు. 262

لَوْ مَا تَأْتِينَا بِالْمَلَائِكَةِ إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ7

"నీవు సత్యవంతుడవే అయితే, మా వద్దకు దేవదూతలను ఎందుకు తీసుకొనిరావు?"
15:8జుజ్ 14 · పు. 262

مَا نُنَزِّلُ الْمَلَائِكَةَ إِلَّا بِالْحَقِّ وَمَا كَانُوا إِذًا مُنْظَرِينَ8

మేము దేవదూతలను, సత్యంతో తప్ప పంపము మరియు వారు వచ్చినప్పుడు వీరికి ఏ మాత్రం వ్యవధి ఇవ్వబడదు.
15:9జుజ్ 14 · పు. 262

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ9

నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము.
15:10జుజ్ 14 · పు. 262

وَلَقَدْ أَرْسَلْنَا مِنْ قَبْلِكَ فِي شِيَعِ الْأَوَّلِينَ10

మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము, నీకు పూర్వం గతించిన తెగల వారి వద్దకు కూడా (ప్రవక్తలను) పంపాము.
15:11జుజ్ 14 · పు. 262

وَمَا يَأْتِيهِمْ مِنْ رَسُولٍ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ11

మరియు వారి వద్దకు వచ్చిన ఏ ప్రవక్తను కూడా, వారు పరిహసించకుండా ఉండలేదు.
15:12జుజ్ 14 · పు. 262

كَذَٰلِكَ نَسْلُكُهُ فِي قُلُوبِ الْمُجْرِمِينَ12

ఈ విధంగా మేము దీనిని (సత్యతిరస్కారాన్ని) అపరాధుల హృదయాలలో ప్రవేశపెడుతున్నాము.
15:13జుజ్ 14 · పు. 262

لَا يُؤْمِنُونَ بِهِ ۖ وَقَدْ خَلَتْ سُنَّةُ الْأَوَّلِينَ13

వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించడం లేదు. మరియు వాస్తవానికి (సత్యతిరస్కారులైన) వారి పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది.
15:14జుజ్ 14 · పు. 262

وَلَوْ فَتَحْنَا عَلَيْهِمْ بَابًا مِنَ السَّمَاءِ فَظَلُّوا فِيهِ يَعْرُجُونَ14

మరియు ఒకవేళ మేము వారి కొరకు ఆకాశపు ఒక ద్వారాన్ని తెరిచినా, వారు దానిపైకి ఎక్కుతూ పోతూ!
15:15జుజ్ 14 · పు. 262

لَقَالُوا إِنَّمَا سُكِّرَتْ أَبْصَارُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَسْحُورُونَ15

ఇలా అనేవారు: "నిశ్చయంగా, మా చూపులు భ్రమింపజేయబడ్డాయి. అలా కాదు, మాపై మంత్రజాలం చేయబడింది."
15:16జుజ్ 14 · పు. 263

وَلَقَدْ جَعَلْنَا فِي السَّمَاءِ بُرُوجًا وَزَيَّنَّاهَا لِلنَّاظِرِينَ16

మరియు వాస్తవానికి, మేము ఆకాశంలో తారాగణాన్ని (నక్షత్రరాశులను) సృష్టించి, దానిని చూపరులకు అలంకారమైనదిగా చేశాము.
15:17జుజ్ 14 · పు. 263

وَحَفِظْنَاهَا مِنْ كُلِّ شَيْطَانٍ رَجِيمٍ17

మరియు శపించబడిన (బహిష్కరించబడిన) ప్రతి షైతాన్ నుండి దానిని (ఆకాశాన్ని) సురక్షితంగా ఉంచాము.
15:18జుజ్ 14 · పు. 263

إِلَّا مَنِ اسْتَرَقَ السَّمْعَ فَأَتْبَعَهُ شِهَابٌ مُبِينٌ18

కాని, ఎవడైనా (ఏ షైతానైనా) దొంగచాటుగా వినటానికి ప్రయత్నిస్తే, స్పష్టమైన కొరవి (అగ్ని జ్వాల) అతనిని వెంబడిస్తుంది.
15:19జుజ్ 14 · పు. 263

