An-Najm

سورة النجم

సూరా 53 · మక్కీ · 62 ఆయత్‌లు

53:1జుజ్ 27 · పు. 526

وَالنَّجْمِ إِذَا هَوَىٰ1

అస్తమించే నక్షత్రం సాక్షిగా!
53:2జుజ్ 27 · పు. 526

مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ2

మీ సహచరుడు (ముహమ్మద్), మార్గభ్రష్టుడు కాలేదు మరియు తప్పు దారిలోనూ లేడు.
53:3జుజ్ 27 · పు. 526

وَمَا يَنْطِقُ عَنِ الْهَوَىٰ3

మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు.
53:4జుజ్ 27 · పు. 526

إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ4

అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే.
53:5జుజ్ 27 · పు. 526

عَلَّمَهُ شَدِيدُ الْقُوَىٰ5

అది అతనికి మహా బలవంతుడు (జిబ్రీల్) నేర్పాడు.
53:6జుజ్ 27 · పు. 526

ذُو مِرَّةٍ فَاسْتَوَىٰ6

అతను శక్తిసామర్ధ్యాలు గలవాడు, తన వాస్తవరూపంలో ప్రత్యక్షమయినప్పుడు;
53:7జుజ్ 27 · పు. 526

وَهُوَ بِالْأُفُقِ الْأَعْلَىٰ7

అతను ఎత్తైన దిజ్ఞ్మండలంలో (దిక్చక్రంలో) కనిపించాడు.
53:8జుజ్ 27 · పు. 526

ثُمَّ دَنَا فَتَدَلَّىٰ8

తరువాత సమీపించాడు, మరింత క్రిందికి దిగి వచ్చాడు.
53:9జుజ్ 27 · పు. 526

فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَىٰ9

అప్పుడు అతను రెండు ధనస్సుల దూరంలోనో లేక అంతకంటే తక్కువ దూరంలోనో ఉన్నాడు.
53:10జుజ్ 27 · పు. 526

فَأَوْحَىٰ إِلَىٰ عَبْدِهِ مَا أَوْحَىٰ10

అప్పుడు అతను (జిబ్రీల్), ఆయన (అల్లాహ్) దాసునిపై అవతరింప జేయవలసిన, దానిని (వహీని) అవతరింపజేశాడు.
53:11జుజ్ 27 · పు. 526

مَا كَذَبَ الْفُؤَادُ مَا رَأَىٰ11

అతను (ప్రవక్త) చూసిన దానిని, అతని హృదయం అబద్ధమని అనలేదు.
53:12జుజ్ 27 · పు. 526

أَفَتُمَارُونَهُ عَلَىٰ مَا يَرَىٰ12

అయితే మీరు, అతను (కళ్ళారా) చూసిన దానిని గురించి (అతనితో) వాదులాడుతారా?
53:13జుజ్ 27 · పు. 526

وَلَقَدْ رَآهُ نَزْلَةً أُخْرَىٰ13

మరియు వాస్తవానికి అతను (ప్రవక్త) అతనిని (జిబ్రీల్ ను) మరొకసారి (ప్రత్యక్షంగా) అవతరించినప్పుడు చూశాడు.
53:14జుజ్ 27 · పు. 526

عِنْدَ سِدْرَةِ الْمُنْتَهَىٰ14

(సప్తాకాశంలో) చివరి హద్దులో నున్న రేగు చెట్టు (సిదరతుల్ మున్తహా) దగ్గర.
53:15జుజ్ 27 · పు. 526

عِنْدَهَا جَنَّةُ الْمَأْوَىٰ15

అక్కడికి దగ్గరలోనే జన్నతుల్ మా'వా ఉంది.
53:16జుజ్ 27 · పు. 526

إِذْ يَغْشَى السِّدْرَةَ مَا يَغْشَىٰ16

అప్పుడు ఆ సిదరహ్ వృక్షాన్ని కప్పేది కప్పేసినప్పుడు!
53:17జుజ్ 27 · పు. 526

مَا زَاغَ الْبَصَرُ وَمَا طَغَىٰ17

అతని (ప్రవక్త) దృష్టి తప్పిపోనూ లేదు మరియు హద్దుదాటి కూడా పోలేదు.
53:18జుజ్ 27 · పు. 526

لَقَدْ رَأَىٰ مِنْ آيَاتِ رَبِّهِ الْكُبْرَىٰ18

వాస్తవంగా, అతను (ముహమ్మద్) తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను (ఆయాత్ లను) చూశాడు.
53:19జుజ్ 27 · పు. 526

أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ19

మీరు, అల్ లాత్ మరియు అల్ ఉజ్జాను గురించి ఆలోచించారా?
53:20జుజ్ 27 · పు. 526

وَمَنَاةَ الثَّالِثَةَ الْأُخْرَىٰ20

మరియు మూడవదీ చివరిది అయిన మనాత్ ను (గురించి కూడా)?
53:21జుజ్ 27 · పు. 526

أَلَكُمُ الذَّكَرُ وَلَهُ الْأُنْثَىٰ21

మీ కొరకైతే కుమారులు మరియు ఆయన కొరకు కుమార్తెలా?
53:22జుజ్ 27 · పు. 526

تِلْكَ إِذًا قِسْمَةٌ ضِيزَىٰ22

ఇది అన్యాయమైన విభజన కాదా!
53:23జుజ్ 27 · పు. 526

إِنْ هِيَ إِلَّا أَسْمَاءٌ سَمَّيْتُمُوهَا أَنْتُمْ وَآبَاؤُكُمْ مَا أَنْزَلَ اللَّهُ بِهَا مِنْ سُلْطَانٍ ۚ إِنْ يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْأَنْفُسُ ۖ وَلَقَدْ جَاءَهُمْ مِنْ رَبِّهِمُ الْهُدَىٰ23

ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. వారు, కేవలం తమ ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది!
53:24జుజ్ 27 · పు. 526

أَمْ لِلْإِنْسَانِ مَا تَمَنَّىٰ24

ఏమిటి? మానవునికి తాను కోరినదంతా లభిస్తుందా?
53:25జుజ్ 27 · పు. 526

فَلِلَّهِ الْآخِرَةُ وَالْأُولَىٰ25

వాస్తవానికి, అంతిమ (పరలోకం) మరియు ప్రథమం (ఇహలోకం) అన్నీ అల్లాహ్ కే చెందినవి.
53:26జుజ్ 27 · పు. 526

۞ وَكَمْ مِنْ مَلَكٍ فِي السَّمَاوَاتِ لَا تُغْنِي شَفَاعَتُهُمْ شَيْئًا إِلَّا مِنْ بَعْدِ أَنْ يَأْذَنَ اللَّهُ لِمَنْ يَشَاءُ وَيَرْضَىٰ26

మరియు ఆకాశాలలో ఎందరో దేవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం పనికిరాదు; అల్లాహ్ ఎవరి పట్లనైతే ప్రసన్నుడై, తన ఇష్టంతో వారికి అనుమతిస్తేనే తప్ప!
53:27జుజ్ 27 · పు. 527

إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ لَيُسَمُّونَ الْمَلَائِكَةَ تَسْمِيَةَ الْأُنْثَىٰ27

నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో! వారే దేవదూతలను స్త్రీల పేర్లతో పిలుస్తారు;
53:28జుజ్ 27 · పు. 527

وَمَا لَهُمْ بِهِ مِنْ عِلْمٍ ۖ إِنْ يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ ۖ وَإِنَّ الظَّنَّ لَا يُغْنِي مِنَ الْحَقِّ شَيْئًا28

ఈ విషయం గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం తమ ఊహలనే అనుసరిస్తున్నారు. కాని వాస్తవానికి, ఊహ సత్యానికి ఏ మాత్రం బదులు కాజాలదు.
53:29జుజ్ 27 · పు. 527

فَأَعْرِضْ عَنْ مَنْ تَوَلَّىٰ عَنْ ذِكْرِنَا وَلَمْ يُرِدْ إِلَّا الْحَيَاةَ الدُّنْيَا29

కావున, మా హితబోధ (ఖుర్ఆన్) నుండి ముఖం త్రిప్పుకొని ఇహలోక జీవితం తప్ప మరేమీ కోరని వ్యక్తిని నీవు పట్టించుకోకు,
53:30జుజ్ 27 · పు. 527

ذَٰلِكَ مَبْلَغُهُمْ مِنَ الْعِلْمِ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِمَنِ اهْتَدَىٰ30

ఇదే వారి జ్ఞానపరిధి. నిశ్చయంగా, నీ ప్రభువుకు, ఆయన మార్గం నుండి ఎవడు తప్పిపోయాడో తెలుసు. మరియు ఎవడు సన్మార్గంలో ఉన్నాడో కూడా, ఆయనకు బాగా తెలుసు.
53:31జుజ్ 27 · పు. 527

وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ لِيَجْزِيَ الَّذِينَ أَسَاءُوا بِمَا عَمِلُوا وَيَجْزِيَ الَّذِينَ أَحْسَنُوا بِالْحُسْنَى31

మరియు ఆకాశాలలో నున్నది మరియు భూమిలో నున్నది, అంతా అల్లాహ్ కే చెందుతుంది. దుష్టులకు వారి కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి మరియు సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి.
53:32జుజ్ 27 · పు. 527

الَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ إِلَّا اللَّمَمَ ۚ إِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ ۚ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنْشَأَكُمْ مِنَ الْأَرْضِ وَإِذْ أَنْتُمْ أَجِنَّةٌ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ ۖ فَلَا تُزَكُّوا أَنْفُسَكُمْ ۖ هُوَ أَعْلَمُ بِمَنِ اتَّقَىٰ32

ఎవరైతే చిన్న చిన్న తప్పులు తప్ప, పెద్ద పాపాల నుండి మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారి కొరకు, నిశ్చయంగా, నీ ప్రభువు క్షమాపణ పరిధి చాలా విశాలమైనది. మిమ్మల్ని మట్టి నుండి సృష్టించినప్పటి నుండి మరియు మీ తల్లుల గర్భాలలో పిండాలుగా ఉన్నప్పటి నుండి కూడా, ఆయనకు మీ గురించి బాగా తెలుసు. కావున మీరు మీ పవిత్రతను గురించి (గొప్పలు) చెప్పుకోకండి. ఎవడు భయభక్తులు గలవాడో ఆయనకు బాగా తెలుసు.
53:33జుజ్ 27 · పు. 527

أَفَرَأَيْتَ الَّذِي تَوَلَّىٰ33

నీవు (ఇస్లాం నుండి) మరలి పోయే వాడిని చూశావా?
53:34జుజ్ 27 · పు. 527

وَأَعْطَىٰ قَلِيلًا وَأَكْدَىٰ34

మరియు (అల్లాహ్ మార్గంలో) కొంత మాత్రమే ఇచ్చి, చేయి ఆపుకునేవాడిని?
53:35జుజ్ 27 · పు. 527

أَعِنْدَهُ عِلْمُ الْغَيْبِ فَهُوَ يَرَىٰ35

అతని వద్ద అగోచర జ్ఞానముందా? అతడు (స్పష్టంగా) చూడటానికి?
53:36జుజ్ 27 · పు. 527

أَمْ لَمْ يُنَبَّأْ بِمَا فِي صُحُفِ مُوسَىٰ36

లేక, మూసా గ్రంథంలో నున్న విషయాలు అతనికి తెలుపబడలేదా?
53:37జుజ్ 27 · పు. 527

وَإِبْرَاهِيمَ الَّذِي وَفَّىٰ37

మరియు తన బాధ్యతను నెరవేర్చిన ఇబ్రాహీమ్ విషయము;
53:38జుజ్ 27 · పు. 527

أَلَّا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ38

మరియు (పాపాల) భారం మోసే వాడెవడూ ఇతరుల (పాపాల) భారం మోయడని;
53:39జుజ్ 27 · పు. 527

وَأَنْ لَيْسَ لِلْإِنْسَانِ إِلَّا مَا سَعَىٰ39

మరియు మానవునికి తాను చేసిన దాని ఫలితం తప్ప మరొకటి లభించదని;
53:40జుజ్ 27 · పు. 527

وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ40

మరియు నిశ్చయంగా, అతనికి తన కృషి ఫలితమే చూపబడుతుందని;
53:41జుజ్ 27 · పు. 527

ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ41

అప్పుడు అతనికి తన కృషికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుందని;
53:42జుజ్ 27 · పు. 527

وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنْتَهَىٰ42

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్దనే (ప్రతిదాని) ముగింపు ఉన్నదని;
53:43జుజ్ 27 · పు. 527

وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ43

మరియు నిశ్చయంగా, ఆయనే నిన్ను నవ్విస్తున్నాడు మరియు ఏడ్పిస్తున్నాడని;
53:44జుజ్ 27 · పు. 527

وَأَنَّهُ هُوَ أَمَاتَ وَأَحْيَا44

మరియు నిశ్చయంగా, ఆయనే మరణింపజేసేవాడు మరియు జీవితాన్ని ప్రసాదించేవాడని;
53:45జుజ్ 27 · పు. 528

