Al-Furqan

سورة الفرقان

సూరా 25 · మక్కీ · 77 ఆయత్‌లు

25:1జుజ్ 18 · పు. 359

تَبَارَكَ الَّذِي نَزَّلَ الْفُرْقَانَ عَلَىٰ عَبْدِهِ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا1

సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా, ఈ గీటురాయిని (ఫుర్ఖాన్ ను) తన దాసునిపై క్రమక్రమంగా అవతరింపజేసిన ఆయన (అల్లాహ్) ఎంతో శుభదాయకుడు!
25:2జుజ్ 18 · పు. 359

الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُنْ لَهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَخَلَقَ كُلَّ شَيْءٍ فَقَدَّرَهُ تَقْدِيرًا2

భూమ్యాకాశాల విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవ్వరినీ సంతానంగా చేసుకోలేదు. విశ్వసామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి, దానికొక విధిని నిర్ణయించాడు.
25:3జుజ్ 18 · పు. 360

وَاتَّخَذُوا مِنْ دُونِهِ آلِهَةً لَا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَمْلِكُونَ لِأَنْفُسِهِمْ ضَرًّا وَلَا نَفْعًا وَلَا يَمْلِكُونَ مَوْتًا وَلَا حَيَاةً وَلَا نُشُورًا3

అయినా వారు ఆయనకు బదులుగా ఏమీ సృష్టించలేని మరియు తామే సృష్టింపబడిన వారిని ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. మరియు వారు తమకు తాము ఎట్టి నష్టం గానీ, లాభం గానీ చేసుకోజాలరు. మరియు వారికి మరణం మీద గానీ, జీవితం మీద గానీ మరియు పునరుత్థాన దినం మీద గానీ, ఎలాంటి అధికారం లేదు.
25:4జుజ్ 18 · పు. 360

وَقَالَ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا إِفْكٌ افْتَرَاهُ وَأَعَانَهُ عَلَيْهِ قَوْمٌ آخَرُونَ ۖ فَقَدْ جَاءُوا ظُلْمًا وَزُورًا4

మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: "ఇది (ఈ ఖుర్ఆన్) కేవలం ఒక బూటక కల్పన; దీనిని ఇతనే కల్పించాడు. మరియు ఇతర జాతివారు కొందరు, ఇతనికి ఈ పనిలో సహాయపడ్డారు. కాని వాస్తవానికి వారు అన్యాయానికి మరియు అబద్ధానికి పూనుకున్నారు."
25:5జుజ్ 18 · పు. 360

وَقَالُوا أَسَاطِيرُ الْأَوَّلِينَ اكْتَتَبَهَا فَهِيَ تُمْلَىٰ عَلَيْهِ بُكْرَةً وَأَصِيلًا5

మరియు వారింకా ఇలా అంటారు: "ఇవి పూర్వీకుల గాథలు, వాటిని ఇతను వ్రాసుకున్నాడు, ఇవి ఇతనికి ఉదయం మరియు సాయంత్రం చెప్పి వ్రాయించబడుతున్నాయి."
25:6జుజ్ 18 · పు. 360

قُلْ أَنْزَلَهُ الَّذِي يَعْلَمُ السِّرَّ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ إِنَّهُ كَانَ غَفُورًا رَحِيمًا6

వారితో ఇలా అను: "దీనిని (ఈ ఖుర్ఆన్ ను) భూమ్యాకాశాల రహస్యాలు తెలిసిన వాడు అవతరింపజేశాడు. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."
25:7జుజ్ 18 · పు. 360

وَقَالُوا مَالِ هَٰذَا الرَّسُولِ يَأْكُلُ الطَّعَامَ وَيَمْشِي فِي الْأَسْوَاقِ ۙ لَوْلَا أُنْزِلَ إِلَيْهِ مَلَكٌ فَيَكُونَ مَعَهُ نَذِيرًا7

మరియు వారిలా అంటారు: "ఇతను ఎటువంటి సందేశహరుడు, (సాధారణ వ్యక్తివలే) ఇతనూ అన్నం తింటున్నాడు మరియు వీధులలో తిరుగుతున్నాడు? (ఇతను వాస్తవంగానే దైవప్రవక్త అయితే) ఇతనికి తోడుగా హెచ్చరిక చేసేవాడిగా, ఒక దేవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు?"
25:8జుజ్ 18 · పు. 360

أَوْ يُلْقَىٰ إِلَيْهِ كَنْزٌ أَوْ تَكُونُ لَهُ جَنَّةٌ يَأْكُلُ مِنْهَا ۚ وَقَالَ الظَّالِمُونَ إِنْ تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَسْحُورًا8

లేదా ఇతనికొక నిధి ఎందుకు ఇవ్వబడలేదు? లేదా ఇతనికొక తోట ఎందుకు ఇవ్వబడలేదు? ఇతను దాని నుండి తినటానికి!" ఆ దుర్మార్గులు ఇంకా ఇలా అంటారు :"మీరు కేవలం ఒక మంత్రజాలానికి గురి అయిన మానవుణ్ణి అనుసరిస్తున్నారు."
25:9జుజ్ 18 · పు. 360

انْظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثَالَ فَضَلُّوا فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا9

(ఓ ప్రవక్తా!) చూడు వారు నిన్ను గురించి ఎటువంటి ఉదాహరణలు ఇస్తున్నారు? వారు మార్గభ్రష్టులై పోయారు, వారు ఋజుమార్గం పొందజాలరు.
25:10జుజ్ 18 · పు. 360

تَبَارَكَ الَّذِي إِنْ شَاءَ جَعَلَ لَكَ خَيْرًا مِنْ ذَٰلِكَ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ وَيَجْعَلْ لَكَ قُصُورًا10

ఆ శుభదాయకుడు కోరితే నీకు వాటి కంటే ఉత్తమమైన వాటిని ప్రసాదించగలడు - స్వర్గవనాలు - వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి మరియు అక్కడ నీ కొరకు పెద్ద కోటలు కూడా ఉంటాయి.
25:11జుజ్ 18 · పు. 360

بَلْ كَذَّبُوا بِالسَّاعَةِ ۖ وَأَعْتَدْنَا لِمَنْ كَذَّبَ بِالسَّاعَةِ سَعِيرًا11

వాస్తవానికి వారు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించారు. మరియు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించే వారి కొరకు మేము జ్వలించే నరకాగ్నిని సిద్ధపరచి ఉంచాము.
25:12జుజ్ 18 · పు. 361

إِذَا رَأَتْهُمْ مِنْ مَكَانٍ بَعِيدٍ سَمِعُوا لَهَا تَغَيُّظًا وَزَفِيرًا12

అది, దూరం నుండి వారిని చూసినప్పుడు వారు దాని ఆవేశ ధ్వనులను మరియు దాని బుసను వింటారు.
25:13జుజ్ 18 · పు. 361

وَإِذَا أُلْقُوا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُقَرَّنِينَ دَعَوْا هُنَالِكَ ثُبُورًا13

మరియు దానిలోని ఒక ఇరుకైన స్థలంలో, వారు బంధింపబడి, త్రోయబడినప్పుడు వారక్కడ తమ చావును పిలువడం ప్రారంభిస్తారు.
25:14జుజ్ 18 · పు. 361

لَا تَدْعُوا الْيَوْمَ ثُبُورًا وَاحِدًا وَادْعُوا ثُبُورًا كَثِيرًا14

వారితో అనబడుతుంది: "ఈ రోజు మీరు ఒక్క చావును పిలువకండి, ఎన్నో చావుల కొరకు అరవండి!"
25:15జుజ్ 18 · పు. 361

قُلْ أَذَٰلِكَ خَيْرٌ أَمْ جَنَّةُ الْخُلْدِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۚ كَانَتْ لَهُمْ جَزَاءً وَمَصِيرًا15

వారితో అను: "ఏమీ? ఇది మంచిదా, లేతా దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన శాశ్వతమైన స్వర్గమా? అదే (దైవభీతి గల) వారి ప్రతిఫలం మరియు గమ్యస్థానం.
25:16జుజ్ 18 · పు. 361

لَهُمْ فِيهَا مَا يَشَاءُونَ خَالِدِينَ ۚ كَانَ عَلَىٰ رَبِّكَ وَعْدًا مَسْئُولًا16

అందులో వారికి వారు కోరింది లభిస్తుంది. వారందు శాశ్వతంగా వుంటారు. ఇది నీ ప్రభువు కర్తవ్యంతో పూర్తి చేయవలసిన వాగ్దానం.
25:17జుజ్ 18 · పు. 361

وَيَوْمَ يَحْشُرُهُمْ وَمَا يَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ فَيَقُولُ أَأَنْتُمْ أَضْلَلْتُمْ عِبَادِي هَٰؤُلَاءِ أَمْ هُمْ ضَلُّوا السَّبِيلَ17

మరియు ఆయన (అల్లాహ్) వారిని (సత్యతిరస్కారులను) మరియు అల్లాహ్ కు బదులుగా వారు ఆరాధించేవారిని, అందరినీ, ఆ రోజు సమావేశపరచి వారితో ఇలా అంటాడు: " ఏమీ? మీరేనా నా దాసులను మార్గం తప్పించిన వారు? లేక స్వయంగా వారే మార్గభ్రష్టులయ్యారా?"
25:18జుజ్ 18 · పు. 361

قَالُوا سُبْحَانَكَ مَا كَانَ يَنْبَغِي لَنَا أَنْ نَتَّخِذَ مِنْ دُونِكَ مِنْ أَوْلِيَاءَ وَلَٰكِنْ مَتَّعْتَهُمْ وَآبَاءَهُمْ حَتَّىٰ نَسُوا الذِّكْرَ وَكَانُوا قَوْمًا بُورًا18

వారంటారు: "ఓ మా ప్రభూ! నీవు సర్వలోపాలకు అతీతుడవు! మేము నిన్ను వదలి ఇతరులను మా సంరక్షకులుగా చేసుకోవటం మాకు తగినది కాదు, కాని నీవు వారికి మరియు వారి తండ్రితాతలకు చాలా సుఖసంతోషాలను ప్రసాదించావు, చివరకు వారు నీ బోధననే మరచి పోయి నాశనానికి గురి అయిన వారయ్యారు."
25:19జుజ్ 18 · పు. 361

فَقَدْ كَذَّبُوكُمْ بِمَا تَقُولُونَ فَمَا تَسْتَطِيعُونَ صَرْفًا وَلَا نَصْرًا ۚ وَمَنْ يَظْلِمْ مِنْكُمْ نُذِقْهُ عَذَابًا كَبِيرًا19

(అప్పుడు అల్లాహ్ అంటాడు): "కాని ఇప్పడైతే వారు, మీ మాటలను అసత్యాలని తిరస్కరిస్తున్నారు. ఇక మీరు మీ శిక్ష నుండి తప్పించుకోలేరు మరియు ఎలాంటి సహాయమూ పొందలేరు. మరియు మీలో దుర్మార్గానికి పాల్పడిన వానికి మేము ఘోరశిక్ష రుచి చూపుతాము!"
25:20జుజ్ 18 · పు. 361

وَمَا أَرْسَلْنَا قَبْلَكَ مِنَ الْمُرْسَلِينَ إِلَّا إِنَّهُمْ لَيَأْكُلُونَ الطَّعَامَ وَيَمْشُونَ فِي الْأَسْوَاقِ ۗ وَجَعَلْنَا بَعْضَكُمْ لِبَعْضٍ فِتْنَةً أَتَصْبِرُونَ ۗ وَكَانَ رَبُّكَ بَصِيرًا20

మరియు (ఓ ముహమ్మద్!) మేము నీకు పూర్వం పంపిన సందేశహరులు అందరూ నిశ్చయంగా, ఆహారం తినేవారే, వీధులలో సంచరించేవారే. మరియు మేము మిమ్మల్ని ఒకరిని మరొకరి కొరకు పరీక్షా సాధనాలుగా చేశాము; ఏమీ? మీరు సహనం వహిస్తారా? మరియు వాస్తవానికి, నీ ప్రభువు సర్వం చూసేవాడు.
25:21జుజ్ 19 · పు. 362

۞ وَقَالَ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا لَوْلَا أُنْزِلَ عَلَيْنَا الْمَلَائِكَةُ أَوْ نَرَىٰ رَبَّنَا ۗ لَقَدِ اسْتَكْبَرُوا فِي أَنْفُسِهِمْ وَعَتَوْا عُتُوًّا كَبِيرًا21

మరియు మమ్మల్ని కలుసుకోవలసి ఉందని ఆశించనివారు ఇలా అన్నారు: "దేవదూతలు మా వద్దకు ఎందుకు పంపబడలేదు? లేదా మేము మా ప్రభువును ఎందుకు చూడలేము?" వాస్తవానికి, వారు తమను తాము చాలా గొప్పవారిగా భావించారు మరియు వారు తలబిరుసుతనంలో చాలా మితిమీరి పోయారు.
25:22జుజ్ 19 · పు. 362

يَوْمَ يَرَوْنَ الْمَلَائِكَةَ لَا بُشْرَىٰ يَوْمَئِذٍ لِلْمُجْرِمِينَ وَيَقُولُونَ حِجْرًا مَحْجُورًا22

ఆ రోజు వారు దేవదూతలను చూస్తారు; ఆరోజు అపరాధులకు ఎలాంటి శుభవార్తలు ఉండవు మరియు వారు (దేవదూతలు) ఇలా అంటారు: "మీకు శుభవార్తలన్నీ ఖచ్చితంగా నిషేధించబడ్డాయి."
25:23జుజ్ 19 · పు. 362

وَقَدِمْنَا إِلَىٰ مَا عَمِلُوا مِنْ عَمَلٍ فَجَعَلْنَاهُ هَبَاءً مَنْثُورًا23

మరియు మేము, వారు (అవిశ్వాసులు) చేసిన కార్యాల వైపుకు మరలుతాము, తరువాత వాటిని సూక్ష్మకణాల వలే (ధూళి వలే) ఎగురవేస్తాము.
25:24జుజ్ 19 · పు. 362

أَصْحَابُ الْجَنَّةِ يَوْمَئِذٍ خَيْرٌ مُسْتَقَرًّا وَأَحْسَنُ مَقِيلًا24

ఆ దినమున స్వర్గానికి అర్హులైన వారు మంచి నివాసంలో మరియు ఉత్తమ విశ్రాంతి స్థలంలో ఉంటారు.
25:25జుజ్ 19 · పు. 362

وَيَوْمَ تَشَقَّقُ السَّمَاءُ بِالْغَمَامِ وَنُزِّلَ الْمَلَائِكَةُ تَنْزِيلًا25

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు ఆకాశం మేఘాలతో సహా బ్రద్దలు చేయబడుతుంది. మరియు దేవదూతలు వరుసగా దింపబడతారు.
25:26జుజ్ 19 · పు. 362

الْمُلْكُ يَوْمَئِذٍ الْحَقُّ لِلرَّحْمَٰنِ ۚ وَكَانَ يَوْمًا عَلَى الْكَافِرِينَ عَسِيرًا26

ఆ రోజు వాస్తవమైన విశ్వ సామ్రాజ్యాధిపత్యం కేవలం ఆ అనంత కరుణామయునిదే! సత్యతిరస్కారులకు ఆ దినం ఎంతో కఠినమైనదిగా ఉంటుంది.
25:27జుజ్ 19 · పు. 362

وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلَىٰ يَدَيْهِ يَقُولُ يَا لَيْتَنِي اتَّخَذْتُ مَعَ الرَّسُولِ سَبِيلًا27

మరియు (జ్ఞాపకముంచుకోండి), ఆ దినమున దుర్మార్గుడు తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: "అయ్యో! నేను సందేశహరుని మార్గం అనుసరిస్తే, ఎంత బాగుండేది!"
25:28జుజ్ 19 · పు. 362

يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا28

"అయ్యో! నా దౌర్భాగ్యం! నేను ఫలానా వానిని స్నేహితునిగా చేసుకోకుండా వుంటే ఎంత బాగుండేది!"
25:29జుజ్ 19 · పు. 362

لَقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنْسَانِ خَذُولًا29

"వాస్తవానికి అతడే, హితబోధ (ఖుర్ఆన్) నా వద్దకు వచ్చిన తరువాత కూడా, నన్ను దాని నుండి తప్పించాడు! వాస్తవానికి షైతాన్ మానవుని యెడల నమ్మకద్రోహి."
25:30జుజ్ 19 · పు. 362

وَقَالَ الرَّسُولُ يَا رَبِّ إِنَّ قَوْمِي اتَّخَذُوا هَٰذَا الْقُرْآنَ مَهْجُورًا30

అప్పుడు సందేశహరుడు ఇలా అంటాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నా జాతివారు ఈ ఖుర్ఆన్ ను పూర్తిగా వదలి పెట్టారు."
25:31జుజ్ 19 · పు. 362

وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا مِنَ الْمُجْرِمِينَ ۗ وَكَفَىٰ بِرَبِّكَ هَادِيًا وَنَصِيرًا31

మరియు ఈ విధంగా మేము అపరాధుల నుండి ప్రతి ప్రవక్తకూ శత్రువులను నియమించాము. మరియు నీ ప్రభువే, నీకు మార్గదర్శకుడిగా మరియు సహాయకుడిగా చాలు!
25:32జుజ్ 19 · పు. 362

وَقَالَ الَّذِينَ كَفَرُوا لَوْلَا نُزِّلَ عَلَيْهِ الْقُرْآنُ جُمْلَةً وَاحِدَةً ۚ كَذَٰلِكَ لِنُثَبِّتَ بِهِ فُؤَادَكَ ۖ وَرَتَّلْنَاهُ تَرْتِيلًا32

మరియు సత్యతిరస్కారులు అంటారు: "ఇతని (ముహమ్మద్) మీద ఈ ఖుర్ఆన్ పూర్తిగా ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు?" మేము (ఈ ఖుర్ఆన్ ను) ఈ విధంగా (భాగాలుగా పంపింది) నీ హృదయాన్ని దృఢపరచడానికి మరియు మేము దీనిని క్రమక్రమంగా అవతరింపజేశాము.
25:33జుజ్ 19 · పు. 363

وَلَا يَأْتُونَكَ بِمَثَلٍ إِلَّا جِئْنَاكَ بِالْحَقِّ وَأَحْسَنَ تَفْسِيرًا33

మరియు వారు నీ వద్దకు (నిన్ను వ్యతిరేకించటానికి) ఎలాంటి ఉపమానాన్ని తెచ్చినా! మేము నీకు దానికి సరైన జవాబు మరియు ఉత్తమమైన వ్యాఖ్యానం ఇవ్వకుండా ఉండము.
25:34జుజ్ 19 · పు. 363

الَّذِينَ يُحْشَرُونَ عَلَىٰ وُجُوهِهِمْ إِلَىٰ جَهَنَّمَ أُولَٰئِكَ شَرٌّ مَكَانًا وَأَضَلُّ سَبِيلًا34

ఎవరైతే, వారి ముఖాల మీద (బోర్లా పడవేయబడి) లాగుతూ నరకంలో కూడబెట్ట బడతారో, అలాంటి వారు ఎంతో దుస్థితిలో మరియు మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నవారు.
25:35జుజ్ 19 · పు. 363

وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَا مَعَهُ أَخَاهُ هَارُونَ وَزِيرًا35

మరియు నిశ్చయంగా, మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము మరియు అతని సోదరుడైన హారూన్ ను అతనికి సహాయకునిగా చేశాము.
25:36జుజ్ 19 · పు. 363

فَقُلْنَا اذْهَبَا إِلَى الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا فَدَمَّرْنَاهُمْ تَدْمِيرًا36

వారిద్దరితో ఇలా అన్నాము: "మీరిద్దరూ మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన జాతి వారి వద్దకు వెళ్ళండి." తరువాత మేము (ఆ జాతి) వారిని పూర్తిగా నాశనం చేశాము.
25:37జుజ్ 19 · పు. 363

