ص ۚ وَالْقُرْآنِ ذِي الذِّكْرِ 1
సాద్. మరియు హితబోధతో నిండివున్న ఈ ఖుర్ఆన్ సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ بَلِ الَّذِينَ كَفَرُوا فِي عِزَّةٍ وَشِقَاقٍ 2
వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారు అహంకారంలో మరియు విరోధంలో పడివున్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَمْ أَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِنْ قَرْنٍ فَنَادَوْا وَلَاتَ حِينَ مَنَاصٍ 3
వారికి పూర్వం గతించిన ఎన్నో తరాలను మేము నాశనం చేశాము. అప్పుడు వారు మొర పెట్టుకోసాగారు, కాని అప్పుడు వారికి దాని నుండి తప్పించుకునే సమయం లేకపోయింది!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَعَجِبُوا أَنْ جَاءَهُمْ مُنْذِرٌ مِنْهُمْ ۖ وَقَالَ الْكَافِرُونَ هَٰذَا سَاحِرٌ كَذَّابٌ 4
మరియు వారిని హెచ్చరించేవాడు, తమలో నుంచే రావటం చూసి వారు ఆశ్చర్యపడ్డారు! మరియు సత్యతిరస్కారులు ఇలా అన్నారు: "ఇతడు మాంత్రికుడు, అసత్యవాది."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَجَعَلَ الْآلِهَةَ إِلَٰهًا وَاحِدًا ۖ إِنَّ هَٰذَا لَشَيْءٌ عُجَابٌ 5
"ఏమీ? ఇతను (ఈ ప్రవక్త) దైవాలందరినీ, ఒకే ఆరాధ్యదైవంగా చేశాడా? నిశ్చయంగా ఇది ఎంతో విచిత్రమైన విషయం!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَانْطَلَقَ الْمَلَأُ مِنْهُمْ أَنِ امْشُوا وَاصْبِرُوا عَلَىٰ آلِهَتِكُمْ ۖ إِنَّ هَٰذَا لَشَيْءٌ يُرَادُ 6
మరియు వారి నాయకులు ఇలా అనసాగారు: "పదండి! మీరు మీ దైవాల (ఆరాధన) మీద స్థిరంగా ఉండండి." నిశ్చయంగా, ఇందులో (మీకు విరుద్ధంగా) ఏదో ఉద్దేశింపబడి ఉంది!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا سَمِعْنَا بِهَٰذَا فِي الْمِلَّةِ الْآخِرَةِ إِنْ هَٰذَا إِلَّا اخْتِلَاقٌ 7
"ఇలాంటి విషయాన్ని మేము ఇటీవలి కాలపు మతంలో విని ఉండలేదు. ఇది కేవలం కల్పన మాత్రమే!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَأُنْزِلَ عَلَيْهِ الذِّكْرُ مِنْ بَيْنِنَا ۚ بَلْ هُمْ فِي شَكٍّ مِنْ ذِكْرِي ۖ بَلْ لَمَّا يَذُوقُوا عَذَابِ 8
"ఏమీ? మా అందరిలోనూ, కేవలం ఇతనిపైననే, ఈ హితబోధ అవతరింప జేయబడిందా? వాస్తవానికి వారు నా హితబోధను గురించి సంశయంలో పడి వున్నారు. అలా కాదు, వారు ఇంకా (నా) శిక్షను రుచి చూడలేదు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمْ عِنْدَهُمْ خَزَائِنُ رَحْمَةِ رَبِّكَ الْعَزِيزِ الْوَهَّابِ 9
లేక వారి దగ్గర సర్వశక్తుడు, సర్వప్రదుడు అయిన నీ ప్రభువు యొక్క కారుణ్య నిధులు ఉన్నాయా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمْ لَهُمْ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ فَلْيَرْتَقُوا فِي الْأَسْبَابِ 10
లేక! ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద వారికి సామ్రాజ్యాధిపత్యం ఉందా? అలా అయితే వారిని తమ సాధనాలతో పైకి (ఆకాశలోకి) ఎక్కమను!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ جُنْدٌ مَا هُنَالِكَ مَهْزُومٌ مِنَ الْأَحْزَابِ 11
ఇంతకు ముందు ఓడించబడిన సైన్యాల వలే, ఒక వర్గం వీరిది కూడా ఉంటుంది!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَعَادٌ وَفِرْعَوْنُ ذُو الْأَوْتَادِ 12
వీరికి పూర్వం నూహ్ మరియు ఆద్ (జాతి) వారు మరియు మేకుల ఫిర్ఔన్ జాతుల వారు సత్యాన్ని తిరస్కరించారు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَثَمُودُ وَقَوْمُ لُوطٍ وَأَصْحَابُ الْأَيْكَةِ ۚ أُولَٰئِكَ الْأَحْزَابُ 13
మరియు సమూద్ మరియు లూత్ జాతుల వారు మరియు అయ్ కహ్ (మద్ యన్) వాసులు అందరూ ఇలాంటి వర్గాలకు చెందినవారే.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنْ كُلٌّ إِلَّا كَذَّبَ الرُّسُلَ فَحَقَّ عِقَابِ 14
ఇక వీరిలో ఏ ఒక్కరూ ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించకుండా ఉండలేదు, కావున నా శిక్ష అనివార్యమయ్యింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا يَنْظُرُ هَٰؤُلَاءِ إِلَّا صَيْحَةً وَاحِدَةً مَا لَهَا مِنْ فَوَاقٍ 15
మరియు వీరందరూ కేవలం ఒక గర్జన (సయ్ హా) కొరకు మాత్రమే ఎదురు చూస్తున్నారు, దానికి ఎలాంటి నిలుపుదల ఉండదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَقَالُوا رَبَّنَا عَجِّلْ لَنَا قِطَّنَا قَبْلَ يَوْمِ الْحِسَابِ 16
మరియు వారు: "ఓ మా ప్రభూ! లెక్క దినానికి ముందే మా భాగం మాకు తొందరగా ఇచ్చి వెయ్యి." అని అంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ اصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاذْكُرْ عَبْدَنَا دَاوُودَ ذَا الْأَيْدِ ۖ إِنَّهُ أَوَّابٌ 17
(ఓ ముహమ్మద్!) వారి మాటల యెడల నీవు సహనం వహించు మరియు బలవంతుడైన, మా దాసుడు దావూద్ ను జ్ఞాపకం చేసుకో. నిశ్చయంగా, అతను ఎల్లప్పుడూ పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపునకు) మరలుతూ ఉండేవాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا سَخَّرْنَا الْجِبَالَ مَعَهُ يُسَبِّحْنَ بِالْعَشِيِّ وَالْإِشْرَاقِ 18
నిశ్చయంగా, మేము పర్వతాలను అతనితో బాటు సాయంత్రం మరియు ఉదయం మా పవిత్రతను కొనియాడుతూ ఉండేటట్లు చేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالطَّيْرَ مَحْشُورَةً ۖ كُلٌّ لَهُ أَوَّابٌ 19
మరియు పక్షులు కూడా గుమికూడేవి. అంతా కలసి ఆయన (అల్లాహ్) వైపుకు మరలేవారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَشَدَدْنَا مُلْكَهُ وَآتَيْنَاهُ الْحِكْمَةَ وَفَصْلَ الْخِطَابِ 20
మరియు మేము అతని సామ్రాజ్యాన్ని పటిష్టపరిచాము మరియు మేము అతనికి వివేకాన్ని మరియు తిరుగులేని తీర్పు చేయడంలో, నేర్పరితనాన్ని ప్రసాదించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ۞ وَهَلْ أَتَاكَ نَبَأُ الْخَصْمِ إِذْ تَسَوَّرُوا الْمِحْرَابَ 21
మరియు తగవులాడుకొని వచ్చిన ఆ ఇద్దరి వార్త నీకు చేరిందా? వారు గోడ ఎక్కి అతని ప్రార్థనా గదిలోకి వచ్చారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ دَخَلُوا عَلَىٰ دَاوُودَ فَفَزِعَ مِنْهُمْ ۖ قَالُوا لَا تَخَفْ ۖ خَصْمَانِ بَغَىٰ بَعْضُنَا عَلَىٰ بَعْضٍ فَاحْكُمْ بَيْنَنَا بِالْحَقِّ وَلَا تُشْطِطْ وَاهْدِنَا إِلَىٰ سَوَاءِ الصِّرَاطِ 22
వారు దావూద్ వద్దకు వచ్చినపుడు, అతను వారిని చూసి బెదిరి పోయాడు. వారన్నారు: "భయపడకు! మేమిద్దరం ప్రత్యర్థులం, మాలో ఒకడు మరొకనికి అన్యాయం చేశాడు. కావున నీవు మా మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి. మరియు నీతి మీరి నడువకు, మాకు సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చెయ్యి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ هَٰذَا أَخِي لَهُ تِسْعٌ وَتِسْعُونَ نَعْجَةً وَلِيَ نَعْجَةٌ وَاحِدَةٌ فَقَالَ أَكْفِلْنِيهَا وَعَزَّنِي فِي الْخِطَابِ 23
వాస్తవానికి, ఇతడు నా సోదరుడు, ఇతని వద్ద తొంభై తొమ్మిది ఆడ గొర్రెలున్నాయి. మరియు నా దగ్గర కేవలం ఒకే ఒక్క ఆడ గొర్రె ఉంది, అయినా ఇతడు అంటున్నాడు: 'దీనిని నాకివ్వు.' మరియు తన మాటల నేర్పులోత నన్ను వశపరచుకుంటున్నాడు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ لَقَدْ ظَلَمَكَ بِسُؤَالِ نَعْجَتِكَ إِلَىٰ نِعَاجِهِ ۖ وَإِنَّ كَثِيرًا مِنَ الْخُلَطَاءِ لَيَبْغِي بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَقَلِيلٌ مَا هُمْ ۗ وَظَنَّ دَاوُودُ أَنَّمَا فَتَنَّاهُ فَاسْتَغْفَرَ رَبَّهُ وَخَرَّ رَاكِعًا وَأَنَابَ ۩ 24
(దావూద్) అన్నాడు: "వాస్తవంగా, నీ ఆడగొర్రెను తన గొర్రెలలో కలుపుకోవటానికి అడిగి, ఇతడు నీపై అన్యాయం చేస్తున్నాడు. మరియు వాస్తవానికి, చాలా మంది భాగస్థులు ఒకరి కొకరు అన్యాయం చేసుకుంటూ ఉంటారు, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప! కాని అటువంటి వారు కొందరు మాత్రమే!" వాస్తవానికి మేము అతనిని (దావూద్ ను) పరీక్షిస్తున్నామని అతను అర్థం చేసుకున్నాడు. కాబట్టి తన ప్రభువును క్షమాపణ వేడుకున్నాడు. మరియు సాష్టాంగం (సజ్దా)లో పడిపోయాడు మరియు పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపుకు) మరలాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَغَفَرْنَا لَهُ ذَٰلِكَ ۖ وَإِنَّ لَهُ عِنْدَنَا لَزُلْفَىٰ وَحُسْنَ مَآبٍ 25
అప్పుడు మేము అతనిని (ఆ తప్పును) క్షమించాము. మరియు నిశ్చయంగా, మా వద్ద అతనికి సాన్నిహిత్యం మరియు మంచి స్థానం కూడా ఉన్నాయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَا دَاوُودُ إِنَّا جَعَلْنَاكَ خَلِيفَةً فِي الْأَرْضِ فَاحْكُمْ بَيْنَ النَّاسِ بِالْحَقِّ وَلَا تَتَّبِعِ الْهَوَىٰ فَيُضِلَّكَ عَنْ سَبِيلِ اللَّهِ ۚ إِنَّ الَّذِينَ يَضِلُّونَ عَنْ سَبِيلِ اللَّهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ بِمَا نَسُوا يَوْمَ الْحِسَابِ 26
(మేము అతనితో ఇలా అన్నాము): "ఓ దావూద్! నిశ్చయంగా, మేము నిన్ను భూమిలో ఉత్తరాధికారిగా నియమించాము. కావున నీవు ప్రజల మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి మరియు నీ మనోకాంక్షలను అనుసరించకు, ఎందుకంటే అవి నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తాయి." నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ మార్గం నుండి తప్పిపోతారో, వారికి లెక్క దినమున మరచి పోయిన దాని ఫలితంగా, కఠినమైన శిక్ష పడుతుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا خَلَقْنَا السَّمَاءَ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا بَاطِلًا ۚ ذَٰلِكَ ظَنُّ الَّذِينَ كَفَرُوا ۚ فَوَيْلٌ لِلَّذِينَ كَفَرُوا مِنَ النَّارِ 27
మరియు మేము ఈ ఆకాశాన్ని మరియు ఈ భూమిని మరియు వాటి మధ్య ఉన్న దాన్నంతా వృథాగా సృష్టించలేదు! ఇది సత్యాన్ని తిరస్కరించిన వారి భ్రమ మాత్రమే. కావున అట్టి సత్యతిరస్కారులకు నరకాగ్ని బాధ పడనున్నది!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمْ نَجْعَلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَالْمُفْسِدِينَ فِي الْأَرْضِ أَمْ نَجْعَلُ الْمُتَّقِينَ كَالْفُجَّارِ 28
ఏమీ? మేము విశ్వసించి, సత్కార్యాలు చేసేవారిని భూమిలో కల్లోలం రేకెత్తించే వారితో సమానులుగా చేస్తామా? లేక మేము దైవభీతి గలవారిని దుష్టులతో సమానులుగా చేస్తామా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُولُو الْأَلْبَابِ 29
(ఓ ముహమ్మద్!) మేము ఎంతో శుభవంతమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింప జేశాము. ప్రజలు దీని సూచనలను (ఆయాత్ లను) గురించి యోచించాలని మరియు బుద్ధిమంతులు దీని నుండి హితబోధ గ్రహించాలని.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَوَهَبْنَا لِدَاوُودَ سُلَيْمَانَ ۚ نِعْمَ الْعَبْدُ ۖ إِنَّهُ أَوَّابٌ 30
మరియు మేము దావూద్ కు సులైమాన్ ను ప్రసాదించాము. అతను ఉత్తమ దాసుడు! నిశ్చయంగా, అతను ఎల్లప్పుడు మా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండేవాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ عُرِضَ عَلَيْهِ بِالْعَشِيِّ الصَّافِنَاتُ الْجِيَادُ 31
ఒకరోజు సాయంకాలం అతని ముందు మేలు జాతి, వడి గల గుర్రాలు ప్రవేశపెట్టబడినప్పుడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَقَالَ إِنِّي أَحْبَبْتُ حُبَّ الْخَيْرِ عَنْ ذِكْرِ رَبِّي حَتَّىٰ تَوَارَتْ بِالْحِجَابِ 32
అతను అన్నాడు: "అయ్యో! వాస్తవంగా నేను నా ప్రభువు స్మరణకు బదులుగా ఈ సంపదను (గుర్రాలను) ప్రేమించాను." చివరకు (సూర్యుడు) కనుమరుగై పోయాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ رُدُّوهَا عَلَيَّ ۖ فَطَفِقَ مَسْحًا بِالسُّوقِ وَالْأَعْنَاقِ 33
(అతను ఇంకా ఇలా అన్నాడు): "వాటిని నా వద్దకు తిరిగి తీసుకురండి." తరువాత అతను వాటి పిక్కలను మరియు మెడలను నిమరసాగాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَقَدْ فَتَنَّا سُلَيْمَانَ وَأَلْقَيْنَا عَلَىٰ كُرْسِيِّهِ جَسَدًا ثُمَّ أَنَابَ 34
మరియు వాస్తవానికి మేము సులైమాన్ ను పరీక్షకు గురి చేశాము మరియు అతని సింహాసనంపై ఒక కళేబరాన్ని పడవేశాము, అప్పుడతను పశ్చాత్తాపంతో మా వైపునకు మరలాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ رَبِّ اغْفِرْ لِي وَهَبْ لِي مُلْكًا لَا يَنْبَغِي لِأَحَدٍ مِنْ بَعْدِي ۖ إِنَّكَ أَنْتَ الْوَهَّابُ 35
అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నా తరువాత మరెవ్వరికీ లభించనటువంటి సామ్రాజ్యాన్ని నాకు ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَسَخَّرْنَا لَهُ الرِّيحَ تَجْرِي بِأَمْرِهِ رُخَاءً حَيْثُ أَصَابَ 36
అప్పుడు మేము గాలిని అతనికి వశ పరచాము. అది అతని ఆజ్ఞానుసారంగా, అతడు కోరిన వైపునకు తగినట్లుగా మెల్లగా వీచేది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالشَّيَاطِينَ كُلَّ بَنَّاءٍ وَغَوَّاصٍ 37
మరియు షైతానులలో (జిన్నాతులలో) నుండి కూడా రకరకాల కట్టడాలు నిర్మించే వాటినీ మరియు సముద్రంలో మునిగి (ముత్యాలు తీసే) వాటినీ (అతనికి వశ పరచి ఉన్నాము).
