Al-Buruj

سورة البروج

సూరా 85 · మక్కీ · 22 ఆయత్‌లు

85:1జుజ్ 30 · పు. 590

وَالسَّمَاءِ ذَاتِ الْبُرُوجِ1

విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా!
85:2జుజ్ 30 · పు. 590

وَالْيَوْمِ الْمَوْعُودِ2

వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా!
85:3జుజ్ 30 · పు. 590

وَشَاهِدٍ وَمَشْهُودٍ3

చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా!
85:4జుజ్ 30 · పు. 590

قُتِلَ أَصْحَابُ الْأُخْدُودِ4

అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు.
85:5జుజ్ 30 · పు. 590

النَّارِ ذَاتِ الْوَقُودِ5

ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు.
85:6జుజ్ 30 · పు. 590

إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ6

వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు;
85:7జుజ్ 30 · పు. 590

وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ7

మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు.
85:8జుజ్ 30 · పు. 590

وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَنْ يُؤْمِنُوا بِاللَّهِ الْعَزِيزِ الْحَمِيدِ8

మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే!
85:9జుజ్ 30 · పు. 590

الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ9

ఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి.
85:10జుజ్ 30 · పు. 590

إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ10

ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది.
85:11జుజ్ 30 · పు. 590

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْكَبِيرُ11

నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అదే గొప్ప విజయం.
85:12జుజ్ 30 · పు. 590

إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ12

నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది.
85:13జుజ్ 30 · పు. 590

إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ13

నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు.
85:14జుజ్ 30 · పు. 590

وَهُوَ الْغَفُورُ الْوَدُودُ14

మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు.
85:15జుజ్ 30 · పు. 590

ذُو الْعَرْشِ الْمَجِيدُ15

సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు, మహత్త్వపూర్ణుడు.
85:16జుజ్ 30 · పు. 590

فَعَّالٌ لِمَا يُرِيدُ16

తాను తలచింది చేయగలవాడు.
85:17జుజ్ 30 · పు. 590

هَلْ أَتَاكَ حَدِيثُ الْجُنُودِ17

ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా?
85:18జుజ్ 30 · పు. 590

فِرْعَوْنَ وَثَمُودَ18

ఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల).
85:19జుజ్ 30 · పు. 590

بَلِ الَّذِينَ كَفَرُوا فِي تَكْذِيبٍ19

అలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు.
85:20జుజ్ 30 · పు. 590

وَاللَّهُ مِنْ وَرَائِهِمْ مُحِيطٌ20

మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు.
85:21జుజ్ 30 · పు. 590

بَلْ هُوَ قُرْآنٌ مَجِيدٌ21

వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన ఖుర్ఆన్.
85:22జుజ్ 30 · పు. 590

فِي لَوْحٍ مَحْفُوظٍ22

సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్) లో (వ్రాయబడి) ఉన్నది.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Muhammad At-Tablawi - Al-Buruj · Tlawati