Az-Zalzalah

سورة الزلزلة

సూరా 99 · మదనీ · 8 ఆయత్‌లు

99:1జుజ్ 30 · పు. 599

إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا1

భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు!
99:2జుజ్ 30 · పు. 599

وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا2

మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు!
99:3జుజ్ 30 · పు. 599

وَقَالَ الْإِنْسَانُ مَا لَهَا3

మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు.
99:4జుజ్ 30 · పు. 599

يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا4

ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది.
99:5జుజ్ 30 · పు. 599

بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا5

ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు.
99:6జుజ్ 30 · పు. 599

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِيُرَوْا أَعْمَالَهُمْ6

ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు.
99:7జుజ్ 30 · పు. 599

فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ7

అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.
99:8జుజ్ 30 · పు. 599

وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ8

మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి