Al-Qadr

سورة القدر

సూరా 97 · మక్కీ · 5 ఆయత్‌లు

97:1 · Laylat al-Qadrజుజ్ 30 · పు. 598

إِنَّا أَنْزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ1

నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో అవతరింపజేశాము.
97:2జుజ్ 30 · పు. 598

وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ2

మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు?
97:3జుజ్ 30 · పు. 598

لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِنْ أَلْفِ شَهْرٍ3

ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది.
97:4జుజ్ 30 · పు. 598

تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِمْ مِنْ كُلِّ أَمْرٍ4

ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్), తమ ప్రభువు అనుమతితో, ప్రతి వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగి వస్తారు.
97:5జుజ్ 30 · పు. 598

سَلَامٌ هِيَ حَتَّىٰ مَطْلَعِ الْفَجْرِ5

ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Muhammad Ayyub - Al-Qadr · Tlawati