وَقَوْمَ نُوحٍ لَمَّا كَذَّبُوا الرُّسُلَ أَغْرَقْنَاهُمْ وَجَعَلْنَاهُمْ لِلنَّاسِ آيَةً ۖ وَأَعْتَدْنَا لِلظَّالِمِينَ عَذَابًا أَلِيمًا37

ఇక నూహ్ జాతి వారు: ఎప్పుడైతే వారు ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించారో, మేము వారిని ముంచి వేసి, సర్వజనులకు వారిని ఒక సూచనగా చేశాము. మరియు దుర్మార్గుల కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధ పరిచి ఉంచాము.
25:38జుజ్ 19 · పు. 363

وَعَادًا وَثَمُودَ وَأَصْحَابَ الرَّسِّ وَقُرُونًا بَيْنَ ذَٰلِكَ كَثِيرًا38

మరియు ఇదే విధంగా ఆద్ మరియు సమూద్ మరియు అర్ రస్స్ ప్రజలు మరియు వారి మధ్య ఎన్నో తరాల వారిని (నాశనం చేశాము).
25:39జుజ్ 19 · పు. 363

وَكُلًّا ضَرَبْنَا لَهُ الْأَمْثَالَ ۖ وَكُلًّا تَبَّرْنَا تَتْبِيرًا39

మరియు వారిలో ప్రతి ఒక్కరినీ మేము దృష్టాంతాలను ఇచ్చి నచ్చజెప్పాము. చివరకు ప్రతి ఒక్కరినీ పూర్తిగా నిర్మూలించాము.
25:40జుజ్ 19 · పు. 363

وَلَقَدْ أَتَوْا عَلَى الْقَرْيَةِ الَّتِي أُمْطِرَتْ مَطَرَ السَّوْءِ ۚ أَفَلَمْ يَكُونُوا يَرَوْنَهَا ۚ بَلْ كَانُوا لَا يَرْجُونَ نُشُورًا40

మరియు మేము దారుణమైన (రాళ్ళ) వర్షం కురిపించిన (లూత్) నగరం మీద నుండి వాస్తవానికి వారు (అవిశ్వాసులు) ప్రయాణం చేసి ఉంటారు. ఏమీ? వారు దానిని (దాని స్థితిని) చూడటం లేదా? వాస్తవానికి, వారు తిరిగి బ్రతికించి లేపబడతారని నమ్మలేదు.
25:41జుజ్ 19 · పు. 363

وَإِذَا رَأَوْكَ إِنْ يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا الَّذِي بَعَثَ اللَّهُ رَسُولًا41

(ఓ ముహమ్మద్!) వారు నిన్ను చూసినప్పుడల్లా నిన్ను పరిహాసాలనికి గురి చేస్తూ ఇలా అంటారు: "ఏమీ? ఇతనినేనా, అల్లాహ్ తన సందేశహరునిగా చేసి పంపింది?
25:42జుజ్ 19 · పు. 363

إِنْ كَادَ لَيُضِلُّنَا عَنْ آلِهَتِنَا لَوْلَا أَنْ صَبَرْنَا عَلَيْهَا ۚ وَسَوْفَ يَعْلَمُونَ حِينَ يَرَوْنَ الْعَذَابَ مَنْ أَضَلُّ سَبِيلًا42

మేము వాటి (మా దేవతల) పట్ల (దృఢవిశ్వాసం మీద) స్థిరంగా ఉండకపోతే, ఇతను మమ్మల్ని మా దేవతల నుండి తప్పించి దూరం చేసేవాడే!" మరియు త్వరలోనే వారు మా శిక్షను చూసినప్పుడు ఎవరు మార్గం తప్పి ఉన్నారో తెలుసుకుంటారు.
25:43జుజ్ 19 · పు. 363

أَرَأَيْتَ مَنِ اتَّخَذَ إِلَٰهَهُ هَوَاهُ أَفَأَنْتَ تَكُونُ عَلَيْهِ وَكِيلًا43

(ఓ ముహమ్మద్!) ఎవడు తన మనోవాంఛలను తనకు దైవంగా చేసుకొని ఉన్నాడో, అలాంటి వానిని నీవు చూశావా? నీవు అలాంటి వానికి రక్షకుడవు కాగలవా?
25:44జుజ్ 19 · పు. 364

أَمْ تَحْسَبُ أَنَّ أَكْثَرَهُمْ يَسْمَعُونَ أَوْ يَعْقِلُونَ ۚ إِنْ هُمْ إِلَّا كَالْأَنْعَامِ ۖ بَلْ هُمْ أَضَلُّ سَبِيلًا44

లేక వారిలోని చాలా మంది వింటారని లేదా అర్థం చేసుకుంటారని నీవు భావిస్తున్నావా? అసలు వారు పశువుల వంటి వారు. అలా కాదు! వారు వాటి కంటే ఎక్కువ దాని తప్పిన వారు.
25:45జుజ్ 19 · పు. 364

أَلَمْ تَرَ إِلَىٰ رَبِّكَ كَيْفَ مَدَّ الظِّلَّ وَلَوْ شَاءَ لَجَعَلَهُ سَاكِنًا ثُمَّ جَعَلْنَا الشَّمْسَ عَلَيْهِ دَلِيلًا45

