إِذَا السَّمَاءُ انْشَقَّتْ 1
ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ 2
మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِذَا الْأَرْضُ مُدَّتْ 3
మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ 4
మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ 5
అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَا أَيُّهَا الْإِنْسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ 6
ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ 7
అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا 8
అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَيَنْقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا 9
మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ 10
ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَسَوْفَ يَدْعُو ثُبُورًا 11
అప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَيَصْلَىٰ سَعِيرًا 12
మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا 13
వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُ ظَنَّ أَنْ لَنْ يَحُورَ 14
వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا 15
అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَا أُقْسِمُ بِالشَّفَقِ 16
కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاللَّيْلِ وَمَا وَسَقَ 17
రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالْقَمَرِ إِذَا اتَّسَقَ 18
పూర్ణచంద్రుని సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَتَرْكَبُنَّ طَبَقًا عَنْ طَبَقٍ 19
మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ 20
అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ ۩ 21
మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ 22
అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ 23
మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَبَشِّرْهُمْ بِعَذَابٍ أَلِيمٍ 24
కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు -
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ 25
విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్