Ash-Shu'ara

سورة الشعراء

సూరా 26 · మక్కీ · 227 ఆయత్‌లు

26:1జుజ్ 19 · పు. 367

طسم1

తా - సీన్ - మీమ్.
26:2జుజ్ 19 · పు. 367

تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ2

ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయతులు)
26:3జుజ్ 19 · పు. 367

لَعَلَّكَ بَاخِعٌ نَفْسَكَ أَلَّا يَكُونُوا مُؤْمِنِينَ3

(ఓ ముహమ్మద్) వారు విశ్వసించలేదనే బాధతో బహుశా నీవు నీ ప్రాణాలే కోల్పోతావేమో!
26:4జుజ్ 19 · పు. 367

إِنْ نَشَأْ نُنَزِّلْ عَلَيْهِمْ مِنَ السَّمَاءِ آيَةً فَظَلَّتْ أَعْنَاقُهُمْ لَهَا خَاضِعِينَ4

మేము కోరితే ఆకాశం నుండి వారిపై ఒక అద్భుత సంకేతాన్ని (ఆయత్ ను) అవతరింపజేసి, దానికి వారి మెడలను నమ్రతతో వంగి పోయేలా చేసేవారము.
26:5జుజ్ 19 · పు. 367

وَمَا يَأْتِيهِمْ مِنْ ذِكْرٍ مِنَ الرَّحْمَٰنِ مُحْدَثٍ إِلَّا كَانُوا عَنْهُ مُعْرِضِينَ5

మరియు వారి వద్దకు అనంత కరుణామయుడని వద్ద నుండి క్రొత్త సందేశం వచ్చినప్పుడల్లా, వారు దాని నుండి విముఖులు కాకుండా ఉండలేదు.
26:6జుజ్ 19 · పు. 367

فَقَدْ كَذَّبُوا فَسَيَأْتِيهِمْ أَنْبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ6

వాస్తవానికి, ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చిన దాని యథార్థమేమిటో వారికి తెలిసిపోతుంది.
26:7జుజ్ 19 · పు. 367

أَوَلَمْ يَرَوْا إِلَى الْأَرْضِ كَمْ أَنْبَتْنَا فِيهَا مِنْ كُلِّ زَوْجٍ كَرِيمٍ7

ఏమీ? వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవరాసుల్ని) పుట్టించామో?
26:8జుజ్ 19 · పు. 367

إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ8

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.
26:9జుజ్ 19 · పు. 367

وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ9

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
26:10జుజ్ 19 · పు. 367

وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰ أَنِ ائْتِ الْقَوْمَ الظَّالِمِينَ10

మరియు నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించిన విషయాన్ని వారికి జ్ఞాపకం చేయించు: "దుర్మార్గులైన జాతి ప్రజల వద్దకు వెళ్ళు;
26:11జుజ్ 19 · పు. 367

قَوْمَ فِرْعَوْنَ ۚ أَلَا يَتَّقُونَ11

ఫిర్ఔన్ జాతివారి వద్దకు. ఏమీ? వారికి దైవభీతి లేదా?"
26:12జుజ్ 19 · పు. 367

قَالَ رَبِّ إِنِّي أَخَافُ أَنْ يُكَذِّبُونِ12

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను.
26:13జుజ్ 19 · పు. 367

وَيَضِيقُ صَدْرِي وَلَا يَنْطَلِقُ لِسَانِي فَأَرْسِلْ إِلَىٰ هَارُونَ13

నా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది, కావున నీవు హారూన్ వద్దకు కూడా (వహీ) పంపు.
26:14జుజ్ 19 · పు. 367

وَلَهُمْ عَلَيَّ ذَنْبٌ فَأَخَافُ أَنْ يَقْتُلُونِ14

మరియు వారి దగ్గర నా మీద ఒక నేరం మోపబడి ఉన్నది, కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను."
26:15జుజ్ 19 · పు. 367

قَالَ كَلَّا ۖ فَاذْهَبَا بِآيَاتِنَا ۖ إِنَّا مَعَكُمْ مُسْتَمِعُونَ15

(అల్లాహ్) సెలవిచ్చాడు: "అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతో పాటు ఉండి సర్వమూ వింటూ ఉంటాము.
26:16జుజ్ 19 · పు. 367

فَأْتِيَا فِرْعَوْنَ فَقُولَا إِنَّا رَسُولُ رَبِّ الْعَالَمِينَ16

కావున మీరిద్దరూ ఫిరఔన్ వద్దకు వెళ్ళి అనండి: "నిశ్చయంగా, మేము సర్వలోకాల పోషకుని సందేశహరులము.
26:17జుజ్ 19 · పు. 367

أَنْ أَرْسِلْ مَعَنَا بَنِي إِسْرَائِيلَ17

కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు."
26:18జుజ్ 19 · పు. 367

قَالَ أَلَمْ نُرَبِّكَ فِينَا وَلِيدًا وَلَبِثْتَ فِينَا مِنْ عُمُرِكَ سِنِينَ18

(ఫిర్ఔన్) అన్నాడు: "ఏమీ? మేము నిన్ను బాల్యంలో మాతో పాటు పోషించలేదా? మరియు నీవు నీ వయస్సులోని అనేక సంవత్సరాలు మాతో పాటు గడిపావు కదా!
26:19జుజ్ 19 · పు. 367

وَفَعَلْتَ فَعْلَتَكَ الَّتِي فَعَلْتَ وَأَنْتَ مِنَ الْكَافِرِينَ19

అయినా నీవు హీనమైన ఆ పని చేశావు, కావున నీవు కృతఘ్నులలోని వాడవు!"
26:20జుజ్ 19 · పు. 368

قَالَ فَعَلْتُهَا إِذًا وَأَنَا مِنَ الضَّالِّينَ20

(మూసా) అన్నాడు: "నేను పొరపాటుగా ఆ పని చేశాను!
26:21జుజ్ 19 · పు. 368

فَفَرَرْتُ مِنْكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِي رَبِّي حُكْمًا وَجَعَلَنِي مِنَ الْمُرْسَلِينَ21

ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు.
26:22జుజ్ 19 · పు. 368

وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَيَّ أَنْ عَبَّدْتَ بَنِي إِسْرَائِيلَ22

ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా!"
26:23జుజ్ 19 · పు. 368

قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ الْعَالَمِينَ23

(ఫిర్ఆన్) అడిగాడు: "అయితే ఈ సర్వలోకాల ప్రభువు అంటే ఏమిటి?"
26:24జుజ్ 19 · పు. 368

قَالَ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِنْ كُنْتُمْ مُوقِنِينَ24

(మూసా) జవాబిచ్చాడు: "మీరు నమ్మేవారే అయితే! ఆయనే ఆకాశాలకూ మరియు భూమికీ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు!"
26:25జుజ్ 19 · పు. 368

قَالَ لِمَنْ حَوْلَهُ أَلَا تَسْتَمِعُونَ25

(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న వారితో: "ఏమీ? మీరు వింటున్నారా?" అని ప్రశ్నించాడు.
26:26జుజ్ 19 · పు. 368

قَالَ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ26

(మూసా) అన్నాడు: "ఆయన (అల్లాహ్) మీ ప్రభువు మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కూడానూ!"
26:27జుజ్ 19 · పు. 368

قَالَ إِنَّ رَسُولَكُمُ الَّذِي أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌ27

(ఫిర్ఔన్) అన్నాడు: "మీ వద్దకు పంపబడిన మీ ఈ సందేశహరుడు నిశ్చయంగా పిచ్చివాడే!"
26:28జుజ్ 19 · పు. 368

قَالَ رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَمَا بَيْنَهُمَا ۖ إِنْ كُنْتُمْ تَعْقِلُونَ28

(మూసా) అన్నాడు: "మీరు అర్థం చేసుకోగలిగితే! ఆయనే తూర్పూ పడమరలకూ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు."
26:29జుజ్ 19 · పు. 368

قَالَ لَئِنِ اتَّخَذْتَ إِلَٰهًا غَيْرِي لَأَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُونِينَ29

(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకుంటే నేను నిన్ను చెరసాలలో ఉన్నవారితో చేర్చుతాను."
26:30జుజ్ 19 · పు. 368

قَالَ أَوَلَوْ جِئْتُكَ بِشَيْءٍ مُبِينٍ30

(మూసా) అన్నాడు: "ఏమీ? నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని (సత్యాన్ని) తీసుకువచ్చిన తరువాత కూడానా?"
26:31జుజ్ 19 · పు. 368

قَالَ فَأْتِ بِهِ إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ31

(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు సత్యవంతుడవే అయితే దానిని (ఆ అద్భుత సూచనను) చూపు!"
26:32జుజ్ 19 · పు. 368

فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعْبَانٌ مُبِينٌ32

అప్పుడు (మూసా) తన చేతి కర్రను పడవేయగానే, అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది.
26:33జుజ్ 19 · పు. 368

وَنَزَعَ يَدَهُ فَإِذَا هِيَ بَيْضَاءُ لِلنَّاظِرِينَ33

తరువాత అతను (మూసా) తన చేతిని (చంక నుండి) వెలుపలికి తీయగానే, అది చూసేవారి యెదుట తెల్లగా ప్రకాశించసాగింది!
26:34జుజ్ 19 · పు. 368

قَالَ لِلْمَلَإِ حَوْلَهُ إِنَّ هَٰذَا لَسَاحِرٌ عَلِيمٌ34

(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న నాయకులతో అన్నాడు: "నిశ్చయంగా, ఇతనొక నేర్పు గల మాంత్రికుడు.
26:35జుజ్ 19 · పు. 368

يُرِيدُ أَنْ يُخْرِجَكُمْ مِنْ أَرْضِكُمْ بِسِحْرِهِ فَمَاذَا تَأْمُرُونَ35

ఇతను తన మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి తరుమ గోరుతున్నాడు, అయితే మీ సలహా ఏమిటి?"
26:36జుజ్ 19 · పు. 368

قَالُوا أَرْجِهْ وَأَخَاهُ وَابْعَثْ فِي الْمَدَائِنِ حَاشِرِينَ36

వారన్నారు: "అతనిని మరియు అతని సోదరుణ్ణి ఆపి ఉంచు మరియు (మంత్రగాళ్ళను) సమావేశ పరచటానికి అన్ని నగరాలకు వార్తాహరులను పంపు;
26:37జుజ్ 19 · పు. 368

يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍ37

వారు నీ వద్దకు నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి తెస్తారు."
26:38జుజ్ 19 · పు. 368

فَجُمِعَ السَّحَرَةُ لِمِيقَاتِ يَوْمٍ مَعْلُومٍ38

ఈ విధంగా ఒక నియమిత రోజున ఒక నియమిత ప్రదేశంలో మాంత్రికులంతా సమావేశ పరచబడ్డారు.
26:39జుజ్ 19 · పు. 368

وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنْتُمْ مُجْتَمِعُونَ39

మరియు ప్రజలతో ఇలా ప్రశ్నించడం జరిగింది: "ఏమీ? మీరంతా సమావేశమయ్యారా?
26:40జుజ్ 19 · పు. 369

لَعَلَّنَا نَتَّبِعُ السَّحَرَةَ إِنْ كَانُوا هُمُ الْغَالِبِينَ40

ఒకవేళ మాంత్రికులు గెలుపొందితే మనమంతా వారిని అనుసరించాలి కదా!"
26:41జుజ్ 19 · పు. 369

فَلَمَّا جَاءَ السَّحَرَةُ قَالُوا لِفِرْعَوْنَ أَئِنَّ لَنَا لَأَجْرًا إِنْ كُنَّا نَحْنُ الْغَالِبِينَ41

మాంత్రికులు వచ్చిన తరువాత ఫిర్ఔన్ తో అన్నారు: "మేము గెలుపొందితే నిశ్చయంగా మాకు బహుమాన ముంది కదా?"
26:42జుజ్ 19 · పు. 369

قَالَ نَعَمْ وَإِنَّكُمْ إِذًا لَمِنَ الْمُقَرَّبِينَ42

(ఫిర్ఔన్) అన్నాడు: "అవును! నిశ్చయంగా, అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరుతారు!"
26:43జుజ్ 19 · పు. 369

قَالَ لَهُمْ مُوسَىٰ أَلْقُوا مَا أَنْتُمْ مُلْقُونَ43

మూసా వారితో అన్నాడు: "మీరు విసర దలుచుకున్న దానిని విసరండి!"
26:44జుజ్ 19 · పు. 369

فَأَلْقَوْا حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوا بِعِزَّةِ فِرْعَوْنَ إِنَّا لَنَحْنُ الْغَالِبُونَ44

అప్పుడు వారు తమ త్రాళ్ళను మరియు తమ కర్రలను విసిరి ఇలా అన్నారు: "ఫిర్ఔన్ శక్తి సాక్షిగా! నిశ్చయంగా మేమే విజయం పొందుతాము."
26:45జుజ్ 19 · పు. 369

فَأَلْقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ45

ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగి వేసింది.
26:46జుజ్ 19 · పు. 369

فَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ46

అప్పుడు ఆ మాంత్రికులు సజ్దాలో పడ్డారు.
26:47జుజ్ 19 · పు. 369

قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ47

వారన్నారు: "మేము సర్వలోకాల ప్రభువును విశ్వసిస్తున్నాము,
26:48జుజ్ 19 · పు. 369

رَبِّ مُوسَىٰ وَهَارُونَ48

మూసా మరియు హారూన్ ల ప్రభువును."
26:49జుజ్ 19 · పు. 369

قَالَ آمَنْتُمْ لَهُ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّهُ لَكَبِيرُكُمُ الَّذِي عَلَّمَكُمُ السِّحْرَ فَلَسَوْفَ تَعْلَمُونَ ۚ لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُمْ مِنْ خِلَافٍ وَلَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ49

(ఫిర్ఔన్) అన్నాడు: "నేను మీకు అనుమతి ఇవ్వక ముందే మీరు ఇతనిని విశ్వసించారా? నిశ్చయంగా, ఇతడే మీ గురువు, మీకు జాలవిద్యను నేర్పినవాడు. సరే! ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ వ్యతిరేక (ప్రతిపక్ష) దిశల చేతులను మరియు కాళ్ళను నరికిస్తాను మరియు మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను."
26:50జుజ్ 19 · పు. 369

قَالُوا لَا ضَيْرَ ۖ إِنَّا إِلَىٰ رَبِّنَا مُنْقَلِبُونَ50

(మాంత్రికులు) అన్నారు: "బాధ లేదు! నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది.
26:51జుజ్ 19 · పు. 369

إِنَّا نَطْمَعُ أَنْ يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَايَانَا أَنْ كُنَّا أَوَّلَ الْمُؤْمِنِينَ51

నిశ్చయంగా, మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే వాస్తవానికి అందరి కంటే ముందుగా విశ్వసించిన వారం మేమే!"
26:52జుజ్ 19 · పు. 369

۞ وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَسْرِ بِعِبَادِي إِنَّكُمْ مُتَّبَعُونَ52

మరియు మేము మూసాకు ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "నీవు నా దాసులను రాత్రివేళ తీసుకొని వెళ్ళిపో నిశ్చయంగా, మీరు వెంబడించబడతారు."
26:53జుజ్ 19 · పు. 369

فَأَرْسَلَ فِرْعَوْنُ فِي الْمَدَائِنِ حَاشِرِينَ53

తరువాత ఫిర్ఔన్ అన్ని పట్టణాలకు వార్తాహరులను పంపాడు.
26:54జుజ్ 19 · పు. 369

إِنَّ هَٰؤُلَاءِ لَشِرْذِمَةٌ قَلِيلُونَ54

(ఇలా ప్రకటన చేయించాడు): "వాస్తవానికి వీరు (ఈ ఇస్రాయీల్ సంతతి వారు) ఒక చిన్న తెగవారు మాత్రమే.
26:55జుజ్ 19 · పు. 369

وَإِنَّهُمْ لَنَا لَغَائِظُونَ55

మరియు నిశ్చయంగా, వారు మాకు చాలా కోపం తెప్పించారు;
26:56జుజ్ 19 · పు. 369

وَإِنَّا لَجَمِيعٌ حَاذِرُونَ56

మరియు నిశ్చయంగా, మనం ఐకమత్యంతో ఉండి జాగరూకత చూపేవారము."
26:57జుజ్ 19 · పు. 369

فَأَخْرَجْنَاهُمْ مِنْ جَنَّاتٍ وَعُيُونٍ57

కావున మేము వారిని, తోటల నుండి మరియు చెలమల నుండి వెళ్ళగొట్టాము;
26:58జుజ్ 19 · పు. 369

وَكُنُوزٍ وَمَقَامٍ كَرِيمٍ58

మరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా.
26:59జుజ్ 19 · పు. 369

كَذَٰلِكَ وَأَوْرَثْنَاهَا بَنِي إِسْرَائِيلَ59

ఈ విధంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని, వాటికి వారసులుగా చేశాము.
26:60జుజ్ 19 · పు. 369

فَأَتْبَعُوهُمْ مُشْرِقِينَ60

అప్పుడు (ఫిర్ఔన్ జాతి) వారు సూర్యోదయ కాలమున (ఇస్రాయీల్ సంతతి) వారిని వెంబడించారు.
26:61జుజ్ 19 · పు. 370

فَلَمَّا تَرَاءَى الْجَمْعَانِ قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ61

ఆ ఇరుపక్షాల వారు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు, మూసా అనుచరులు అన్నారు: "నిశ్చయంగా మేము చిక్కి పోయాము!"
26:62జుజ్ 19 · పు. 370

قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ62

(మూసా అన్నాడు): "అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)."
26:63జుజ్ 19 · పు. 370

فَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنِ اضْرِبْ بِعَصَاكَ الْبَحْرَ ۖ فَانْفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِيمِ63

అప్పుడు మేము మూసాకు: "నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది.
26:64జుజ్ 19 · పు. 370

وَأَزْلَفْنَا ثَمَّ الْآخَرِينَ64

మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింప జేశాము.
26:65జుజ్ 19 · పు. 370