وَالْأَرْضَ مَدَدْنَاهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَاسِيَ وَأَنْبَتْنَا فِيهَا مِنْ كُلِّ شَيْءٍ مَوْزُونٍ19

మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును తగిన పరిమాణంలో ఉత్పత్తి చేశాము.
15:20జుజ్ 14 · పు. 263

وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَايِشَ وَمَنْ لَسْتُمْ لَهُ بِرَازِقِينَ20

మరియు అందులో మీకూ మరియు మీరు పోషించని వాటి కొరకూ (జీవరాసుల కొరకూ) మేము జీవనోపాధిని కల్పించాము.
15:21జుజ్ 14 · పు. 263

وَإِنْ مِنْ شَيْءٍ إِلَّا عِنْدَنَا خَزَائِنُهُ وَمَا نُنَزِّلُهُ إِلَّا بِقَدَرٍ مَعْلُومٍ21

మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీ లేదు మరియు దానిని మేము ఒక నిర్ణీత పరిమాణంలో మాత్రమే పంపుతూ ఉంటాము.
15:22జుజ్ 14 · పు. 263

وَأَرْسَلْنَا الرِّيَاحَ لَوَاقِحَ فَأَنْزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً فَأَسْقَيْنَاكُمُوهُ وَمَا أَنْتُمْ لَهُ بِخَازِنِينَ22

మరియు మేము (వృక్షకోటిని) ఫలవంతం చేయటానికి గాలులను పంపుతాము! తరువాత మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిని మీకు త్రాగటానికి సమకూర్చుతాము మరియు దాని కోశాధికారులు మీరు మాత్రం కారు!
15:23జుజ్ 14 · పు. 263

وَإِنَّا لَنَحْنُ نُحْيِي وَنُمِيتُ وَنَحْنُ الْوَارِثُونَ23

మరియు నిశ్చయంగా, మేమే జీవన్మరణాలను ఇచ్చేవారము; మరియు చివరకు మేమే వారసులుగా మిగిలే వారము.
15:24జుజ్ 14 · పు. 263

وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَقْدِمِينَ مِنْكُمْ وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَأْخِرِينَ24

మరియు వాస్తవానికి, మీకు ముందు గడిచి పోయిన వారిని గురించి మాకు తెలుసు మరియు వాస్తవంగా మీ తరువాత వచ్చే వారిని గురించి కూడా మాకు బాగా తెలుసు.
15:25జుజ్ 14 · పు. 263

وَإِنَّ رَبَّكَ هُوَ يَحْشُرُهُمْ ۚ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ25

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు, ఆయనే! వారందరినీ సమావేశపరుస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు.
15:26జుజ్ 14 · పు. 263

وَلَقَدْ خَلَقْنَا الْإِنْسَانَ مِنْ صَلْصَالٍ مِنْ حَمَإٍ مَسْنُونٍ26

మరియు వాస్తవంగా మేము మానవుణ్ణి మ్రోగే (ధ్వని చేసే) మట్టి, రూపాంతరం చెందిన జిగట బురద (బంకమట్టి)తో సృష్టించాము.
15:27జుజ్ 14 · పు. 263

وَالْجَانَّ خَلَقْنَاهُ مِنْ قَبْلُ مِنْ نَارِ السَّمُومِ27

మరియు దీనికి పూర్వం మేము జిన్నాతులను (పొగలేని) మండే అగ్నిజ్వాలతో సృష్టించాము.
15:28జుజ్ 14 · పు. 263

وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي خَالِقٌ بَشَرًا مِنْ صَلْصَالٍ مِنْ حَمَإٍ مَسْنُونٍ28

మరియు నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకో!): "నిశ్చయంగా నేను మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో మానవుణ్ణి సృష్టించబోతున్నాను.
15:29జుజ్ 14 · పు. 263

فَإِذَا سَوَّيْتُهُ وَنَفَخْتُ فِيهِ مِنْ رُوحِي فَقَعُوا لَهُ سَاجِدِينَ29

ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి (రూపమిచ్చి), అతని (ఆదమ్) లో నా తరఫు నుండి ప్రాణం (రూహ్) ఊదిన తరువాత, మీరంతా అతని ముందు సాష్టాంగం (సజ్దా) చేయాలి."
15:30జుజ్ 14 · పు. 263

فَسَجَدَ الْمَلَائِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ30

అప్పుడు దేవదూతలు, అందరూ కలిసి సాష్టాంగం (సజ్దా) చేశారు -
15:31జుజ్ 14 · పు. 263

إِلَّا إِبْلِيسَ أَبَىٰ أَنْ يَكُونَ مَعَ السَّاجِدِينَ31

ఒక్క ఇబ్లీస్ తప్ప! అతడు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరనని మొండికేశాడు.
15:32జుజ్ 14 · పు. 264

قَالَ يَا إِبْلِيسُ مَا لَكَ أَلَّا تَكُونَ مَعَ السَّاجِدِينَ32

(అల్లాహ్) ఇలా ప్రశ్నించాడు: "ఓ ఇబ్లీస్! నీకేమయింది, నీవు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో ఎందుకు చేరలేదు?"
15:33జుజ్ 14 · పు. 264

قَالَ لَمْ أَكُنْ لِأَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهُ مِنْ صَلْصَالٍ مِنْ حَمَإٍ مَسْنُونٍ33

(ఇబ్లీస్) ఇలా జవాబిచ్చాడు: "మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో నీవు సృష్టించిన మానవునికి నేను సాష్టాంగం (సజ్దా) చేసే వాడను కాను."
15:34జుజ్ 14 · పు. 264

قَالَ فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ34

(అల్లాహ్) అన్నాడు: "అయితే నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో! ఇక, నిశ్చయంగా, నీవు శపించ (బహిష్కరించ) బడ్డవాడవు!
15:35జుజ్ 14 · పు. 264

وَإِنَّ عَلَيْكَ اللَّعْنَةَ إِلَىٰ يَوْمِ الدِّينِ35

మరియు నిశ్చయంగా, తీర్పు దినము వరకు నీపై శాపం (బహిష్కారం) ఉంటుంది."
15:36జుజ్ 14 · పు. 264

قَالَ رَبِّ فَأَنْظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ36

(ఇబ్లీస్) వేడుకున్నాడు: "ఓ నా ప్రభూ! పునరుత్థాన దినం వరకు నాకు వ్యవధినివ్వు!"
15:37జుజ్ 14 · పు. 264

قَالَ فَإِنَّكَ مِنَ الْمُنْظَرِينَ37

(అల్లాహ్) జవాబిచ్చాడు: "ఇక నిశ్చయంగా, నీవు వ్యవధి ఇవ్వబడిన వారిలోని వాడవు!
15:38జుజ్ 14 · పు. 264

إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ38

(నాకు మాత్రమే) తెలిసి వున్న ఆ దినపు, ఆ సమయం వరకు!"
15:39జుజ్ 14 · పు. 264

قَالَ رَبِّ بِمَا أَغْوَيْتَنِي لَأُزَيِّنَنَّ لَهُمْ فِي الْأَرْضِ وَلَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ39

(ఇబ్లీస్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నన్ను అపమార్గం పట్టించావు, కావున నేను వారికి, భూమిలో (వారి దుష్కర్మలన్నీ) మంచివిగా కనబడేటట్లు చేస్తాను మరియు నిశ్చయంగా, వారందరినీ అపమార్గంలో పడవేస్తాను.
15:40జుజ్ 14 · పు. 264

إِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ40

వారిలో నీవు ఎన్నుకున్న (నీ ఆజ్ఞానువర్తనులైన) నీ దాసులు తప్ప!"
15:41జుజ్ 14 · పు. 264

قَالَ هَٰذَا صِرَاطٌ عَلَيَّ مُسْتَقِيمٌ41

(అల్లాహ్) అన్నాడు: "ఇదే మా దగ్గరకు తెచ్చే ఋజుమార్గం.
15:42జుజ్ 14 · పు. 264

إِنَّ عِبَادِي لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَانٌ إِلَّا مَنِ اتَّبَعَكَ مِنَ الْغَاوِينَ42

నిశ్చయంగా, నా దాసులపై నీ అధికారం సాగదు! కేవలం మార్గభ్రష్టులైన నిన్ను అనుసరించేవారి మీద తప్ప!
15:43జుజ్ 14 · పు. 264

وَإِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ أَجْمَعِينَ43

మరియు నిశ్చయంగా, వారందరి కొరకు వాగ్దానం చేయబడిన (నివాసం) నరకమే!
15:44జుజ్ 14 · పు. 264

لَهَا سَبْعَةُ أَبْوَابٍ لِكُلِّ بَابٍ مِنْهُمْ جُزْءٌ مَقْسُومٌ44

దానికి (నరకానికి) ఏడు ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క వర్గం వారు ప్రత్యేకించబడి ఉన్నారు.
15:45జుజ్ 14 · పు. 264

إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ45

నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో చెలమల మధ్య ఉంటారు.
15:46జుజ్ 14 · పు. 264

ادْخُلُوهَا بِسَلَامٍ آمِنِينَ46

వారు: 'శాంతితో సురక్షితంగా ప్రవేశించండి!' అని ఆహ్వానించబడతారు.
15:47జుజ్ 14 · పు. 264

وَنَزَعْنَا مَا فِي صُدُورِهِمْ مِنْ غِلٍّ إِخْوَانًا عَلَىٰ سُرُرٍ مُتَقَابِلِينَ47

వారి హృదయాలలో మిగిలి వున్న కాపట్యాన్ని (మాలిన్యాన్ని) మేము తొలగిస్తాము. వారు సోదరుల వలే ఎదురెదురుగా పీఠాలపై కూర్చొని ఉంటారు.
15:48జుజ్ 14 · పు. 264

لَا يَمَسُّهُمْ فِيهَا نَصَبٌ وَمَا هُمْ مِنْهَا بِمُخْرَجِينَ48

అక్కడ వారికి అలసట ఉండదు. మరియు అక్కడి నుండి వారు ఎన్నడూ వెడల గొట్టబడరు."
15:49జుజ్ 14 · పు. 264

۞ نَبِّئْ عِبَادِي أَنِّي أَنَا الْغَفُورُ الرَّحِيمُ49

నా దాసులకు ఇలా తెలియజెయ్యి: "నిశ్చయంగా నేను, కేవలం నేనే! క్షమించే వాడను, కరుణించేవాడను.
15:50జుజ్ 14 · పు. 264

وَأَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ50

మరియు నిశ్చయంగా, నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష!
15:51జుజ్ 14 · పు. 264

وَنَبِّئْهُمْ عَنْ ضَيْفِ إِبْرَاهِيمَ51

మరియు వారికి ఇబ్రాహీమ్ అతిథులను గురించి తెలుపు.
15:52జుజ్ 14 · పు. 265

إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا قَالَ إِنَّا مِنْكُمْ وَجِلُونَ52

వారు అతని వద్దకు వచ్చి: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అన్నారు. అతనన్నాడు: "నిశ్చయంగా, మాకు మీ వలన భయం కలుగుతున్నది."
15:53జుజ్ 14 · పు. 265

قَالُوا لَا تَوْجَلْ إِنَّا نُبَشِّرُكَ بِغُلَامٍ عَلِيمٍ53

వారు జవాబిచ్చారు: "నీవు భయపడకు! నిశ్చయంగా, మేము జ్ఞానవంతుడైన ఒక కుమారుని శుభవార్తను నీకు ఇస్తున్నాము."
15:54జుజ్ 14 · పు. 265

قَالَ أَبَشَّرْتُمُونِي عَلَىٰ أَنْ مَسَّنِيَ الْكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ54

(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు ఈ ముసలితనంలో నాకు (కుమారుడు కలుగుననే) శుభవార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి (అసాధ్యమైన) శుభవార్తను ఇస్తున్నారు?"
15:55జుజ్ 14 · పు. 265

قَالُوا بَشَّرْنَاكَ بِالْحَقِّ فَلَا تَكُنْ مِنَ الْقَانِطِينَ55

వారన్నారు: "మేము నీకు సత్యమైన శుభవార్తను ఇచ్చాము. కనుక నీవు నిరాశ చెందకు."
15:56జుజ్ 14 · పు. 265

قَالَ وَمَنْ يَقْنَطُ مِنْ رَحْمَةِ رَبِّهِ إِلَّا الضَّالُّونَ56

(ఇబ్రాహీమ్) అన్నాడు: "తన ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు మార్గభ్రష్టులు తప్ప మరెవరు?"
15:57జుజ్ 14 · పు. 265

قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا الْمُرْسَلُونَ57

(ఇంకా) ఇలా అన్నాడు: "ఓ దైవదూతలారా! మరి మీరు వచ్చిన కారణమేమిటి?"
15:58జుజ్ 14 · పు. 265

قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُجْرِمِينَ58

వారన్నారు: "వాస్తవానికి మేము అపరాధులైన జాతి వారి వైపునకు పంపబడ్డాము -
15:59జుజ్ 14 · పు. 265

إِلَّا آلَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ59

లూత్ ఇంటివారు తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము;
15:60జుజ్ 14 · పు. 265

إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَا ۙ إِنَّهَا لَمِنَ الْغَابِرِينَ60

అతని భార్య తప్ప ! (ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు): "నిశ్చయంగా ఆమె వెనుక ఉండి పోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము."
15:61జుజ్ 14 · పు. 265

فَلَمَّا جَاءَ آلَ لُوطٍ الْمُرْسَلُونَ61

తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు;
15:62జుజ్ 14 · పు. 265

قَالَ إِنَّكُمْ قَوْمٌ مُنْكَرُونَ62

(లూత్) అన్నాడు: "నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు."
15:63జుజ్ 14 · పు. 265

قَالُوا بَلْ جِئْنَاكَ بِمَا كَانُوا فِيهِ يَمْتَرُونَ63

వారన్నారు: "కాదు! వాస్తవానికి వారు (దుర్మార్గులు) దేనిని గురించి సందేహంలో పడి ఉన్నారో, దానిని (ఆ శిక్షను) తీసుకొని నీ వద్దకు వచ్చాము.
15:64జుజ్ 14 · పు. 265

وَأَتَيْنَاكَ بِالْحَقِّ وَإِنَّا لَصَادِقُونَ64

మరియు మేము నీ వద్దకు సత్యాన్ని తెచ్చాము. మరియు మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము.
15:65జుజ్ 14 · పు. 265

فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِنَ اللَّيْلِ وَاتَّبِعْ أَدْبَارَهُمْ وَلَا يَلْتَفِتْ مِنْكُمْ أَحَدٌ وَامْضُوا حَيْثُ تُؤْمَرُونَ65

కావున నీవు కొంత రాత్రి మిగిలి ఉండగానే, నీ ఇంటి వారిని తీసుకొని బయలుదేరు, నీవు వారి వెనుక పో! మీలో ఎవ్వరూ కూడా వెనుదిరిగి చూడరాదు; మరియు మీరు, మీకు ఆజ్ఞాపించిన వైపునకే పోతూ ఉండండి."
15:66జుజ్ 14 · పు. 265

وَقَضَيْنَا إِلَيْهِ ذَٰلِكَ الْأَمْرَ أَنَّ دَابِرَ هَٰؤُلَاءِ مَقْطُوعٌ مُصْبِحِينَ66

మరియు (మా దూతల ద్వారా) మా ఆదేశాన్ని అతనికి ఇలా తెలియజేశాము: "నిశ్చయంగా, తెల్లవారే సరికి వారందరూ సమూలంగా నిర్మూలించబడతారు."
15:67జుజ్ 14 · పు. 265

وَجَاءَ أَهْلُ الْمَدِينَةِ يَسْتَبْشِرُونَ67

మరియు నగరవాసులు ఉల్లాసంతో అక్కడికి వచ్చారు.
15:68జుజ్ 14 · పు. 265

قَالَ إِنَّ هَٰؤُلَاءِ ضَيْفِي فَلَا تَفْضَحُونِ68

(లూత్) అన్నాడు: "వాస్తవానికి, వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు చేయకండి.
15:69జుజ్ 14 · పు. 265

وَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ69

మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు నా గౌరవాన్ని పోగొట్టకండి."
15:70జుజ్ 14 · పు. 265

قَالُوا أَوَلَمْ نَنْهَكَ عَنِ الْعَالَمِينَ70

వారన్నారు: "ప్రపంచంలోని (ప్రతి వాణ్ణి) వెనకేసుకోకు!" అని మేము నిన్ను వారించలేదా?"
15:71జుజ్ 14 · పు. 266

قَالَ هَٰؤُلَاءِ بَنَاتِي إِنْ كُنْتُمْ فَاعِلِينَ71

(లూత్) అన్నాడు: "మీకు (ఏమైనా) చేయాలనే ఉంటే, నా కుమార్తెలు (జాతి స్త్రీలు) ఉన్నారు."
15:72జుజ్ 14 · పు. 266

لَعَمْرُكَ إِنَّهُمْ لَفِي سَكْرَتِهِمْ يَعْمَهُونَ72

"నీ ప్రాణం సాక్షి! నిశ్చయంగా, వారు తమ (కామ) మత్తులో త్రోవ తప్పి తిరుగుతున్నారు."
15:73జుజ్ 14 · పు. 266

فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُشْرِقِينَ73

ఆ పిదప సూర్యోదయ సమయమున ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని పట్టుకున్నది.
15:74జుజ్ 14 · పు. 266

فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِنْ سِجِّيلٍ74

తరువాత మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేశాము మరియు వారిపై కాల్చిన మట్టి గులకరాళ్ళను కురిపించాము.
15:75జుజ్ 14 · పు. 266

إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِلْمُتَوَسِّمِينَ75

నిశ్చయంగా, ఇందులో దూరదృష్టి గలవారికి ఎన్నో సూచనలున్నాయి.
15:76జుజ్ 14 · పు. 266

وَإِنَّهَا لَبِسَبِيلٍ مُقِيمٍ76

మరియు వాస్తవానికి ఆ ప్రాంతం ఒక రహదారి పైననే ఉన్నది.
15:77జుజ్ 14 · పు. 266

إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِلْمُؤْمِنِينَ77

నిశ్చయంగా, ఇందులో విశ్వసించిన వారికి ఒక సూచన ఉంది.
15:78జుజ్ 14 · పు. 266

وَإِنْ كَانَ أَصْحَابُ الْأَيْكَةِ لَظَالِمِينَ78

మరియు అయ్ కహ్ (మద్ యన్) వాసులు కూడా దుర్మార్గులుగానే ఉండేవారు.
15:79జుజ్ 14 · పు. 266

فَانْتَقَمْنَا مِنْهُمْ وَإِنَّهُمَا لَبِإِمَامٍ مُبِينٍ79

కావున మేము వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాము. మరియు ఆ రెండు (శిథిలాలు) కూడా ఒక స్పష్టమైన మార్గం మీద ఉన్నాయి.
15:80జుజ్ 14 · పు. 266

وَلَقَدْ كَذَّبَ أَصْحَابُ الْحِجْرِ الْمُرْسَلِينَ80

మరియు వాస్తవానికి హిజ్ర్ వాసులు కూడా ప్రవక్తలను అసత్యవాదులన్నారు.
15:81జుజ్ 14 · పు. 266

وَآتَيْنَاهُمْ آيَاتِنَا فَكَانُوا عَنْهَا مُعْرِضِينَ81

మరియు వారికి కూడా మేము అద్భుత సూచన (ఆయాత్) లను ఇచ్చి ఉంటిమి. కాని వారు వాటి నుండి విముఖులై ప్రవర్తించారు.
15:82జుజ్ 14 · పు. 266

وَكَانُوا يَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا آمِنِينَ82

మరియు వారు కొండలను తొలచి గృహాలను నిర్మించుకునే వారు, సురక్షితంగా ఉండగలమని (భావిస్తూ)!
15:83జుజ్ 14 · పు. 266

فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُصْبِحِينَ83

చివరకు ఒక ఉదయమున ఒక తీవ్రమైన గర్జన (సయ్ హా) వారిపై కూడా వచ్చి పడింది.
15:84జుజ్ 14 · పు. 266

فَمَا أَغْنَىٰ عَنْهُمْ مَا كَانُوا يَكْسِبُونَ84

అప్పుడు వారు సంపాదించింది వారికి ఏ మాత్రం పనికి రాలేక పోయింది.
15:85జుజ్ 14 · పు. 266

وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ ۗ وَإِنَّ السَّاعَةَ لَآتِيَةٌ ۖ فَاصْفَحِ الصَّفْحَ الْجَمِيلَ85

