36:1 · Ya-Sin జుజ్ 22 · పు. 440 يس 1
యా సీన్!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالْقُرْآنِ الْحَكِيمِ 2
వివేకంతో నిండి ఉన్న ఖుర్ఆన్ సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ 3
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు సందేశహరులలో ఒకడవు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ عَلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ 4
(నీవు) ఋజుమార్గంపై ఉన్నావు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ تَنْزِيلَ الْعَزِيزِ الرَّحِيمِ 5
ఇది (ఈ ఖుర్ఆన్) సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత ద్వారానే అవతరింపజేయబడింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لِتُنْذِرَ قَوْمًا مَا أُنْذِرَ آبَاؤُهُمْ فَهُمْ غَافِلُونَ 6
ఏ జాతి వారి తండ్రి తాతలైతే హెచ్చరిక చేయబడక, నిర్లక్ష్యులై ఉన్నారో, వారిని హెచ్చరించటానికి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَقَدْ حَقَّ الْقَوْلُ عَلَىٰ أَكْثَرِهِمْ فَهُمْ لَا يُؤْمِنُونَ 7
వాస్తవానికి వారిలో అనేకులను గురించి మా వాక్కు నిజం కానున్నది, కావున వారు విశ్వసించరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا جَعَلْنَا فِي أَعْنَاقِهِمْ أَغْلَالًا فَهِيَ إِلَى الْأَذْقَانِ فَهُمْ مُقْمَحُونَ 8
నిశ్చయంగా, మేము వారి మెడలలో పట్టాలు వేశాము. అవి వారి గడ్డాల వరకు వున్నాయి. కావున వారి తలలు నిక్కి వున్నాయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَعَلْنَا مِنْ بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُونَ 9
మరియు మేము వారి ముందు ఒక అడ్డు (తెరను) మరియు వారి వెనుక ఒక అడ్డు (తెర)ను నిలబెట్టాము. మరియు మేము వారిని కప్పి వేశాము అందువల్ల వారు ఏమీ చూడలేరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَسَوَاءٌ عَلَيْهِمْ أَأَنْذَرْتَهُمْ أَمْ لَمْ تُنْذِرْهُمْ لَا يُؤْمِنُونَ 10
మరియు నీవు వారిని హెచ్చరించినా, హెచ్చరించక పోయినా, వారికి సమానమే, వారు విశ్వసించరు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّمَا تُنْذِرُ مَنِ اتَّبَعَ الذِّكْرَ وَخَشِيَ الرَّحْمَٰنَ بِالْغَيْبِ ۖ فَبَشِّرْهُ بِمَغْفِرَةٍ وَأَجْرٍ كَرِيمٍ 11
నిశ్చయంగా, ఎవడైతే హితబోధను అనుసరిస్తూ, అగోచరుడైన కరుణామయునికి భయపడతాడో! అతనిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. అతనికి క్షమాభిక్ష మరియు మంచి ప్రతిఫలం (స్వర్గం) లభిస్తుందనే శుభవార్తను అందజేయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا نَحْنُ نُحْيِي الْمَوْتَىٰ وَنَكْتُبُ مَا قَدَّمُوا وَآثَارَهُمْ ۚ وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُبِينٍ 12
నిశ్చయంగా, మేము మృతులను సజీవులుగా చేస్తాము. మరియు మేము వారు చేసి పంపిన మరియు తమ వెనుక విడిచిన చిహ్నాలను కూడా వ్రాసి పెడుతున్నాము. మరియు ప్రతి విషయాన్ని మేము స్పష్టమైన గ్రంథంలో వ్రాసిపెడుతున్నాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاضْرِبْ لَهُمْ مَثَلًا أَصْحَابَ الْقَرْيَةِ إِذْ جَاءَهَا الْمُرْسَلُونَ 13
వారికి సందేశహరులను పంపిన ఆ నగరవాసుల గాథను వినిపించు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ أَرْسَلْنَا إِلَيْهِمُ اثْنَيْنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزْنَا بِثَالِثٍ فَقَالُوا إِنَّا إِلَيْكُمْ مُرْسَلُونَ 14
మేము వారి వద్దకు ఇద్దరిని పంపగా వారు ఆ ఇద్దరినీ అబద్ధీకులని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని మూడవ వానితో బలపరిచాము. అప్పుడు వారు, వారితో: "నిశ్చయంగా, మేము (మీ వద్దకు పంపబడిన) సందేశహరులం" అని అన్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا مَا أَنْتُمْ إِلَّا بَشَرٌ مِثْلُنَا وَمَا أَنْزَلَ الرَّحْمَٰنُ مِنْ شَيْءٍ إِنْ أَنْتُمْ إِلَّا تَكْذِبُونَ 15
(దానికి ఆ నగరవాసులు) ఇలా అన్నారు: "మీరు కేవలం మా వంటి మానవులే మరియు అనంత కరుణామయుడు మీపై ఏదీ (సందేశాన్నీ) అవతరింపజేయలేదు. మీరు కేవలం అబద్ధాలాడుతున్నారు?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا رَبُّنَا يَعْلَمُ إِنَّا إِلَيْكُمْ لَمُرْسَلُونَ 16
(ఆ ప్రవక్తలు) అన్నారు: "మా ప్రభువుకు తెలుసు, నిశ్చయంగా మేము మీ వద్దకు పంపబడిన సందేశహరులము!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا عَلَيْنَا إِلَّا الْبَلَاغُ الْمُبِينُ 17
మా బాధ్యత కేవలం మీకు స్పష్టంగా సందేశాన్ని అందజేయటమే!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا إِنَّا تَطَيَّرْنَا بِكُمْ ۖ لَئِنْ لَمْ تَنْتَهُوا لَنَرْجُمَنَّكُمْ وَلَيَمَسَّنَّكُمْ مِنَّا عَذَابٌ أَلِيمٌ 18
(ఆ నగరవాసులు) అన్నారు; "నిశ్చయంగా, మేము మిమ్మల్ని ఒక దుశ్శకునంగా పరిగణిస్తున్నాము. మీరు దీనిని మానుకోకపోతే మేము మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తాము. మరియు మా నుండి మీకు బాధాకరమైన శిక్ష పడుతుంది."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا طَائِرُكُمْ مَعَكُمْ ۚ أَئِنْ ذُكِّرْتُمْ ۚ بَلْ أَنْتُمْ قَوْمٌ مُسْرِفُونَ 19
(ఆ ప్రవక్తలు) అన్నారు: "మీ అపశకునం మీ వెంటనే ఉంది. మీకు చేసే హితబోధను (మీరు అపశకునంగా పరిగణిస్తున్నారా)? అది కాదు, అసలు మీరు మితిమీరి పోయిన ప్రజలు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَاءَ مِنْ أَقْصَى الْمَدِينَةِ رَجُلٌ يَسْعَىٰ قَالَ يَا قَوْمِ اتَّبِعُوا الْمُرْسَلِينَ 20
ఆ నగరపు దూర ప్రాంతం నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఈ సందశహరులను అనుసరించండి!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ اتَّبِعُوا مَنْ لَا يَسْأَلُكُمْ أَجْرًا وَهُمْ مُهْتَدُونَ 21
మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ కోరని వారిని (ఈ సందేశహరులను) అనుసరించండి! వారు సన్మార్గంలో ఉన్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا لِيَ لَا أَعْبُدُ الَّذِي فَطَرَنِي وَإِلَيْهِ تُرْجَعُونَ 22
"మరియు నన్ను సృష్టించిన ఆయనను నేనెందుకు ఆరాధించకూడదూ? మరియు మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَأَتَّخِذُ مِنْ دُونِهِ آلِهَةً إِنْ يُرِدْنِ الرَّحْمَٰنُ بِضُرٍّ لَا تُغْنِ عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنْقِذُونِ 23
ఏమీ? ఆయనను వదలి నేను ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకోవాలా? ఒకవేళ ఆ కరుణామయుడు నాకు హాని చేయదలచుకుంటే, వారి సిఫారసు నాకు ఏ మాత్రం ఉపయోగ పడదు మరియు వారు నన్ను కాపాడనూలేరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنِّي إِذًا لَفِي ضَلَالٍ مُبِينٍ 24
అలా చేస్తే నిశ్చయంగా, నేను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి పోయిన వాడిని అవుతాను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنِّي آمَنْتُ بِرَبِّكُمْ فَاسْمَعُونِ 25
నిశ్చయంగా, నేను మీ ప్రభువును విశ్వసిస్తున్నాను, కావున మీరు నా మాట వినండి!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قِيلَ ادْخُلِ الْجَنَّةَ ۖ قَالَ يَا لَيْتَ قَوْمِي يَعْلَمُونَ 26
(అతనిని వారు చంపిన తరువాత అతనితో) ఇలా అనబడింది: "నీవు స్వర్గంలో ప్రవేశించు." అతడు ఇలా అన్నాడు: "అయ్యో! నా జాతి వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుండేది!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ بِمَا غَفَرَ لِي رَبِّي وَجَعَلَنِي مِنَ الْمُكْرَمِينَ 27
నా ప్రభువు నన్ను క్షమించాడు మరియు నన్ను గౌరవనీయులలోకి ప్రవేశింపజేశాడు!" అనేది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ۞ وَمَا أَنْزَلْنَا عَلَىٰ قَوْمِهِ مِنْ بَعْدِهِ مِنْ جُنْدٍ مِنَ السَّمَاءِ وَمَا كُنَّا مُنْزِلِينَ 28
మరియు ఆ తరువాత అతని జాతి వారి మీదకు, మేము ఆకాశం నుండి ఏ సైన్యాన్నీ పంపలేదు. అసలు మాకు సైన్యాన్ని పంపే అవసరమే ఉండదు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنْ كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ خَامِدُونَ 29
అది కేవలం ఒక పెద్ద ధ్వని మాత్రమే! అంతే! వారంతా (ఒకేసారి) అంతం చేయబడ్డారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَا حَسْرَةً عَلَى الْعِبَادِ ۚ مَا يَأْتِيهِمْ مِنْ رَسُولٍ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ 30
ఆ దాసుల గతి ఎంత శోచనీయమయినది! వారి వద్దకు ఏ సందేశహరుడు వచ్చినా, వారు అతనిని ఎగతాళి చేయకుండా ఉండలేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا قَبْلَهُمْ مِنَ الْقُرُونِ أَنَّهُمْ إِلَيْهِمْ لَا يَرْجِعُونَ 31
ఏమీ? వారు చూడలేదా (వారికి తెలియదా)? వారికి ముందు మేము ఎన్నో తరాలను నాశనం చేశామని? నిశ్చయంగా, వారు (వారి పూర్వీకులు) ఎన్నటికీ వారి వద్దకు తిరిగి రాలేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنْ كُلٌّ لَمَّا جَمِيعٌ لَدَيْنَا مُحْضَرُونَ 32
కాని వారందరినీ కలిపి ఒకేసారి, మా ముందు హాజరు పరచడం జరుగుతుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَآيَةٌ لَهُمُ الْأَرْضُ الْمَيْتَةُ أَحْيَيْنَاهَا وَأَخْرَجْنَا مِنْهَا حَبًّا فَمِنْهُ يَأْكُلُونَ 33
మరియు వారి కొరకు సూచనగా జీవం లేని ఈ భూమియే ఉంది. మేము దీనికి ప్రాణం పోసి, దీని నుండి ధాన్యం తీస్తాము, దాన్ని వారు తింటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَعَلْنَا فِيهَا جَنَّاتٍ مِنْ نَخِيلٍ وَأَعْنَابٍ وَفَجَّرْنَا فِيهَا مِنَ الْعُيُونِ 34
మేము దీనిలో ఖర్జూరపు మరియు ద్రాక్ష వనాలను పెంచాము మరియు వాటిలో ఊటలను ప్రవహింపజేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لِيَأْكُلُوا مِنْ ثَمَرِهِ وَمَا عَمِلَتْهُ أَيْدِيهِمْ ۖ أَفَلَا يَشْكُرُونَ 35