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَآخَرِينَ مُقَرَّنِينَ فِي الْأَصْفَادِ 38
మరికొన్ని సంకెళ్ళతో బంధింపబడినవి కూడా ఉండేవి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هَٰذَا عَطَاؤُنَا فَامْنُنْ أَوْ أَمْسِكْ بِغَيْرِ حِسَابٍ 39
(అల్లాహ్ అతనితో అన్నాడు): "ఇది నీకు మా కానుక, కావున నీవు దీనిని (ఇతరులకు) ఇచ్చినా, లేక నీవే ఉంచుకున్నా, నీతో ఎలాంటి లెక్క తీసుకోబడదు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ لَهُ عِنْدَنَا لَزُلْفَىٰ وَحُسْنَ مَآبٍ 40
మరియు నిశ్చయంగా, అతనికి మా సాన్నిహిత్యం మరియు ఉత్తమ గమ్యస్థానం ఉన్నాయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاذْكُرْ عَبْدَنَا أَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الشَّيْطَانُ بِنُصْبٍ وَعَذَابٍ 41
మరియు మా దాసుడు అయ్యూబ్ ను గురించి ప్రస్తావించు; అతను తన ప్రభువుతో ఇలా మొరపెట్టుకున్నాడు: "నిశ్చయంగా షైతాన్ నన్ను ఆపదకు మరియు శిక్షకు గురి చేశాడు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ارْكُضْ بِرِجْلِكَ ۖ هَٰذَا مُغْتَسَلٌ بَارِدٌ وَشَرَابٌ 42
(మేము అతనితో అన్నాము): "నీ కాలును నేల మీద కొట్టు. అదిగో చల్ల (నీటి చెలిమ)! నీవు స్నానం చేయటానికి మరియు త్రాగుటకూను."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَوَهَبْنَا لَهُ أَهْلَهُ وَمِثْلَهُمْ مَعَهُمْ رَحْمَةً مِنَّا وَذِكْرَىٰ لِأُولِي الْأَلْبَابِ 43
మరియు మేము అతని కుటుంబం వారిని మరియు వారితో బాటు, వారి వంటి వారిని మా కరుణతో అతనికి తిరిగి ఇచ్చాము మరియు బుద్ధిమంతులకు ఇది ఒక హితబోధ.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَخُذْ بِيَدِكَ ضِغْثًا فَاضْرِبْ بِهِ وَلَا تَحْنَثْ ۗ إِنَّا وَجَدْنَاهُ صَابِرًا ۚ نِعْمَ الْعَبْدُ ۖ إِنَّهُ أَوَّابٌ 44
(అల్లాహ్ అతనితో అన్నాడు): "ఒక పుల్లల కట్టను నీ చేతిలోకి తీసికొని దానితో (నీ భార్యను) కొట్టు మరియు నీ ఒట్టును భంగపరచుకోకు." వాస్తవానికి, మేము అతనిని ఎంతో సహనశీలునిగా పొందాము. అతను ఉత్తమ దాసుడు! నిశ్చయంగా, ఎల్లపుడు మా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండేవాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاذْكُرْ عِبَادَنَا إِبْرَاهِيمَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ أُولِي الْأَيْدِي وَالْأَبْصَارِ 45
మరియు మా దాసులైన ఇబ్రాహీమ్, ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను జ్ఞాపకం చేసుకో! వారు గొప్ప కార్యశీలురు మరియు దూరదృష్టి గలవారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا أَخْلَصْنَاهُمْ بِخَالِصَةٍ ذِكْرَى الدَّارِ 46
నిశ్చయంగా, మేము వారిని ఒక విశిష్ట గుణం కారణంగా ఎన్నుకున్నాము, అది వారి పరలోక చింతన.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّهُمْ عِنْدَنَا لَمِنَ الْمُصْطَفَيْنَ الْأَخْيَارِ 47
మరియు నిశ్చయంగా, మా దృష్టిలో వారు ఎన్నుకోబడిన ఉత్తమ (పుణ్య) పురుషులలోని వారు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَاذْكُرْ إِسْمَاعِيلَ وَالْيَسَعَ وَذَا الْكِفْلِ ۖ وَكُلٌّ مِنَ الْأَخْيَارِ 48
మరియు ఇస్మాయీల్, అల్ యస్అ మరియు జుల్ కిప్ల్ ను కూడా జ్ఞాపకం చేసుకో. మరియు వారందరూ ఎన్నుకొనబడిన ఉత్తమ పురుషులలోని వారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هَٰذَا ذِكْرٌ ۚ وَإِنَّ لِلْمُتَّقِينَ لَحُسْنَ مَآبٍ 49
ఇది ఒక ప్రస్తావన. మరియు నిశ్చయంగా! దైవభీతి గలవారికి ఉత్తమ గమ్యస్థానం ఉంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ جَنَّاتِ عَدْنٍ مُفَتَّحَةً لَهُمُ الْأَبْوَابُ 50
శాశ్వతమైన స్వర్గవనాలు, వాటి ద్వారాలు వారి కొరకు తెరువబడి ఉంటాయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مُتَّكِئِينَ فِيهَا يَدْعُونَ فِيهَا بِفَاكِهَةٍ كَثِيرَةٍ وَشَرَابٍ 51
అందులో వారు దిండ్లను ఆనుకొని కూర్చొని; అందులో వారు అనేక ఫలాలను మరియు పానీయాలను అడుగుతూ ఉంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ۞ وَعِنْدَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ أَتْرَابٌ 52
మరియు వారి దగ్గర సమవయస్కులు మరియు తమ చూపులను వారి కొరకే ప్రత్యేకించుకొనే శీలవతులైన స్త్రీలు ఉంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هَٰذَا مَا تُوعَدُونَ لِيَوْمِ الْحِسَابِ 53
లెక్కదినం కొరకు మీతో (దైవభీతి గలవారితో) చేయబడిన వాగ్దానం ఇదే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ هَٰذَا لَرِزْقُنَا مَا لَهُ مِنْ نَفَادٍ 54
నిశ్చయంగా, ఇదే మేమిచ్చే జీవనోపాధి. దానికి తరుగులేదు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هَٰذَا ۚ وَإِنَّ لِلطَّاغِينَ لَشَرَّ مَآبٍ 55
ఇదే (విశ్వాసులకు లభించేది). మరియు నిశ్చయంగా, తలబిరుసుతనం గల దుష్టులకు అతి చెడ్డ గమ్యస్థానం ఉంటుంది -
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ جَهَنَّمَ يَصْلَوْنَهَا فَبِئْسَ الْمِهَادُ 56
నరకం - వారందులో కాలుతారు. ఎంత బాధాకరమైన విరామ (నివాస) స్థలము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هَٰذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ 57
ఇదే (దుష్టులకు లభించేది), కావున వారు దాని రుచి చూస్తారు; సలసలకాగే నీరు మరియు చీము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَآخَرُ مِنْ شَكْلِهِ أَزْوَاجٌ 58
ఇంకా ఇలాంటివే అనేకం ఉంటాయి!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هَٰذَا فَوْجٌ مُقْتَحِمٌ مَعَكُمْ ۖ لَا مَرْحَبًا بِهِمْ ۚ إِنَّهُمْ صَالُو النَّارِ 59
"ఇదొక దళం, మీ వైపునకు త్రోయబడుతూ వస్తున్నది. వారికి ఎలాంటి స్వాగతం లేదు! నిశ్చయంగా, వారు నరకాగ్నిలో కాలుతారు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا بَلْ أَنْتُمْ لَا مَرْحَبًا بِكُمْ ۖ أَنْتُمْ قَدَّمْتُمُوهُ لَنَا ۖ فَبِئْسَ الْقَرَارُ 60
(సత్యతిరస్కారులు తమను మార్గం తప్పించిన వారితో) అంటారు: "అయితే మీకు కూడా స్వాగతం లేదు కదా! ఈ పర్యవసానాన్ని మా ముందుకు తెచ్చిన వారు మీరే కదా! ఎంత చెడ్డ నివాస స్థలము."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا رَبَّنَا مَنْ قَدَّمَ لَنَا هَٰذَا فَزِدْهُ عَذَابًا ضِعْفًا فِي النَّارِ 61
వారు ఇంకా ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మా యెదుట దీనిని (నరకాన్ని) తెచ్చిన వానికి రెట్టింపు నరకాగ్ని శిక్షను విధించు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَقَالُوا مَا لَنَا لَا نَرَىٰ رِجَالًا كُنَّا نَعُدُّهُمْ مِنَ الْأَشْرَارِ 62
ఇంకా వారు ఇలా అంటారు: "మాకేమయింది? మనం చెడ్డవారిగా ఎంచిన వారు ఇక్కడ మనకు కనబడటం లేదేమిటి?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَتَّخَذْنَاهُمْ سِخْرِيًّا أَمْ زَاغَتْ عَنْهُمُ الْأَبْصَارُ 63
మనం ఊరికే వారిని ఎగతాళి చేశామా? లేదా వారు మనకు కనుమరుగయ్యారా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ ذَٰلِكَ لَحَقٌّ تَخَاصُمُ أَهْلِ النَّارِ 64
నిశ్చయంగా, ఇదే నిజం! నరకవాసులు ఇలాగే వాదులాడుకుంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قُلْ إِنَّمَا أَنَا مُنْذِرٌ ۖ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ 65
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి నేను హెచ్చరించేవాడను మాత్రమే! అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! ఆయన అద్వితీయుడు తన సృష్టి మీద సంపూర్ణ అధికారం గలవాడు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الْعَزِيزُ الْغَفَّارُ 66
ఆకాశాలు, భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు, సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قُلْ هُوَ نَبَأٌ عَظِيمٌ 67
వారితో అను: "ఇది (ఈ ఖుర్ఆన్) ఒక గొప్ప సందేశం.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَنْتُمْ عَنْهُ مُعْرِضُونَ 68
దాని నుండి మీరు విముఖులవు తున్నారు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا كَانَ لِيَ مِنْ عِلْمٍ بِالْمَلَإِ الْأَعْلَىٰ إِذْ يَخْتَصِمُونَ 69
(ఓ ముహమ్మద్! ఇలా అను): "ఉన్నత స్థానాలలో ఉన్న ముఖ్యుల (దేవదూతల) మధ్య (ఆదమ్ సృష్టి గురించి) ఒకప్పుడు జరిగిన వివాదం గురించి నాకు తెలియదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنْ يُوحَىٰ إِلَيَّ إِلَّا أَنَّمَا أَنَا نَذِيرٌ مُبِينٌ 70
కాని అది నాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారానే తెలుపబడింది. వాస్తవానికి, నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي خَالِقٌ بَشَرًا مِنْ طِينٍ 71
నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న మాటను (జ్ఞాపకం చేసుకో): "నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَإِذَا سَوَّيْتُهُ وَنَفَخْتُ فِيهِ مِنْ رُوحِي فَقَعُوا لَهُ سَاجِدِينَ 72
ఇక ఎప్పుడైతే, నేను అతని సృష్టిని పూర్తి చేసి అతనిలో నా (తరఫు నుండి) ఆత్మను (జీవాన్ని) ఊదుతానో అప్పుడు, మీరు అతని ముందు సాష్టాంగం (సజ్దా)లో పడిపోండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَسَجَدَ الْمَلَائِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ 73
అప్పుడు దేవదూతలందరూ కలసి అతనికి సజ్దా చేశారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا إِبْلِيسَ اسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ 74
ఒక్క ఇబ్లీస్ తప్ప! అతడు గర్వితుడయ్యాడు మరియు సత్యతిరస్కారులలో కలిసి పోయాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ يَا إِبْلِيسُ مَا مَنَعَكَ أَنْ تَسْجُدَ لِمَا خَلَقْتُ بِيَدَيَّ ۖ أَسْتَكْبَرْتَ أَمْ كُنْتَ مِنَ الْعَالِينَ 75
(అల్లాహ్) ఇలా అన్నాడు: "ఓ ఇబ్లీస్! నేను నా రెండు చేతులతో సృష్టించిన వానికి సాష్టాంగం (సజ్దా) చేయకుండా నిన్ను ఆపింది ఏమిటీ? నీవు గర్వితుడవై పోయావా! లేదా నిన్ను, నీవు ఉన్నత శ్రేణికి చెందిన వాడవనుకున్నావా?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ أَنَا خَيْرٌ مِنْهُ ۖ خَلَقْتَنِي مِنْ نَارٍ وَخَلَقْتَهُ مِنْ طِينٍ 76
(ఇబ్లీస్) అన్నాడు: "నేను అతని కంటే శ్రేష్ఠుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని మట్టితో సృష్టించావు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ 77
(అల్లాహ్) అన్నాడు: "ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో! నిశ్చయంగా నీవు భ్రష్టుడవు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ عَلَيْكَ لَعْنَتِي إِلَىٰ يَوْمِ الدِّينِ 78
మరియు నిశ్చయంగా, తీర్పుదినం వరకు నీపై నా శాపం (బహిష్కారం) ఉంటుంది."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ رَبِّ فَأَنْظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ 79
(అప్పుడు ఇబ్లీస్) ఇలా మనవి చేసుకున్నాడు: "ఓ నా ప్రభూ! మృతులు తిరిగి లేపబడే దినం వరకు నాకు వ్యవధినివ్వు!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ فَإِنَّكَ مِنَ الْمُنْظَرِينَ 80
(అల్లాహ్) సెలవిచ్చాడు: "సరే! నీకు వ్యవధి ఇవ్వబడుతోంది!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ 81
ఆ నియమిత దినపు ఆ గడువు వచ్చే వరకు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ 82
(ఇబ్లీస్) అన్నాడు: "నీ శక్తి సాక్షిగా నేను వారందరినీ తప్పు దారి పట్టిస్తాను;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ 83
వారిలో నుండి నీవు ఎన్నుకున్న నీ దాసుల్ని తప్ప!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ فَالْحَقُّ وَالْحَقَّ أَقُولُ 84
(అల్లాహ్) అన్నాడు: "అయితే సత్యం ఇదే! మరియు నేను సత్యం పలుకుతున్నాను;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنْكَ وَمِمَّنْ تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ 85
నీవు మరియు వారిలో నుండి నిన్ను అనుసరించే వారందరితో నేను నరకాన్ని నింపుతాను!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ وَمَا أَنَا مِنَ الْمُتَكَلِّفِينَ 86
(ఓ ప్రవక్తా!) వారితో అను: "నేను దీని (ఈ సందేశం) కొరకు మీ నుండి, ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు మరియు నేను వంచకులలోని వాడను కాను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِلْعَالَمِينَ 87
ఇది (ఈ ఖుర్ఆన్) సమస్త లోకాల వారందరికీ కేవలం ఒక జ్ఞాపిక (హితబోధ)!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَتَعْلَمُنَّ نَبَأَهُ بَعْدَ حِينٍ 88
మరియు అచిర కాలంలోనే దీని ఉద్దేశాన్ని (వార్తను) మీరు తప్పక తెలుసుకుంటారు."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్