At-Tin

سورة التين

సూరా 95 · మక్కీ · 8 ఆయత్‌లు

95:1జుజ్ 30 · పు. 597

وَالتِّينِ وَالزَّيْتُونِ1

అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగా!
95:2జుజ్ 30 · పు. 597

وَطُورِ سِينِينَ2

సీనాయ్ (తూర్) కొండ సాక్షిగా!
95:3జుజ్ 30 · పు. 597

وَهَٰذَا الْبَلَدِ الْأَمِينِ3

ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా!
95:4జుజ్ 30 · పు. 597

لَقَدْ خَلَقْنَا الْإِنْسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ4

వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము.
95:5జుజ్ 30 · పు. 597

ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ5

తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాము.
95:6జుజ్ 30 · పు. 597

إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ6

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది.
95:7జుజ్ 30 · పు. 597

فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ7

అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు?
95:8జుజ్ 30 · పు. 597

أَلَيْسَ اللَّهُ بِأَحْكَمِ الْحَاكِمِينَ8

ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా?

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి