Ash-Shams

سورة الشمس

సూరా 91 · మక్కీ · 15 ఆయత్‌లు

91:1జుజ్ 30 · పు. 595

وَالشَّمْسِ وَضُحَاهَا1

సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా!
91:2జుజ్ 30 · పు. 595

وَالْقَمَرِ إِذَا تَلَاهَا2

దాని వెనుక వచ్చే చంద్రుని సాక్షిగా!
91:3జుజ్ 30 · పు. 595

وَالنَّهَارِ إِذَا جَلَّاهَا3

ప్రకాశించే పగటి సాక్షిగా!
91:4జుజ్ 30 · పు. 595

وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا4

దానిని క్రమ్ముకునే, రాత్రి సాక్షిగా!
91:5జుజ్ 30 · పు. 595

وَالسَّمَاءِ وَمَا بَنَاهَا5

ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!
91:6జుజ్ 30 · పు. 595

وَالْأَرْضِ وَمَا طَحَاهَا6

భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా!
91:7జుజ్ 30 · పు. 595

وَنَفْسٍ وَمَا سَوَّاهَا7

మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా!
91:8జుజ్ 30 · పు. 595

فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا8

ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు.
91:9జుజ్ 30 · పు. 595

قَدْ أَفْلَحَ مَنْ زَكَّاهَا9

వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు.
91:10జుజ్ 30 · పు. 595

وَقَدْ خَابَ مَنْ دَسَّاهَا10

మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు.
91:11జుజ్ 30 · పు. 595

كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا11

సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు;
91:12జుజ్ 30 · పు. 595

إِذِ انْبَعَثَ أَشْقَاهَا12

అల్లాహ్ సందేశహరుడు (సాలిహ్) వారితో: "ఈ ఆడ ఒంటె అల్లాహ్ కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!" అని అన్నాడు.
91:13జుజ్ 30 · పు. 595

فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا13

అయినా వారు అతని (సాలిహ్) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనక మోకాలి నరాన్ని కోసి, కుంటిదాన్ని చేసి చంపారు.
91:14జుజ్ 30 · పు. 595

فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُمْ بِذَنْبِهِمْ فَسَوَّاهَا14

కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారి మీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనం చేశాడు.
91:15జుజ్ 30 · పు. 595

وَلَا يَخَافُ عُقْبَاهَا15

మరియు ఆయన (అల్లాహ్) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు!

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి