Al-Alaq

سورة العلق

సూరా 96 · మక్కీ · 19 ఆయత్‌లు

96:1జుజ్ 30 · పు. 597

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ1

చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు!
96:2జుజ్ 30 · పు. 597

خَلَقَ الْإِنْسَانَ مِنْ عَلَقٍ2

ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు.
96:3జుజ్ 30 · పు. 597

اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ3

చదువు! మరియు నీ ప్రభువు పరమదాత.
96:4జుజ్ 30 · పు. 597

الَّذِي عَلَّمَ بِالْقَلَمِ4

ఆయన కలం ద్వారా నేర్పాడు.
96:5జుజ్ 30 · పు. 597

عَلَّمَ الْإِنْسَانَ مَا لَمْ يَعْلَمْ5

మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.
96:6జుజ్ 30 · పు. 597

كَلَّا إِنَّ الْإِنْسَانَ لَيَطْغَىٰ6

అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు.
96:7జుజ్ 30 · పు. 597

أَنْ رَآهُ اسْتَغْنَىٰ7

ఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు.
96:8జుజ్ 30 · పు. 597

إِنَّ إِلَىٰ رَبِّكَ الرُّجْعَىٰ8

నిశ్చయంగా నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది.
96:9జుజ్ 30 · పు. 597

أَرَأَيْتَ الَّذِي يَنْهَىٰ9

నీవు నిరోధించే వ్యక్తిని చూశావా?
96:10జుజ్ 30 · పు. 597

عَبْدًا إِذَا صَلَّىٰ10

నమాజ్ చేసే (అల్లాహ్) దాసుణ్ణి?
96:11జుజ్ 30 · పు. 597

أَرَأَيْتَ إِنْ كَانَ عَلَى الْهُدَىٰ11

ఒకవేళ అతను (ముహమ్మద్!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి?
96:12జుజ్ 30 · పు. 597

أَوْ أَمَرَ بِالتَّقْوَىٰ12

ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే?
96:13జుజ్ 30 · పు. 598

أَرَأَيْتَ إِنْ كَذَّبَ وَتَوَلَّىٰ13

ఒకవేళ (ఆ నిరోధించే) వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే?
96:14జుజ్ 30 · పు. 598

أَلَمْ يَعْلَمْ بِأَنَّ اللَّهَ يَرَىٰ14

వాస్తవానికి, అల్లాహ్ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా?
96:15జుజ్ 30 · పు. 598

كَلَّا لَئِنْ لَمْ يَنْتَهِ لَنَسْفَعًا بِالنَّاصِيَةِ15

అలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము.
96:16జుజ్ 30 · పు. 598

نَاصِيَةٍ كَاذِبَةٍ خَاطِئَةٍ16

అది అబద్ధాలలో, అపరాధాలలో మునిగివున్న నుదురు!
96:17జుజ్ 30 · పు. 598

فَلْيَدْعُ نَادِيَهُ17

అయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను!
96:18జుజ్ 30 · పు. 598

سَنَدْعُ الزَّبَانِيَةَ18

మేము కూడా నరక దూతలను పిలుస్తాము!
96:19జుజ్ 30 · పు. 598

كَلَّا لَا تُطِعْهُ وَاسْجُدْ وَاقْتَرِبْ ۩19

అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు!

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Abdullah Basfar - Al-Alaq · Tlawati