మరియు మేము ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్యనున్న సర్వాన్ని కేవలం సత్యంతోనే సృష్టించాము. మరియు నిశ్చయంగా, తీర్పు గడియ రానున్నది. కావున నీవు ఉదార భావంతో వారిని ఉపేక్షించు!
15:86జుజ్ 14 · పు. 266

إِنَّ رَبَّكَ هُوَ الْخَلَّاقُ الْعَلِيمُ86

నిశ్చయంగా, నీ ప్రభువు ఆయనే సర్వ సృష్టికర్త, సర్వజ్ఞుడు.
15:87జుజ్ 14 · పు. 266

وَلَقَدْ آتَيْنَاكَ سَبْعًا مِنَ الْمَثَانِي وَالْقُرْآنَ الْعَظِيمَ87

మరియు మేము నిశ్చయంగా, నీకు తరచుగా పఠింపబడే ఏడు (సూక్తులను) మరియు సర్వోత్తమ ఖుర్ఆన్ ను ప్రసాదించాము.
15:88జుజ్ 14 · పు. 266

لَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِ أَزْوَاجًا مِنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ88

వారిలో (అవిశ్వాసులలో) కొందరికి మేము ఒసంగిన ఐహిక సంపదలను నీవు కన్నెత్తి కూడా చూడకు. మరియు వారి (అవిశ్వాస) వైఖరికి బాధపడకు. మరియు విశ్వసించిన వారికి ఆశ్రయం (ఛాయ) ఇవ్వటానికి నీ రెక్కలను విప్పు.
15:89జుజ్ 14 · పు. 266

وَقُلْ إِنِّي أَنَا النَّذِيرُ الْمُبِينُ89

మరియు (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నిశ్చయంగా, నేను స్పష్టమైన హెచ్చరిక చేసే వాడను మాత్రమే!"
15:90జుజ్ 14 · పు. 266

كَمَا أَنْزَلْنَا عَلَى الْمُقْتَسِمِينَ90

ఏ విధంగానైతే మేము (గ్రంథాన్ని), విభజించే వారిపై అవతరింపజేశామో!
15:91జుజ్ 14 · పు. 267

الَّذِينَ جَعَلُوا الْقُرْآنَ عِضِينَ91

ఎవరైతే ఈ ఖుర్ఆన్ ను (తమ తిరస్కారంతో) ముక్కలు ముక్కులుగా చేశారో!
15:92జుజ్ 14 · పు. 267

فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِينَ92

నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ ప్రశ్నిస్తాము;
15:93జుజ్ 14 · పు. 267

عَمَّا كَانُوا يَعْمَلُونَ93

వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి.
15:94జుజ్ 14 · పు. 267

فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ94

కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు. మరియు అల్లాహ్ కు సాటి కల్పించే వారి (ముష్రికీన్) నుండి విముఖుడవకు.
15:95జుజ్ 14 · పు. 267

إِنَّا كَفَيْنَاكَ الْمُسْتَهْزِئِينَ95

నిశ్చయంగా, నీతో పరిహాసాలాడే వారి నుండి నిన్ను రక్షించటానికి మేమే చాలు!
15:96జుజ్ 14 · పు. 267

الَّذِينَ يَجْعَلُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ ۚ فَسَوْفَ يَعْلَمُونَ96

ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను కూడా (ఆరాధనకు) నియమించుకుంటున్నారో, వారు త్వరలోనే (సత్యాన్ని) తెలుసుకుంటారు.
15:97జుజ్ 14 · పు. 267

وَلَقَدْ نَعْلَمُ أَنَّكَ يَضِيقُ صَدْرُكَ بِمَا يَقُولُونَ97

మరియు వాస్తవానికి వారు పలికే మాటల వలన నీ హృదయానికి తప్పక కష్టం కలుగుతుందని మాకు బాగా తెలుసు.
15:98జుజ్ 14 · పు. 267

فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُنْ مِنَ السَّاجِدِينَ98

కావున నీవు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ స్తోత్రం చేస్తూ ఉండు మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరు.
15:99జుజ్ 14 · పు. 267

وَاعْبُدْ رَبَّكَ حَتَّىٰ يَأْتِيَكَ الْيَقِينُ99

మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చే వరకు, నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Sahl Yaseen - Al-Hijr · Tlawati