Al-Muddaththir

سورة المدثر

సూరా 74 · మక్కీ · 56 ఆయత్‌లు

74:1జుజ్ 29 · పు. 575

يَا أَيُّهَا الْمُدَّثِّرُ1

ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!
74:2జుజ్ 29 · పు. 575

قُمْ فَأَنْذِرْ2

లే! ఇక హెచ్చరించు!
74:3జుజ్ 29 · పు. 575

وَرَبَّكَ فَكَبِّرْ3

మరియు మీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)!
74:4జుజ్ 29 · పు. 575

وَثِيَابَكَ فَطَهِّرْ4

మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో!
74:5జుజ్ 29 · పు. 575

وَالرُّجْزَ فَاهْجُرْ5

మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!
74:6జుజ్ 29 · పు. 575

وَلَا تَمْنُنْ تَسْتَكْثِرُ6

మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)!
74:7జుజ్ 29 · పు. 575

وَلِرَبِّكَ فَاصْبِرْ7

మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు!
74:8జుజ్ 29 · పు. 575

فَإِذَا نُقِرَ فِي النَّاقُورِ8

మరియు బాకా (నాఖూర్) ఊదబడినప్పుడు;
74:9జుజ్ 29 · పు. 575

فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ9

ఆ దినం చాలా కఠినమైన దినమై ఉంటుంది;
74:10జుజ్ 29 · పు. 575

عَلَى الْكَافِرِينَ غَيْرُ يَسِيرٍ10

సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు.
74:11జుజ్ 29 · పు. 575

ذَرْنِي وَمَنْ خَلَقْتُ وَحِيدًا11

వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ!
74:12జుజ్ 29 · పు. 575

وَجَعَلْتُ لَهُ مَالًا مَمْدُودًا12

మరియు నేను అతనికి పుష్కలంగా సంపదనిచ్చాను.
74:13జుజ్ 29 · పు. 575

وَبَنِينَ شُهُودًا13

మరియు అతనికి తోడుగా ఉండే కుమారులను!
74:14జుజ్ 29 · పు. 575

وَمَهَّدْتُ لَهُ تَمْهِيدًا14

మరియు అతను కొరకు అతని జీవన సౌకర్యాలను సులభం చేశాను.
74:15జుజ్ 29 · పు. 575

ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ15

అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు.
74:16జుజ్ 29 · పు. 575

كَلَّا ۖ إِنَّهُ كَانَ لِآيَاتِنَا عَنِيدًا16

అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు.
74:17జుజ్ 29 · పు. 575

سَأُرْهِقُهُ صَعُودًا17

నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను!
74:18జుజ్ 29 · పు. 575

إِنَّهُ فَكَّرَ وَقَدَّرَ18

వాస్తవానికి, అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు.
74:19జుజ్ 29 · పు. 576

فَقُتِلَ كَيْفَ قَدَّرَ19

కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురి కానివ్వండి!
74:20జుజ్ 29 · పు. 576

ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ20

అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురి కానివ్వండి!
74:21జుజ్ 29 · పు. 576

ثُمَّ نَظَرَ21

అప్పుడు అతడు ఆలోచించాడు.
74:22జుజ్ 29 · పు. 576

ثُمَّ عَبَسَ وَبَسَرَ22

తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు);
74:23జుజ్ 29 · పు. 576

ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ23

తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు.
74:24జుజ్ 29 · పు. 576

فَقَالَ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ يُؤْثَرُ24

అప్పుడు అతడు ఇలా అన్నాడు: "ఇది పూర్వ నుండి వస్తూ వున్న ఒక మంత్రజాలం మాత్రమే!
74:25జుజ్ 29 · పు. 576

إِنْ هَٰذَا إِلَّا قَوْلُ الْبَشَرِ25

ఇది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే
74:26జుజ్ 29 · పు. 576

سَأُصْلِيهِ سَقَرَ26

త్వరలోనే నేను అతనిని నరకాగ్నిలో కాల్చుతాను.
74:27జుజ్ 29 · పు. 576

وَمَا أَدْرَاكَ مَا سَقَرُ27

మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమనుకుంటున్నావు?
74:28జుజ్ 29 · పు. 576

لَا تُبْقِي وَلَا تَذَرُ28

అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు.
74:29జుజ్ 29 · పు. 576

لَوَّاحَةٌ لِلْبَشَرِ29

అది మానవుణ్ణి (అతడి చర్మాన్ని0 దహించి వేస్తుంది.
74:30జుజ్ 29 · పు. 576

عَلَيْهَا تِسْعَةَ عَشَرَ30

దానిపై పందొమ్మిది (దేవదూతలు నియమించబడి) ఉన్నారు.
74:31జుజ్ 29 · పు. 576

وَمَا جَعَلْنَا أَصْحَابَ النَّارِ إِلَّا مَلَائِكَةً ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِلَّذِينَ كَفَرُوا لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَيَزْدَادَ الَّذِينَ آمَنُوا إِيمَانًا ۙ وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ الَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ وَالْكَافِرُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ مَنْ يَشَاءُ وَيَهْدِي مَنْ يَشَاءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِيَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ31

మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్యతిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్యతిరస్కారులు: "ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్ ఉద్దేశమేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.
74:32జుజ్ 29 · పు. 576

كَلَّا وَالْقَمَرِ32

అలా కాదు! చంద్రుని సాక్షిగా!
74:33జుజ్ 29 · పు. 576

وَاللَّيْلِ إِذْ أَدْبَرَ33

గడిచిపోయే రాత్రి సాక్షిగా!
74:34జుజ్ 29 · పు. 576

وَالصُّبْحِ إِذَا أَسْفَرَ34

ప్రకాశించే, ఉదయం సాక్షిగా!
74:35జుజ్ 29 · పు. 576

إِنَّهَا لَإِحْدَى الْكُبَرِ35

నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం.
74:36జుజ్ 29 · పు. 576

نَذِيرًا لِلْبَشَرِ36

మానవునికి ఒక హెచ్చరిక;
74:37జుజ్ 29 · పు. 576

لِمَنْ شَاءَ مِنْكُمْ أَنْ يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ37

మీలో ముందుకు రావాలని కోరుకునే వానికి లేదా వెనుక ఉండి పోయేవానికి;
74:38జుజ్ 29 · పు. 576

كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ رَهِينَةٌ38

ప్రతి మానవుడు తాను చేసిన కర్మలకు తాకట్టుగా ఉంటాడు.
74:39జుజ్ 29 · పు. 576

إِلَّا أَصْحَابَ الْيَمِينِ39

కుడిపక్షం వారు తప్ప!
74:40జుజ్ 29 · పు. 576

فِي جَنَّاتٍ يَتَسَاءَلُونَ40

వారు స్వర్గాలలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు!
74:41జుజ్ 29 · పు. 576

عَنِ الْمُجْرِمِينَ41

అపరాధులను గురించి (మరియు వారితో అంటారు):
74:42జుజ్ 29 · పు. 576

مَا سَلَكَكُمْ فِي سَقَرَ42

"మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది?"
74:43జుజ్ 29 · పు. 576

قَالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ43

వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము.
74:44జుజ్ 29 · పు. 576

وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ44

మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము;
74:45జుజ్ 29 · పు. 576

وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ45

మరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము;
74:46జుజ్ 29 · పు. 576

وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ46

మరియు తీర్పుదినాన్ని అబద్ధమని నిరాకరిస్తూ ఉండేవాళ్ళము;
74:47జుజ్ 29 · పు. 576

حَتَّىٰ أَتَانَا الْيَقِينُ47

చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చి పడింది.
74:48జుజ్ 29 · పు. 577

فَمَا تَنْفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ48

అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు.
74:49జుజ్ 29 · పు. 577

فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِينَ49

అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు.
74:50జుజ్ 29 · పు. 577

كَأَنَّهُمْ حُمُرٌ مُسْتَنْفِرَةٌ50

వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది;
74:51జుజ్ 29 · పు. 577

فَرَّتْ مِنْ قَسْوَرَةٍ51

సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)!
74:52జుజ్ 29 · పు. 577

بَلْ يُرِيدُ كُلُّ امْرِئٍ مِنْهُمْ أَنْ يُؤْتَىٰ صُحُفًا مُنَشَّرَةً52

అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు.
74:53జుజ్ 29 · పు. 577

كَلَّا ۖ بَلْ لَا يَخَافُونَ الْآخِرَةَ53

కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు.
74:54జుజ్ 29 · పు. 577

كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ54

అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం.
74:55జుజ్ 29 · పు. 577

فَمَنْ شَاءَ ذَكَرَهُ55

కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు.
74:56జుజ్ 29 · పు. 577

وَمَا يَذْكُرُونَ إِلَّا أَنْ يَشَاءَ اللَّهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ56

కాని అల్లాహ్ కోరితే తప్ప! వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Mishary Al-Afasy - Al-Muddaththir · Tlawati