An-Naba

سورة النبأ

సూరా 78 · మక్కీ · 40 ఆయత్‌లు

78:1జుజ్ 30 · పు. 582

عَمَّ يَتَسَاءَلُونَ1

ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?
78:2జుజ్ 30 · పు. 582

عَنِ النَّبَإِ الْعَظِيمِ2

ఆ మహా వార్తను గురించేనా?
78:3జుజ్ 30 · పు. 582

الَّذِي هُمْ فِيهِ مُخْتَلِفُونَ3

దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో?
78:4జుజ్ 30 · పు. 582

كَلَّا سَيَعْلَمُونَ4

అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
78:5జుజ్ 30 · పు. 582

ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ5

ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
78:6జుజ్ 30 · పు. 582

أَلَمْ نَجْعَلِ الْأَرْضَ مِهَادًا6

ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా?
78:7జుజ్ 30 · పు. 582

وَالْجِبَالَ أَوْتَادًا7

మరియు పర్వతాలను మేకులుగా?
78:8జుజ్ 30 · పు. 582

وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا8

మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము.
78:9జుజ్ 30 · పు. 582

وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا9

మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము.
78:10జుజ్ 30 · పు. 582

وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا10

మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము.
78:11జుజ్ 30 · పు. 582

وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا11

మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.
78:12జుజ్ 30 · పు. 582

وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا12

మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము.
78:13జుజ్ 30 · పు. 582

وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا13

మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము.
78:14జుజ్ 30 · పు. 582

وَأَنْزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا14

మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.
78:15జుజ్ 30 · పు. 582

لِنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا15

దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి!
78:16జుజ్ 30 · పు. 582

وَجَنَّاتٍ أَلْفَافًا16

మరియు దట్టమైన తోటలను.
78:17జుజ్ 30 · పు. 582

إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا17

నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం.
78:18జుజ్ 30 · పు. 582

يَوْمَ يُنْفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا18

ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు.
78:19జుజ్ 30 · పు. 582

وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا19

మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి;
78:20జుజ్ 30 · పు. 582

وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا20

మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి.
78:21జుజ్ 30 · పు. 582

إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا21

నిశ్చయంగా, నరకం ఒక మాటు;
78:22జుజ్ 30 · పు. 582

لِلطَّاغِينَ مَآبًا22

ధిక్కారుల గమ్యస్థానం;
78:23జుజ్ 30 · పు. 582

لَابِثِينَ فِيهَا أَحْقَابًا23

అందులో వారు యుగాల తరబడి ఉంటారు.
78:24జుజ్ 30 · పు. 582

لَا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا24

అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు.
78:25జుజ్ 30 · పు. 582

إِلَّا حَمِيمًا وَغَسَّاقًا25

సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప!
78:26జుజ్ 30 · పు. 582

جَزَاءً وِفَاقًا26

(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!
78:27జుజ్ 30 · పు. 582

إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا27

వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు.
78:28జుజ్ 30 · పు. 582

وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا28

పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు.
78:29జుజ్ 30 · పు. 582

وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا29

మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము.
78:30జుజ్ 30 · పు. 582

فَذُوقُوا فَلَنْ نَزِيدَكُمْ إِلَّا عَذَابًا30

కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.
78:31జుజ్ 30 · పు. 583

إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا31

నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;
78:32జుజ్ 30 · పు. 583

حَدَائِقَ وَأَعْنَابًا32

ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ!
78:33జుజ్ 30 · పు. 583

وَكَوَاعِبَ أَتْرَابًا33

మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు;
78:34జుజ్ 30 · పు. 583

وَكَأْسًا دِهَاقًا34

మరియు నిండి పొర్లే (మధు) పాత్ర
78:35జుజ్ 30 · పు. 583

لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّابًا35

అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.
78:36జుజ్ 30 · పు. 583

جَزَاءً مِنْ رَبِّكَ عَطَاءً حِسَابًا36

(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.
78:37జుజ్ 30 · పు. 583

رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الرَّحْمَٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا37

భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు.
78:38జుజ్ 30 · పు. 583

يَوْمَ يَقُومُ الرُّوحُ وَالْمَلَائِكَةُ صَفًّا ۖ لَا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمَٰنُ وَقَالَ صَوَابًا38

ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు.
78:39జుజ్ 30 · పు. 583

ذَٰلِكَ الْيَوْمُ الْحَقُّ ۖ فَمَنْ شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ مَآبًا39

అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి!
78:40జుజ్ 30 · పు. 583

إِنَّا أَنْذَرْنَاكُمْ عَذَابًا قَرِيبًا يَوْمَ يَنْظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنْتُ تُرَابًا40

నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Muhammad Ayyub - An-Naba · Tlawati