At-Tariq

سورة الطارق

సూరా 86 · మక్కీ · 17 ఆయత్‌లు

86:1జుజ్ 30 · పు. 591

وَالسَّمَاءِ وَالطَّارِقِ1

ఆకాశం మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రం (అత్ తారిఖ్) సాక్షిగా!
86:2జుజ్ 30 · పు. 591

وَمَا أَدْرَاكَ مَا الطَّارِقُ2

రాత్రి వేళ వచ్చేది (అత్ తారిఖ్) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది?
86:3జుజ్ 30 · పు. 591

النَّجْمُ الثَّاقِبُ3

అదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం.
86:4జుజ్ 30 · పు. 591

إِنْ كُلُّ نَفْسٍ لَمَّا عَلَيْهَا حَافِظٌ4

కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు.
86:5జుజ్ 30 · పు. 591

فَلْيَنْظُرِ الْإِنْسَانُ مِمَّ خُلِقَ5

కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి!
86:6జుజ్ 30 · పు. 591

خُلِقَ مِنْ مَاءٍ دَافِقٍ6

అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు.
86:7జుజ్ 30 · పు. 591

يَخْرُجُ مِنْ بَيْنِ الصُّلْبِ وَالتَّرَائِبِ7

అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది.
86:8జుజ్ 30 · పు. 591

إِنَّهُ عَلَىٰ رَجْعِهِ لَقَادِرٌ8

నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు!
86:9జుజ్ 30 · పు. 591

يَوْمَ تُبْلَى السَّرَائِرُ9

ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో!
86:10జుజ్ 30 · పు. 591

فَمَا لَهُ مِنْ قُوَّةٍ وَلَا نَاصِرٍ10

అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు.
86:11జుజ్ 30 · పు. 591

وَالسَّمَاءِ ذَاتِ الرَّجْعِ11

వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా!
86:12జుజ్ 30 · పు. 591

وَالْأَرْضِ ذَاتِ الصَّدْعِ12

(చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా!
86:13జుజ్ 30 · పు. 591

إِنَّهُ لَقَوْلٌ فَصْلٌ13

నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి).
86:14జుజ్ 30 · పు. 591

وَمَا هُوَ بِالْهَزْلِ14

మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు.
86:15జుజ్ 30 · పు. 591

إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا15

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు.
86:16జుజ్ 30 · పు. 591

وَأَكِيدُ كَيْدًا16

మరియు నేను కూడా పన్నాగం పన్నుతున్నాను.
86:17జుజ్ 30 · పు. 591

فَمَهِّلِ الْكَافِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًا17

కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధి నివ్వు! వారి పట్ల మృదువుగా వ్యవహరించు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Mishary Al-Afasy - At-Tariq · Tlawati