వారు దీని ఫలాలను తినటానికి; మరియు ఇదంతా వారి చేతులు చేసింది కాదు. అయినా వారు కృతజ్ఞతలు తెలుపరా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ سُبْحَانَ الَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا مِمَّا تُنْبِتُ الْأَرْضُ وَمِنْ أَنْفُسِهِمْ وَمِمَّا لَا يَعْلَمُونَ 36
భూమి నుండి ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులలో, జీవులలో మరియు స్వయాన వారిలో (మానవులలో) ఇంకా వారికి తెలియని వాటిలోనూ (ఆడ-మగ) జతలను సృష్టించిన ఆయన (అల్లాహ్) లోపాలకు అతీతుడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَآيَةٌ لَهُمُ اللَّيْلُ نَسْلَخُ مِنْهُ النَّهَارَ فَإِذَا هُمْ مُظْلِمُونَ 37
మరియు వారి కొరకు మా సూచనలలో రాత్రి ఒకటి; మేము దానిపై నుండి పగటిని (వెలుగును) తొలగించి నప్పుడు, వారిని చీకటి ఆవరించుకుంటుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالشَّمْسُ تَجْرِي لِمُسْتَقَرٍّ لَهَا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ 38
మరియు సూర్యుడు తన నిర్ణీత పరిధిలో, నిర్ణీత కాలంలో పయనిస్తూ ఉంటాడు. ఇది ఆ సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని నియమావళి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالْقَمَرَ قَدَّرْنَاهُ مَنَازِلَ حَتَّىٰ عَادَ كَالْعُرْجُونِ الْقَدِيمِ 39
మరియు చంద్రుని కొరకు మేము దశలను నియమించాము, చివరకు అతడు ఎండిన ఖర్జురపు మట్ట వలే అయిపోతాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَا الشَّمْسُ يَنْبَغِي لَهَا أَنْ تُدْرِكَ الْقَمَرَ وَلَا اللَّيْلُ سَابِقُ النَّهَارِ ۚ وَكُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ 40
చంద్రుణ్ణి అందుకోవటం సూర్యుడి తరం కాదు. మరియు రాత్రి పగటిని అధిగమించ జాలదు. మరియు అవన్నీ తమ తమ కక్ష్యలలో సంచరిస్తూ ఉంటాయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَآيَةٌ لَهُمْ أَنَّا حَمَلْنَا ذُرِّيَّتَهُمْ فِي الْفُلْكِ الْمَشْحُونِ 41
వారికి మరొక సూచన ఏమిటంటే, నిశ్చయంగా, మేము వారి సంతతిని (నూహ్ యొక్క) నిండు నావ లోనికి ఎక్కించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَخَلَقْنَا لَهُمْ مِنْ مِثْلِهِ مَا يَرْكَبُونَ 42
మరియు మేము వారు ఎక్కి ప్రయాణం చేయటానికి, ఇటువంటి వాటిని ఎన్నో సృష్టించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنْ نَشَأْ نُغْرِقْهُمْ فَلَا صَرِيخَ لَهُمْ وَلَا هُمْ يُنْقَذُونَ 43
మరియు మేము కోరినట్లయితే, వారిని ముంచి వేసే వారము; అప్పుడు వారి కేకలు వినేవాడెవడూ ఉండడు మరియు వారు రక్షింపబడనూ లేరు -
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا رَحْمَةً مِنَّا وَمَتَاعًا إِلَىٰ حِينٍ 44
మేము కరుణిస్తే తప్ప - మరియు మేము కొంత కాలం వరకు వారికి వ్యవధినిస్తే తప్ప!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ لَعَلَّكُمْ تُرْحَمُونَ 45
మరియు వారితో: "మీరు, మీ ముందున్న దానికీ (ఇహలోక శిక్షకూ) మరియు మీ వెనుక రానున్న దానికీ (పరలోక శిక్షకూ) భీతిపరులై ఉండండి, బహుశా మీరు కరుణింప బడవచ్చు!" అని అన్నప్పుడు, (వారు లక్ష్యం చేయటం లేదు).