ఏమీ? నీవు చూడటం లేదా? నీ ప్రభువు! ఏ విధంగా ఛాయను పొడిగిస్తాడో? ఒకవేళ ఆయన కోరితే, దానిని నిలిపివేసి ఉండేవాడు, కాని మేము సూర్యుణ్ణి దానికి మార్గదర్శిగా చేశాము.
25:46జుజ్ 19 · పు. 364

ثُمَّ قَبَضْنَاهُ إِلَيْنَا قَبْضًا يَسِيرًا46

తరువాత మేము దానిని (ఆ నీడను) క్రమక్రమంగా మా వైపునకు లాక్కుంటాము.
25:47జుజ్ 19 · పు. 364

وَهُوَ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِبَاسًا وَالنَّوْمَ سُبَاتًا وَجَعَلَ النَّهَارَ نُشُورًا47

మరియు ఆయన (అల్లాహ్) యే మీ కొరకు రాత్రిని వస్త్రంగానూ (తెరగానూ), నిద్రను విశ్రాంతి స్థితిగానూ మరియు పగటిని తిరిగి బ్రతికించి లేపబడే (జీవనోపాధి) సమయంగానూ చేశాడు.
25:48జుజ్ 19 · పు. 364

وَهُوَ الَّذِي أَرْسَلَ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ ۚ وَأَنْزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً طَهُورًا48

మరియు ఆయన (అల్లాహ్) యే తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలుగా పంపేవాడు మరియు మేమే ఆకాశం నుండి నిర్మలమైన నీటిని కురిపించే వారము.
25:49జుజ్ 19 · పు. 364

لِنُحْيِيَ بِهِ بَلْدَةً مَيْتًا وَنُسْقِيَهُ مِمَّا خَلَقْنَا أَنْعَامًا وَأَنَاسِيَّ كَثِيرًا49

దాని ద్వారా ఒక మృత ప్రదేశానికి ప్రాణం పోయటానికి మరియు దానిని మేము సృష్టించిన ఎన్నో పశువులకు మరియు మానవులకు త్రాగటానికి!
25:50జుజ్ 19 · పు. 364

وَلَقَدْ صَرَّفْنَاهُ بَيْنَهُمْ لِيَذَّكَّرُوا فَأَبَىٰ أَكْثَرُ النَّاسِ إِلَّا كُفُورًا50

మరియు వాస్తవానికి, మేము దానిని (నీటిని) వారి మధ్య పంచాము, వారు (మా అనుగ్రహాన్ని) జ్ఞాపకముంచుకోవాలని; కానీ మానవులలో చాలా మంది దీనిని తిరస్కరించి, కృతఘ్నులవుతున్నారు.
25:51జుజ్ 19 · పు. 364

وَلَوْ شِئْنَا لَبَعَثْنَا فِي كُلِّ قَرْيَةٍ نَذِيرًا51

మరియు మేము తలుచుకుంటే, ప్రతి నగరానికొక హెచ్చరిక చేసేవానిని (ప్రవక్తను) పంపి ఉండేవారము.
25:52జుజ్ 19 · పు. 364

فَلَا تُطِعِ الْكَافِرِينَ وَجَاهِدْهُمْ بِهِ جِهَادًا كَبِيرًا52

కావున నీవు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారుల అభిప్రాయాన్ని లక్ష్యపెట్టకు మరియు దీని (ఈ ఖుర్ఆన్) సహాయంతో, (వారికి హితబోధ చేయటానికి) గట్టిగా పాటుపడు.
25:53జుజ్ 19 · పు. 364

۞ وَهُوَ الَّذِي مَرَجَ الْبَحْرَيْنِ هَٰذَا عَذْبٌ فُرَاتٌ وَهَٰذَا مِلْحٌ أُجَاجٌ وَجَعَلَ بَيْنَهُمَا بَرْزَخًا وَحِجْرًا مَحْجُورًا53

మరియు రెండు సముద్రాలను కలిపి ఉంచిన వాడు ఆయనే! ఒకటేమో రుచికరమైనది, దాహం తీర్చునది, మరొకటేమో ఉప్పగనూ, చేదుగనూ ఉన్నది మరియు ఆయన ఆ రెండింటి మధ్య ఒక అడ్డుతెరను - అవి కలిసి పోకుండా - అవరోధంగా ఏర్పరచాడు.
25:54జుజ్ 19 · పు. 364

وَهُوَ الَّذِي خَلَقَ مِنَ الْمَاءِ بَشَرًا فَجَعَلَهُ نَسَبًا وَصِهْرًا ۗ وَكَانَ رَبُّكَ قَدِيرًا54

మరియు ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు. తరువాత అతనికి తన వంశ బంధుత్వాన్ని మరియు వివాహ బంధుత్వాన్ని ఏర్పరచాడు. మరియు వాస్తవానికి నీ ప్రభువు (ప్రతిదీ చేయగల) సమర్ధుడు.
25:55జుజ్ 19 · పు. 364

وَيَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ مَا لَا يَنْفَعُهُمْ وَلَا يَضُرُّهُمْ ۗ وَكَانَ الْكَافِرُ عَلَىٰ رَبِّهِ ظَهِيرًا55

మరియు వారు అల్లాహ్ ను వదలి తమకు లాభం గానీ, నష్టం గానీ, చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు. మరియు సత్యతిరస్కారుడు తన ప్రభువుకు విరుద్ధంగా, (షైతానుకు తోడుగా) ఉంటాడు.
25:56జుజ్ 19 · పు. 365

وَمَا أَرْسَلْنَاكَ إِلَّا مُبَشِّرًا وَنَذِيرًا56

మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను ఒక శుభవార్తాహరునిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము.
25:57జుజ్ 19 · పు. 365

قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِلَّا مَنْ شَاءَ أَنْ يَتَّخِذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا57

కావున నీవు వారితో అను: "దీనికై (ఈ ప్రచారానికై) మీతో ఎలాంటి ప్రతిఫలము నడగటం లేదు. కేవలం, తాను కోరిన వ్యక్తియే తన ప్రభువు మార్గాన్ని అవలంబించవచ్చు!"
25:58జుజ్ 19 · పు. 365

وَتَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لَا يَمُوتُ وَسَبِّحْ بِحَمْدِهِ ۚ وَكَفَىٰ بِهِ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا58

కావున ఎన్నడూ మరణించని, ఆ సజీవుని (నిత్యుని) పైననే ఆధారపడి ఉండు మరియు ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. తన దాసుల పాపాలను ఎరుగుటకు ఆయనే చాలు.
25:59జుజ్ 19 · పు. 365

الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ الرَّحْمَٰنُ فَاسْأَلْ بِهِ خَبِيرًا59

ఆయనే ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించి, తరువాత తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. ఆయన అనంత కరుణా మయుడు, ఆయన ఘనతను గురించి ఎరిగిన వాడిని అడుగు.
25:60జుజ్ 19 · పు. 365

وَإِذَا قِيلَ لَهُمُ اسْجُدُوا لِلرَّحْمَٰنِ قَالُوا وَمَا الرَّحْمَٰنُ أَنَسْجُدُ لِمَا تَأْمُرُنَا وَزَادَهُمْ نُفُورًا ۩60

మరియు వారితో: "ఆ కరుణామయునికి సాష్టాంగం (సజ్దా) చేయండి." అని అన్నప్పుడల్లా, వారంటారు: "ఆ కరుణామయుడెవడు? మీరు ఆజ్ఞాపించిన వానికి మేము సాష్టాంగం (సజ్దా) చేయాలా?" మరియు అది (నీ పిలుపు) వారి వ్యతిరేకతను మరింత అధికమే చేసింది.
25:61జుజ్ 19 · పు. 365

تَبَارَكَ الَّذِي جَعَلَ فِي السَّمَاءِ بُرُوجًا وَجَعَلَ فِيهَا سِرَاجًا وَقَمَرًا مُنِيرًا61

ఆకాశంలో నక్షత్రరాసులను (బురూజులను) నిర్మించి అందులో ఒక (ప్రకాశించే) సూర్యుణ్ణి మరియు వెలుగునిచ్చే (ప్రతిబింబింప జేసే) చంద్రుణ్ణి నియమించిన ఆయన (అల్లాహ్) శుభదాయకుడు.
25:62జుజ్ 19 · పు. 365

وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِمَنْ أَرَادَ أَنْ يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورًا62

మరియు ఆయనే, రేయింబవళ్ళను ఒకదాని వెంట ఒకటి అనుక్రమంగా వచ్చేటట్లు చేసేవాడు, ఇవన్నీ గమనించ గోరిన వారి కొరకు లేదా కృతజ్ఞత చూపగోరిన వారి కొరకు ఉన్నాయి.
25:63జుజ్ 19 · పు. 365

وَعِبَادُ الرَّحْمَٰنِ الَّذِينَ يَمْشُونَ عَلَى الْأَرْضِ هَوْنًا وَإِذَا خَاطَبَهُمُ الْجَاهِلُونَ قَالُوا سَلَامًا63

మరియు వారే, అనంత కరుణామయుని దాసులు, ఎవరైతే భూమి మీద నమ్రతతో నడుస్తారో! మరియు మూర్ఖులు వారిని పలుకరించి నప్పుడు: "మీకు సలాం!" అని అంటారో!
25:64జుజ్ 19 · పు. 365

وَالَّذِينَ يَبِيتُونَ لِرَبِّهِمْ سُجَّدًا وَقِيَامًا64

మరియు ఎవరైతే, తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ మరియు (నమాజ్ లో) నిలబడుతూ రాత్రులు గడుపుతారో!
25:65జుజ్ 19 · పు. 365

وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ ۖ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا65

మరియు ఎవరైతే: "ఓ మా ప్రభూ! మా నుండి నరకపు శిక్షను తొలగించు. నిశ్చయంగా, దాని శిక్ష ఎడతెగని పీడన" అని అంటారో!
25:66జుజ్ 19 · పు. 365

