Ash-Sharh

سورة الشرح

సూరా 94 · మక్కీ · 8 ఆయత్‌లు

94:1జుజ్ 30 · పు. 596

أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ1

(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా?
94:2జుజ్ 30 · పు. 596

وَوَضَعْنَا عَنْكَ وِزْرَكَ2

మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా?
94:3జుజ్ 30 · పు. 597

الَّذِي أَنْقَضَ ظَهْرَكَ3

ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో?
94:4జుజ్ 30 · పు. 597

وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ4

మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా?
94:5 · With hardship comes easeజుజ్ 30 · పు. 597

فَإِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا5

నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది;
94:6 · Indeed, with hardship comes easeజుజ్ 30 · పు. 597

إِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا6

నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది.
94:7జుజ్ 30 · పు. 597

فَإِذَا فَرَغْتَ فَانْصَبْ7

కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో!
94:8జుజ్ 30 · పు. 597

وَإِلَىٰ رَبِّكَ فَارْغَبْ8

మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Ahmad Nainaa - Ash-Sharh · Tlawati