Al-A'la

سورة الأعلى

సూరా 87 · మక్కీ · 19 ఆయత్‌లు

87:1జుజ్ 30 · పు. 591

سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى1

అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు!
87:2జుజ్ 30 · పు. 591

الَّذِي خَلَقَ فَسَوَّىٰ2

ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు.
87:3జుజ్ 30 · పు. 591

وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ3

మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు!
87:4జుజ్ 30 · పు. 591

وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ4

మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు.
87:5జుజ్ 30 · పు. 591

فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ5

మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు.
87:6జుజ్ 30 · పు. 591

سَنُقْرِئُكَ فَلَا تَنْسَىٰ6

మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు -
87:7జుజ్ 30 · పు. 591

إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ7

అల్లాహ్ కోరింది తప్ప! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు.
87:8జుజ్ 30 · పు. 591

وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ8

మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము.
87:9జుజ్ 30 · పు. 591

فَذَكِّرْ إِنْ نَفَعَتِ الذِّكْرَىٰ9

కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు!
87:10జుజ్ 30 · పు. 591

سَيَذَّكَّرُ مَنْ يَخْشَىٰ10

(అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు.
87:11జుజ్ 30 · పు. 592

وَيَتَجَنَّبُهَا الْأَشْقَى11

మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు.
87:12జుజ్ 30 · పు. 592

الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ12

అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు.
87:13జుజ్ 30 · పు. 592

ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ13

అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు.
87:14జుజ్ 30 · పు. 592

قَدْ أَفْلَحَ مَنْ تَزَكَّىٰ14

సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు.
87:15జుజ్ 30 · పు. 592

وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ15

మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు.
87:16జుజ్ 30 · పు. 592

بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا16

అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు;
87:17జుజ్ 30 · పు. 592

وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ17

కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది.
87:18జుజ్ 30 · పు. 592

إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ18

నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది;
87:19జుజ్ 30 · పు. 592

صُحُفِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ19

ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Hani Ar-Rifai - Al-A'la · Tlawati