وَالْفَجْرِ 1
ప్రాంతః కాలం సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَيَالٍ عَشْرٍ 2
పది రాత్రుల సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالشَّفْعِ وَالْوَتْرِ 3
సరి బేసీల సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاللَّيْلِ إِذَا يَسْرِ 4
గడచిపోయే రాత్రి సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هَلْ فِي ذَٰلِكَ قَسَمٌ لِذِي حِجْرٍ 5
వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ 6
నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِرَمَ ذَاتِ الْعِمَادِ 7
ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ الَّتِي لَمْ يُخْلَقْ مِثْلُهَا فِي الْبِلَادِ 8
వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَثَمُودَ الَّذِينَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ 9
మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَفِرْعَوْنَ ذِي الْأَوْتَادِ 10
మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ الَّذِينَ طَغَوْا فِي الْبِلَادِ 11
వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَكْثَرُوا فِيهَا الْفَسَادَ 12
మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ 13
కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ 14
వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَمَّا الْإِنْسَانُ إِذَا مَا ابْتَلَاهُ رَبُّهُ فَأَكْرَمَهُ وَنَعَّمَهُ فَيَقُولُ رَبِّي أَكْرَمَنِ 15
అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَمَّا إِذَا مَا ابْتَلَاهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُ فَيَقُولُ رَبِّي أَهَانَنِ 16
కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَلَّا ۖ بَلْ لَا تُكْرِمُونَ الْيَتِيمَ 17
అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَا تَحَاضُّونَ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ 18
మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتَأْكُلُونَ التُّرَاثَ أَكْلًا لَمًّا 19
మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَتُحِبُّونَ الْمَالَ حُبًّا جَمًّا 20
మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَلَّا إِذَا دُكَّتِ الْأَرْضُ دَكًّا دَكًّا 21
అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا 22
మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍ يَتَذَكَّرُ الْإِنْسَانُ وَأَنَّىٰ لَهُ الذِّكْرَىٰ 23
ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي 24
అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَيَوْمَئِذٍ لَا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ 25
అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ 26
మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ 27
(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَرْضِيَّةً 28
నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَادْخُلِي فِي عِبَادِي 29
నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَادْخُلِي جَنَّتِي 30
మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్