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا تَأْتِيهِمْ مِنْ آيَةٍ مِنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ 46
మరియు వారి ప్రభువు సూచనలలో నుండి, వారి వద్దకు ఏ సూచన వచ్చినా, వారు దాని నుండి ముఖం త్రిప్పుకోకుండా ఉండలేదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِذَا قِيلَ لَهُمْ أَنْفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَنُطْعِمُ مَنْ لَوْ يَشَاءُ اللَّهُ أَطْعَمَهُ إِنْ أَنْتُمْ إِلَّا فِي ضَلَالٍ مُبِينٍ 47
మరియు వారితో: "అల్లాహ్ మీకు ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేయండి." అని అన్నప్పుడు, సత్యతిరస్కారులు విశ్వాసులతో అంటారు: "ఏమీ? అల్లాహ్ కోరితే, తానే తినిపించగల వారికి, మేము తినిపించాలా? మీరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِنْ كُنْتُمْ صَادِقِينَ 48
వారు ఇంకా ఇలా అంటారు: "మీరు సత్యవంతులే అయితే, ఆ వాగ్దానం (పునరుత్థానం) ఎప్పుడు పూర్తి కానున్నది?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا يَنْظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّمُونَ 49
వారు నిరీక్షిస్తున్నది కేవలం ఒక పెద్ద ధ్వని కొరకే. మరియు వారు వాదులాడుకుంటూ ఉండగానే, అది వారిని చిక్కించుకుంటుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَىٰ أَهْلِهِمْ يَرْجِعُونَ 50
వారు ఏ విధమైన వీలునామా కూడా వ్రాయలేరు మరియు తమ కుటుంబం వారి వద్దకు కూడా తిరిగి పోలేరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُمْ مِنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنْسِلُونَ 51
మరియు (మరొకసారి) బాకా ఊదబడి నప్పుడు, వారంతా గోరీల నుండి (లేచి) తమ ప్రభువు వైపునకు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا يَا وَيْلَنَا مَنْ بَعَثَنَا مِنْ مَرْقَدِنَا ۜ ۗ هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ 52
వారంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా పడకల నుండి లేపి ఎవరు నిలబెట్టారు?" (వారితో అనబడుతుంది): "ఇదే ఆ కరుణామయుడు చేసిన వాగ్దానం. మరియు అతని సందేశహరులు సత్యమే పలికారు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنْ كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ جَمِيعٌ لَدَيْنَا مُحْضَرُونَ 53
అది కేవలం ఒక పెద్ద ధ్వని మాత్రమే అయి ఉంటుంది! వెంటనే వారంతా మా ముందు హాజరు చేయబడతారు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَالْيَوْمَ لَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَلَا تُجْزَوْنَ إِلَّا مَا كُنْتُمْ تَعْمَلُونَ 54
ఆ రోజు ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం జరుగదు. మరియు మీ కర్మలకు తగినది తప్ప, మరే ప్రతిఫలమివ్వబడదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ 55
నిశ్చయంగా, ఆ రోజు స్వర్గవాసులు సుఖసంతోషాలలో నిమగ్నులై ఉంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هُمْ وَأَزْوَاجُهُمْ فِي ظِلَالٍ عَلَى الْأَرَائِكِ مُتَّكِئُونَ 56
వారు మరియు వారి సహవాసులు (అజ్వాజ్), చల్లని నీడలలో, ఆనుడు ఆసనాల మీద హాయిగా కూర్చొని ఉంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُمْ مَا يَدَّعُونَ 57
అందులో వారికి ఫలాలు మరియు వారు కోరే వన్నీ ఉంటాయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ سَلَامٌ قَوْلًا مِنْ رَبٍّ رَحِيمٍ 58
"మీకు శాంతి కలుగుగాక (సలాం)!" అనే పలుకులు అపార కరుణా ప్రదాత అయిన ప్రభువు తరఫు నుండి వస్తాయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَامْتَازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ 59
ఇంకా (ఇలా అనబడుతుంది): "ఓ అపరాధులారా! ఈనాడు మీరు వేరయి పొండి."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ۞ أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَنْ لَا تَعْبُدُوا الشَّيْطَانَ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ 60
"ఓ ఆదమ్ సంతతివారలారా: 'షైతానును ఆరాధించకండి' అని నేను మిమ్మల్ని ఆదేశించలేదా? నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَنِ اعْبُدُونِي ۚ هَٰذَا صِرَاطٌ مُسْتَقِيمٌ 61
"మరియు మీరు నన్నే ఆరాధించండి. ఇదే ఋమార్గమనీ!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَقَدْ أَضَلَّ مِنْكُمْ جِبِلًّا كَثِيرًا ۖ أَفَلَمْ تَكُونُوا تَعْقِلُونَ 62
"మరియు వాస్తవానికి వాడు (షైతాన్) మీలో పెద్ద సమూహాన్ని దారి తప్పించాడు. ఏమీ? మీకు తెలివి లేక పోయిందా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هَٰذِهِ جَهَنَّمُ الَّتِي كُنْتُمْ تُوعَدُونَ 63
"మీకు వాగ్దానం చేయబడిన ఆ నరకం ఇదే!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ اصْلَوْهَا الْيَوْمَ بِمَا كُنْتُمْ تَكْفُرُونَ 64
"మీరు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నందుకు, ఈ రోజు దీనిలో ప్రవేశించండి (కాలండి)."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ الْيَوْمَ نَخْتِمُ عَلَىٰ أَفْوَاهِهِمْ وَتُكَلِّمُنَا أَيْدِيهِمْ وَتَشْهَدُ أَرْجُلُهُمْ بِمَا كَانُوا يَكْسِبُونَ 65
ఆ రోజు మేము వారి నోళ్ళ మీద ముద్ర వేస్తాము. మరియు వారేమి అర్జించారో వారి చేతులు మాతో చెబుతాయి మరియు వారి కాళ్ళు మా ముందు సాక్ష్యమిస్తాయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَوْ نَشَاءُ لَطَمَسْنَا عَلَىٰ أَعْيُنِهِمْ فَاسْتَبَقُوا الصِّرَاطَ فَأَنَّىٰ يُبْصِرُونَ 66
మరియు మేము కోరినట్లయితే, వారి దృష్టిని నిర్మూలించే వారము, అప్పుడు వారు దారి కొరకు పెనుగులాడే వారు, కాని వారు ఎలా చూడగలిగే వారు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَوْ نَشَاءُ لَمَسَخْنَاهُمْ عَلَىٰ مَكَانَتِهِمْ فَمَا اسْتَطَاعُوا مُضِيًّا وَلَا يَرْجِعُونَ 67
మరియు మేము కోరినట్లయితే, వారిని వారి స్థానంలోనే రూపాన్ని మార్చి ఉంచే వారం, అప్పుడు వారు ముందుకూ పోలేరు మరియు వెనుకకూ మరలలేరు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَنْ نُعَمِّرْهُ نُنَكِّسْهُ فِي الْخَلْقِ ۖ أَفَلَا يَعْقِلُونَ 68
మరియు మేము ఎవరికి దీర్ఘాయువు నొసంగుతామో, అతని శారీరక రూపాన్ని మార్చుతాము. ఏమీ? వారు ఇది కూడా గ్రహించలేరా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا عَلَّمْنَاهُ الشِّعْرَ وَمَا يَنْبَغِي لَهُ ۚ إِنْ هُوَ إِلَّا ذِكْرٌ وَقُرْآنٌ مُبِينٌ 69
మరియు మేము అతనికి (ముహమ్మద్ కు) కవిత్వం నేర్పలేదు. మరియు అది అతనికి శోభించదు కూడా! ఇది కేవలం ఒక హితోపదేశం మరియు స్పష్టమైన పఠన గ్రంథం (ఖుర్ఆన్) మాత్రమే.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لِيُنْذِرَ مَنْ كَانَ حَيًّا وَيَحِقَّ الْقَوْلُ عَلَى الْكَافِرِينَ 70
బ్రతికి వున్న ప్రతివానికి హెచ్చరిక చేయటానికి మరియు సత్యతిరస్కారుల ఎడల మా ఆదేశాన్ని నిరూపించటానికి!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَوَلَمْ يَرَوْا أَنَّا خَلَقْنَا لَهُمْ مِمَّا عَمِلَتْ أَيْدِينَا أَنْعَامًا فَهُمْ لَهَا مَالِكُونَ 71
ఏమీ, వారికి తెలియదా? నిశ్చయంగా, మేము వారికి వారి కొరకు మా చేతులతో పశువులను సృష్టించి, తరువాత వాటిపై వారికి యాజమాన్యం ఇచ్చామని?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَذَلَّلْنَاهَا لَهُمْ فَمِنْهَا رَكُوبُهُمْ وَمِنْهَا يَأْكُلُونَ 72
మరియు వాటిని, వారికి స్వాధీనపరిచాము. కావున వాటిలో కొన్నిటిపై వారు స్వారీ చేస్తారు, మరికొన్నిటిని (వాటి మాంసాన్ని) వారు తింటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبُ ۖ أَفَلَا يَشْكُرُونَ 73
మరియు వాటిలో వారికి ఎన్నో ప్రయోజనాలు మరియు పానీయాలు (పాలు) ఉన్నాయి. అయినా, వారెందుకు కృతజ్ఞతలు చూపరు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاتَّخَذُوا مِنْ دُونِ اللَّهِ آلِهَةً لَعَلَّهُمْ يُنْصَرُونَ 74
మరియు వారు అల్లాహ్ ను వదలి, ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు. బహుశా వారి వలన తమకు సహాయం దొరకుతుందేమోననే ఆశతో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَا يَسْتَطِيعُونَ نَصْرَهُمْ وَهُمْ لَهُمْ جُنْدٌ مُحْضَرُونَ 75
వారు (ఆ దైవాలు), తమకెలాంటి సహాయ చేయలేరు. అయినా! వీరు (సత్యతిరస్కారులు) వారి (ఆ దైవాల) కొరకు సైన్యం మాదిరిగా సర్వసన్నద్ధులై ఉన్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَا يَحْزُنْكَ قَوْلُهُمْ ۘ إِنَّا نَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ 76
కావున (ఓ ముహమ్మద్!) వారి మాటలు నిన్ను బాధింపనివ్వరాదు. వాస్తవానికి! మాకు, వారు దాచేవి మరియు వెలిబుచ్చేవీ అన్నీ బాగా తెలుసు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَوَلَمْ يَرَ الْإِنْسَانُ أَنَّا خَلَقْنَاهُ مِنْ نُطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُبِينٌ 77
ఏమీ? మానవుడు ఎరుగడా? నిశ్చయంగా, మేము అతనిని వీర్యబిందువుతో సృష్టించామని? అయినా! అతడు బహిరంగ ప్రత్యర్థిగా తయారయ్యాడు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَضَرَبَ لَنَا مَثَلًا وَنَسِيَ خَلْقَهُ ۖ قَالَ مَنْ يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ 78
మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరలిపోయాడు. అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قُلْ يُحْيِيهَا الَّذِي أَنْشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ 79
ఇలా అను: "మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయనకు, ప్రతి దానిని సృష్టించే జ్ఞానముంది."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ الَّذِي جَعَلَ لَكُمْ مِنَ الشَّجَرِ الْأَخْضَرِ نَارًا فَإِذَا أَنْتُمْ مِنْهُ تُوقِدُونَ 80
ఆయనే పచ్చని చెట్టు నుండి మీ కొరకు అగ్నిని పుట్టించేవాడు, తరువాత మీరు దాని నుండి మంటను వెలిగించుకుంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَوَلَيْسَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِقَادِرٍ عَلَىٰ أَنْ يَخْلُقَ مِثْلَهُمْ ۚ بَلَىٰ وَهُوَ الْخَلَّاقُ الْعَلِيمُ 81
ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించగలవాడు, వాటి లాంటి వాటిని మరల సృష్టించలేడా? ఎందుకు చేయలేడు! ఆయనే సర్వసృష్టికర్త, సర్వజ్ఞుడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّمَا أَمْرُهُ إِذَا أَرَادَ شَيْئًا أَنْ يَقُولَ لَهُ كُنْ فَيَكُونُ 82
నిశ్చయంగా, ఆయన విధానమేమిటంటే! ఆయన ఏదైనా చేయదలచు కున్నప్పుడు దానితో: "అయిపో!" అని అంటాడు, అంతే! అది అయిపోతుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَسُبْحَانَ الَّذِي بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَإِلَيْهِ تُرْجَعُونَ 83
ఎందుకంటే! సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) చేతిలో ప్రతిదానికి సంబంధించిన సర్వాధికారాలు ఉన్నాయి మరియు మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్