Al-Ma'un

سورة الماعون

సూరా 107 · మక్కీ · 7 ఆయత్‌లు

107:1జుజ్ 30 · పు. 602

أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ1

తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?
107:2జుజ్ 30 · పు. 602

فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ2

అతడే అనాథులను కసరి కొట్టేవాడు;
107:3జుజ్ 30 · పు. 602

وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ3

మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.
107:4జుజ్ 30 · పు. 602

فَوَيْلٌ لِلْمُصَلِّينَ4

కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!
107:5జుజ్ 30 · పు. 602

الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ5

ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో!
107:6జుజ్ 30 · పు. 602

الَّذِينَ هُمْ يُرَاءُونَ6

ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)!
107:7జుజ్ 30 · పు. 602

وَيَمْنَعُونَ الْمَاعُونَ7

మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో!

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Abdullah Al-Mattrod - Al-Ma'un · Tlawati