إِنَّهَا سَاءَتْ مُسْتَقَرًّا وَمُقَامًا66

నిశ్చయంగా, అది అతి చెడ్డ ఆశ్రయం మరియు నివాస స్థలం.
25:67జుజ్ 19 · పు. 365

وَالَّذِينَ إِذَا أَنْفَقُوا لَمْ يُسْرِفُوا وَلَمْ يَقْتُرُوا وَكَانَ بَيْنَ ذَٰلِكَ قَوَامًا67

మరియు ఎవరైతే ఖర్చు చేసేటప్పుడు అనవసర ఖర్చు గానీ లేక లోభత్వం గానీ చేయకుండా, ఈ రెండింటి మధ్య మితంగా ఉంటారో;
25:68జుజ్ 19 · పు. 366

وَالَّذِينَ لَا يَدْعُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ وَلَا يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُونَ ۚ وَمَنْ يَفْعَلْ ذَٰلِكَ يَلْقَ أَثَامًا68

మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో! మరియు వ్యభిచారానికి పాల్పబడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.
25:69జుజ్ 19 · పు. 366

يُضَاعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيَامَةِ وَيَخْلُدْ فِيهِ مُهَانًا69

పునరుత్థాన దినం నాడు, అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు.
25:70జుజ్ 19 · పు. 366

إِلَّا مَنْ تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَأُولَٰئِكَ يُبَدِّلُ اللَّهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا70

కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
25:71జుజ్ 19 · పు. 366

وَمَنْ تَابَ وَعَمِلَ صَالِحًا فَإِنَّهُ يَتُوبُ إِلَى اللَّهِ مَتَابًا71

మరియు ఎవడైతే, పశ్చాత్తాప పడి సత్కార్యాలు చేస్తాడో! నిశ్చయంగా అలాంటి వాడు హృదయపూర్వకంగా అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలుతాడు!
25:72జుజ్ 19 · పు. 366

وَالَّذِينَ لَا يَشْهَدُونَ الزُّورَ وَإِذَا مَرُّوا بِاللَّغْوِ مَرُّوا كِرَامًا72

మరియు ఎవరైతే, అబద్ధమైన సాక్ష్యం ఇవ్వరో! మరియు వ్యర్థమైన పనుల వైపు నుండి పోవటం జరిగితే, సంస్కారవంతులుగా అక్కడి నుండి దాటిపోతారో!
25:73జుజ్ 19 · పు. 366

وَالَّذِينَ إِذَا ذُكِّرُوا بِآيَاتِ رَبِّهِمْ لَمْ يَخِرُّوا عَلَيْهَا صُمًّا وَعُمْيَانًا73

మరియు ఎవరైతే, తమ ప్రభువు సూచనల (ఆయాత్ ల) హితబోధ చేసినపుడు, వారు దానికి చెవిటివారిగా మరియు గ్రుడ్డివారిగా ఉండిపోరో!
25:74 · Our Lord, grant us from our spousesజుజ్ 19 · పు. 366

وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا74

మరియు ఎవరైతే, ఇలా ప్రార్థిస్తారో: "ఓ మా ప్రభూ! మా సహవాసుల (అజ్వాజ్ ల) మరియు సంతానం ద్వారా మా కన్నులకు చల్లదనం ప్రసాదించు. మరియు మమ్మల్ని దైవభీతి గలవారికి నాయకులుగా (ఇమాములుగా) చేయి."
25:75జుజ్ 19 · పు. 366

أُولَٰئِكَ يُجْزَوْنَ الْغُرْفَةَ بِمَا صَبَرُوا وَيُلَقَّوْنَ فِيهَا تَحِيَّةً وَسَلَامًا75

ఇలాంటి వారే తమ సహనశీలతకు ప్రతిఫలంగా (స్వర్గంలో) ఉన్నత స్థానాన్ని పొందేవారు. అక్కడ వారికి గౌరవమైన స్వాగతం మరియు శాంతి లభిస్తాయి.
25:76జుజ్ 19 · పు. 366

خَالِدِينَ فِيهَا ۚ حَسُنَتْ مُسْتَقَرًّا وَمُقَامًا76

వారందు శాశ్వతంగా ఉంటారు. అది ఎంత మంచి నివాసం మరియు ఎంత మంచి స్థలం.
25:77జుజ్ 19 · పు. 366

قُلْ مَا يَعْبَأُ بِكُمْ رَبِّي لَوْلَا دُعَاؤُكُمْ ۖ فَقَدْ كَذَّبْتُمْ فَسَوْفَ يَكُونُ لِزَامًا77

(ఓ ముహమ్మద్! అవిశ్వాసులతో) ఇలా అను: "మీరు ఆయనను ప్రార్థిస్తున్నారు కాబట్టి నా ప్రభువు మిమ్మల్ని అలక్ష్యం చేయడం లేదు. కాని వాస్తవానికి, ఇప్పుడు మీరు (ఆయనను) తిరస్కరించారు. కావున త్వరలోనే ఆయన శిక్ష మీపై అనివార్యమవుతుంది."

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Fares Abbad - Al-Furqan · Tlawati