وَأَنَّهُ خَلَقَ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنْثَىٰ45

మరియు నిశ్చయంగా, మగ-ఆడ జంటలను సృష్టించినవాడు ఆయనేనని -
53:46జుజ్ 27 · పు. 528

مِنْ نُطْفَةٍ إِذَا تُمْنَىٰ46

విసర్జింపబడిన వీర్యబిందువు నుండి.
53:47జుజ్ 27 · పు. 528

وَأَنَّ عَلَيْهِ النَّشْأَةَ الْأُخْرَىٰ47

మరియు నిశ్చయంగా, దానికి మరొక జీవితాన్ని (పునరుత్థానం) ప్రసాదించడం ఆయన (అల్లాహ్) కే చెందినదని;
53:48జుజ్ 27 · పు. 528

وَأَنَّهُ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ48

మరియు నిశ్చయంగా, ఆయనే సంపన్నునిగా చేసేవాడు మరియు తృప్తినిచ్చు వాడని;
53:49జుజ్ 27 · పు. 528

وَأَنَّهُ هُوَ رَبُّ الشِّعْرَىٰ49

మరియు నిశ్చయంగా ఆయనే అగ్ని నక్షత్రానికి ప్రభువని;
53:50జుజ్ 27 · పు. 528

وَأَنَّهُ أَهْلَكَ عَادًا الْأُولَىٰ50

మరియు నిశ్చయంగా, ఆయనే తొలి ఆద్ జాతిని నాశనం చేసినవాడని;
53:51జుజ్ 27 · పు. 528

وَثَمُودَ فَمَا أَبْقَىٰ51

మరియు సమూద్ జాతిని; ఒక్కడూ కూడా లేకుండా రూపుమాపాడని.
53:52జుజ్ 27 · పు. 528

وَقَوْمَ نُوحٍ مِنْ قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ52

మరియు అంతకు పూర్వం నూహ్ జాతి వారిని. నిశ్చయంగా, వారు పరమ దుర్మార్గులు మరియు తలబిరుసులు.
53:53జుజ్ 27 · పు. 528

وَالْمُؤْتَفِكَةَ أَهْوَىٰ53

మరియు ఆయనే తలక్రిందులైన నగరాలను నాశనం చేశాడు.
53:54జుజ్ 27 · పు. 528

فَغَشَّاهَا مَا غَشَّىٰ54

తరువాత వాటిని క్రమ్ముకొనవలసింది (రాళ్ళ వర్షం) క్రమ్ముకున్నది.
53:55జుజ్ 27 · పు. 528

فَبِأَيِّ آلَاءِ رَبِّكَ تَتَمَارَىٰ55

అయితే (ఓ మానవుడా!) నీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను గురించి నీవు అనుమానంలో పడి ఉంటావు?
53:56జుజ్ 27 · పు. 528

هَٰذَا نَذِيرٌ مِنَ النُّذُرِ الْأُولَىٰ56

ఇది వరకు వచ్చిన హెచ్చరిక చేసే వారి వలే ఇతను (ముహమ్మద్) కూడా హెచ్చరిక చేసేవాడు మాత్రమే!
53:57జుజ్ 27 · పు. 528

أَزِفَتِ الْآزِفَةُ57

రానున్న ఘడియ (పునరుత్థాన దినం) సమీపంలోనే వుంది.
53:58జుజ్ 27 · పు. 528

لَيْسَ لَهَا مِنْ دُونِ اللَّهِ كَاشِفَةٌ58

అల్లాహ్ తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు.
53:59జుజ్ 27 · పు. 528

أَفَمِنْ هَٰذَا الْحَدِيثِ تَعْجَبُونَ59

ఏమీ? మీరు ఈ సందేశాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారా?
53:60జుజ్ 27 · పు. 528

وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ60

మరియు మీరు నవ్వుతున్నారా?మరియు మీకు ఏడ్పు రావటం లేదా?
53:61జుజ్ 27 · పు. 528

وَأَنْتُمْ سَامِدُونَ61

మరియు మీరు నిర్లక్ష్యంలో మునిగి ఉన్నారు.
53:62జుజ్ 27 · పు. 528

فَاسْجُدُوا لِلَّهِ وَاعْبُدُوا ۩62

కావున! అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి. మరియు (ఆయనను మాత్రమే) ఆరాధించండి!

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి