حم 1
హా - మీమ్.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالْكِتَابِ الْمُبِينِ 2
స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا أَنْزَلْنَاهُ فِي لَيْلَةٍ مُبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنْذِرِينَ 3
నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము. నిశ్చయంగా, మేము (ప్రజలను) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ 4
దానిలో (ఆ రాత్రిలో), ప్రతి విషయం వివేకంతో విశదీకరించ బడుతుంది;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمْرًا مِنْ عِنْدِنَا ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ 5
మా ఆజ్ఞానుసారంగా, నిశ్చయంగా, మేము (సందేశహరులను) పంపుతూ వచ్చాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ رَحْمَةً مِنْ رَبِّكَ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ 6
నీ ప్రభువు తరఫు నుండి కారుణ్యంగా! నిశ్చయంగా, ఆయనే అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِنْ كُنْتُمْ مُوقِنِينَ 7
భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు. మీకు వాస్తవంగా నమ్మకమే ఉంటే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَا إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ 8
ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మరియు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. ఆయన మీ ప్రభువు మరియు పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ بَلْ هُمْ فِي شَكٍّ يَلْعَبُونَ 9
అసలు! వారు సందేహంలో పడి ఆటల్లో మునిగి ఉన్నారు (పరిహసిస్తున్నారు).
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَارْتَقِبْ يَوْمَ تَأْتِي السَّمَاءُ بِدُخَانٍ مُبِينٍ 10
కావున నీవు ఆకాశం నుండి స్పష్టమైన పొగ వచ్చే దినం కొరకు నిరీక్షించు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَغْشَى النَّاسَ ۖ هَٰذَا عَذَابٌ أَلِيمٌ 11
అది మానవులందరినీ క్రమ్ముకుంటుంది. అదొక బాధాకరమైన శిక్ష.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ رَبَّنَا اكْشِفْ عَنَّا الْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ 12
(అప్పుడు వారు ఇలా వేడుకుంటారు): "ఓ మా ప్రభూ! ఈ శిక్షను మా నుండి తొలగించు. నిశ్చయంగా, మేము విశ్వాసుల మవుతాము."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَنَّىٰ لَهُمُ الذِّكْرَىٰ وَقَدْ جَاءَهُمْ رَسُولٌ مُبِينٌ 13
ఇక (అంతిమ ఘడియలో) హితబోధ స్వీకరించటం వారికి ఎలా పనికి రాగలదు? వాస్తవానికి వారి వద్దకు (సత్యాన్ని) స్పష్టంగా తెలియజేసే ప్రవక్త వచ్చి ఉన్నాడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ تَوَلَّوْا عَنْهُ وَقَالُوا مُعَلَّمٌ مَجْنُونٌ 14
అప్పుడు వారు అతని నుండి మరలి పోయారు మరియు ఇలా అన్నారు: "ఇతను ఇతరుల నుండి నేర్చుకున్నాడు, ఇతనొక పిచ్చివాడు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا كَاشِفُو الْعَذَابِ قَلِيلًا ۚ إِنَّكُمْ عَائِدُونَ 15
వాస్తవానికి మేము కొంతకాలం వరకు ఈ శిక్షను తొలగిస్తే నిశ్చయంగా, మీరు చేస్తూ వచ్చిందే మళ్ళీ చేస్తారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَوْمَ نَبْطِشُ الْبَطْشَةَ الْكُبْرَىٰ إِنَّا مُنْتَقِمُونَ 16
మేము శిక్షించటం కోసం గట్టిగా పట్టుకున్న రోజు, మేము నిశ్చయంగా, ప్రతీకారం చేస్తాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ۞ وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَاءَهُمْ رَسُولٌ كَرِيمٌ 17
మరియు వాస్తవంగా, వారికి పూర్వం మేము ఫిర్ఔన్ జాతి వారిని పరీక్షకు గురి చేశాము. మరియు వారి వద్దకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చి ఉన్నాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَنْ أَدُّوا إِلَيَّ عِبَادَ اللَّهِ ۖ إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ 18
(అతను ఇలా అన్నాడు): "అల్లాహ్ దాసులను నాకు అప్పగించు. నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుణ్ణయిన సందేశహరుణ్ణి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنْ لَا تَعْلُوا عَلَى اللَّهِ ۖ إِنِّي آتِيكُمْ بِسُلْطَانٍ مُبِينٍ 19
మరియు మీరు అల్లాహ్ ముందు అహంభావాన్ని (ఔన్నత్యాన్ని) చూపకండి. నిశ్చయంగా, నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకొని వచ్చాను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُمْ أَنْ تَرْجُمُونِ 20
మరియు నిశ్చయంగా, నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు (అయిన) అల్లాహ్ యొక్క శరణు పొందాను, - మీరు నన్ను రాళ్లు రువ్వి చంపకుండా ఉండటానికి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنْ لَمْ تُؤْمِنُوا لِي فَاعْتَزِلُونِ 21
ఒకవేళ మీరు నా మాట నమ్మకపోయినా సరే! నా జోలికి మాత్రం రాకండి!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَدَعَا رَبَّهُ أَنَّ هَٰؤُلَاءِ قَوْمٌ مُجْرِمُونَ 22
చివరకు అతను తన ప్రభువున ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా, ఈ జనులు చాలా అపరాధులు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَسْرِ بِعِبَادِي لَيْلًا إِنَّكُمْ مُتَّبَعُونَ 23
(అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు): "నీవు నా దాసులను తీసుకొని రాత్రివేళ బయలు దేరు, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُنْدٌ مُغْرَقُونَ 24
మరియు సముద్రాన్ని చీల్చి నెమ్మదిగా వెళ్ళిపో. నిశ్చయంగా, ఆ సైనికులు అందులో మునిగిపోతారు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَمْ تَرَكُوا مِنْ جَنَّاتٍ وَعُيُونٍ 25
వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచి పోయారు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ 26
మరియు ఎన్నో పంటపొలాలను మరియు గొప్ప భవనాలను;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَنَعْمَةٍ كَانُوا فِيهَا فَاكِهِينَ 27
మరియు వారు అనుభవిస్తూ ఉన్న ఎన్నో సుఖసంతోషాలను కూడా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَاهَا قَوْمًا آخَرِينَ 28
ఈ విధంగా, (వారి ముగింపు జరిగింది). మరియు మేము వాటికి ఇతర జాతి వారిని వారసులుగా చేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَمَا بَكَتْ عَلَيْهِمُ السَّمَاءُ وَالْأَرْضُ وَمَا كَانُوا مُنْظَرِينَ 29
కాని, వారి కొరకు ఆకాశం గానీ, భూమి గానీ విలపించలేదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَقَدْ نَجَّيْنَا بَنِي إِسْرَائِيلَ مِنَ الْعَذَابِ الْمُهِينِ 30
మరియు వాస్తవంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని అవమానకరమైన శిక్ష నుండి విముక్తి కలిగించాము -
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مِنْ فِرْعَوْنَ ۚ إِنَّهُ كَانَ عَالِيًا مِنَ الْمُسْرِفِينَ 31
ఫిర్ఔన్ నుండి నిశ్చయంగా, అతడు మితిమీరి ప్రవర్తించేవారి, అగ్రగణ్యుడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَقَدِ اخْتَرْنَاهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى الْعَالَمِينَ 32
మరియు వాస్తవానికి మాకు తెలిసి ఉండి కూడా మేము వారిని లోకంలో (ఆ కాలపు) సర్వజనులపై ఎన్నుకున్నాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَآتَيْنَاهُمْ مِنَ الْآيَاتِ مَا فِيهِ بَلَاءٌ مُبِينٌ 33
మరియు మేము వారికి అద్భుత సూచనలను (ఆయాత్ లను) ఒసంగి ఉంటిమి. అందులో వారికి స్పష్టమైన పరీక్ష ఉండింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ هَٰؤُلَاءِ لَيَقُولُونَ 34
నిశ్చయంగా, వీరు (ఖురైషులు) ఇలా అంటున్నారు:
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنْ هِيَ إِلَّا مَوْتَتُنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنْشَرِينَ 35
"వాస్తవానికి, మాకు ఈ మొదటి మరణం మాత్రమే ఉంది, ఆ తరువాత మేము తిరిగి బ్రతికించబడము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأْتُوا بِآبَائِنَا إِنْ كُنْتُمْ صَادِقِينَ 36
మీరు సత్యవంతులే అయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురండి!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍ وَالَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ أَهْلَكْنَاهُمْ ۖ إِنَّهُمْ كَانُوا مُجْرِمِينَ 37
వారు మేలైన వారా? లేక తుబ్బఅ జాతివారు మరియు వారి కంటే పూర్వం వారా? మేము వారందరినీ నాశనం చేశాము. నిశ్చయంగా, వారందరూ అపరాధులే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ 38
మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆట (కాలక్షేపం) కొరకు సృష్టించలేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا خَلَقْنَاهُمَا إِلَّا بِالْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ 39
మేము వాటిని ఒక లక్ష్యంతోనే సృష్టించాము, కాని చాలా మందికి ఇది తెలియదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ يَوْمَ الْفَصْلِ مِيقَاتُهُمْ أَجْمَعِينَ 40
నిశ్చయంగా, తీర్పుదినం వారందరి కొరకు ఒక నిర్ణీత దినం.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَوْمَ لَا يُغْنِي مَوْلًى عَنْ مَوْلًى شَيْئًا وَلَا هُمْ يُنْصَرُونَ 41
ఆ దినమున ఏ స్నేహితుడు కూడా మరొక స్నేహితునికి ఏ మాత్రం ఉపయోగపడడు. మరియు వారికి ఎలాంటి సహాయమూ లభించదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا مَنْ رَحِمَ اللَّهُ ۚ إِنَّهُ هُوَ الْعَزِيزُ الرَّحِيمُ 42
అల్లాహ్ కరుణించిన వానికి తప్ప! నిశ్చయంగా, ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ شَجَرَتَ الزَّقُّومِ 43
నిశ్చయంగా, జఖ్ఖూమ్ వృక్షఫలం;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ طَعَامُ الْأَثِيمِ 44
పాపులకు ఆహారంగా ఇవ్వబడుతుంది;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَالْمُهْلِ يَغْلِي فِي الْبُطُونِ 45
మరిగే నూనే (సీసం) వలే, అది వారి కడుపులో మరుగుతుంది;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَغَلْيِ الْحَمِيمِ 46
సలసల కాగే నీటిలాగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ خُذُوهُ فَاعْتِلُوهُ إِلَىٰ سَوَاءِ الْجَحِيمِ 47
(ఇలా అనబడుతుంది): "ఇతనిని పట్టుకొని భగభగ మండే నరకాగ్ని మధ్యలోకి ఈడ్వండి;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ صُبُّوا فَوْقَ رَأْسِهِ مِنْ عَذَابِ الْحَمِيمِ 48
ఆ తరువాత అతని నెత్తి మీద సలసల కాగే నీటి శిక్షను పోయండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ذُقْ إِنَّكَ أَنْتَ الْعَزِيزُ الْكَرِيمُ 49
దీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ هَٰذَا مَا كُنْتُمْ بِهِ تَمْتَرُونَ 50
నిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడి వున్న విషయం!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ 51
నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فِي جَنَّاتٍ وَعُيُونٍ 52
ఉద్యానవనాలలో మరియు చెలమల మధ్య.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَلْبَسُونَ مِنْ سُنْدُسٍ وَإِسْتَبْرَقٍ مُتَقَابِلِينَ 53
వారు, మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టు వస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَذَٰلِكَ وَزَوَّجْنَاهُمْ بِحُورٍ عِينٍ 54
ఇలా ఉంటుంది వారి స్థితి! మరియు మేము వారిని అందమైన, ప్రకాశవంతమైన కళ్ళు గల వారితో (హూర్ లతో) వివాహం చేయిస్తాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَدْعُونَ فِيهَا بِكُلِّ فَاكِهَةٍ آمِنِينَ 55
వారక్కడ శాంతియుతంగా ఉంటూ అనేక రకాలైన ఫలాలను అడుగుతుంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَا يَذُوقُونَ فِيهَا الْمَوْتَ إِلَّا الْمَوْتَةَ الْأُولَىٰ ۖ وَوَقَاهُمْ عَذَابَ الْجَحِيمِ 56
వారక్కడ మరణాన్ని ఎన్నడూ రుచి చూడరు; వారి మొదటి (ఇహలోక) మరణం తప్ప! మరియు ఆయన వారిని భగభగమండే అగ్నిశిక్ష నుండి కాపాడాడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَضْلًا مِنْ رَبِّكَ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ 57
నీ ప్రభువు అనుగ్రహం వల్ల. ఇదే ఆ గొప్ప సాఫల్యం!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَإِنَّمَا يَسَّرْنَاهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ 58
అందుకే నిశ్చయంగా, మేము (ఈ ఖుర్ఆన్ ను) నీ భాషలో సులభం చేశాము. ఇలాగైనా వారు అర్థం చేసుకుంటారని (హితబోధ గ్రహిస్తారని).
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَارْتَقِبْ إِنَّهُمْ مُرْتَقِبُونَ 59
కావున, నీవు నిరీక్షించు! నిశ్చయంగా వారు కూడా నిరీక్షిస్తున్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్