Al-Waqi'ah

سورة الواقعة

సూరా 56 · మక్కీ · 96 ఆయత్‌లు

56:1జుజ్ 27 · పు. 534

إِذَا وَقَعَتِ الْوَاقِعَةُ1

ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు,
56:2జుజ్ 27 · పు. 534

لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ2

అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు.
56:3జుజ్ 27 · పు. 534

خَافِضَةٌ رَافِعَةٌ3

అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది
56:4జుజ్ 27 · పు. 534

إِذَا رُجَّتِ الْأَرْضُ رَجًّا4

భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు;
56:5జుజ్ 27 · పు. 534

وَبُسَّتِ الْجِبَالُ بَسًّا5

మరియు పర్వతాలు పొడిగా మార్చబడినపుడు;
56:6జుజ్ 27 · పు. 534

فَكَانَتْ هَبَاءً مُنْبَثًّا6

అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండి పోయినపుడు;
56:7జుజ్ 27 · పు. 534

وَكُنْتُمْ أَزْوَاجًا ثَلَاثَةً7

మరియు మీరు మూడు వర్గాలుగా విభజింపబడతారు.
56:8జుజ్ 27 · పు. 534

فَأَصْحَابُ الْمَيْمَنَةِ مَا أَصْحَابُ الْمَيْمَنَةِ8

ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)!
56:9జుజ్ 27 · పు. 534

وَأَصْحَابُ الْمَشْأَمَةِ مَا أَصْحَابُ الْمَشْأَمَةِ9

మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)!
56:10జుజ్ 27 · పు. 534

وَالسَّابِقُونَ السَّابِقُونَ10

మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు.
56:11జుజ్ 27 · పు. 534

أُولَٰئِكَ الْمُقَرَّبُونَ11

అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు.
56:12జుజ్ 27 · పు. 534

فِي جَنَّاتِ النَّعِيمِ12

వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు.
56:13జుజ్ 27 · పు. 534

ثُلَّةٌ مِنَ الْأَوَّلِينَ13

మొదటి తరాల వారిలో నుండి చాలా మంది;
56:14జుజ్ 27 · పు. 534

وَقَلِيلٌ مِنَ الْآخِرِينَ14

మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది.
56:15జుజ్ 27 · పు. 534

عَلَىٰ سُرُرٍ مَوْضُونَةٍ15

(బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద;
56:16జుజ్ 27 · పు. 534

مُتَّكِئِينَ عَلَيْهَا مُتَقَابِلِينَ16

ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.
56:17జుజ్ 27 · పు. 535

يَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُخَلَّدُونَ17

వారి చుట్టుప్రక్కలలో చిరంజీవులైన (నిత్యబాల్యం గల) బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు.
56:18జుజ్ 27 · పు. 535

بِأَكْوَابٍ وَأَبَارِيقَ وَكَأْسٍ مِنْ مَعِينٍ18

(మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో!
56:19జుజ్ 27 · పు. 535

لَا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنْزِفُونَ19

దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు.
56:20జుజ్ 27 · పు. 535

وَفَاكِهَةٍ مِمَّا يَتَخَيَّرُونَ20

మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి.
56:21జుజ్ 27 · పు. 535

وَلَحْمِ طَيْرٍ مِمَّا يَشْتَهُونَ21

మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం.
56:22జుజ్ 27 · పు. 535

وَحُورٌ عِينٌ22

మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్);
56:23జుజ్ 27 · పు. 535

كَأَمْثَالِ اللُّؤْلُؤِ الْمَكْنُونِ23

దాచబడిన ముత్యాల వలే!
56:24జుజ్ 27 · పు. 535

جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ24

ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా!
56:25జుజ్ 27 · పు. 535

لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا تَأْثِيمًا25

అందులో వారు వ్యర్థమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు.
56:26జుజ్ 27 · పు. 535

إِلَّا قِيلًا سَلَامًا سَلَامًا26

"శాంతి (సలాం) శాంతి (సలాం)!" అనే మాటలు తప్ప!
56:27జుజ్ 27 · పు. 535

وَأَصْحَابُ الْيَمِينِ مَا أَصْحَابُ الْيَمِينِ27

మరియు కుడి పక్షం వారు, ఆ కుడి పక్షం వారు ఎంత (అదృష్టవంతులు)!
56:28జుజ్ 27 · పు. 535

فِي سِدْرٍ مَخْضُودٍ28

వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య !
56:29జుజ్ 27 · పు. 535

وَطَلْحٍ مَنْضُودٍ29

మరియు పండ్ల గెలలతో నిండిన అరటి చెట్లు;
56:30జుజ్ 27 · పు. 535

وَظِلٍّ مَمْدُودٍ30

మరియు వ్యాపించి ఉన్న నీడలు,
56:31జుజ్ 27 · పు. 535

وَمَاءٍ مَسْكُوبٍ31

మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు;
56:32జుజ్ 27 · పు. 535

وَفَاكِهَةٍ كَثِيرَةٍ32

మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు;
56:33జుజ్ 27 · పు. 535

لَا مَقْطُوعَةٍ وَلَا مَمْنُوعَةٍ33

ఎడతెగకుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో);
56:34జుజ్ 27 · పు. 535

وَفُرُشٍ مَرْفُوعَةٍ34

మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు.
56:35జుజ్ 27 · పు. 535

إِنَّا أَنْشَأْنَاهُنَّ إِنْشَاءً35

నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము;
56:36జుజ్ 27 · పు. 535

فَجَعَلْنَاهُنَّ أَبْكَارًا36

మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము;
56:37జుజ్ 27 · పు. 535

عُرُبًا أَتْرَابًا37

వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు);
56:38జుజ్ 27 · పు. 535

لِأَصْحَابِ الْيَمِينِ38

కుడిపక్షం వారి కొరకు.
56:39జుజ్ 27 · పు. 535

ثُلَّةٌ مِنَ الْأَوَّلِينَ39

అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు;
56:40జుజ్ 27 · పు. 535

وَثُلَّةٌ مِنَ الْآخِرِينَ40

మరియు తరువాత తరాల వారిలో నుండి చాలా మంది ఉంటారు.
56:41జుజ్ 27 · పు. 535

وَأَصْحَابُ الشِّمَالِ مَا أَصْحَابُ الشِّمَالِ41

ఇక వామ(ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)?
56:42జుజ్ 27 · పు. 535

فِي سَمُومٍ وَحَمِيمٍ42

వారు దహించే నరకాగ్నిలో మరియు సలసలకాగే నీటిలో;
56:43జుజ్ 27 · పు. 535

وَظِلٍّ مِنْ يَحْمُومٍ43

మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు).
56:44జుజ్ 27 · పు. 535

لَا بَارِدٍ وَلَا كَرِيمٍ44

అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు;
56:45జుజ్ 27 · పు. 535

إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ45

నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి;
56:46జుజ్ 27 · పు. 535

وَكَانُوا يُصِرُّونَ عَلَى الْحِنْثِ الْعَظِيمِ46

మరియు వారి మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి;
56:47జుజ్ 27 · పు. 535

وَكَانُوا يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ47

మరియు వారు ఇలా అనేవారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా?
56:48జుజ్ 27 · పు. 535

أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ48

మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా?
56:49జుజ్ 27 · పు. 535

قُلْ إِنَّ الْأَوَّلِينَ وَالْآخِرِينَ49

వారితో ఇలా అను: "నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ!
56:50జుజ్ 27 · పు. 535

لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَاتِ يَوْمٍ مَعْلُومٍ50

వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశ పరచబడతారు.
56:51జుజ్ 27 · పు. 536

ثُمَّ إِنَّكُمْ أَيُّهَا الضَّالُّونَ الْمُكَذِّبُونَ51

ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా!
56:52జుజ్ 27 · పు. 536

لَآكِلُونَ مِنْ شَجَرٍ مِنْ زَقُّومٍ52

మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు.
56:53జుజ్ 27 · పు. 536

فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ53

దానితో కడుపులు నింపుకుంటారు.
56:54జుజ్ 27 · పు. 536

فَشَارِبُونَ عَلَيْهِ مِنَ الْحَمِيمِ54

తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు.
56:55జుజ్ 27 · పు. 536

فَشَارِبُونَ شُرْبَ الْهِيمِ55

వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు.
56:56జుజ్ 27 · పు. 536

هَٰذَا نُزُلُهُمْ يَوْمَ الدِّينِ56

తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే!
56:57జుజ్ 27 · పు. 536

نَحْنُ خَلَقْنَاكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ57

మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు?
56:58జుజ్ 27 · పు. 536

أَفَرَأَيْتُمْ مَا تُمْنُونَ58

ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా?
56:59జుజ్ 27 · పు. 536

أَأَنْتُمْ تَخْلُقُونَهُ أَمْ نَحْنُ الْخَالِقُونَ59

ఏమీ? మీరా, దానిని సృష్టించేవారు? లేక మేమా దాని సృష్టికర్తలము?
56:60జుజ్ 27 · పు. 536

نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ60

మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;
56:61జుజ్ 27 · పు. 536

عَلَىٰ أَنْ نُبَدِّلَ أَمْثَالَكُمْ وَنُنْشِئَكُمْ فِي مَا لَا تَعْلَمُونَ61

మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి.
56:62జుజ్ 27 · పు. 536

وَلَقَدْ عَلِمْتُمُ النَّشْأَةَ الْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ62

మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు?
56:63జుజ్ 27 · పు. 536

أَفَرَأَيْتُمْ مَا تَحْرُثُونَ63

మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా?
56:64జుజ్ 27 · పు. 536

أَأَنْتُمْ تَزْرَعُونَهُ أَمْ نَحْنُ الزَّارِعُونَ64

మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము?
56:65జుజ్ 27 · పు. 536

لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ65

మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు."
56:66జుజ్ 27 · పు. 536

إِنَّا لَمُغْرَمُونَ66

(మీరు అనేవారు): "నిశ్చయంగా, మేము పాడై పోయాము!
56:67జుజ్ 27 · పు. 536

بَلْ نَحْنُ مَحْرُومُونَ67

కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని.
56:68జుజ్ 27 · పు. 536

أَفَرَأَيْتُمُ الْمَاءَ الَّذِي تَشْرَبُونَ68

ఏమీ? మీరెప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా?
56:69జుజ్ 27 · పు. 536

أَأَنْتُمْ أَنْزَلْتُمُوهُ مِنَ الْمُزْنِ أَمْ نَحْنُ الْمُنْزِلُونَ69

మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించేవారము?
56:70జుజ్ 27 · పు. 536

لَوْ نَشَاءُ جَعَلْنَاهُ أُجَاجًا فَلَوْلَا تَشْكُرُونَ70

మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞతలు చూపరు?
56:71జుజ్ 27 · పు. 536

أَفَرَأَيْتُمُ النَّارَ الَّتِي تُورُونَ71

మీరు రాజేసే అగ్నిని గమనించారా?
56:72జుజ్ 27 · పు. 536

أَأَنْتُمْ أَنْشَأْتُمْ شَجَرَتَهَا أَمْ نَحْنُ الْمُنْشِئُونَ72

దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా?
56:73జుజ్ 27 · పు. 536

نَحْنُ جَعَلْنَاهَا تَذْكِرَةً وَمَتَاعًا لِلْمُقْوِينَ73

మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము.
56:74జుజ్ 27 · పు. 536

فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ74

కావున సర్వత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.
56:75జుజ్ 27 · పు. 536

۞ فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ75

ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను.
56:76జుజ్ 27 · పు. 536

وَإِنَّهُ لَقَسَمٌ لَوْ تَعْلَمُونَ عَظِيمٌ76

మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది!
56:77జుజ్ 27 · పు. 537

إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ77

నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది.
56:78జుజ్ 27 · పు. 537

فِي كِتَابٍ مَكْنُونٍ78

సురక్షితమైన గ్రంథంలో ఉన్నది.
56:79 · None touch it except the purifiedజుజ్ 27 · పు. 537

لَا يَمَسُّهُ إِلَّا الْمُطَهَّرُونَ79

దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు.
56:80జుజ్ 27 · పు. 537

تَنْزِيلٌ مِنْ رَبِّ الْعَالَمِينَ80

ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది.
56:81జుజ్ 27 · పు. 537

أَفَبِهَٰذَا الْحَدِيثِ أَنْتُمْ مُدْهِنُونَ81

ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా?
56:82జుజ్ 27 · పు. 537

وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ82

మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా?
56:83జుజ్ 27 · పు. 537

فَلَوْلَا إِذَا بَلَغَتِ الْحُلْقُومَ83

అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)?
56:84జుజ్ 27 · పు. 537

وَأَنْتُمْ حِينَئِذٍ تَنْظُرُونَ84

మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు.
56:85జుజ్ 27 · పు. 537

وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنْكُمْ وَلَٰكِنْ لَا تُبْصِرُونَ85

మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు.
56:86జుజ్ 27 · పు. 537

فَلَوْلَا إِنْ كُنْتُمْ غَيْرَ مَدِينِينَ86

ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే;
56:87జుజ్ 27 · పు. 537

تَرْجِعُونَهَا إِنْ كُنْتُمْ صَادِقِينَ87

మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు?
56:88జుజ్ 27 · పు. 537

فَأَمَّا إِنْ كَانَ مِنَ الْمُقَرَّبِينَ88

కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే!
56:89జుజ్ 27 · పు. 537

فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ89

అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి.
56:90జుజ్ 27 · పు. 537

وَأَمَّا إِنْ كَانَ مِنْ أَصْحَابِ الْيَمِينِ90

మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో!
56:91జుజ్ 27 · పు. 537

فَسَلَامٌ لَكَ مِنْ أَصْحَابِ الْيَمِينِ91

అతనితో: "నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది).
56:92జుజ్ 27 · పు. 537

وَأَمَّا إِنْ كَانَ مِنَ الْمُكَذِّبِينَ الضَّالِّينَ92

మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో!
56:93జుజ్ 27 · పు. 537

فَنُزُلٌ مِنْ حَمِيمٍ93

అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది.
56:94జుజ్ 27 · పు. 537

وَتَصْلِيَةُ جَحِيمٍ94

మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది.
56:95జుజ్ 27 · పు. 537

إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ الْيَقِينِ95

నిశ్చయంగా, ఇది రూఢి అయిన నమ్మదగిన సత్యం!
56:96జుజ్ 27 · పు. 537

فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ96

కావున సర్వత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి