Al-Infitar

سورة الإنفطار

సూరా 82 · మక్కీ · 19 ఆయత్‌లు

82:1జుజ్ 30 · పు. 587

إِذَا السَّمَاءُ انْفَطَرَتْ1

ఆకాశం చీల్చబడినప్పుడు!
82:2జుజ్ 30 · పు. 587

وَإِذَا الْكَوَاكِبُ انْتَثَرَتْ2

మరియు నక్షత్రాలు చెదిరి పోయినప్పుడు!
82:3జుజ్ 30 · పు. 587

وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ3

మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు!
82:4జుజ్ 30 · పు. 587

وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ4

మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు!
82:5జుజ్ 30 · పు. 587

عَلِمَتْ نَفْسٌ مَا قَدَّمَتْ وَأَخَّرَتْ5

ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది.
82:6జుజ్ 30 · పు. 587

يَا أَيُّهَا الْإِنْسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ6

ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది?
82:7జుజ్ 30 · పు. 587

الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ7

ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు.
82:8జుజ్ 30 · పు. 587

فِي أَيِّ صُورَةٍ مَا شَاءَ رَكَّبَكَ8

తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు.
82:9జుజ్ 30 · పు. 587

كَلَّا بَلْ تُكَذِّبُونَ بِالدِّينِ9

అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు!
82:10జుజ్ 30 · పు. 587

وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ10

మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు.
82:11జుజ్ 30 · పు. 587

كِرَامًا كَاتِبِينَ11

వారు, గౌరవనీయులైన లేఖకులు;
82:12జుజ్ 30 · పు. 587

يَعْلَمُونَ مَا تَفْعَلُونَ12

మీరు చేసేదంతా తెలుసుకునేవారు!
82:13జుజ్ 30 · పు. 587

إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ13

నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు.
82:14జుజ్ 30 · పు. 587

وَإِنَّ الْفُجَّارَ لَفِي جَحِيمٍ14

మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు.
82:15జుజ్ 30 · పు. 587

يَصْلَوْنَهَا يَوْمَ الدِّينِ15

తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు.
82:16జుజ్ 30 · పు. 587

وَمَا هُمْ عَنْهَا بِغَائِبِينَ16

మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు.
82:17జుజ్ 30 · పు. 587

وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ17

మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?
82:18జుజ్ 30 · పు. 587

ثُمَّ مَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ18

అవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?
82:19జుజ్ 30 · పు. 587

يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِنَفْسٍ شَيْئًا ۖ وَالْأَمْرُ يَوْمَئِذٍ لِلَّهِ19

ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి