Al-Ghashiyah

سورة الغاشية

సూరా 88 · మక్కీ · 26 ఆయత్‌లు

88:1జుజ్ 30 · పు. 592

هَلْ أَتَاكَ حَدِيثُ الْغَاشِيَةِ1

హఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు (పునరుత్థాన దినపు) సమాచారం నీకు అందిందా?
88:2జుజ్ 30 · పు. 592

وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ2

కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి.
88:3జుజ్ 30 · పు. 592

عَامِلَةٌ نَاصِبَةٌ3

(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి,
88:4జుజ్ 30 · పు. 592

تَصْلَىٰ نَارًا حَامِيَةً4

వారు దహించే అగ్నిలో పడి కాలుతారు.
88:5జుజ్ 30 · పు. 592

تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ5

వారికి సలసల కాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది.
88:6జుజ్ 30 · పు. 592

لَيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِنْ ضَرِيعٍ6

వారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు.
88:7జుజ్ 30 · పు. 592

لَا يُسْمِنُ وَلَا يُغْنِي مِنْ جُوعٍ7

అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు!
88:8జుజ్ 30 · పు. 592

وُجُوهٌ يَوْمَئِذٍ نَاعِمَةٌ8

ఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి;
88:9జుజ్ 30 · పు. 592

لِسَعْيِهَا رَاضِيَةٌ9

తాము చేసుకున్న సత్కార్యాలకు (ఫలితాలకు) వారు సంతోషపడుతూ ఉంటారు.
88:10జుజ్ 30 · పు. 592

فِي جَنَّةٍ عَالِيَةٍ10

అత్యున్నతమైన స్వర్గవనంలో.
88:11జుజ్ 30 · పు. 592

لَا تَسْمَعُ فِيهَا لَاغِيَةً11

అందులో వారు ఎలాంటి వృథా మాటలు వినరు.
88:12జుజ్ 30 · పు. 592

فِيهَا عَيْنٌ جَارِيَةٌ12

అందులో ప్రవహించే సెలయేళ్ళు ఉంటాయి;
88:13జుజ్ 30 · పు. 592

فِيهَا سُرُرٌ مَرْفُوعَةٌ13

అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి;
88:14జుజ్ 30 · పు. 592

وَأَكْوَابٌ مَوْضُوعَةٌ14

మరియు పేర్చబడిన (మధు) పాత్రలు;
88:15జుజ్ 30 · పు. 592

وَنَمَارِقُ مَصْفُوفَةٌ15

మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు;
88:16జుజ్ 30 · పు. 592

وَزَرَابِيُّ مَبْثُوثَةٌ16

మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు.
88:17జుజ్ 30 · పు. 592

أَفَلَا يَنْظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ17

ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో?
88:18జుజ్ 30 · పు. 592

وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ18

మరియు ఆకాశం వైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో?
88:19జుజ్ 30 · పు. 592

وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ19

మరియు కొండల వైపుకు చూడరా?అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో?
88:20జుజ్ 30 · పు. 592

وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ20

మరియు భూమి వైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో?
88:21జుజ్ 30 · పు. 592

فَذَكِّرْ إِنَّمَا أَنْتَ مُذَكِّرٌ21

కావున (ఓ ముహమ్మద్!) నీవు హితోపదేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసే వాడవు మాత్రమే!
88:22జుజ్ 30 · పు. 592

لَسْتَ عَلَيْهِمْ بِمُصَيْطِرٍ22

నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు.
88:23జుజ్ 30 · పు. 593

إِلَّا مَنْ تَوَلَّىٰ وَكَفَرَ23

ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో!
88:24జుజ్ 30 · పు. 593

فَيُعَذِّبُهُ اللَّهُ الْعَذَابَ الْأَكْبَرَ24

అప్పుడు అతనికి అల్లాహ్ ఘోరశిక్ష విధిస్తాడు.
88:25జుజ్ 30 · పు. 593

إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ25

నిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది;
88:26జుజ్ 30 · పు. 593

ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُمْ26

ఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే!

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Abdullah Basfar - Al-Ghashiyah · Tlawati