Al-Mursalat

سورة المرسلات

సూరా 77 · మక్కీ · 50 ఆయత్‌లు

77:1జుజ్ 29 · పు. 580

وَالْمُرْسَلَاتِ عُرْفًا1

ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా!
77:2జుజ్ 29 · పు. 580

فَالْعَاصِفَاتِ عَصْفًا2

మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా!
77:3జుజ్ 29 · పు. 580

وَالنَّاشِرَاتِ نَشْرًا3

మరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా!
77:4జుజ్ 29 · పు. 580

فَالْفَارِقَاتِ فَرْقًا4

మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా!
77:5జుజ్ 29 · పు. 580

فَالْمُلْقِيَاتِ ذِكْرًا5

సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా!
77:6జుజ్ 29 · పు. 580

عُذْرًا أَوْ نُذْرًا6

సాకుగా లేక హెచ్చరికగా!
77:7జుజ్ 29 · పు. 580

إِنَّمَا تُوعَدُونَ لَوَاقِعٌ7

నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది.
77:8జుజ్ 29 · పు. 580

فَإِذَا النُّجُومُ طُمِسَتْ8

అప్పుడు ఎప్పడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో!
77:9జుజ్ 29 · పు. 580

وَإِذَا السَّمَاءُ فُرِجَتْ9

మరియు ఆకాశం చీలిపోతుందో!
77:10జుజ్ 29 · పు. 580

وَإِذَا الْجِبَالُ نُسِفَتْ10

మరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో!
77:11జుజ్ 29 · పు. 580

وَإِذَا الرُّسُلُ أُقِّتَتْ11

మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో!
77:12జుజ్ 29 · పు. 580

لِأَيِّ يَوْمٍ أُجِّلَتْ12

ఏ దినానికి గాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి?
77:13జుజ్ 29 · పు. 580

لِيَوْمِ الْفَصْلِ13

ఆ తీర్పుదినం కొరకా!
77:14జుజ్ 29 · పు. 580

وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الْفَصْلِ14

మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు?
77:15జుజ్ 29 · పు. 580

وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ15

ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది!
77:16జుజ్ 29 · పు. 580

أَلَمْ نُهْلِكِ الْأَوَّلِينَ16

ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా?
77:17జుజ్ 29 · పు. 580

ثُمَّ نُتْبِعُهُمُ الْآخِرِينَ17

తరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము.
77:18జుజ్ 29 · పు. 580

كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ18

ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము.
77:19జుజ్ 29 · పు. 580

وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ19

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
77:20జుజ్ 29 · పు. 581

أَلَمْ نَخْلُقْكُمْ مِنْ مَاءٍ مَهِينٍ20

ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా?
77:21జుజ్ 29 · పు. 581

فَجَعَلْنَاهُ فِي قَرَارٍ مَكِينٍ21

తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము.
77:22జుజ్ 29 · పు. 581

إِلَىٰ قَدَرٍ مَعْلُومٍ22

ఒక నిర్ణీత కాలం వరకు.
77:23జుజ్ 29 · పు. 581

فَقَدَرْنَا فَنِعْمَ الْقَادِرُونَ23

ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము.
77:24జుజ్ 29 · పు. 581

وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ24

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
77:25జుజ్ 29 · పు. 581

أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا25

ఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా?
77:26జుజ్ 29 · పు. 581

أَحْيَاءً وَأَمْوَاتًا26

జీవులకూ మరియు మృతులకూను?
77:27జుజ్ 29 · పు. 581

وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُمْ مَاءً فُرَاتًا27

మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా?
77:28జుజ్ 29 · పు. 581

وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ28

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
77:29జుజ్ 29 · పు. 581

انْطَلِقُوا إِلَىٰ مَا كُنْتُمْ بِهِ تُكَذِّبُونَ29

(సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): "మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి!"
77:30జుజ్ 29 · పు. 581

انْطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ30

(దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి;
77:31జుజ్ 29 · పు. 581

لَا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ31

కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు!
77:32జుజ్ 29 · పు. 581

إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ32

వాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది.
77:33జుజ్ 29 · పు. 581

كَأَنَّهُ جِمَالَتٌ صُفْرٌ33

వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి.
77:34జుజ్ 29 · పు. 581

وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ34

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
77:35జుజ్ 29 · పు. 581

هَٰذَا يَوْمُ لَا يَنْطِقُونَ35

ఆ దినాన వారు మాట్లాడలేరు.
77:36జుజ్ 29 · పు. 581

وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ36

మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు.
77:37జుజ్ 29 · పు. 581

وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ37

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
77:38జుజ్ 29 · పు. 581

هَٰذَا يَوْمُ الْفَصْلِ ۖ جَمَعْنَاكُمْ وَالْأَوَّلِينَ38

అది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము!
77:39జుజ్ 29 · పు. 581

فَإِنْ كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ39

కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి.
77:40జుజ్ 29 · పు. 581

وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ40

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
77:41జుజ్ 29 · పు. 581

إِنَّ الْمُتَّقِينَ فِي ظِلَالٍ وَعُيُونٍ41

నిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు.
77:42జుజ్ 29 · పు. 581

وَفَوَاكِهَ مِمَّا يَشْتَهُونَ42

మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి.
77:43జుజ్ 29 · పు. 581

كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنْتُمْ تَعْمَلُونَ43

(వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి!"
77:44జుజ్ 29 · పు. 581

إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ44

నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము.
77:45జుజ్ 29 · పు. 581

وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ45

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
77:46జుజ్ 29 · పు. 581

كُلُوا وَتَمَتَّعُوا قَلِيلًا إِنَّكُمْ مُجْرِمُونَ46

(ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు!
77:47జుజ్ 29 · పు. 581

وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ47

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
77:48జుజ్ 29 · పు. 581

وَإِذَا قِيلَ لَهُمُ ارْكَعُوا لَا يَرْكَعُونَ48

మరియు వారితో: "(అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు.
77:49జుజ్ 29 · పు. 581

وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ49

ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
77:50జుజ్ 29 · పు. 581

فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ50

దీని (ఈ ఖుర్ఆన్) తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్నివిశ్వసిస్తారు?

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Fares Abbad - Al-Mursalat · Tlawati