وَأَنْجَيْنَا مُوسَىٰ وَمَنْ مَعَهُ أَجْمَعِينَ65

మరియు మూసాను మరియు అతనితో పాటు ఉన్నవారిని అందరినీ రక్షించాము.
26:66జుజ్ 19 · పు. 370

ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ66

ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము.
26:67జుజ్ 19 · పు. 370

إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ67

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
26:68జుజ్ 19 · పు. 370

وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ68

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిసంపన్నుడు, అపార కరుణా ప్రదాత.
26:69జుజ్ 19 · పు. 370

وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَاهِيمَ69

ఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు.
26:70జుజ్ 19 · పు. 370

إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَا تَعْبُدُونَ70

అతను తన తండ్రితో మరియు తన జాతి వారితో: "మీరెవరిని ఆరాధిస్తున్నారు?" అని అడిగినపుడు;
26:71జుజ్ 19 · పు. 370

قَالُوا نَعْبُدُ أَصْنَامًا فَنَظَلُّ لَهَا عَاكِفِينَ71

వారన్నారు: "మేము విగ్రహాలను ఆరాధిస్తున్నాము మరియు మేము వాటికే ఎల్లప్పుడు భక్తులమై ఉంటాము."
26:72జుజ్ 19 · పు. 370

قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ72

(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా?
26:73జుజ్ 19 · పు. 370

أَوْ يَنْفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ73

లేదా, మీకేమైనా మేలు చేయగలవా? లేదా హాని చేయగలవా?"
26:74జుజ్ 19 · పు. 370

قَالُوا بَلْ وَجَدْنَا آبَاءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ74

వారన్నారు: "అలా కాదు! మేము మా తండ్రితాతలను ఇలా చేస్తూ ఉండగా చూశాము."
26:75జుజ్ 19 · పు. 370

قَالَ أَفَرَأَيْتُمْ مَا كُنْتُمْ تَعْبُدُونَ75

అతను అన్నాడు: "ఏమీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరెవరిని ఆరాధిస్తున్నారో?
26:76జుజ్ 19 · పు. 370

أَنْتُمْ وَآبَاؤُكُمُ الْأَقْدَمُونَ76

మీరు గానీ మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గానీ (ఆలోచించారా)?
26:77జుజ్ 19 · పు. 370

فَإِنَّهُمْ عَدُوٌّ لِي إِلَّا رَبَّ الْعَالَمِينَ77

ఎందుకంటే! నిశ్చయంగా, ఇవన్నీ నా శత్రువులే! కేవలం ఆ సర్వలోకాల ప్రభువు తప్ప!
26:78జుజ్ 19 · పు. 370

الَّذِي خَلَقَنِي فَهُوَ يَهْدِينِ78

ఆయనే నన్ను సృష్టించాడు. కాబట్టి ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు.
26:79జుజ్ 19 · పు. 370

وَالَّذِي هُوَ يُطْعِمُنِي وَيَسْقِينِ79

ఆయనే నాకు తినిపించేవాడు మరియు త్రాగించేవాడు.
26:80 · When I am ill, it is He who heals meజుజ్ 19 · పు. 370

وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ80

మరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే, ఆయనే నాకు స్వస్థత నిచ్చేవాడు.
26:81జుజ్ 19 · పు. 370

وَالَّذِي يُمِيتُنِي ثُمَّ يُحْيِينِ81

మరియు ఆయనే నన్ను మరణింపజేసేవాడు, తరువాత మళ్ళీ బ్రతికింపజేసేవాడు.
26:82జుజ్ 19 · పు. 370

وَالَّذِي أَطْمَعُ أَنْ يَغْفِرَ لِي خَطِيئَتِي يَوْمَ الدِّينِ82

మరియు ఆయనే తీర్పుదినమున నా తప్పులను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాను.
26:83జుజ్ 19 · పు. 370

رَبِّ هَبْ لِي حُكْمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ83

మరియు ఓ నా ఫ్రభూ! నాకు వివేకాన్ని ప్రసాదించు మరియు నన్ను సద్వర్తనులలో కలుపు.
26:84జుజ్ 19 · పు. 371

وَاجْعَلْ لِي لِسَانَ صِدْقٍ فِي الْآخِرِينَ84

మరియు తరువాత వచ్చే తరాల వారిలో నాకు మంచి పేరును ప్రసాదించు.
26:85జుజ్ 19 · పు. 371

وَاجْعَلْنِي مِنْ وَرَثَةِ جَنَّةِ النَّعِيمِ85

మరియు సర్వసుఖాల స్వర్గానికి వారసులయ్యేవారిలో నన్ను చేర్చు.
26:86జుజ్ 19 · పు. 371

وَاغْفِرْ لِأَبِي إِنَّهُ كَانَ مِنَ الضَّالِّينَ86

మరియు నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టులలోని వాడే!
26:87జుజ్ 19 · పు. 371

وَلَا تُخْزِنِي يَوْمَ يُبْعَثُونَ87

మరియు అందరూ తిరిగి బ్రతికింపబడే రోజు నన్ను అవమానం పాల చేయకు.
26:88జుజ్ 19 · పు. 371

يَوْمَ لَا يَنْفَعُ مَالٌ وَلَا بَنُونَ88

ఏ రోజునైతే ధనసంపత్తులు గానీ, సంతానం గానీ పనికిరావో!
26:89జుజ్ 19 · పు. 371

إِلَّا مَنْ أَتَى اللَّهَ بِقَلْبٍ سَلِيمٍ89

కేవలం నిర్మలమైన హృదయంతో అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు తప్ప!"
26:90జుజ్ 19 · పు. 371

وَأُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِينَ90

మరియు (ఆ రోజు) స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకు రాబడుతుంది.
26:91జుజ్ 19 · పు. 371

وَبُرِّزَتِ الْجَحِيمُ لِلْغَاوِينَ91

మరియు నరకం మార్గం తప్పిన వారి ముందు పెట్టబడుతుంది.
26:92జుజ్ 19 · పు. 371

وَقِيلَ لَهُمْ أَيْنَ مَا كُنْتُمْ تَعْبُدُونَ92

మరియు వారితో అనబడుతుంది: "మీరు ఆరాధించేవారు (ఆ దైవాలు) ఇప్పుడు ఎక్కడున్నారు?
26:93జుజ్ 19 · పు. 371

مِنْ دُونِ اللَّهِ هَلْ يَنْصُرُونَكُمْ أَوْ يَنْتَصِرُونَ93

అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా?"
26:94జుజ్ 19 · పు. 371

فَكُبْكِبُوا فِيهَا هُمْ وَالْغَاوُونَ94

అప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు.
26:95జుజ్ 19 · పు. 371

وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ95

మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ.
26:96జుజ్ 19 · పు. 371

قَالُوا وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ96

వారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు:
26:97జుజ్ 19 · పు. 371

تَاللَّهِ إِنْ كُنَّا لَفِي ضَلَالٍ مُبِينٍ97

"అల్లాహ్ సాక్షిగా! మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము.
26:98జుజ్ 19 · పు. 371

إِذْ نُسَوِّيكُمْ بِرَبِّ الْعَالَمِينَ98

ఎప్పుడైతే మేము మిమ్మల్ని సర్వలోకాల ప్రభువుతో సమానులుగా చేశామో!
26:99జుజ్ 19 · పు. 371

وَمَا أَضَلَّنَا إِلَّا الْمُجْرِمُونَ99

మరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే.
26:100జుజ్ 19 · పు. 371

فَمَا لَنَا مِنْ شَافِعِينَ100

మాకిప్పుడు సిఫారసు చేసేవారు ఎవ్వరూ లేరు.
26:101జుజ్ 19 · పు. 371

وَلَا صَدِيقٍ حَمِيمٍ101

మరియు ఏ ప్రాణ స్నేహితుడు కూడా లేడు.
26:102జుజ్ 19 · పు. 371

فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ102

ఒకవేళ మళ్ళీ మరలిపోయే అవకాశం మాకు దొరికి ఉంటే, మేము తప్పకుండా విశ్వసించిన వారిలో చేరిపోతాము!"
26:103జుజ్ 19 · పు. 371

إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ103

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
26:104జుజ్ 19 · పు. 371

وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ104

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
26:105జుజ్ 19 · పు. 371

كَذَّبَتْ قَوْمُ نُوحٍ الْمُرْسَلِينَ105

నూహ్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
26:106జుజ్ 19 · పు. 371

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ106

వారి సహోదరుడు నూహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
26:107జుజ్ 19 · పు. 371

إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ107

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
26:108జుజ్ 19 · పు. 371

فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ108

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
26:109జుజ్ 19 · పు. 371

وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ109

నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
26:110జుజ్ 19 · పు. 371

فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ110

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
26:111జుజ్ 19 · పు. 371

۞ قَالُوا أَنُؤْمِنُ لَكَ وَاتَّبَعَكَ الْأَرْذَلُونَ111

వారన్నారు: "ఏమీ? మేము నిన్ను విశ్వసించాలా? నిన్ను కేవలం అధములైన వారే కదా అనుసరిస్తున్నది?"
26:112జుజ్ 19 · పు. 372

قَالَ وَمَا عِلْمِي بِمَا كَانُوا يَعْمَلُونَ112

(నూహ్) అన్నాడు: "వారేమి (పనులు) చేస్తూ ఉండేవారో నాకేం తెలుసు?
26:113జుజ్ 19 · పు. 372

إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّي ۖ لَوْ تَشْعُرُونَ113

వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది.
26:114జుజ్ 19 · పు. 372

وَمَا أَنَا بِطَارِدِ الْمُؤْمِنِينَ114

మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించే వాడను కాను.
26:115జుజ్ 19 · పు. 372

إِنْ أَنَا إِلَّا نَذِيرٌ مُبِينٌ115

నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!"
26:116జుజ్ 19 · పు. 372

قَالُوا لَئِنْ لَمْ تَنْتَهِ يَا نُوحُ لَتَكُونَنَّ مِنَ الْمَرْجُومِينَ116

వారన్నారు: "ఓ నూహ్! నీవు దీనిని మానుకోకపోతే, నీవు తప్పక రాళ్ళు రువ్వి చంపబడతావు."
26:117జుజ్ 19 · పు. 372

قَالَ رَبِّ إِنَّ قَوْمِي كَذَّبُونِ117

(నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నా జాతి ప్రజలు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తున్నారు.
26:118జుజ్ 19 · పు. 372

فَافْتَحْ بَيْنِي وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِي وَمَنْ مَعِيَ مِنَ الْمُؤْمِنِينَ118

కావున నీవే నాకూ మరియు వారికీ మధ్య తీర్పు చేయి. మరియు నన్నూ మరియు నాతో పాటు ఉన్న విశ్వాసులనూ కాపాడు."
26:119జుజ్ 19 · పు. 372

فَأَنْجَيْنَاهُ وَمَنْ مَعَهُ فِي الْفُلْكِ الْمَشْحُونِ119

ఆ పిదప మేము అతనిని మరియు అతనితో పాట నిండునావలో ఎక్కి ఉన్న వారినందరినీ కాపాడాము.
26:120జుజ్ 19 · పు. 372

ثُمَّ أَغْرَقْنَا بَعْدُ الْبَاقِينَ120

ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము.
26:121జుజ్ 19 · పు. 372

إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ121

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.
26:122జుజ్ 19 · పు. 372

وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ122

నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
26:123జుజ్ 19 · పు. 372

كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ123

ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
26:124జుజ్ 19 · పు. 372

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ124

వారి సహోదరుడు హూద్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
26:125జుజ్ 19 · పు. 372

إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ125

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
26:126జుజ్ 19 · పు. 372

فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ126

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
26:127జుజ్ 19 · పు. 372

وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ127

నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
26:128జుజ్ 19 · పు. 372

أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ128

ఏమీ? మీరు కేవలం ఆడంబరానికి ప్రతి ఎత్తైన స్థలం మీద ఒక స్మారకాన్ని నిర్మిస్తారా?
26:129జుజ్ 19 · పు. 372

وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ129

మరియు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారన్నట్లు పెద్దపెద్ద కోటలు కడతారా?
26:130జుజ్ 19 · పు. 372

وَإِذَا بَطَشْتُمْ بَطَشْتُمْ جَبَّارِينَ130

మరియు మీరు ఎవరినైనా పట్టుకుంటే, అతి క్రూరులై పట్టుకుంటారా?
26:131జుజ్ 19 · పు. 372

فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ131

ఇకనైన మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
26:132జుజ్ 19 · పు. 372

وَاتَّقُوا الَّذِي أَمَدَّكُمْ بِمَا تَعْلَمُونَ132

మరియు మీకు తెలిసివున్న (మంచి) వస్తువులను, మీకు విస్తారంగా ఇచ్చిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి.
26:133జుజ్ 19 · పు. 372

أَمَدَّكُمْ بِأَنْعَامٍ وَبَنِينَ133

ఆయన విస్తారంగా మీకు పశువులను మరియు సంతానాన్ని అనుగ్రహించాడు.
26:134జుజ్ 19 · పు. 372

وَجَنَّاتٍ وَعُيُونٍ134

మరియు తోటలను మరియు చెలమలను.
26:135జుజ్ 19 · పు. 372

إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ135

నిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను!"
26:136జుజ్ 19 · పు. 372

قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُنْ مِنَ الْوَاعِظِينَ136

వారన్నారు: "నీవు ఉపదేశించినా, ఉపదేశించక పోయినా మాకు అంతా సమానమే!
26:137జుజ్ 19 · పు. 373

إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ137

ఇది మా పూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే!
26:138జుజ్ 19 · పు. 373

وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ138

మరియు మాకు ఎలాంటి శిక్ష విధించబడదు."
26:139జుజ్ 19 · పు. 373

فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ139

ఈ విధంగా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
26:140జుజ్ 19 · పు. 373

وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ140

నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
26:141జుజ్ 19 · పు. 373

كَذَّبَتْ ثَمُودُ الْمُرْسَلِينَ141

సమూద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
26:142జుజ్ 19 · పు. 373

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَالِحٌ أَلَا تَتَّقُونَ142

వారి సహోదరుడు సాలిహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
26:143జుజ్ 19 · పు. 373

إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ143

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
26:144జుజ్ 19 · పు. 373

فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ144

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
26:145జుజ్ 19 · పు. 373

وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ145

నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
26:146జుజ్ 19 · పు. 373

أَتُتْرَكُونَ فِي مَا هَاهُنَا آمِنِينَ146

ఏమీ? మీరిప్పుడు ఇక్కడ ఉన్న స్థితిలోనే సుఖశాంతులలో ఎల్లప్పుడూ వదలి వేయబడతారని అనుకుంటున్నారా?
26:147జుజ్ 19 · పు. 373

فِي جَنَّاتٍ وَعُيُونٍ147

తోటలలో మరియు చెలమలలో!
26:148జుజ్ 19 · పు. 373

وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ148

మరియు ఈ పొలాలలో, మాగిన పండ్లగుత్తులు గల ఖర్జూరపు చెట్ల మధ్య;
26:149జుజ్ 19 · పు. 373

وَتَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا فَارِهِينَ149

మరియు మీరు కొండలను తొలిచి ఎంతో నేర్పుతో గృహాలను నిర్మిస్తూ ఉంటారనీ!
26:150జుజ్ 19 · పు. 373

فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ150

అలా కాదు, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
26:151జుజ్ 19 · పు. 373

وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ151

మరియు మితిమీరి ప్రవర్తించే వారి ఆజ్ఞలను అనుసరించకండి.
26:152జుజ్ 19 · పు. 373

الَّذِينَ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ152

ఎవరైతే భూమిలో కల్లోలం రేకెత్తిస్తున్నారో మరియు ఎన్నడూ సంస్కరణను చేపట్టరో!"
26:153జుజ్ 19 · పు. 373

قَالُوا إِنَّمَا أَنْتَ مِنَ الْمُسَحَّرِينَ153

వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు!
26:154జుజ్ 19 · పు. 373

مَا أَنْتَ إِلَّا بَشَرٌ مِثْلُنَا فَأْتِ بِآيَةٍ إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ154

నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! కావున నీవు సత్యవంతుడవే అయితే, ఏదైనా అద్భుత సూచన తీసుకురా!"
26:155జుజ్ 19 · పు. 373

قَالَ هَٰذِهِ نَاقَةٌ لَهَا شِرْبٌ وَلَكُمْ شِرْبُ يَوْمٍ مَعْلُومٍ155

(సాలిహ్) అన్నాడు: "ఇదిగో ఈ ఆడ ఒంటె. ఇది నీరు త్రాగే (దినం) మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణయించబడ్డాయి.
26:156జుజ్ 19 · పు. 373

وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيمٍ156

దీనికి హాని కలిగించకండి. అలా చేస్తే ఒక మహా దినపు శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది."
26:157జుజ్ 19 · పు. 373

فَعَقَرُوهَا فَأَصْبَحُوا نَادِمِينَ157

కాని వారు దాని వెనుక కాలి మోకాలి పెద్ద నరమును కోసి చంపారు, ఆ తరువాత వారు పశ్చాత్తాప పడతూ ఉండిపోయారు.
26:158జుజ్ 19 · పు. 373

فَأَخَذَهُمُ الْعَذَابُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ158

కావున, వారిని శిక్ష పట్టుకుంది. నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
26:159జుజ్ 19 · పు. 373

وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ159

నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
26:160జుజ్ 19 · పు. 374

كَذَّبَتْ قَوْمُ لُوطٍ الْمُرْسَلِينَ160

లూత్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
26:161జుజ్ 19 · పు. 374

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ161

వారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
26:162జుజ్ 19 · పు. 374

إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ162

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
26:163జుజ్ 19 · పు. 374

فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ163

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
26:164జుజ్ 19 · పు. 374

وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ164

నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
26:165జుజ్ 19 · పు. 374

أَتَأْتُونَ الذُّكْرَانَ مِنَ الْعَالَمِينَ165

(ప్రకృతికి విరుద్ధంగా) సర్వప్రాణులలో కెల్లా మీరే పురుషుల వద్దకు పోతారేమిటీ?
26:166జుజ్ 19 · పు. 374

وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُمْ مِنْ أَزْوَاجِكُمْ ۚ بَلْ أَنْتُمْ قَوْمٌ عَادُونَ166

మీ ప్రభువు, మీ కొరకు సహవాసులు (అజ్వాజ్) గా పుట్టించిన వారిని విడిచి పెడుతున్నారేమిటి? అలా కాదు, మీరు హద్దు మీరి ప్రవర్తించే జాతివారు!"
26:167జుజ్ 19 · పు. 374

قَالُوا لَئِنْ لَمْ تَنْتَهِ يَا لُوطُ لَتَكُونَنَّ مِنَ الْمُخْرَجِينَ167

(దానికి) వారన్నారు: "ఓ లూత్! ఇక నీవు మానుకోక పోతే నీవు దేశం నుండి బహిష్కరించబడిన వారిలో చేరుతావు!"
26:168జుజ్ 19 · పు. 374

قَالَ إِنِّي لِعَمَلِكُمْ مِنَ الْقَالِينَ168

(లూత్) అన్నాడు: "నిశ్చయంగా మీ ఈ చేష్టను అసహ్యించుకునే వారిలో నేనూ ఉన్నాను."
26:169జుజ్ 19 · పు. 374

رَبِّ نَجِّنِي وَأَهْلِي مِمَّا يَعْمَلُونَ169

(ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా కుటుంబం వారినీ వీరి చేష్ట నుండి కాపాడు."
26:170జుజ్ 19 · పు. 374

فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ170

కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరినీ కాపాడాము -
26:171జుజ్ 19 · పు. 374

إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ171

వెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప -
26:172జుజ్ 19 · పు. 374

ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ172

ఆ తరువాత, మిగతా వారిని నిర్మూలించాము.
26:173జుజ్ 19 · పు. 374

وَأَمْطَرْنَا عَلَيْهِمْ مَطَرًا ۖ فَسَاءَ مَطَرُ الْمُنْذَرِينَ173

వారిపై ఒక వర్షాన్ని కురిపించాము. అది (ముందు) హెచ్చరించబడిన వారిపై (కురిపించబడ్డ) అతి భయంకరమైన వర్షం.
26:174జుజ్ 19 · పు. 374

إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ174

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.
26:175జుజ్ 19 · పు. 374

وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ175

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
26:176జుజ్ 19 · పు. 374

كَذَّبَ أَصْحَابُ الْأَيْكَةِ الْمُرْسَلِينَ176

వన (అయ్ కహ్) వాసులు సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించారు.
26:177జుజ్ 19 · పు. 374

إِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ أَلَا تَتَّقُونَ177

షుఐబ్ వారితో ఇలా అన్నాడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
26:178జుజ్ 19 · పు. 374

إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ178

నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
26:179జుజ్ 19 · పు. 374

فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ179

కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
26:180జుజ్ 19 · పు. 374

وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ180

నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
26:181జుజ్ 19 · పు. 374

۞ أَوْفُوا الْكَيْلَ وَلَا تَكُونُوا مِنَ الْمُخْسِرِينَ181

మీరు (ఇచ్చినపుడు) సరిగ్గా కొలిచి ఇవ్వండి. నష్టపరిచే వారిలో చేరకండి!
26:182జుజ్ 19 · పు. 374

وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ182

త్రాసుతో సరిసమానంగా తూచండి.
26:183జుజ్ 19 · పు. 374

وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ183

ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ దౌర్జన్యపరులుగా ప్రవర్తించకండి.
26:184జుజ్ 19 · పు. 375

وَاتَّقُوا الَّذِي خَلَقَكُمْ وَالْجِبِلَّةَ الْأَوَّلِينَ184

మిమ్మల్ని మరియు మీకు పూర్వం గతించిన తరాల వారిని సృష్టించిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి."
26:185జుజ్ 19 · పు. 375

قَالُوا إِنَّمَا أَنْتَ مِنَ الْمُسَحَّرِينَ185

వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు!
26:186జుజ్ 19 · పు. 375

وَمَا أَنْتَ إِلَّا بَشَرٌ مِثْلُنَا وَإِنْ نَظُنُّكَ لَمِنَ الْكَاذِبِينَ186

నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! నిశ్చయంగా, మేము నిన్ను అసత్యవాదులలో ఒకనిగా పరిగణిస్తున్నాము!
26:187జుజ్ 19 · పు. 375

فَأَسْقِطْ عَلَيْنَا كِسَفًا مِنَ السَّمَاءِ إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ187

నీవు సత్యవంతుడవే అయితే ఆకాశం యొక్క ఒక తునకను మాపై పడవేయి."
26:188జుజ్ 19 · పు. 375

قَالَ رَبِّي أَعْلَمُ بِمَا تَعْمَلُونَ188

(షుఐబ్) అన్నాడు: "మీరు చేసేది నా ప్రభువుకు బాగా తెలుసు!"
26:189జుజ్ 19 · పు. 375

فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ الظُّلَّةِ ۚ إِنَّهُ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ189

కాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చి పడింది. నిశ్చయంగా, అదొక భయంకరమైన దినపు శిక్ష!
26:190జుజ్ 19 · పు. 375

إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ190

నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
26:191జుజ్ 19 · పు. 375

وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ191

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
26:192జుజ్ 19 · పు. 375

وَإِنَّهُ لَتَنْزِيلُ رَبِّ الْعَالَمِينَ192

మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం).
26:193జుజ్ 19 · పు. 375

نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ193

దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు;
26:194జుజ్ 19 · పు. 375

عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنْذِرِينَ194

నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని;
26:195జుజ్ 19 · పు. 375

بِلِسَانٍ عَرَبِيٍّ مُبِينٍ195

స్పష్టమైన అరబ్బీ భాషలో!
26:196జుజ్ 19 · పు. 375

وَإِنَّهُ لَفِي زُبُرِ الْأَوَّلِينَ196

నిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది.
26:197జుజ్ 19 · పు. 375

أَوَلَمْ يَكُنْ لَهُمْ آيَةً أَنْ يَعْلَمَهُ عُلَمَاءُ بَنِي إِسْرَائِيلَ197

ఇస్రాయీల్ సంతతి వారిలోని విద్వాంసులు ఈ విషయాన్ని ఒప్పు కోవటం వారికొక సూచనగా సరిపోదా?
26:198జుజ్ 19 · పు. 375

وَلَوْ نَزَّلْنَاهُ عَلَىٰ بَعْضِ الْأَعْجَمِينَ198

ఒకవేళ మేము దీనిని అరబ్ కాని వానిపై అవతరింపజేసి ఉంటే!
26:199జుజ్ 19 · పు. 375

فَقَرَأَهُ عَلَيْهِمْ مَا كَانُوا بِهِ مُؤْمِنِينَ199

అతను దానిని వారికి చదివి వినిపించినా, వారు దానిని విశ్వసించేవారు కారు.
26:200జుజ్ 19 · పు. 375

كَذَٰلِكَ سَلَكْنَاهُ فِي قُلُوبِ الْمُجْرِمِينَ200

ఈ విధంగా, మేము దీనిని (తిరస్కారాన్ని) అపరాధుల హృదయాల లోనికి దిగిపోయేలా చేశాము.
26:201జుజ్ 19 · పు. 375

لَا يُؤْمِنُونَ بِهِ حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ201

కఠినశిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు.
26:202జుజ్ 19 · పు. 375

فَيَأْتِيَهُمْ بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ202

అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి పడుతుంది.
26:203జుజ్ 19 · పు. 375

فَيَقُولُوا هَلْ نَحْنُ مُنْظَرُونَ203

అప్పుడు వారంటారు: "ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా?
26:204జుజ్ 19 · పు. 375

أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ204

ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా?
26:205జుజ్ 19 · పు. 375

أَفَرَأَيْتَ إِنْ مَتَّعْنَاهُمْ سِنِينَ205

చూశావా? మేము కొన్ని సంవత్సరాలు వారికి (ఈ జీవితంలో) సుఖసంతోషాలతో గడిపే వ్యవధినిచ్చినా!
26:206జుజ్ 19 · పు. 375

ثُمَّ جَاءَهُمْ مَا كَانُوا يُوعَدُونَ206

తరువాత వాగ్దానం చేయబడినది (శిక్ష) వారిపైకి వచ్చినపుడు;
26:207జుజ్ 19 · పు. 376

مَا أَغْنَىٰ عَنْهُمْ مَا كَانُوا يُمَتَّعُونَ207

వారు అనుభవిస్తూ ఉండిన సుఖసంతోషాలు వారికేమీ పనికిరావు.
26:208జుజ్ 19 · పు. 376

وَمَا أَهْلَكْنَا مِنْ قَرْيَةٍ إِلَّا لَهَا مُنْذِرُونَ208

మరియు - హెచ్చరిక చేసేవారిని (ప్రవక్తలను) పంపనిదే - మేము ఏ నగరాన్ని కూడా నాశనం చేయలేదు!
26:209జుజ్ 19 · పు. 376

ذِكْرَىٰ وَمَا كُنَّا ظَالِمِينَ209

హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు.
26:210జుజ్ 19 · పు. 376

وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيَاطِينُ210

మరియు దీనిని (ఈ దివ్యగ్రంథాన్ని) తీసుకొని క్రిందికి దిగిన వారు షైతానులు కారు.
26:211జుజ్ 19 · పు. 376

وَمَا يَنْبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ211

మరియు అది వారికి తగినది కాదు; వారది చేయలేరు.
26:212జుజ్ 19 · పు. 376

إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ212

వాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు.
26:213జుజ్ 19 · పు. 376

فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ213

కావున అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు.
26:214జుజ్ 19 · పు. 376

وَأَنْذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ214

మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు;
26:215జుజ్ 19 · పు. 376

وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ215

విశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపై నీ కనికరపు రెక్కలను చాపు.
26:216జుజ్ 19 · పు. 376

فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّي بَرِيءٌ مِمَّا تَعْمَلُونَ216

ఒకవేళ వారు నీ పట్ల అవిధేయత చూపితే వారితో అను: "మీరు చేసే కార్యాలకు నేను బాధ్యుడను కాను."
26:217జుజ్ 19 · పు. 376

وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ217

మరియు ఆ సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత మీద నమ్మకం ఉంచుకో!
26:218జుజ్ 19 · పు. 376

الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ218

ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు.
26:219జుజ్ 19 · పు. 376

وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ219

మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారితో నీ రాకపోకడలను కూడా!
26:220జుజ్ 19 · పు. 376

إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ220

నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
26:221జుజ్ 19 · పు. 376

هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَنْ تَنَزَّلُ الشَّيَاطِينُ221

షైతాన్ లు ఎవరిపై దిగుతారో నేను మీకు తెలుపనా?
26:222జుజ్ 19 · పు. 376

تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍ222

వారు అసత్యవాదులైన పాపాత్ములపై దిగుతారు;
26:223జుజ్ 19 · పు. 376

يُلْقُونَ السَّمْعَ وَأَكْثَرُهُمْ كَاذِبُونَ223

గాలి వార్తలను చెవులలో ఊదుతారు; మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే!
26:224జుజ్ 19 · పు. 376

وَالشُّعَرَاءُ يَتَّبِعُهُمُ الْغَاوُونَ224

మరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు.
26:225జుజ్ 19 · పు. 376

أَلَمْ تَرَ أَنَّهُمْ فِي كُلِّ وَادٍ يَهِيمُونَ225

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా వారు (కవులు) తమ కవిత్వంలో ప్రతి విషయాన్ని ఉద్దేశరహితంగా (ప్రశంసిస్తూ) ఉంటారని;
26:226జుజ్ 19 · పు. 376

وَأَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ226

మరియు నిశ్చయంగా, వారు తాము ఆచరించని దానిని చెప్పుకుంటారని;
26:227జుజ్ 19 · పు. 376

إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَذَكَرُوا اللَّهَ كَثِيرًا وَانْتَصَرُوا مِنْ بَعْدِ مَا ظُلِمُوا ۗ وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ227

కాని, (వారిలో) విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ, అల్లాహ్ ను అమితంగా స్మరించే వారూ మరియు - తమకు అన్యాయం జరిగినప్పుడే - ప్రతీకార చర్య తీసుకునే వారు తప్ప! అన్యాయం చేసేవారు తమ పర్యవసానం ఏమిటో త్వరలో తెలుసుకోగలరు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి