Abasa

سورة عبس

సూరా 80 · మక్కీ · 42 ఆయత్‌లు

80:1జుజ్ 30 · పు. 585

عَبَسَ وَتَوَلَّىٰ1

అతను (ప్రవక్త) భృకుటి ముడి వేసుకున్నాడు మరియు ముఖం త్రిప్పుకున్నాడు;
80:2జుజ్ 30 · పు. 585

أَنْ جَاءَهُ الْأَعْمَىٰ2

ఆ గ్రుడ్డివాడు తన వద్దకు వచ్చాడని!
80:3జుజ్ 30 · పు. 585

وَمَا يُدْرِيكَ لَعَلَّهُ يَزَّكَّىٰ3

కాని నీకేం తెలుసు? బహుశా అతడు తనను తాను సంస్కరించుకోవచ్చు!
80:4జుజ్ 30 · పు. 585

أَوْ يَذَّكَّرُ فَتَنْفَعَهُ الذِّكْرَىٰ4

లేదా అతడు హితబోధ పొందవచ్చు మరియు ఆ హితబోధ అతనికి ప్రయోజనకరం కావచ్చు!
80:5జుజ్ 30 · పు. 585

أَمَّا مَنِ اسْتَغْنَىٰ5

కాని అతడు, ఎవడైతే తనను తాను స్వయం సమృద్ధుడు, అనుకుంటున్నాడో!
80:6జుజ్ 30 · పు. 585

فَأَنْتَ لَهُ تَصَدَّىٰ6

అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు.
80:7జుజ్ 30 · పు. 585

وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ7

ఒకవేళ అతడు సంస్కరించుకోక పోతే నీపై బాధ్యత ఏముంది?
80:8జుజ్ 30 · పు. 585

وَأَمَّا مَنْ جَاءَكَ يَسْعَىٰ8

కాని, ఎవడైతే తనంతట తాను, నీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడో!
80:9జుజ్ 30 · పు. 585

وَهُوَ يَخْشَىٰ9

మరియు (అల్లాహ్ యెడల) భీతిపరుడై ఉన్నాడో!
80:10జుజ్ 30 · పు. 585

فَأَنْتَ عَنْهُ تَلَهَّىٰ10

అతనిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు.
80:11జుజ్ 30 · పు. 585

كَلَّا إِنَّهَا تَذْكِرَةٌ11

అలా కాదు! నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) ఒక హితోపదేశం.
80:12జుజ్ 30 · పు. 585

فَمَنْ شَاءَ ذَكَرَهُ12

కావున ఇష్టమున్నవారు దీనిని స్వీకరించవచ్చు!
80:13జుజ్ 30 · పు. 585

فِي صُحُفٍ مُكَرَّمَةٍ13

ఇది ప్రతిష్ఠాకరమైన పుటలలో (వ్రాయబడి ఉన్నది);
80:14జుజ్ 30 · పు. 585

مَرْفُوعَةٍ مُطَهَّرَةٍ14

మహోన్నతమైనది, పవిత్రమైనది;
80:15జుజ్ 30 · పు. 585

بِأَيْدِي سَفَرَةٍ15

లేఖకుల (దేవదూతల) చేతులలో;
80:16జుజ్ 30 · పు. 585

كِرَامٍ بَرَرَةٍ16

వారు గౌరవనీయులైన సత్పురుషులు (ఆజ్ఞానువర్తనులు).
80:17జుజ్ 30 · పు. 585

قُتِلَ الْإِنْسَانُ مَا أَكْفَرَهُ17

మానవుడు నాశనం గాను! అతడు ఎంత కృతఘ్నుడు!
80:18జుజ్ 30 · పు. 585

مِنْ أَيِّ شَيْءٍ خَلَقَهُ18

ఆయన (అల్లాహ్) దేనితో అతనిని సృష్టించాడు?
80:19జుజ్ 30 · పు. 585

مِنْ نُطْفَةٍ خَلَقَهُ فَقَدَّرَهُ19

అతనిని వీర్యబిందువుతో సృష్టించాడు తరువాత అతనిని తగిన విధంగా తీర్చిదిద్దాడు.
80:20జుజ్ 30 · పు. 585

ثُمَّ السَّبِيلَ يَسَّرَهُ20

ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు;
80:21జుజ్ 30 · పు. 585

ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ21

ఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు;
80:22జుజ్ 30 · పు. 585

ثُمَّ إِذَا شَاءَ أَنْشَرَهُ22

మళ్ళీ ఆయన (అల్లాహ్) కోరినప్పుడు అతనిని తిరిగి బ్రతికించి లేపాడు.
80:23జుజ్ 30 · పు. 585

كَلَّا لَمَّا يَقْضِ مَا أَمَرَهُ23

అలా కాదు, ఆయన (అల్లాహ్) ఆదేశించిన దానిని (మానవుడు) నెరవేర్చలేదు.
80:24జుజ్ 30 · పు. 585

فَلْيَنْظُرِ الْإِنْسَانُ إِلَىٰ طَعَامِهِ24

ఇక, మానవుడు తన ఆహారాన్ని గమనించాలి!
80:25జుజ్ 30 · పు. 585

أَنَّا صَبَبْنَا الْمَاءَ صَبًّا25

నిశ్చయంగా మేము నీటిని (వర్షాన్ని) ఎంత పుష్కలంగా కురిపించాము.
80:26జుజ్ 30 · పు. 585

ثُمَّ شَقَقْنَا الْأَرْضَ شَقًّا26

ఆ తరువాత భూమిని (మొలిచే మొక్కలతో) చీల్చాము, ఒక అద్భుతమైన చీల్పుతో!
80:27జుజ్ 30 · పు. 585

فَأَنْبَتْنَا فِيهَا حَبًّا27

తరువాత దానిలో ధాన్యాన్ని పెంచాము;
80:28జుజ్ 30 · పు. 585

وَعِنَبًا وَقَضْبًا28

మరియు ద్రాక్షలను మరియు కూరగాయలను;
80:29జుజ్ 30 · పు. 585

وَزَيْتُونًا وَنَخْلًا29

మరియు ఆలివ్ (జైతూన్) మరియు ఖర్జూరపు చెట్లను;
80:30జుజ్ 30 · పు. 585

وَحَدَائِقَ غُلْبًا30

మరియు దట్టమైన తోటలను;
80:31జుజ్ 30 · పు. 585

وَفَاكِهَةً وَأَبًّا31

మరియు (రకరకాల) పండ్లను మరియు పచ్చికలను;
80:32జుజ్ 30 · పు. 585

مَتَاعًا لَكُمْ وَلِأَنْعَامِكُمْ32

మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా!
80:33జుజ్ 30 · పు. 585

فَإِذَا جَاءَتِ الصَّاخَّةُ33

ఎప్పుడైతే, చెవులను చెవిటిగా చేసే ఆ గొప్ప ధ్వని వస్తుందో!
80:34జుజ్ 30 · పు. 585

يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ أَخِيهِ34

ఆ రోజు, మానవుడు తన సోదరుని నుండి దూరంగా పారిపోతాడు;
80:35జుజ్ 30 · పు. 585

وَأُمِّهِ وَأَبِيهِ35

మరియు తన తల్లి నుండి మరియు తండ్రి నుండి;
80:36జుజ్ 30 · పు. 585

وَصَاحِبَتِهِ وَبَنِيهِ36

మరియు తన భార్య (సాహిబతి) నుండి మరియు తన సంతానం నుండి;
80:37జుజ్ 30 · పు. 585

لِكُلِّ امْرِئٍ مِنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ37

ఆ రోజు వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే చాలినంత చింత ఉంటుంది.
80:38జుజ్ 30 · పు. 585

وُجُوهٌ يَوْمَئِذٍ مُسْفِرَةٌ38

ఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాయి;
80:39జుజ్ 30 · పు. 585

ضَاحِكَةٌ مُسْتَبْشِرَةٌ39

అవి చిరునవ్వులతో ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంటాయి.
80:40జుజ్ 30 · పు. 585

وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ40

మరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి.
80:41జుజ్ 30 · పు. 586

تَرْهَقُهَا قَتَرَةٌ41

అవి నల్లగా మాడిపోయి ఉంటాయి;
80:42జుజ్ 30 · పు. 586

أُولَٰئِكَ هُمُ الْكَفَرَةُ الْفَجَرَةُ42

అలాంటి వారు, వారే! సత్యతిరస్కారులైన దుష్టులు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి